కాయ ముపయి దెబ్బ కాలమ్ము తోమాయుమదిని గ్రుచ్చు మాట మాసి పోదువాటు కన్న మిగుల మాటలే బాధించుపచ్చిమట్ల మాట పసిడిమూట
కొలదిగ తావిడు విరులనువెలదులు ధరియిం పగోరు వేడుక తోడన్అలరా రుతుతా వొసగనిపూలను ధరియింపగోరుపొలతులు గలరే ?
కొలదిగ తావిడు పూలనువెలదులు ధరియిం పగోరు వేడుక తోడన్అలరా రెడుకా గితంపుపూలను ధరియింపగోరుపొలతులు గలరే ?
క. కడులచ్చి గలిగి నైననుకుడువక గట్టక వలువల ముడుపుల్ గట్టీపిడికెడు దానం జేయకయడక్కు తినకున్న వాడు యథముండాయెన్
తరిగి పోవు వయసు కరుగుకా లమ్మిలసమసిపోవు సకల సంప దలవిమనల వెంట నంటు మంచి కర్మలెగాకపచ్చిమట్ల మాట పసిడి మూట
మూడుముళ్లుఏడడుగుల బంధంతో ఏకమైతనువున తనువైమనమున మనమై మెలుగుతూవంశవృక్ష నవపల్లవోద్భవధాత్రియైఅనుబంధాల కాలవాలమైఆత్మీయానురాగాల నెలవైపుట్టినిల్లు మెట్టినిల్లుల నడుమఆసువోస్తూ అల్లినఅనుబంధపు వారధైపెనవేసుకున్న ఆత్మీయబంధాలలతలపొదరింటి పాదు తానైదినదిన ప్రవర్దమానఅష్టైశ్వర్యాలకు నెలవైనాతో కలిసి నడుస్తూన్నలావణ్య శేఖర శోభితనా జీవితభాగస్వాయైన శుభదినం !మా [...]
అందానికి నిర్వచనం అభిమానానికి ఆలవాలం చిరు నగవు చిరునామా నిత్య యవ్వన నింగి భామా అందానికి ఆహార్యం జోడించి లాఘవ లావణ్య లాలిత్యం తోడ బాల నటి మొదలు బాలీవుడ్ వరకు అభిమాన కోటి మనస్సుల్లో చెరగని  ముద్ర వేసిన  వెన్నెల భామ సుందర సుమధుర భావాలను మేళవించినటనకే నడకలు నేర్పిచిత్రసీమలో చిరస్థాయిగా నిలిచి భువి నుంచి దివి కేగిన  చిరయశస్వి శ్రీ దేవి!అప్సర [...]
సుతులు గల్గు వారు  గతులు వడిసెదరు సుతులు లేని యెడల గతులు లేవు సుతులు గతుల నునవి  సృష్టించి నదెవరో పచ్చిమట్ల మాట పసిడి మూట 
వేకువనే లేస్తవు వేదపండితునోలెస్నానజపము లేక సాగిపోతవుపొద్దువొడిసేటాల్లకు పొలిమేరలు దాటితాటివనంలోన తచ్చాడతవుబతుకుదెరువుకోసం వ్యథలువడతవుసాహసమే ఊపిరిగా సాగుతుంటవు గౌడన్నా !మోకు బుజానేసి ముత్తాదు గట్టుకొనివీరునోలె ముందుకేగి విజృంభించిఎత్తైన తాటిచెట్టు ఎగాదిగా జూసిమొద్దుకు బంధమేసి మొగులుకెగబాకిపచ్చనాకులంట పాకి పరవశిస్తవు గౌడన్నా! తనువు అణువణువు [...]
పసిప్రాయపు పసిడి బాల్యానికిఊచల్లేని చెరసాల పాఠశాలబడికి సెలవులంటేయావత్ జీవశిక్షనుంచివిడుదలయిన ఖైదీల్లాపంజరం చెరవీడినసీతాకోక చిలుకల్లాబోసినవ్వుల పసిహృదయాలురెక్కలు విదిల్చి ఎగిరి గంతేస్తాయి.గతస్మృతులను నెమరువేసుకుంటూపల్లెకు పయనమవుతాయి !తాతయ్య నాయనమ్మల తలపులతోనెయ్యపు దారుల వెంట స్వేచ్ఛా విహంగాలైపల్లెఒడిని చేరి సేదతీరుతాయి !నవ పల్లవాగమం తో పండుటాకులు [...]
 (ఆత్మీయ మిత్రుడు     మటేటి చంద్రశేఖర్ కు హార్థిక శుభాకాంక్షలతో)స్నేహానికి నెలవైఆత్మీయత కాలవాలమైఅందరికాదర్శప్రయమైమిత్రకోటికి ఆప్తుడవైఅందరి ఆదరాభిమానాలతోఅహర్నిశలు శ్రమిస్తూఅంచలంచలుగా యెదిగిస్నేహ పరిమళాలుసర్వత్ర వ్యాపింపజేస్తుఅశేష నెచ్చెలుల కాదరువైనిత్యం చిరునగవులలరించినప్రసన్నతామూర్తిచెలిమికి చిరునామయైమెలిగే చిన్ననాటి నేస్తానికి హృదయపూర్వక [...]
సంసారపు బాధలనీదలేకసతమతమౌతున్న పెనిమిటిజూచినిండ నీటితో భారంగాకదులుతున్న మేఘమై తిరగాడుతూనిత్యం మోముపై చిరునవ్వుల నంటించుకొనిధైర్యం సాకారమైనట్టు కనవడుతూగాలి ఆప్యాయతకు కరిగిభారం దించుకున్నట్లుచాటుగా కన్నీరు కార్చి బాధను దించుకొనిమేకపోతు గాంభీర్యంతోభర్తకు వెన్నుదన్నై నిలుస్తుంది భార్య!నెలవంకలను నేర్పుతో అద్దినఆరు గజాల అతుకుల చీరతోతనువు మసక [...]
అల్లారు ముద్దుగా నలరారు రామయ్య ఆటపాటలయందు తనరు చుండెపసిడిప్రా యములోనె పరిపరి విధములఅస్త్ర శస్త్రములందు నారి తేరెవిశ్వమిత్రునివెంట విధినిర్వ హణముకైఅడవుల కే గెనా బాలకుండుయాగరక్షణమున తాగెమున్ జూపించి
కష్ట సుఖము లందు కలిమి లేములయందుపాటి దప్ప కుండ పాట్లు వడుతుజనహితము గోరి జగతిని బాలించురామచంద్రు నంటి రాజుగలడె
ఊర చెరువు జూడ నున్నకా డనెయుండుచేరు గమ్య ములను బారు వాగుచేతనత్వమున్న చేకూరు ఫలితముల్పచ్చిమట్లమాట పసిడిమూట
సంప దెంతొ యుండి సంతృప్తి లేకున్ననరక ప్రాయ మౌను  నరుని బ్రతుకుసంపద లవి యేవి సంతృప్తి నిన్మించిపచ్చిమట్ల మాట పసిడిమూట
అనుక్షణం ప్రజారక్షణకై పరితపించేకలంయోధులుఅన్యాయాన్నెదిరించేధర్మవీరులుప్రజలను సన్మార్గంలోనడిపించు సామాజిక వేత్తలుఅణగారిన వర్గాల ఆత్మబంధువులుపత్రికా విలేకరులు
పత్రకలుఅక్షరవిత్తులు నాటిన కేధారాలుఆలోచనల అంకురాలుప్రజాస్వామ్య వీచికలుశ్రమజీవుల గొంతుకలుఅనుక్షణం ప్రజారక్షణకై పరితపించేకలంయోధులుఅన్యాయాన్నెదిరించేఅణగారిన వర్గాల ఆత్మబంధువులు
జగతి నావహించినచీకట్లను చీల్చుటకుఉషోదయమై ఉదయించింది పత్రికదావానలమై వ్యాపించినమూఢనమ్మకాల ముక్కువిండిచాంధసాచారాలను చర్నకోలలై తరిమిసామాజిక రుగ్మతలను సమూలంగా బాపిసామాన్య ప్రజల శ్రేయోభిలాషియై వర్దిల్లాలిపాలకుల పంచనజేరి ప్రజల వంచించకస్వయం పోషకాలై యెదగాలిసదా ప్రజాశ్రేయస్సుకై పాటుపడాలిచాపకింద నీరులా సాంతం వ్యాపిస్తున్నఅసాంఘీక శక్తుల నంతమొందించిశాంతి [...]
మనోవీధిలో గాంచిన దృశ్యమాలికలనుసుమధుర భావాలతో సుధామయ  సుందర వర్ణనలతోపాఠకలోకానికందించడం కవిధర్మంకవి కల్పనలు అద్వితీయంకవ్వించేది కవనంనవ్వించేది కవనంఉహల్లో విహరింపజేసిమనసును రాగరంజిత మొనర్చేది కవనంకవి అపర బ్రహ్మఊహల్లో  విహరింగలడుఉత్తమ సృష్టి గావించగలడుమానసికానందం దాపునగురుతర బాధ్యత దాగివుందికవి కవితా సేద్యంచేయాలిసాగర లోతుల్ని శోధించాలిమంచిముత్యపు [...]
అనంత అశేష విశాలవినీలాకాశపు పొత్తములోకవికలహాలముతో జల్లిననక్షత్రాల విత్తులు అక్షరాలు.భూమిపొరల్లోమరుగున వడిన విత్తులకుపాఠకుని నాలుక తడితగిలిన నాడుమట్టిని పెకిలించుకొని అంకురించిఅనంత ఆలోచనలకు ఆయువుపోసిఅద్వితీయ అపురూప సృష్టికిఅంకురార్పణ చేస్తుంది !కారునలుపు కమ్మిన మేదినిపైమిణుగురులై  మెరిసే వర్ణాలుకొంగ్రొత్త వెలుగులు జిమ్ముతూమానవ మస్తిష్కంలోజ్ఞానపు [...]
చెలీ !నా మనసు కాన్వాసుపైనీబొమ్మ గీసుకొనినాశ్వాసలో సగం నీకు పంచినాలోని నీకు ప్రాణంపోసినీవే నేనై బ్రతుకుతున్న !నీవు నాదానవని యెంచికుంచె నీకందించాను ప్రియా!మనవైన మధుర స్మృతులభావచిత్రాలు పొదుగుతావనినాలోని నీ చిత్రానికి నిజరూపు నిస్తావనీ చూడచక్కని సుందర దృశ్యాల్ని చిత్రించిపరవశంతోపులకిస్తావో ?నీలోని అలలై ఎగిసే భావాలనుపరిపూర్తి గావించి ప్రపుల్ల మొనరుస్తావో [...]
 తనుభారము తాలలేకతరువులన్ని ఆకులురాల్చిమోడులోలె గనవడుతున్నప్రకృతిని జూసి పరితపించినచైత్ర రథమెక్కినఋతురాజు వసంతుడుమాయజేసెనో లేకఅమృతబిందువులే చిలుకరించెనో గానితలంటు స్నానం జేసితలారబెట్టుకుంటున్నట్టునిరాడంబరంగా నిలబడ్డతరువులన్నినూత్న వధువుకు  నగిసీలు దిద్దినట్టుఆభరణాలు తొడిగి అలంకరించినట్టుచెట్లన్ని చిగురించిప్రకృతికి పచ్చల చీరగట్టుముద్దుగ [...]
మనిషి గుణము చేత మాహోన్న తుండగుకలిమి బలిమి చేత నగుట కల్లఎనుము బలిసి నంత ఏనుగె ట్లవునురాపచ్చిమట్ల మాట పసిడి మూట
నగరవాసులంనాగరికత వారసులంఅన్నీ మాకే తెలుసనుకుంటంఫలితం కోసం పరితపిస్తుంటం!కళ్ళముందు జరిగిందేది కనిపించదు మాకుయథార్థ విషయాలేవి బోధపడవు మాకుమేం మేముగానే ఉంటాంఅయినా మేం నాగరికులం!నాగరికతకు వారసుల!!పక్కన్న వాళ్లను పట్టించుకొనే తీరికలేదుధీనుల జూసి స్పందించే మనసులేదుసాటివారికి సాయపడాలనే సోయి లేదుఅయినా మేం నాగరికులం!నాగరికత వారసులం!!ప్రతి వారిని తమ వారిగ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు