* * * * * * * * వేసవి సెలవులు అయిపోయిన తరువాత వచ్చిన పిల్లలను సెలవుల్లో ఏమి చేసారో రాసుకొని రమ్మన్నాను. ఒకళ్ళేమో డిస్నీకెళ్ళామంటే ఇంకొకళ్ళు డకోటా(సౌత్ డకోటా) కెళ్ళామని రాసుకొచ్చారు. ఒక గడుగ్గాయి భారత్ వెళ్ళొచ్చాడు. పేపర్ లో రాసుకొచ్చింది నా చేతిలో పెట్టి నా పక్కన నుంచున్నాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింట్లో ఆవు ఈనిందట. ఒక దూడ పెయ్యని ఈనిందట. అమ్మమ్మ జున్ను చేసి ఇచ్చిందట. [...]
***"అయ్య గారూ""ఏం సిద్ధా?""దేవుడెక్కడున్నాడు?""కాంగ్రేస్ పార్టీ లో వున్నాడు కదా?"మరిప్పుడు వై.ఎస్ ఎక్కడున్నాడు?""దేవుడి దగ్గర కెళ్ళిపోయాడు?""ఏ దేవుడి దగ్గర కెళ్ళాడు?""వరుణ దేవుడు వచ్చి అసలు దేవుడి దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు.""అదే ఎందుకు అని?""సకాలం లో వర్షాలు పడనందుకు ఆందోళన చెందిన దేవుళ్ళు తమ ధైర్యం కోసం మొండి ధైర్యం కల వై.ఎస్. తోడుంటే బావుంటుందని."***నీకెలాంటి [...]
* * * * * * * * సిలికానాంధ్ర అని పేరు చెబితే అమెరికాలో కొంత మందే గుర్తుపట్టే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ పేరు చెప్పగానే ఏ కూచిపూడో, శాస్త్రీయ సంగీతమో, జాన పద కళో చప్పున గుర్తుకు వస్తుంది అమెరికా తెలుగోడి కైనా, తెలుగు దేశం లో తెలుగు మాట్లాడని వాడికైనా. ఆ సంఘం తెలుగు బాషకు చేసే సేవల్లో మన బడి ఒకటి. మన బడిని పిల్లలకు తెలుగు భాష నేర్పటానికి మొదలు పెట్టారు. ఇంతింతై వటుడింతై [...]
* * * * * * * * అనగనగా ........ఓ చంద్రుడు లేని రాత్రిఅదే కాళ రాత్రి.....అమావస్య రాత్రి....చిమ్మ చీకటి రాత్రిచీమ చిటుక్కు మనే రాత్రి కటిక చీకటిచీకటి....కటి.....కట్.....రెండు కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయ్.అబగా ఆర్తిగా ఆకలిగా..నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తీక్షణంగా చూస్తూ..ఆ కాళ్ళు వెనక్కి నక్కాయి.ఏండుటాకుల మీద అడుగుల చప్పుడు.అలికిడి..అలజడి..వెతుకుతున్నది కళ్ళ బడింది.నిగ నిగ లాడుతూ [...]
"అయ్య గారూ...అయ్య గారొ....""....""అయ్య గారూ...ఎక్కడున్నారు?""ఏవిట్రా నీలో నువ్వే గొణుక్కుంటున్నావు. పొద్దున్నుంచీ కనిపించ లేదు ఎక్కడ చచ్చావ్.""ష్. గట్టిగా అరవకండి.""ఏవిటి మగ ధీర సినిమా టికెట్లు గానీ దొరికాయా?.. నెత్తిన ఆ మూటలేంటి?""ముందు మీరా తలుపులేసేసి బీరువా దగ్గరకు రండి.""బీరువా దగ్గరకా? ఏవన్నా లంకె బిందెలు దొరికాయా?""లంకె బిందెలు ఎవడిక్కావాలి..ఇవి వాటి కన్నా విలువైనవి. [...]
* * * * * * * * ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పే రోజు ఏదో ఒకటి వుంటుంది. అదే జీవితాన్ని, కుదరకపోతే శరీరాన్ని మలుపులు తిప్పుతుంది. అమెరికా వచ్చినప్పుడు తెచ్చింది రెండు పెట్టెలు. ఇప్పటికీ ఆ రెండు పెట్టెలను నా "రెండు పెట్టెలు" అని అప్పుడప్పుడూ బయటకి తీసి ఊడిపోయిన నట్లు బిగించి, సంక్రాంతి అప్పుడు ఎద్దు కొమ్ములకు రంగులేసినట్టు రంగులేసి ఆరబెట్టి మళ్ళీ ప్లాస్టిక్ సంచుల్లో [...]
* * * * * * * * "బాబా బాబా.... లతోబా బాబా.ఇల్లా బాబా...ముల్లా బాబా.లాహి..లాహి లతోబా..ఇల్లా ఇల్ల లతోబా""ఎవరండీ ఇక్కడ ఇంట్లో ఏవైనా పూజలు చేస్తున్నారా?""బల బల బల బల బాబా?...ఓ ఎవరు?.... పక్కింటి ఎంకట్రావు గారా? పూజ చేసుకుంటున్నామండి ""ఓ ఈ బాబా నా. నాకు బాగా తెలుసు. ఈ లతోబా బాబా దయవల్లే మనం ఇంకా బతికి వున్నాం..నేను కూడా భజన చేస్తా బాబా బాబా లతోబా ..బాబా బాబా లతోబా.""మమ్ములను దయ చూచు లతోబా...
ముంబైలో విదేశీ ముష్కరులు చేసిన మారణకాండను ఖండించాలా? ఎందుకు ఖండించాలి? ఖండించాల్సింది జరిగిన దుస్సంఘటనను కాదు. ఈ సంఘటనకు శాయశక్తులా సహాయపడిన స్వదేశీ రాక్షసుల కుత్తుకలను ఖండించాలి.వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రత్యర్థి పార్టీల గుట్టు మట్లు తెలుసుకోవడానికి చూపిస్తున్న స్వామి భక్తి పరాయణత ను దేశ భద్రత మీద పెట్టని ఇంటెలిజెన్సు అధికారుల కుత్తుకల్ని [...]
* * * * * * * * "రేయ్ సిధ్ధా!!!""......" "రేయ్ సిధ్ధా!!! ఆ గంతులేమిటి ఇలా రా.. క్రికెట్ లో మనోళ్ళు బాగానే ఆడుతున్నారు. నువ్వు ప్రాక్టీసు చేసి దేశాన్నేమీ ఉద్ధరించక్కర్లేదు ఇటొచ్చి కాస్త పని చూడు""అయ్య గారూ, నేను క్రికెట్ ప్రాక్టీసు మానేసి చాలా కాలమయింది. ఇప్పుడు నేను ప్రాక్టీసు చేస్తోంది తొడ కొట్టి మీసం మెలెయ్యడం""ఏ సంక్రాంతికి కుస్తీ పోటీలు గానీ జరుగుతున్నాయా ఊర్లో?""వచ్చే [...]
* * * * * * * * దేశంలో గరీబోళ్ళు ఎక్కువయ్యారని ఇందిరాగాంధీ 'గరీబీ హఠావో' అంది. పదవి లోకి రాగానే గరీబోళ్ళకు చాలా చేసింది...గరీబోళ్ళు హ్యాప్పీ.. రాష్ట్రం లో బీదోళ్ళు ఎక్కువయిపోయారని రెండు రూపాయలకే బియ్యమిస్తానన్నాడు అన్న ఎన్టీఆర్. రాగానే ఇచ్చాడు... బీదోళ్ళు హ్యాప్పీ... రైతులు బ్యాంకు ఋణాలు కట్టలేరని మాఫీ అన్నాడు చెన్నా రెడ్డి. పదవిలోకి రాగానే ఋణాలు మాఫీ...రైతులు హ్యాప్పీ... [...]
* * * * * * * * అన్ని దేశాల ఎకానమీలు సున్నా అయి సున్నకెంత విలువుందో చూపిస్తాం అని సునామీ సృష్టిస్తున్నాయి. దీనికి మెంటలా అంటే అవును. ఓ రోజు తారా జువ్వలా రివ్వున ఎగసి పడుతుంది ఇంకో రోజున తుస్సు తుపాకీ అని పుటుక్కుమని నేల పడుతుంది. అక్టోబరు మొదటి వారం లో రికార్డు స్థాయిలో అమెరికా డౌ జోన్సు ఇండెక్సు 800+ పాయింట్ల పతనం..(చరిత్ర సృష్టించింది) మళ్ళీ వారం తిరక్కుండానే రికార్డు [...]
కంపెనీలు : ఉద్యోగులను ఇంటికి పంపించి స్టాక్ మార్కెట్ : ఇండెక్సును కిందకి పంపిచిరంజీవి: ప్రజాపర్యటన మధ్య లో ఆపేసివై.ఎస్.: 24 గంటలు బీరు తయారీకి అనుమతిచ్చిభారతీయ రిజర్వు బ్యాంకు: ఒక శాతం వడ్డీ తగ్గించితమిళెంపీలు: 39 రాజీనామాలు కరుణా నిధి చేతిలో పెట్టి నేను: ఒక టపా రాసి
* * * * * * * * "అమెరికా తుమ్మితే మిగతా ప్రపంచానికి జలుబు చేస్తుందట కదా?""కాదు. ప్రపంచానికి జలుబు చేసే ముందే అమెరికా తుమ్ముతుంది."* * * * * * * * "ఇవాల్టికి మీ కంపెనీలో స్కోరెంత?""ఆ ఎంత ఓ ముప్పై!!!""ఓస్ అంతేనా మా దాన్లో యాభై""అయితే ఇక క్లోజన్న మాట""ఏవిటి అప్పుడేనా ఇంకా చాలా వుందట""మా కంపెనీలో కూడా"* * * * * * * * "మీ కంపెనీలో వ్యవహారమెలా వుంది?""కొందర్ని క్యూబు దాకా రానిస్తున్నారు.""మీ కంపెనీ నే
* * * * * * * * మరూన్‌ బెల్స్: అమెరికాలో విరివిగా క్యాలండర్ లలో వుండే చిత్రం ఇదే. అమెరికా వచ్చిన కొత్తలో ఫ్లోరిడా లోనో, టెక్సాస్ లోనో పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు ఈ టి.వి. ల వాళ్ళు మదర్ నేచర్ కన్నెర్ర చేసింది, మదర్ నేచర్ మార్పులు తెచ్చింది అని అంటుంటే వీళ్ళు కూడా ఏంటబ్బా మనలా మదర్ ఇండియా, మాతృత్వం లాంటి పదాలు వాడతారు
నా కొత్త టపా, ఏ ప్రాజెక్టు బిడ్డింగులో ఎంతమంది పాల్గొన్నా చివరికి కాంగ్రేస్ సపోర్టర్ కే దక్కినట్టు, కూడలి లో పైన కనిపిస్తోంది. దానికి కారణం నేను చేసిన చిన్న తప్పిదం. అంతే కానీ కాంగ్రేసు పార్టీ లో చేరినట్టు కాదు. భారత కాల మానాన్ని అందుకొనే ప్రయత్నము లో ప్రచురించే సమయం 10 గంటలకు 12 కలపబోయి 10 తేదీని 12 వ తేదీ చేశా. అదే ఇప్పుడు కూడలి లో కపి రాజు లా రెప రెప లాడ్డానికి కారణం. ఇలా [...]
* * * * * * * * హిందు జగేతో.... విశ్వ జగెజై జై గీత భగవద్గీత వంటి నినాదాలతో శాంట మరియా క్యాంపు మారుమ్రోగింది. చాన్నాళ్ళ తరువాత ఎప్పటి వెప్పటివో తీపు గుర్తులు, ఉద్విగ్న క్షణాలు గుర్తుకు వచ్చాయి ఆ మూడు రోజులూ. హెచ్.ఎస్.ఎస్., అమెరికా (హిందూ స్వయం సేవక్ సంఘ్) కొలరాడో విభాగం వారు ఆగస్టు 29-31 తేదీలలో హిందూ కుటుంబ శిబిరాన్ని నిర్వహించారు. డాదాపు ప్రతి సంవత్సరమూ జరిగే ఈ కుటుంబ శిబిరంలో ఈ [...]
పార్టీ పేరు బానే వుంది కానీ 'ప్రజ' బాగా అతుకున్నేట్టు చూడు. మిగతా పార్టీల్లో అది లేకనే నీ అవసరం వచ్చింది ::::::::::::::: ::::::::::::::: టి.డి.పి. లో నుండి వలసలకు గుర్తుగా పసుపు రంగు పెట్టడం బాగానే వుంది బావా.:::::::::::::::
బ్లాగుకి టపాకి మధ్య అనుసంధానమైంది ఈ బ్లాగు * * * * * * * * రండి బాబూ...రండి.కాయ్ రాజా కాయ్..మాడి పోయిన బుర్రలు వెలుగుతాయి బాబు..వీడి పోయిన మనసులు కలిసి పోతాయ్ బాబూ..ఒక్క లుక్కు వేసుకోండి బాబూ..ఒక్క క్లిక్కు పది పేజీల టపా బాబూ..కాయ్ రాజా కాయ్..రండి బాబూ రండి....హమ్మయ్యా వచ్చేశారా. ఈ జాతర్లో పాటలేంటంటారా? ఒక్కో సారంతే. కొన్ని సంవత్సరాల తరువాత బ్లాగులకు కాప్షన్‌ లు ఇలానే వుంటాయ్.అదే నా [...]
* * * * * * * * సిలికానాంధ్ర : కాలిఫోర్నియాలోని ఈ తెలుగు సంస్థ పేరు చెప్పగానే అమెరికా లో తెలుగు భాష మీద, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మీద అభిమాన మున్న ప్రతి వ్యక్తి అనుకునే ఒకే ఒక మాట " ఇలాంటిది మా ఊర్లో కూడ ఒకటి వుంటే బావుండు". ఈ సంస్థ ప్రతి సంవత్సరము తమ సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. వీరి ప్రత్యేకత ఏంటంటే సినిమా పాటలు లేక పోవడమే కాదు రికార్డు [...]
* * * * * * * * "అయ్యా!" "సిద్ధా!""ఈ సారి మనకు ఒలంపిక్స్ లో ఓ స్వర్ణం తెచ్చి మన త్రివర్ణాన్ని రెప రెప లాడించాడు గదా మన బింధ్రా.""అవును. అభినవ్ భింద్రాను చూసి ఆసేతు హిమాచల మంతా ఆనంద డోలికల్లో మునిగి అణువు అణువునా పులకరిస్తోంది.""ఇరవై నాలుగేళ్ళ కుర్రోడు, స్వతంత్ర భరతావని చరిత్రలో మొదటి సారి వ్యక్తిగత పతకమొస్తే అనిర్వచనీయమైన అనందంతో గంతు లేయకుండా స్థిత ప్రజ్ఞుడిలా ప్రశాంతంగా [...]
ఇందులో విషయం లేదు కానీ ప్రచురించే సమయానికి ప్రత్యేకత వుంది.(చిరంజీవి ఈ సమయానికే పార్టీ పేరు ప్రకటిస్తాడేమో) సమయం రెండువేలలో 8 వ సంవత్సరం, 8 వ నెల, 8 వ రోజు , 8 గంటలు, 8 నిముషాలు, 8 సెకన్లు.నా జీవితకాలం లో మళ్ళీ ఇంకో సారి దీన్ని చూడను.ఇంతకు ముందు చూసిన ప్రత్యక మైన తేదీ.12:34:56 7-8-90
"అయ్య గారూ" "హాయి హాయిగ జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి ...""ఎక్కడున్నారు?""హాయ్ హమ్మా హాయ్ హాయ్ హమ్మ...""ఏమైంది మీకు?" "చికు బుకు చికు బుకు రైలే...అదిరెను దీని స్టైలే..""అంత సంబరమెందుకో"."ఇదిగో ఇందుకు""ఓసోస్ ..దానికే ఇంత ఆనందమా?..ఇప్పుడూ...నేను చెప్పేదేంటంటే ... అలాంటివి చాలా వస్తూ వుంటాయ్.... గదా.. ఆఁ..వస్తుంటాయ్ గదా..అందుకని...ఏరీ మళ్ళీ ఎక్కడికెళ్ళారు? కిందెక్కాడా కనబడ్డం లేదు." [...]
* * * * * * * * రేయ్ సిద్ధా!!! అయ్య గారూఎక్కడ అఘోరిస్తున్నావ్ రా ఇక్కడే అఘోరిస్తున్నా ఇక్కడికి వచ్చి చావు. ఈ చీకట్లో నన్నెవరో కట్టేశారు. మిమ్మల్నీ కట్టేశారా? ఏవిటి నిన్ను కూడా కట్టేశారా?ఇలా మనిద్దర్నీ ఎందుకు కట్టేసార్రా? నాకేం తెలుసండీ. మీకెవరైనా శతృవులు వున్నారా?నాకు తెలిసి ఎవరూ లేరు. తెలీకుండా ఎవరన్నా వున్నారేమో? అయ్యగారూ నాకో అనుమానం.నీ అనుమానం పార్లమెంటు కెళ్ళా. నువ్వు [...]
లోకం లో జనాలు రెండు రకాలు.చదవడం తెలిసిన వాళ్ళు, చదవడం రాని వాళ్ళు.చదవడం రాని వాళ్ళతో హ్యాప్పీస్. చదవడం వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండు రకాలు.తెలుగు వచ్చిన వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు.తెలుగు రాని వాళ్ళతో హ్యాప్పీస్తెలుగొచ్చిన వాళ్ళు మళ్ళీ రెండు రకాలుబ్లాగులు చదివే వాళ్ళు, బ్లాగులు చదవని వాళ్ళు.బ్లాగులు చదవని వాళ్ళతో హ్యాప్పీస్. బ్లాగులు చదివే వాళ్ళు రెండు రకాలు.నా బ్లాగు [...]
ఈ నెల బ్లాగు వ్యాసం : జ్ఞాపకాలు ఇలాంటిదేదో వస్తుందని ముందే ఊహించి ముందే రాసేశా. అదే ఈ చెనిక్కాయిలు ఉడకేసుకుందాం రా రా.. పోయిన నెలో అంతకుముందు నెలో ఇచ్చిన వ్యాసం: ఈతఇలాంటిదేదో వస్తుందని ముందే ఊహించి రాసేశా. అదే ఈ "డబుక్కు జర జర డుబుక్కు"వచ్చే నెల ఏదొచ్చినా నేను రాసిందే వుంటుంది.అదే మరి ముందు చూపంటే.బ్లాగుల్లో ఎవరికీ తట్టని అవిడియాలు ఎవరికి తడుతాయంటే అది విహారికే.
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు