చేరరావే ప్రియా!హృదయం ముంగిట స్నేహమనే ముగ్గు వేసిప్రేమ అనే పేరంటానికి ఆర్తి అనే ఆహ్వానాన్ని పంపి ఎద సాక్షిగా ఎదురుచూపు చూస్తున్నా -మబ్బుల మాటున మాట మాత్రంగా నైనా చెప్పకుండా మరుగున పడిన మసక వెన్నెలలా నువ్వు,మేఘాల అప్పగింతల నుండి వెలువడిచినుకెపుడు తన దోసిట చేరుతుందా అని తల పైకెత్తి చూసే ముత్యపు చిప్పలా నేను -ఇలా ఇంకెంత కాలం ప్రియా ఈ విరహం?ఇదే శాశ్వతమై పోతే [...]
నువ్వు-నేను-ఈ ప్రపంచంప్రియా!ఈ ప్రపంచాన్ని నే మరచానంటేనా ప్రపంచంలోకి నువ్వొచ్చినట్టునా ప్రపంచంలోకి నువ్వొచ్చావంటేనన్ను నేను మరచినట్టు 
చిరుజల్లుతో ఒక రవికిరణం హరివిల్లైన క్షణాన అప్రయత్నపు పైకి చూసిన నీ చూపులలో, అతివేగపు కదలికల నీ కనురెప్పపై జాలువారిన వర్షపు చినుకుకు, కలసి పొంచిన అందానికినా హృదయం స్పందించకపోయి ఉంటే, నాదీ ఒక హృదయం అయ్యిండేది కాదు!
ఇష్టానికి మరణం ఉండదుఇష్టం ఉన్నపుడు కష్టానికి జననం ఉండదు!ఇష్టానికి మరణం ఉండదుఇష్టం ఉన్నపుడు నష్టానికి జననం ఉండదు!
అతను - చందమామ ఆమె - వెన్నెలమ్మ చందమామ, వెన్నెలమ్మ రెండు కాదు ఒకటే.
ఒక్కోసారి అనిపిస్తుంది ప్రేమంటే -"రెండు బలహీన హృదయాలు చాలా బలంగా ఇష్టపడడం" అని.
నీ ఒంట్లో నలతగా ఉందంటేనే నా మనసు ఎంతో కలత చెందుతుంది!నా పంచ ప్రాణాలూ నీ ఒక్క ప్రాణమే అంటేనా ఒక్క ప్రాణం కోసం నీ పంచ ప్రాణాలు పనంగా పెట్టవా?మన ప్రేమలో ఒక్కోసారి నాకు బలంగా అనిపిస్తుంది-కష్టం నీది అనుభవించాలని.. సంతోషం నీతో అనుభవించాలని...
అహం ఉన్న మనసులో ప్రేమ ఉండొచ్చుకాని నిలవదు!ప్రేమను కోల్పోయాకఅహం కూడా చచ్చిపోతుంది,అప్పటికే అంతా మించిపోతుంది.
బంధం ఆకర్షణతో మొదలైనపుడు ఆకర్షణ ఆశించడాన్ని నేర్పింది ఆకర్షణ ప్రేమగా మారినపుడు ప్రేమ ఇవ్వడాన్ని నేర్పింది.ఎంతగా అంటే ఎంత ఇచ్చినా ఇంకా ఏదో లోటు చేస్తున్నాననే...
ప్రతి మనసుకి కన్నీరు ఉంటుందిఆనందంతో, దుఃఖంతో.అవి మనసులో ప్రవేశించే మరో ప్రతి మనసుకిఒక అర్హత పత్రాన్నిస్తాయి!ఏ ఒక్క మనిషి వలన మనకు ఈ రెండు కన్నీళ్లు ఉంటాయో వాళ్ళే మన మనుషులు, మన మనసుకున్న మనుషులు.
ఆయుష్షుందని,శరీరం శిధిలమైనా ప్రాణాన్ని బంధించి ఉంచేఆ దేవుని నిర్దయలాంటిదే ప్రేమ చచ్చిపోయిన హృదయమున్న మనిషినిజీవింపచేయడం కూడా!
కదలక కదలాలనిపించక వలదని అన్నా,వదలక మనసున చొరబడి,ఏదో సడి... యదలో అలజడి...
నాకిష్టమైన ఆణిముత్యాన్ని అదృష్టం లేక పోగొట్టుకున్నానుమీకు దొరికిందా, మీకు దొరికిందానినోరు తెరిచి, చేతులు చాచి అడగలేక దీనంగా వీధుల వెంట కనులతో వెదుకుతున్నానుఅది ఎక్కడో జారి, ఎవ్వరినో చేరిఆనందాలను పంచుతూ ఉంటుంది,ఆనందాలను పంచుకుంటూ ఉంటుంది?పారేసుకున్న చోటు తెలుసు,తెలిసినా వెదకలేను,వెదికినా వేడుకలను చూడలేను...తిరిగి నా ముత్యాన్ని ముత్యపు [...]
ప్రియా!నీపై ప్రేమను హృదిలో,నీ తాలూకు ఆలోచనలను మదిలో అదిమిపెట్టి ఉంచడాన్నిఅధిగమించలేకపోతున్నాను.మన జ్ఞాపకాల శిధిలాల మధ్య మనసు రాసే గాయాల గేయాలకు కన్నీరు నిరంతరం నర్తిస్తూనే ఉంటోంది...
నేననుభవిస్తున్న శిక్షో,విధి నా మీద సాధిస్తున్న కక్షో,లేక నేనేదుర్కుంటున్న పరీక్షో తెలియదు కాని జాగు లేని జాములో విశ్రమించడానికి శ్రమించడం...అసలు జరిగేదొకటే నేస్తమా...నిట్టూరుస్తూ వాలిపోయే నాలో మన జ్ఞాపకాలు వరసగా రీళ్లైకనుమూసిన రెప్పల తెరలపై ప్రదర్శించబడే చలన చిత్రాలౌతాయి ఈలోగాదూరంగా ఎక్కడో ఒక కుక్క అరుపు వినబడుతుంది ఈలోగా ఒక గాలి తిమ్మెర చల్లగా [...]
నీ రూపం ఒక అపురూపమై మన మధ్య ఆగిపోయిన కాలంతో పాటు ఒక అందమై, అద్భుతమై  నా మదిలో నిలిచిపోయింది.నిలిచిపోతుంది... ఎన్నటికీ మారనట్టు,ముడతలు పడనట్టు...అదృష్టమే కదా మరి!
పదే పదే నన్ను ప్రేమించమని ఆత్రంగా ఎలా అడగగలను?నన్ను ప్రేమిస్తుంటే మాత్రం అన్నీ గెలవగలను, నీతో సహా...
విషాదంలో ఉన్నాననుకుంటారంతానన్ను, ఈ ప్రపంచాన్ని కలగలిపి మర్చిపోయేంతగా నీ తియ్యని జ్ఞాపకమొకటి మదిలోకొస్తుందికనులు శూన్యంలో నిలిచిపోతాయి కాలం నన్ను దాటిపోతుంది నవ్వు చెక్కిలి జారిపోతుంది...చివరిగా ఈలోకంలోకి వస్తుంటే కన్నీరు ఒలికిపోతుంది, విషాదంలో ఉన్నాననుకుంటారంతా!
తపనల తలపులు తరమగవలపుల తలుపులు తెరవకుమరచిన మనుషులు మెదలగగడిచిన కధలను వెదుకకు.
మురిపిస్తేనే... మరపిస్తేనే ఆనక యదపై వాలి రొదనే మరిచిమధువును గ్రోలింది ఆ అతిధి!తననే వలచి అన్ని మరచి తృప్తిని గెలిచి నింగి కెగిరింది ఆ పరువంమరలవచ్చేటి మధు పంపకానికై ఎదురుచూస్తోంది విరి విరహం...
అసలంటూ ఉన్న ఈ ప్రపంచంలో అందరూ ఉంటారు నేను తప్ప,నాకంటూ ఉన్న నా ప్రపంచంలో ఎవ్వరూ లేరు నువ్వు తప్ప.
వెదుకులాటతో మొదలయ్యే ఆత్రం...ఈ వినువీధుల్లొ నా ప్రయాణం - ఝుమ్మనె నాదాన్నిస్తుంది.వెదికింది దొరికితే మాత్రం...నా కనుసన్నల్లో ఒక నేస్తం - తానే తేనెను ఇస్తుంది.
 ఎక్కడనుండి ఎగిరొచ్చావో తెలీదుమనము కలిసామని ఆదరించానుమనసు కలిసిందని విడిది చేసావుగుండె గూడుని చేస్తే గువ్వగా నీవొదిగావునీ ఆకలి నాదైతే నా ఫలాలు నీకిచ్చానునా గాలి పాటకు పరవశాలు పోయి నృత్యాలు నీవు చేసావుకొమ్మ కొమ్మకూ తిప్పి ఆటలాడించానుకోరుకున్న కబుర్లతో ఒలలాడించావుఇంతలో ఏమైయ్యింది ప్రియతమా ఎగిరొచ్చిన నీ జాతితో ఎగిరిపోయావుఎగరలేని నా [...]
 జీవితాంతపు కలయిక కోసం...ఘటన లేదని తెలిసీవరమొకటి ఉంటుందనిదేవుని ముందు మోకరిల్లిందొక ప్రార్ధన...ఘటన లేకుంటేవరమనే ప్రసక్తే లేదని కొట్టివేయబడింది చేసుకున్న అభ్యర్ధన!
మంచుబిందువొకటి నను చేరవచ్చేవేళగడ్డిపరకనైనను నేను జామంత మోస్తాను - పరవశాలు పోతాను.రవికిరణంబొకటి ఉదయించువేళ ఆవిరయ్యే నెచ్చెలికై కనులు ధారలు కడతాను - అలజడులు పోతాను.
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు