రెండేళ్ళ క్రితం ఇలాంటి టపానే – పంద్రాగస్టు చింతన్ భైఠక్ లాగా రాసాను. ఇవాళ మళ్ళీ, అవే ఆలోచనలొస్తున్నాయి. అసలు మనం స్వతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలు ఎందుకు జరుపుకోవాలి? -మొదట్నుంచీ, నా అభిప్రాయం ఒకటే : ఇది దేశం మొత్తానికీ పండుగ లాంటి రోజు కనుక. హిందూ,ముస్లిం,సిక్కు,క్రైస్తవ -ఇలా భిన్న సంప్రదాయాల్లో ఉండే పండుగల్ని ఆయా మతస్థులు ఎలా జరుపుకుంటారో, దేశ సంప్రదాయంలో ముఖ్యమైన ఈ [...]
