తెల్లవారు జామున నులివెచ్చని కిరనాలు నీ కౌగిలిని గుర్తుకు తెస్తున్నాయి నీ జ్ఞాపకాల సెగలు ఎప్పుడు దుఃఖపు సంగీతాన్ని ఆలపిస్తున్నాయి జరిగిన ఘటనలు చావుకీ బతుక్కీ మధ్య వేలాడుతున్న గతంగింగిరాలు తిరుగుతూనే ఉంది గతంలో జరిగిపోయిన క్షనాలను బెట్టు కొంటూమనసు పేజీ మడతలో జీవితపు కాలీలను నింపుకొంటు నిర్వేదంగా జీవితాన్ని ఇలా కొనసాగిస్తూనే [...]
నిన్నటి నుంచిమనసు మదనపడుతోంది కలం కలవరపడుతోందినిజం నురగలు గక్కుతొంది తాగిన సిరాతో నురుగులు కక్కుతోందినా మనసును కదిలించినా విదిలించినానీ జ్ఞాపకాలు రాలిపడుతున్నాయి  చెదిరిన కల ఇంకా నన్ను కల్వరపెడుతూనే వుంది పగలంతా పలవరింతలు వెక్కిరిస్తున్నాయిరాత్రంతా కలవరింతలుకవ్విస్తూ నవ్విస్తున్నావు  ఉలిక్కిపడీ లేచేసరికిఅంతా బ్రమ అని [...]
రోజూ ఎర్రబడ్డ సూరీడు చల్లదనం నుండి  జారిపోయాడు నిజాలు వేలాడుతున్నాయి అబద్దాలు ఆడి పోసుకుంటున్నయి అవకాశాలన్నీ అన్ని  అనుమానాలు గా మారి ఆహాన్ని తగిలించి అధికారాన్ని తుంచాలని చేసిన విఫల ప్రయత్నాలన్నీ నన్ను నాకు కాకుండా చేయాలని చూసాయి కాంక్రిట్  బతుకులోవీరు వారూ..నన్నుఎవరెవరో తోసుకుంటూతొక్కుకుంటూ..తన్నుకొంటూ నాపై అపనిందల్ని [...]
గతం తాలూకా జ్ఞాపకాలు .. మనల్ని నమ్మించి ఊరించి ఉడికించిన పరిచయాలు ..అప్పుడు నిజాలు ఇప్పుడు కనిపించనంత దూరంగా  మన మాట కు అందుబాటు కు లేనంత గా  వున్నప్పుడు ఆ క్షనాలు గుర్తొచ్చినప్పుడు .. ఏమి చెయ్యాలో తెలియని స్థితుల్లో ... అటువైపు   వారిని భాదపెట్టలేక .. మన ఊహ కూడా వారికి వద్దు అనుకున్నప్పుడు ...మనసు మౌనంగా రొదిస్తున్న క్షనాల్లో ఏళ్ల తరబడి మైండ్‌లో పేరుకుపోయిన [...]
అర్థం కాని లోకంలోఅయోమయంలోఅదోరకపు భ్రాంతిలో బ్రతికేస్తున్నాంమనుషులంతా ఇప్పుడు..మౌనశిలలుగా మరో రూపమెత్తారుమాటలు కరువైయ్యాయిపెదాల కదలికల్ని మనసు దారిలో విసిరేసితమది కానీ లోకంలో విహరిస్తున్నారుఇప్పుడు మాట్లాడ్డానికేమున్నాయి?అంతా వాట్సాప్,ఫేస్ బుక్ లేగాఇదే నిశ్శబ్దాలకు మూలాలుఅయిన ఇప్పుడేం మిగిలుందిఇద్దరి మనుషుల  నిశ్శబ్దమేగాఇద్దరు వ్యక్తుల [...]
నమ్మకపు నాలుక చివరనపడ్డ గాయం..నిశ్శబ్దపునిజం మాటునచుర కత్తుల్లా..దూచుకొచ్చిఅక్షరాలు మనసునిండాగాయాల మయం చేసాయి..ఇష్టం కష్టం గా మారిన క్షణానఎదురించ లేని నిస్సత్తువ నడుమనాలో రగిలిన‌ భావాలతోనన్ను నేను రాగిలించు కొంటూతగలబడుతున్న జ్ఞాపకాలవెలుగుల్లో..కానరాని నీకోసం.నా మనసు ఆత్రంగా వెతుకుతొందినాలో రగులుతున్నఆశలు నా దేహాన్నిచీల్చుకొని పదాల పరిమలా లైవిచ్చుకుంటూ ని [...]
మనసుపోరాల్లోనిజ్ఞాపకాలు తడుముకున్నప్పుడుకంటి చివరల నించి..క్షణాలను ఒడిసిపట్టుకుందామనుకున్నజారిపోతున్న భావాలనుబందీలుగా చేయాలని చూస్తున్నప్రతి ప్రయత్నం విఫలం అవుతూనే ఉంది ఎదురుగా కనిపిస్తున్న రూపంలిలగా అస్పష్టం కనిపిస్తూ మురిపిస్తు మైమరిపిస్తోందిప్రశ్నలుగా మిగిలిపోయినకొన్ని జవాబులుగా సాక్షిగా..గాయపడ్డ గతం జ్ఞాపకాలై..రాలి పోతూనే ఉన్నాయినీ [...]
ఒంటరితనపు నడకలోఆమె కన్నీటితోనిర్లక్ష్యం నన్ను వేక్కిరిస్తూతన నడక సాగిస్తూనే ఉందినా రెప్పలపై జారిపోతున్నకలల సాక్షిగా..నాలో నేనుతడబడుతూ...అడుగులు వేస్తున్నాచెదిపోతున్న స్వప్నాల సాక్షిగానిదురలో ఉలిక్కి పడ్డ నేనుఊహలకు ఉపిరిపోసుకుంటూ ప్రతీరాత్రీ...కలత నిద్రలో నీకోసంతడుము కుంటూనే ఉన్నావేకువ కోసం వేలరాత్రులుఎదురు చూపులతోకాలం కరిగిపోతూనే ఉందినిజం [...]
పగిలిపోయిన పగుళ్లలోముక్కలైన..చిరుగుల.మధ్యమనసులో జ్ఞాపలకు చేస్తున్నవిధ్వసం,విస్ఫోటనాలునాకు మాత్రమే వినిపిస్తున్నాయినిజం ఆకలి చూపులకుఆవిరి అవుతున్న జ్ఞాపకాల సాక్షిగాఅబద్ధపు..అక్రందనలోఆశగా ఎదురు చూస్తున్నవిషాదం..నిషా చీకటిలోవిరహపు నల్లటి రంగుపులుపు కొంటుంది..ఎంటో..?కోరికల విరహ వేదనతోకసి తీర్చుకుంటున్న కాలంకరిగిపోతున్నా..కనికరించని జ్ఞాపకంకన్నీరై వెక్కి [...]
ఓయ్ఈ చెట్లు చూడు రోజూ పెళ్లికూతుళ్లల్లా పూలు సింగారించుకుని ఆకాశాన్ని మత్తెక్కిస్తుంటే, వెర్రి ఆకాశం తెల్లబడుతూ, ఎర్రబడుతూ, నల్లబడుతూ తబ్బిబ్బై ముంచేస్తుంది.ఆ సెలయేరు చూడు ఎవరు తరుముకొస్తున్నారని అంతలా పరుగులు పెడుతోంది? ఆగదు, ఆగనివ్వదు నీలా. మలుపు మలుపులో ఊరిస్తూ, ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అందాల మందారం మాత్రం ఏమి తెలీనట్లు సోయగాల చమక్కుల్లో చిక్కకుండా చుట్టూ [...]
కవిత్వమొక కాలాతీత కాంతిరేఖ. ఒక మెరుపు. ప్రణాళికాబద్ధమైన వాటికి అది లొంగదు. సిసిరో అన్నట్లు అది ప్రకృతి నుంచే సరాసరి కవులకు అందుతుంది. ఆ వెలుగులో కవి జ్వలిస్తాడు. రూపాంతరం చెందుతాడు. తక్షణ అనుభూతిని కవి వజ్రంలా మెరిపిస్తాడు. నక్షత్ర వర్షం కురిపిస్తాడు. ప్రతి కవికీ ఒక ఫిలాసఫీ ఉంటుంది. అది సామాజికం కాదు. వ్యక్తిగతమైంది. వ్యక్తినిష్ఠమైంది.  “నిన్ను నీవు [...]
గుండెలోని ఆవేదననంతా కరిగి ద్రవించేవి కన్నీళ్లు. ఆ భావోద్వేగం వైయక్తికం. కానీ అక్కడ అది సామూహికం. బతుకుదెరువు. అందుకే వాళ్లు గుండెలు బాదుకుంటూ రోదిస్తారు. అవును అక్కడ కన్నీళ్లు వాళ్ల కడుపునింపుతున్నాయి. ఇది రాజస్థాన్‌లోని రుదాలీ మహిళల కథ.ఎవరైనా చనిపోయారన్న వార్త వినిపిస్తే చాలు వాళ్లంతా హవేలీ ఆవరణలోకి వస్తారు. వాళ్ల ఆచార సంప్రదాయాల ప్రకారం ఆ హవేలీలోని [...]
 మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ- పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించే ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆ'లోచనం' చేసేదే మనసు. మనలో ఉండి మనలను నడిపించే మనసే మన 'తొలిగురువు' అంటోంది వేదసారం. 'నీవెవరో తెలుసుకో' అని బోధించిన రమణ మహర్షుల వారైనా 'నీవే ప్రపంచం' అన్న జిడ్డు కృష్ణమూర్తి తత్వమైనా నీలో ఉన్న [...]
ఎవరు ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నా దానికి బలమైన మానసిక, శారీరక, సాంఘీక కారణం ఉంటుంది. వారి స్తానంలో ఉంటే తప్ప వారి మానసిక సంఘర్షన ఎవరికీ అర్ధం కాదు. అది అర్ధం కాకుండా వాళ్ళను విమర్శించడం, వాళ్ళు చేసేది తప్పు అండం వారిని అవమానించడమే. వారి స్తానంలో ఉంటే ఈ విమర్శకుడు అలానే చేసేవాడేమో. వారిస్తానంలోకెళ్ళి ఆలోచించడి (put yourself in their shoes). నన్ను నేను వారిస్తానంలో ఉంచి రాయడానికి [...]
  పోరాడి గెలవానలే ఆరాటం ఉరుకుల పరుగుల జీవితం పరుగుల్లో పడ్డా లేచినా అడిగేవారు లేరు అందరు మీడియా అంటే కడగాలని చూసేవారే మాదారి ముళ్ళదారి అని మాకే తెల్సు అయినా గోదారిన్ ఒడ్డున సేదతీరాలనే అత్యాస తీరక పరుగులు పెడుతూ ఆరాట పడుతూనే ఉంటాం తప్పదు పొట్టతిప్పలు ఓవైపు పోటీ పడి ముందుండాలనే తపన లో మా మనసులతో మేమే తన్నుకు చస్తున్నాం అందరు వెలెత్తే చూపిస్తే .. సమాజాన్ని [...]
ఆ పలకరింపు ..తియ్యని పులకరింపైఓ శబ్ద తరంగాన్ని అలా మోసుకొచ్చిచుట్టపుచూపులా వచ్చినట్టే వచ్చి కనుచూపుమేరకు తరలిపోయింది నాలోతట్టుకోలేని నిశ్శబ్దాన్ని మిగిల్చిందికనురెప్పల కదలికలలో సవ్వడేది?కన్నీటి సుడులలో హోరుహృదయంలో నీ జ్ఞాపకాల అలజడిమీరెవరన్నా విన్నారా?ఒయ్ నిన్నే నీకూ వినిపిస్తుందానాకనిపిస్తోంది  నిశ్శబ్దమే బాగుంది కదానిశ్శబ్దమే [...]
గడిచిన కాలం వదిలిన జ్ఞాపకాల్లో నన్ను నేను చూసుకోవాలనుకున్న ప్రతిసారిమనసనే అద్దం పగిలిన క్షనాల్లో అద్దం ముక్కల్ని ప్రేమగా తుడుచుకునిపగిలి  చెదిరిన బింబాల్లో నన్ను నేను ఆతృతగా వెతుక్కుంటున్నాను..ప్రతి ప్రతిబింబంలో నేనెక్కడ కనిపించడంలేదు అన్నిటిలో నీవే కనిపిస్తున్నావు నాన్ను నేను చూసుకుందామనుకొంటే ఎక్కడా కనిపించనెందుకనో నిజమిది అని [...]
అంతా సుఖమే అని భ్రమిస్తున్న జీవితంలోకపటం చేసే కల్లోలం ఎంతోఒక కల నుంచి ఇంకో కలకు దొర్లిన చప్పుడుఒక దుఃఖం నుండి ఇంకో దుఃఖానికి పొర్లిన చప్పుడుతెలియని గోడల్లో కన్నీళ్ళ చప్పుడుకూలిన ఆశల శిధిలాల్లోఎగరలేని ఆలోచనల చప్పుడుపచ్చని ఆకులు పగిలిన చప్పుడురెక్కలు విరిగిన చప్పుడుపాట ఆగిన చప్పుడుశ్వాస వీడిన చప్పుడుఆరాటాలు పోరాటాలు అలిసిన చప్పుడుఆఖరి పర్వంలో చీదరింపుల [...]
కన్నీరు అడ్డొచ్చివెక్కిళ్ళు మాటలను మింగేసిన క్షణంలోనీ మౌనాన్ని వింటాను.నాలో  నువ్వు పడుతున్న సంఘర్షణనువ్యక్తపరచలేని నీ మాటల లేమి నాకు వినిపిస్తుంది.పదాల కోసం వెతుక్కునే నీ నిస్సహాయత నిట్టూర్పును   మౌనంలో వింటానుఅక్షరాలలో ఒదగలేని నీ భావాలను నా కళ్ళతో చూస్తానుమాట్లాడుతూ మాట్లాడుతూనువ్వు హటాత్తుగా ఆగిపోతావేఅప్పుడు నీ నిశ్శబ్దం  నా చెవులలో [...]
ఆ రెండు కన్నీటి చుక్కలుకనుకోనలలో వేళాడుతున్నాయివాలే భుజం లేక…..ఆ రెండు మాటలునాలికను చిధిమేస్తూగొంతుకలో నొక్కివెయ్యబడుతున్నాయివినే మనసు లేక…..ఆ విసుగు నిస్పృహైశూన్యంలోకి జారిపోతుందిఆశకు ఆసరా లేక…..ఆ తనువు తనను తాను శిక్షించుకుంటూమరణాన్ని ప్రేమించి నిష్క్రమించిందిహత్యో ఆత్మహత్యో ముద్దాయిలెవరోతేల్చుకోలేని ప్రశ్నలనుమనకు వదిలేస్తూ…..మనంఆ మనసులనుఆ ఆ [...]
 ఓ చెరిగిపోయిన అక్షరాల్లారా కరిగిపోయిన క్షణాల్లారా! ప్రవహించండి నా కలంలో సిరాలాగ ! సరే మరణించాను నాకు   చచ్చిపోవాలని ఉంది. బహుశ విమాన ప్రమాదంలో, లేదా జలగండం వల్ల ? అదీ ఇదీ కాకపోతే నేల మీదనే కాలధర్మం. నా శవం చుట్టూ చాలామంది చేరి ఏడుస్తున్నారు. "ఎందుకేడుస్తున్నారు, ఇప్పుడేమయిపోయిందని" అని నేనెంత ధారాపాతంగా అరుస్తున్నా ఎవరికీ నా మాటలు వినబడవు. " అనంతర కార్యక్రమం [...]
చచ్చి పోవాలని...ఈ లోకం వీడిపోవాలని...నన్ను నేను దహించుకోవాలని...అన్నీ వీడి మరణించాలని...ఎన్నో సార్లు అనుకున్నాఅన్ని సార్లూ వాయిదా వేసుకున్నా...క్యాలెండర్ లో తేదీలు మారినట్లునిర్ణయాన్ని మార్చుకున్నా...బతకాలని లేకున్నా బతికే ఉన్నా...మనసైన మనసులోస్థానం కోల్పోయితుది అంకంలోనా మనసులో విషాదంనింపుకునిపరాజితుడిగానిష్క్రమించలేకబతికిపోయాను...ఇప్పుడు మళ్ళీచచ్చిపోవాలని [...]
మనసు ఒక మౌనం, కాని నేను నీ మనసు లోని మౌనాన్ని మాటలుగా మార్చాలి అనుకున్నా,కాని ఏమీ చేయలేని నిస్సహాన్ని అని తెల్సింది ఎందుకో పెదవులు కదలక మాటలు కాస్త మూగబొయినాయికళ్ళలొని కాంతి  తేజస్సు వీడి తన్మయం చెందవలసిన సమయం లొ తనకొసం తపించిన  మనస్సు  మాటలను  కళ్ళతొ పలికించ లేక బింధువుల రూపంలొ కన్నీటి భాష్పలుగా పంపుతున్నాయి.... ఓ మాటలు  రాని మౌనమా. [...]
నేను తట్టుకోలేనంతగా ప్రేమించకునాకు అందనంత  దూరంగా నీవు ఉండకునువ్వు ప్రేమించలేనంత నిన్ను ప్రేమించాననినీ ప్రేమని నాకు చెప్పడం మరువకు..నేను లేని ఒంటరితనాన్ని ఊహించకునన్ను తలచి మౌనంగా రోధించకునా ప్రేమని నీవు మరిచే ప్రయత్నం చేస్తూనిన్ను మరువమని నన్ను శపించకు..------ అప్పుడు-ఇప్పుడు -----------నేనెరిగిన కార్యం కేవలం నీ అడుగు నీడలో నేనుఅప్పుడు దగ్గరై దూరం, ఇప్పుడు దూరమే [...]
చిక్కటి చీకటి రాత్రిప్రశాంతతను ఆశించి నిద్రకుపక్రమించిన జ్ఞాపకంఅవి ఎప్పటినుంచి వేచి ఉన్నాయోఆ తరుణం కోసం.. ఎన్ని ఊసులో.. ఎన్ని గుసగుసలో..గుండె లోతుల్లోనుంచి గుచ్చబడినబంధాలు తెగి జారిన ముత్యాల్లా.. సాగుతున్నాయి మనసులో గుచ్చేస్తున్నాయి ఆ జ్ఞాపకాలు  సున్నితంగా..అప్పుడప్పుడూ మనసును తడుముతూనే వున్నాయిముల్లులా దాని మనసు గుచ్చేవి కొన్నైతేజేబులో దాచిన [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు