అద్దం అద్దం అవతల నువ్వు ఇవతల నేనూ ఒకరినొకరు చూసుకొని ఇంతకాలం ఇద్దరం ఒకటే అనుకున్నాను... నవ్వినప్పుడు నవ్వు కోపంలో కోపం చిరాకులో చిరాకు ఏడ్చినప్పుడు ఏడుపు అన్నీ నావే అనుకున్నాను ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా ఎందరితో పోట్లాడినా నీడలా వెంటే వస్తోంటే అదీ నేనే [...]




