ఇప్డు డు నరసింహారావు మా ఇంటికి అల్లుడు కాదు. పెద్దకొడుకు. మంచీ చెడూ అన్నీ కనుక్కుంటాడు. తరుచుగా ఉత్తరాలు రాస్తాడు. ఫోన్లు చేస్తాడు. ఆరోగ్యం సంగతి అడుగుతాడు. మావయ్యగారు వేళ కి భోజనం చేస్తున్నారా అని అడుగుతాడు. మందులు వేసుకుంటు న్న్నారా, డాక్టర్ దగ్గరికి రెగ్యులర్ గా వెడుతున్నారా అని అన్ని విషయాలూ శ్రద్ధగా అడుగుతాడు. సలహాలు చెప్తాడు. ఏ సాయం కావాలన్నా ముందుకి [...]




