***సంవత్సరమేదో గుర్తులేదు కానీ, అప్పుడే హైదరాబాదు వచ్చిన కొత్త. మల్కాజగిరిలో అన్నయ్యతో పాటు ఉండటవల్ల అవసరార్దం వంట చెయ్యాల్సి వచ్చింది. మోండా మార్కెట్టుకు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఏమి దొరుకుతాయో చెప్పాడు అన్నయ్య. ఓ రోజు నేను ఒక్కడ్ణే వెళ్ళాను. అక్కడ నన్ను ఒక కూరగాయ ఊరించింది. అవి తీసుకున్నప్పటినుంచీ ఎప్పుడు వండుదామా అని కుతూహలంగా ఉండింది. నాకు బాగా గుర్తుంది ఆ రోజు [...]
జ్ఞాపకాలను తాజా పరచుకుని దానిద్వారా దేవుడు చేసిన మేళ్ళనుబట్టి  స్తుతించడానికి దేవుడు సమయాలను ఇస్తుంటాడు. ఆ సమయాలలో ఎవరైతే ఉంటారో వారికే జ్ఞాపకానుభవం ఉంటుంది.4.6.2014 at LIG, RC Puram, Hyderabadగత సంవత్సరం మనమధ్య వున్న నాన్న ఈ రోజు లేరు, 4.6.2013 at LIG, RC Puram, Hyderabadఅయినా ఇదే రోజు నాటి జ్ఞాపకం ఉంది. ***1984 నాటి కొన్ని సంగతులను పిల్లలముందు పంచుకోవడానికి సమయమిచ్చినందుకు దేవునికి వందనాలు.4.6.1984 at Nalgonda1984 [...]
ఒక్కోసారి ఒకానొక సమయానికి చిక్కి ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంటాము. అలా ఎందుకు జరిగిందిబయటికి ఎలా రావాలిచుట్టూవున్న వాతావరణం ఏమిటి అని అలోచించేలోగా కాలం దొర్లిపోతుంది.ఇరుక్కున్న కాలంలోనే ఏదో తెలియని వత్తిడి, సందిగ్దత ఏర్పడతాయి.ఇప్పుడు నా పరిస్థులు అలానే అన్పిస్తున్నాయి.కాలేజీ చదివే రోజుల్లో ఇలాంటిదే ఒక అనుభవం. (ఓ 34 ఏళ్ళ నాటిది) పశ్చిమ గోదావరిలోని [...]
ఇక్కడే నా బాల్యం వెల్లివిరిసిందిఒకొక్కరుగా నేస్తాలు జీవనంలోకి నడుస్తూ చెదిరిపోయారుఎవ్వరు ఏ సమయంలో వచ్చి తమ పాదముద్రలకు మోకరిల్లుతున్నారోఇప్పుడక్కడ అభివృద్దిరహదారై తరలిపోతుందిఆ గోదారి విరామమెరుగక ప్రవహిస్తూనే ఉందికుంచెకు దొరకని ఎన్నో బాల్యజ్ఞాపకాలుమనసుపొరల్లో మసకబారుతున్నాయిబాల్య నేస్తాల్లారాఇప్పుడు మీరు ఎదురైనా గుర్తించలేనట్లేమనం ఈ ఇసుకలో ఆడిన [...]
సంవత్సరాన్ని నెలలు నెలలుగా విభజించి బేరీజువేసుకున్న ధాఖలాలు లేవు. కానీ 2013 ఎందుకో బేరీజుల తక్కేడలో నా కళ్ళముందు కదలాడింది.తొలిమాసంలోనే కొంత అలజడి, ఆ అలజడి  సంవత్సరం పొడుగునా వెంటాడింది అనే చెప్పవచ్చు. పని బాద్యతలవిషయంలో  తలెత్తిన   అలజడి ఒక అవగాహన రాకుండానే కొన్ని నెలలలు గడచిపోయి, మళ్ళీ ఆ పనే నేనే బాధ్యవహించవల్సి వచ్చింది. ఈ అలజడి కొంత మనస్థాపాన్ని కలిగించి [...]
ఈ మధ్య నా కవితా ప్రయాణంగురించి మాట్లాడే అవకాశంవచ్చింది. ఏమి మాట్లాడాలి అని పదిరోజులపాటు (కాలేజీలో పరీక్షలకు సిద్ధపడినట్టు) సిద్దపడ్డాను.   ఆ నేపద్యంలో నాకు నన్ను ప్రభావితంచేసిన వారు గుర్తుకొచ్చారు. వారిలో : మృణాలిని చుండూరినా అక్క 70వ దశకంలో నవలలు బగా చదివేది. అక్కకు నవలలు నేనే తెచ్చిపెట్టేవాణ్ణి చాలాసార్లు. అయినా నవలలు చదవడం నాకు అంతగా వంటబట్టలేదు. ఆరోజుల్లో [...]
14,15 డిశెంబరు 2004 పాల్గొన్నప్పుడుఅద్దేపల్లి గారితో పరిచయం నెలనెలావెన్నెల్లో జరిగింది. నేను రాస్తున్నవి కొన్ని ఆయనకు పోస్టులో  పంపాను. వారం తిరక్కుండానే ఆయన దగ్గరనుండి జవాబు వచ్చింది. తర్వాత తరచూ ఫోనులో మాట్లాడటంతో సాన్నిహిత్యం పెరిగింది. కొన్ని సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఎక్స్‌రే, విజయవాడ వారు నిర్వహించిన 24 గంటల [...]
~ జాన్ హైడ్ కనుమూరి ఈ రోజెందుకో బాల్యంనాటి సాహసాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి అవి సాహసమేమీ కావు. అయినా ఆ వయసురీత్యా సాహసమనే చెప్పాలి.అలాంటి మూడు సంఘటనలు. నిజానికి ఇవి ఏకోవలోకి వస్తాయో  అని ఎప్పుడూ సందేహమే!                                              (పోలవరం పాండురంగడి కొండ నుంచి  గోదావరి )1వయస్సు సరిగ్గా  [...]
మనసు శరీరం రెండూ అంతగా అదుపులో లేవు. జ్ఞాపకాలు ఏవీ జ్ఞప్తికి రావటంలేదు. అయినా టైపుచెయ్యాలని వేళ్ళు ఉబలాటపడుతున్నాయి. పరుగెడుతున్నవయస్సులో వెనక్కు చూడటం కుదరుదు కదా! ఇప్పుడు నిలబడ్డవయస్సులో వెనక్కు తిరిగి చూసుకుంటే ఎన్నో మలుపులు, సంఘటనలు, తారసపడ్డ వ్యక్తులు, ప్రయాణాలు, మజిలీలు, ....ఇవన్నీలేకుంటే జీవితమెలా అవుతుంది?నన్ను మలుపుతిప్పిన ఒకానొక వ్యక్తి కలిసినచోటుకు [...]
ఈ రోజెందుకో బాల్యంనాటి సాహసాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి అవి సాహసమేమీ కావు. అయినా ఆ వయసురీత్యా సాహసమనే చెప్పాలి.అలాంటి మూడు సంఘటనలు. నిజానికి ఇవి ఏకోవలోకి వస్తాయో  అని ఎప్పుడూ సందేహమే!1వయస్సు సరిగ్గా  గుర్తులేదు. బహుశ ఇంకా స్కూలుకు వెళ్ళటంలేదు. అప్పట్లో వయస్సు ఆరో సంవత్సరం వస్తేగాని బడిలో చేర్చుకునేవారు కాదు.స్థలం మాత్రం పోలవరం (పశ్చిమగోదావరి జిల్లా). మా రూతు [...]
***** కొన్ని రోజులుగా అడపాదడపా ఇబ్బంది పెడ్తున్న దగ్గుతో పాటు నిన్న సాయత్రంనుండి శరీరంలో ఏదో తెలియని అలజడి. శ్వాస ఇబ్బందో, గాస్ ఎటూ పోక ఇబ్బందో శరీరం సన్నని వణుకుల మధ్య నా ప్రక్కటెముక, పిల్లలు ఉపచారాలు చేసారు. బాగా ఆలస్యమైన రాత్రి అయ్యాక ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. ఉదయం 5 గటలకు వినిపించే అజా పిలుపుతో తెలవారుతుందని మాగన్నుగా తెలుస్తుంది. అప్పుడు మరో అలజడి [...]
గురువుల జ్ఞాపకాలను సీరియల్‌గా రాయలని అనుకోలేదు. అయినా యాదృశ్చికంగా గుర్తుకొచ్చేవి ఇలా  రికార్డు చేస్తున్నానంతే.  ఇందులో ఒక  గురువు మరియు వినాయక చవితి వుండటం విశేషం  కొంతకాలం మధ్యప్రదేశ్‌లో పనిచేసివచ్చాక 1985లో  ఇంటివద్దే వుండిపోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పుడు ఒక మిత్రునిద్వారా ఒకవిషయంతెలిసింది. అదేమంటే ఎక్కడైనా వర్కుషాపులో  పనిచేసినట్టు [...]
 1975-77 లో నేను చదివిన జూనియర్ కాలేజి, ఏలూరు నా స్నేహితుడు/నాజూనియర్  Chunduri Srinivasa Gupta   ఇన్ని సంవత్సరాలైనా మారని గేటు ఓ తియ్యని జ్ఞాపకం ఇంటర్మీడియెట్  కోసం గర్నమెంటు జూనియర్ కాలేజి, ఏలూరులో 1975-77 బాచ్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు మాకు శ్రీ జనార్దన రావు,  ప్రిన్సిపాల్‌గా వుండేవారు. కొంచెం పొట్టిగాను, పరమ కఠినంగానూ ఉండేవారు. ఆయనకు ఇంగ్లీషు పొయెట్రీ అంటే పరమ పిచ్చి. [...]
గతంలో నా బాల్య విద్యాభ్యాసాల గురువుల్ని జ్ఞాపకంచేసుకున్నాను. తరచూ మారుతున్న ఊర్లవల్లనో లేక నా జ్ఞాపకశక్తి లోపమో గాని లేక నా అనాసక్తో తెలియదు గాని చాలామంది పేర్లు గుర్తులేవు. 9వ తరగతినుంచి ఇంటర్మీడియెట్ వరకు  మా నాన్నగారంటే భయపడి తప్పించుకునేవాణ్ణి. ఆయన పనిచేసేది రెవెన్యూ డిపార్టుమెంటు అయినా మేము చదువుకునే సమయానికి ఆయనకు సమయం కుదిరితే షేక్సిపియర్ గురించో, [...]
  కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి. ఎంతగా అంటే విశ్లేసించుకుని వాటినుంచి వచ్చే అనుభవాన్నో, సారాంశాన్నో  జీవిత విధానంలోకి తెచ్చుకుని మార్పు తెచ్చుకునేంతగా.నా అనుభవాలనుంచి  కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటలన్నిటిని విశ్లేసించుకున్నాను ఒకసారి. కొన్ని విషయాలను క్రోడీకరించుకున్నాను 1999-2001 సంవత్సరాలలో నేను మద్యపానం మానేయాలనుకోవడం, కంప్యూటరు [...]
వెళ్ళిపోయిన కాలంలోంచి జ్ఞాపకాలు తొంగిచూస్తాయి.   ప్రసంగి 7 : 1-3 (బైబిలు) నుంచి 1. సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.2. విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.3. నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును [...]
నేను కొంత కాలంగా  దినచర్యగా  చదువుతున్న బైబిలు వాక్యాలు  తెలుగు బైబిలు బ్లాగులో యధాతధంగా పోస్టుచేస్తూన్నాను. సామెతలు 31వ  అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు నాకు కలిగిన భావాన్ని ఇలా మీతో పంచుకుంటున్నాను. 10వ వచనమునుండి "గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది" మొదలయ్యి ముత్యముకంటె అమూల్యమైనది అయిన భార్య దొరకటం ద్వారా కలిగే మేళ్ళను, [...]
నేను ఎప్పుడో పోగొట్టుకున్నదానినిమళ్ళా పోగొట్టుకున్నానని ఎలాచెప్పనుమిత్రమా!నాన్న ఉద్యోగపు బదిలీలమధ్య తొమ్మిదవ తరగతికిసెయింట్ జేవియర్స్ హై స్కూలులో చేరినప్పుడుకొత్తకొత్త వాతావరణం మధ్యకలిసిన తొలి స్నేహహస్తానివిపదవతరగతి పరీక్షలకుకట్టా సుబ్బారావు తోటలో కలిసి చదివిన పాఠాలకుముఖ్యాంశాలను అద్దిన వాడివిఉన్నత విద్యలో నీదారి నాదారీ వేరైనాకలిసి తిరిగిన [...]
చాలా కాలం క్రితం చదివిన తుమ్మల దేవరావు గారి ఈ కవిత చాలాసార్లు నన్ను వెంటాడుతూ వచ్చింది. ఇందులో వున్న పదచిత్రాలు నన్ను బాగా అకర్షించాయి.వర్షానికి నిర్వచనాలు, సూత్రీకరణలు, కొన్ని చిత్రాలు, అనుభూతి చెందడం ఎలా!, వాటివెనుక కొన్ని జ్ఞాపకాలు కన్పిస్తాయి. బీద ధనిక, గుడిసెలపైన భవంతులపైనా వకేలా కురుస్తుందని చెప్తూ-వర్షం ఒక సమతా సూత్రంభూమిని ఆకాశాన్ని కలిపి కుట్టే నీటి [...]
***ఫెంటోలు అనేది ఒకరూపం 10మొదటి పాదం 15 రెండవ పాదం  దాని నిర్దిష్టత.వాటిని ఏ ఏ అంశాలకు ఏవిధమైన అభివ్యక్తి చెబుతున్నాము, వాటికుండే ధ్వని వేటిని చూచిస్తున్నాయి అనేది గమనించాలనేది నా ఉద్దేశం.కేవలము భావ ప్రదానంగా నడిచి వయక్తికంగా ఎక్కువ ఉండటంవల్ల భావ కవిత్వపు స్థాయిని మాత్రమే ఫెంటోలు పొంద గలుగు తాయి.భావ కవిత్వాన్ని 1930  తర్వాత అధిగమించి వాదాలు, వర్గాల వైపు పయనించిందని [...]
ఏదైనా చదివిన వెంటనే అయస్కాంతంలా ఆకర్షింపబడినప్పుడు అదే రీతిలో ఫార్‌మేట్‌లోకి వెళ్ళిన నా రాతలు గురించి మీరేమైన చెబుతారా? ఇలా ఆకర్షింపబడటం అనేది వేరే సందర్భాలలో జరగలేదు. ఇది నా అనుభవమేనా, లేక ఇలాంటివి సహజమా? ఎవరికైనా జరిగాయా? తెలుసుకోవాలనే కుతూహలం నాకు కవిత్వం రాయటం ఎలా అబ్బింది అని సందేహమొచ్చిందీమధ్య.ఖచ్చితమైన సమాధానమేదీ దొరకలేదు.నేను ఏమీ రాశాను అని [...]
నేను 8వ తరగతి చదువుతున్న రోజుల్లో ఎలా ఏర్పడిందో గాని మిరపకాయబజ్జీలంటే భలే ఇష్టం ఏర్పడింది. సాయంకాలంపూట ఒక(పాక/గుడిశె) హోటలులో సాయంకాలాలు మిర్చిబజ్జీలు వెయ్యడం మొదలుపెట్టారు. అక్కడే చిన్న ఆ వూరిబస్సులు ఆగేవి. అప్పటికి ఇంకా బస్సు షల్టరు ప్రత్యేకంగా ఏదీ లేదు ఆవూరిలో. సినిమాహాలుకు వెళ్ళే దారికూడా కావటంవల్ల బాగానే అమ్ముడుపోయేవి. ఒక్కో మిర్చి బజ్జీ 3 పైసలు, 10 [...]
వొక తర్వాత బహుశ వొక వ్యక్తి మరణించిన తర్వాతనే అతనితో సంభాషణ మొదలుపెడతాం వొక వ్యక్తి అంతర్థానమైన తర్వాతనే ఆమెను అర్థం చేసుకోవడం మొదలుపెడతాం శాశ్వత అశాశ్వతత్వాని అక్షండ ఖండ సత్యాల్ని అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత బహుశా దుఖ్కించడమో సంతోషించడమో మొదలుపెడతాం మరి సంధ్యా సౌదర్య శిఖరంపై కమ్ముకున్న చిక్కటి చీకటి శైతల్యం రాత్రి పెదిమల మీద నులివెచ్చని వుదయ రాగోదయం [...]
 ఈ మధ్య ఏమిటో  ఆఫీసులో నిద్రవూతున్నప్పుడు చేతిలో పెన్నో, పెసిలో దొరికితే బొమ్మలైపోతున్నాయిఇందులో ఏముందో మీరేమనా చెప్తారా?
ఘజల్ రాయడంలో నేనూ ప్రావీణ్యున్నేమీ కాదు. ఇలానే ఒకప్పుడు  నేను రాస్తున్న కవితలు ఘజల్ లా వుంటాయని నేను రాయాలని నాచేత రాయించిన క్రెడిట్ జ్యోతిర్మయి మళ్ళ గారిది. కవిత చదవగానే నాకు "చిత్రం భళారే విచిత్రం" అనే పాట గుర్తొచ్చింది. ఈ పాట నేపద్యానికి అనేక ప్రయోగాలున్నాయి. ప్రాస అనుప్రాసలు వాడినప్పుడు  శబ్ద ధ్వని వస్తుంది, ఆ శబ్ద ధ్వనికి అనువైన పదాలు అమరినప్పుడు భావంతో [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు