విచక్షణలేక ఇంద్రియలోలుడై జీవించు వానిని సరియైన శిక్షణలేని జంతువుగా మన పెద్దలు చెపుతారు.  సరియైన శిక్షణలేని ఎద్దు ఎలాగైతే వ్యవసాయమునకు ఉపయోగపడదో అలాగే విచక్షణ లేక జీవించువాడు జ్ఞానమును పొందలేడు.  గుఱ్ఱమును లొంగదీసుకొని, మచ్చికచేసుకొని, దానికి సరియైన శిక్షణనిచ్చి దానిపై స్వారీ చేసి గమ్యమునకు చేరవచ్చును.  అలాగే శరీరమునకు శిక్షణనిచ్చి మానవుడు తన [...]
ధ్యానము - ప్రపంచములో ప్రస్తుతము ఎక్కచూసినా వినబడే ప్రక్రియ.  చాలా మంది చాలా చోట్ల దీనిగురించి మాట్లాడుతూ ఉంటారు.  అసలు ధ్యానము అనగా ఏమిటి?  ఎందుకు చేయాలి? అన్న ప్రశ్నలకు చాలా తక్కువమంది సరియైన సమాథానము చెపుతారు.  "శ్వాసమీద ధ్యాస" అని చెప్పేవాళ్ళు ఎక్కువమంది ఉంటారు.  అది నిజమే!  ధ్యానము చేయాలని కూర్చొని మనస్సును శ్వాసమీద ఉంచినచో ఎందుకు నిలచుటలేదు?  అలా ఎంతమందికి [...]
అవథాని శ్రీ గరికపాటి నరసింహారావుగారు 2005లో అమెరికాలోని ఆంథ్రులకు శ్రీమద్రామాయణంలోని థర్మసూక్ష్మాలను వివరిస్తూ ఇచ్చిన ప్రసంగంలో "అనగనగా ఒక రాజు.  ఆ రాజుకు ఏడుగురు కొడుకులు." అన్న కథలోని తత్వచింతనా కోణాన్ని అవిష్కరించారు.  అది ఇక్కడ అందచేస్తున్నాను.  ఈ కథ ప్రతి తల్లి, తండ్రి చిన్నపిల్లలకు చెప్పే కథల్లో ముఖ్యమైనది.  అందరికి తెలిసినదే.  మామూలు కథగా ఆలోచిస్తే ఎదో [...]
మానస సరోవరం వద్ద మాస్టరు గారి దర్శనము (ఊహా చిత్రము) ఈరోజు మాస్టరు సి.వి.వి గారి జన్మదినము.  1868 ఆగస్టు 4న మాస్టరు గారు తమిళనాడులోని కుంభకోణములో జన్మించారు.  చిన్నతనములోనే అనేభాషలలో ప్రావీణ్యము సంపాదించారు.  భాష దాని శబ్దము, శబ్దతరంగములలోని అనేకానేక రహస్యములను అవగతము చేసుకొన్నారు.  1910లో దిగివచ్చిన కుంభచైతన్యమును అందుకొని విశ్వప్రణాళికలో భాగంగా మానవజాతిని [...]
సృష్టిలో తనకు తాను ఉన్నట్లుగా తెలిసిన జీవి మనిషి మాత్రమే.  మనస్సనే ప్రజ్ఞ వికసించుటవలన మనిషి తాను ఉన్నట్లుగా తెలియగలుగుచున్నాడు.  ఇతర జీవరాశులకు వాటికి అవి ఉన్నట్లుగా తెలియదు.  ఇతరవాటిని గుర్తించగలవు.  ఇంద్రియములను నడిపించునది మనసు.  మనస్సు ఇంద్రియ వశమైనప్పుడు మనిషి సుఖదుఃఖముల వలయములో చిక్కుకొని శాంతిలేక జీవించును.  ఇంద్రియములు మనస్సువశమై, మసస్సు బుద్దితో [...]
క్షమ..భగవంతుని అనంత కళ్యాణగుణాలలో ముఖ్యమైనది.  కరుణ కలిగిన వాడే క్షమా గుణాన్ని ప్రదర్శించగలడు.  బుద్ది జీవుడైన మానవుడు తప్పక కలిగి ఉండవలసినది క్షమా గుణము.  గుణములన్నిటిలోనూ అత్యుత్తమైనది.   అది లేనివాడు మనిషి కాలేడు. ఇతరుల దోషాలను క్షమించగలిగి ఉండాలి.  ఎవరి ఆలోచన వారికి సరియైనదే.  కానీ అది ఇంకొకరి ఆలోచనతో విభేదించినపుడు మనస్పర్దలు కలుగుతాయి.  వాటిని పెంచుకొని [...]
మానవ దేహము పంచభూతములతో చేయబడినది. అన్ని వేళళా దానిని పవిత్రముగా ఉంచుకొనవలెను. పవిత్రమైన దేహము స్వచ్ఛమైన జీవితమునకు వాహికయై ఉంటుంది. వాహనము సరిగా ఉన్నప్పుడే ప్రయాణము సాఫీగా సాగుతుంది. జీవుని ఉన్నతికి మంచి దేహము అవసరము. తరచూ అనారోగ్యమును అనుభవించే దేహము జీవునికి ఆత్మానుభూతిని అందివ్వదు. మంచి పనికి మంచి దేహము అవసరము. అది అనేక మంచి పనులను చేయించును. దేహము జీవుని [...]
దేవాలయమునకు కాని, సద్గురు సమక్షమునకు కాని వెళ్ళినచో మనకు తెలియని ఎదో ఒక ప్రశాంతత ఉంటుంది. ఆ సమయములో ఎంతో ఊరట పోందుతాము. హాయిగా ఉంటుంది. ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకు? ఆ ప్రశాంతత ఇతర సమయాలలో ఎందుకు ఉండదు? కారణము ఏమిటి? అటువంటి ప్రశాంతతను కోల్పోవుటకు గల కారణమేమి? స్వభావము. జీవుని యొక్క స్వభావమే కారణము. సాథారణముగా దైవీ స్వభావము యొక్క సమీపములో [...]
Over Communicative Syndrome Over Talking Syndrome 1876 లో అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్ కనిపెట్టినప్పుడు, రాబోవు తరాలలో మానవజాతి దీనివల్ల ఎంత అభివృద్ది చెందుతుందో ఆలోచించాడే కాని, విచ్చలవిడిగా వాడి మానసిక రోగానికి గురి అవుతారని ఊహించి వుండడు. గత పది సంవత్సరాలలో పెరిగిన టెలిఫోన్ కంపెనీలు మరియు వాటి వాడకము వల్ల తెలుస్తుంది. ఎన్ని కుంభాకోణాలు వెలుగుచూపాయో ప్రత్యేకంగా చెప్పుకొనవలసిన పనిలేదు.
నీవెవరో గుర్తు చేసేవాడు గురువు. జ్ఞానమును బోధించేవాడు గురువు. దైవము వైపు నడిపించేవాడు గురువు. సమర్పణ చెందినవాని సమస్త భారము వహించువాడు గురువు. అరిషడ్వర్గములనుండి కాపాడువాడు గురువు. అమృతత్వమును ప్రసాదించువాడు గురువు. తాను బ్రహ్మమై శిష్యునికి బ్రహ్మత్వము అనుగ్రహించేవాడు గురువు. జన్మ జన్మలకు వదలక ఉండేవాడు గురువు. కరుడుకట్టిన కర్మను కరుణతో కరగించువాడు గురువు. [...]
సృష్టిలో దైవము ఎలా ఉన్నాడు? గుర్తించటము ఎలా? అన్న ప్రశ్న మామూలుగా దైవము ఎడల భక్తో, భయమో ఉన్న వారికి సహజముగా కలుగుతూ ఉంటుంది. అసలు దైవము ఉన్నాడా అనే ప్రశ్న అనాదిగా తర్కించుకుంటునే ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. ఎప్పుడైనా ఎవరికైనా అసలు లేని దాని గురించి ప్రశ్నంచటానికి గాని, ఆలోచించటానికి గాని వీలు ఉంటుందా? ఒకవేళ అలావుంటే అవి ఏమిటి? ఎదైనా ఒక విషయము మనకి [...]
గురు అనగా పెద్దది లేక బరువైనది అని అర్థము కలదు. మన సౌరమండలములో కూడా సూర్యుని తరువాత గురువే పెద్ద గ్రహము. జ్ఞానములో పెద్దవానిని గురువు అందురు. తల్లి తొలి గురువుగా మొదలు పెట్టిన జీవితములో తండ్రి మలి గురువు. ఆ తరువాత విద్యాభ్యాసము.. అక్కడి వారు విద్య నేర్పే గురువులు. ఇంకా అనేకానేక మంది ద్వారా మనము అనేక విషయములను తెలుసుకొని శిక్షణ పొందుతూ వుంటాము. కనుక గురువు యొక్క [...]
సంఖ్యా శాస్త్ర ప్రకారము 11, 22 మరియు 33 చాలా ముఖ్యమైన సంఖ్యలు. దానిని మాస్టరు నెంబర్లు అంటారు. ఇది మనిషి యొక్క బాహ్య ప్రపంచానికి, లోపలి ప్రపంచానికి వారధిగా పనిచేస్తాయి. మనిషి తన అంతరంగములోనికి ప్రయాణము చేయుటకు ఈ సంఖ్యల యొక్క తరంగములు బాగా ఉపయోగపడతాయి. మనిషి తనలోని ఊహాశక్తిని, శ్రద్ధను, ఆధ్యాత్మికత మొదలగునవి పెంచుకొనుటకు ఇవి చాలా దోహదమును అందిస్తాయి. ఈరోజున 11-11-11 మూడు [...]
యోగజీవనమును సాగింపదలచిన వారు ఈ క్రింది విషయములను పరిశీలించుకొనవలెనని పరమ గురువు మైత్రేయుల వారు తెలియచేసి యున్నారు. 1. దప్పికకు నిలువగలవా? 2. ఆకలిని ఓర్చుకొనగలవా? 3. వేసవిని భరింపగలవా? అట్లే శీతలమును భరింపగలవా? 4. రోజుల తరబడి వర్షించుచు సూర్యరశ్మి కలుగనిచో సహింపగలవా? పై విషయములయందు నీకు చిరాకు కలుగుట లేదు కదా! కలుగనిచో ప్రాథమిక సంసిద్ధత నీకు ఉన్నదని తెలియును. [...]
సుమారు 20 సంవత్సరాల క్రితం ఒక వార పత్రికలో చూసి వ్రాసుకున్న సూర్య స్తోత్రం. మనందరికి తెలిసినదే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత. కర్మ సాక్షి. ప్రత్యక్ష నారాయణుడు. సమస్త సూర్యమండలానికి వెలుగును ప్రసాదించే దైవము. అటువంటి సూర్యారాధన సమస్త రోగములను హరించి ఆరోగ్యమును అందిస్తుంది. రోగగ్రస్తుడైన శ్రీకృష్ణ కుమారుడు సాంబుడు తన తండ్రి ఆజ్ఞానుసారము సూర్య ధ్యానములో [...]
కర్మ - అంటే మనోవాక్కాయములతో చేసే పని. కానీ భౌతికముగా చేసేదే పని అని దాని వల్ల కర్మ బంధాలు ఏర్పడాతాయి అని, ఫలితాలు అంటుతాయి అని కొందరి వాదన. కనుక పని మానేస్తే ఫలితాలు అంటక మోక్షము వస్తుంది అని కొందరి వాదన. కానీ భగవద్గీతలో భగవానుడు జ్ఞానయోగములో కర్మ చేస్తూ కూడా చేయని వానివలే ఎలా ఉండాలి, ఫలితములు అంటకుండా ఎలా ఉండాలి అని చెప్పియున్నాడు. అది ఎట్లా చేయవచ్చో తన జీవితములో [...]
ప్రపంచ గ్రంధాలలో తలమానికమైన భగవద్గీత ధర్మము అను పదముతో మొదలు అవుతుంది. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే" అను శ్లోకముతో మొదలు అవుతుంది. ప్రపంచానికి భారతీయ సంస్కృతి అందించిన అత్యద్బుతమైన పదము ధర్మము. ధర్మము అను పదమునకు అనువాదము ఇతర భాషలలో లేదు. Law అంటే చట్టము అవుతుంది ధర్మము అవదు. కనుక ధర్మమును చెప్పవలసి వచ్చినపుడు "ధర్మ" లేక "ధర్మ్" అని మాత్రమే వాడాతారు. మన భారతీయ [...]
సమస్త సంకటములను తొలగించి, సకల శుభములను కలిగించే సంకట నాశన గణేశ స్తోత్రము.సంకటనాశన గణేశ స్తోత్రం నారద ఉవాచ -ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |భక్తావాసం స్మరేనిత్యం, ఆయుష్కామార్థసిద్ధయే || ౧ || ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్ |తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్ || ౨ || లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ || నవమం [...]
ప్రాచీన సాంప్రదాయములో మతము లేదు. ఉన్నది థర్మమే. అది సనాతన మానవ థర్మము. దాని విలువలు సమస్త మానవ జాతివి. తనను తాను ఉద్దరించుకొనవలెనన్న ప్రతి మానవుడు కూడా థర్మమును అనుసరించవలసినదే. మతము మనిషి మతి నుండి పుట్టినది. మన వాజ్ఞ్మయములో హిందూ అన్న పదము లేదు. ఉన్నది సనాతన థర్మమే. ప్రస్తుతము మనకు కాపాడుకోవలసినది దీనినే. థర్మమును వీడి ఏమి చేసినా అది కర్ర విడిచి సాము చేసినట్లే. [...]
2012లో ఏమి జరుగుతుంది? నిజంగానే ప్రపంచము అంతరిస్తుందా? ఏమవబోతోంది? ప్రస్తుతము మానవ జాతి మనసులో నలుగుతున్న ప్రశ్న. భయపెడుతున్న ప్రశ్న. మయన్ క్యాలెండరు రాబోవు 2012తో ముగుస్తుంది కాబట్టి ప్రపంచము కూడా అంతరిస్తుంది అనే ఒక వార్త ప్రపంచమంతా క్షణ కాలములో చుట్టి వచ్చింది. అదేమిటో ఒకసారి చూద్దాం...... భూమి సూర్యుని చుట్టి రావటానికి 360 రోజులు పడుతుంది. ఈ 360 రోజులలో ప్రతి 90 [...]
అనంత సంసార సముద్ర తార నౌకాయిదాభ్యాం గురు భక్తిదాభ్యాం |వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం, నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం ||1||కవిత్వ వారాశి నిశాకరాభ్యాం, దౌర్భాగ్యదావాం బుధ మాలికాభ్యాం |ధూరీకృతానమ్ర విపత్థిదాభ్యాం, నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం ||2||నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః |మూకాస్చ వాచస్పతితాం హితాభ్యాం, నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం [...]
శ్రీకృష్ణుడి గురించిన పద్యాలు కొన్ని.... శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో ద్రేకస్తంభకు కేళి లోల విలసదృగ్జాల సంభూత నా నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్ !! ( ఇది భాగవతం లో నాందీ పద్యం లాంటిది) అమ్మా మన్ను తినంగ నే శిశువునో ? యాకొంటినో ? వెర్రినో ? నమ్మంజూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు కొట్టంగ వీ [...]
నిద్ర జీవికి ప్రకృతిచ్చిన వరం. ప్రతి జీవీ నిద్ర పోతుంది. నిద్రపోని జీవి ఎక్కువ కాలము జీవించలేదు. నిద్రలో ఎమవుతుందో ఎవరికీ తెలియదు. కాని నిద్ర పోయినట్లు మాత్రము తెలుస్తుంది. అదెట్లా? అసలు నిద్ర అంటే ఏమిటి? బాహ్యాన్ని మరచి మనస్సు, ఇంద్రియములు వెనకకు మరలి పొందే ఒక విశ్రాంతి స్థితి. ఒక జీవి నిద్రించేటప్పుడు జరిగే భౌతిక పరమైన మార్పులని ఆధునిక శాస్త్రము గుర్తించ [...]
ప్రకృతిలోని జీవరాసులన్నిటిలో ఒక్క మానవుడే మరణ భయం కలిగివున్నాడు. మిగిలిన జీవులన్నీ కూడా ప్రకృతి ఆథీనమై వుండుటచేత ప్రకృతిచే నడపబడుతున్నాయి. కానీ మానవుడు తానున్నాన్న భావము కలిగి, దేహమే తాను అని అనుకొని మరణ భయం కలిగివున్నాడు. సాథారణముగా మనము వెళ్ళే గమ్యము తెలియనప్పుడు అక్కడ ఎలా వుంటుందో తెలియక చాలా భయపడతాము. ఒకవేళ తెలిసివుంటే భయము వుండదు. అలాగే చనిపోయినప్పుడు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు