"విశ్రాంతిగా 'నేను'ను గమనిస్తూవుండు. వాస్తవం దాని వెనుకే వుంది. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వుండు; అది వికసిస్తుంది లేదా నిన్ను లోగొంటుంది. నిన్ను సంస్కరించుకొనే ప్రయత్నం చెయ్యకు, మార్పు ఎంత నిష్ఫలమో గ్రహించు. మార్పు చెందేది మారుతూనే వుంటుంది, మారనిది ఎదురుచూస్తూ వుంటుంది. మారేది మారనిదాన్నిస్వీకరించాలని ఎదురుచూడకు, అది ఎప్పటికీ జరగదు. మారేదంతా భ్రమా జనితమని [...]
ఇంగ్లీషు తేదీల ప్రకారం ఇవాళ భగవాన్ శ్రీ రమణమహర్షి పుట్టినరోజు (30.12.1879) కాస్త సాహిత్యం చదువుకొని, సమాజంలోని అన్యాయాలపై ఆగ్రహంతో ఊగిపోతున్న, ఆదర్శాల కలలు కంటున్నఇరవైఏళ్ళ వయసులో, తెలియని అశాంతి ఏదో మనసంతా కమ్ముకొని, బయటపడే దారి కోసం వెదుక్కొంటున్నపుడు, సౌందర్యస్పృహని బలంగా మేల్కొల్పిన, సమాజంలోని కపట విలువల పట్ల ధిక్కారాన్నినేర్పిన చలమే మళ్ళీ, ఇదిగో నీ గమ్యం [...]
ఏదైనా వశం తప్పితే ఏమవుతుంది? మనిషి జీవితం కూడా అంతే మరి. ఆశలు-ఆశయాలు, క్రమశిక్షణ-కట్టుబాట్లు, నడవడిక-నాగరికత, అభివృద్ధి-ఆకాంక్షలు ఇలాంటి కృత్రిమ వ్యవస్థలన్నీ కలసి ఆధునిక మానవాళిని ఎంతలా కుదించి వేస్తున్నాయంటే అంతకంతకూ ఉబ్బిపోతున్న గాలిబుడగలోని ఒత్తిడి అంతలా. అవశమై పోయినప్పుడు భళ్లున పగిలి, పేలి పోవడం తప్ప దానికి వేరే గత్యంతరం ఉండదు. అలవికాని అప్రాకృతిక [...]
'నీలో కొన్నిసార్లు' 'బివివి ప్రసాద్ హైకూలు' ఆవిష్కరణ సభలో బివివి ప్రసాద్ ప్రసంగం. https://www.youtube.com/watch?v=4TiHMtmn47s
'బివివి ప్రసాద్ హైకూలు' పై డాక్టర్ రెంటాల శ్రీ వేంకటేశ్వరరావు గారి ప్రసంగం. భాగం 2/3 https://www.youtube.com/watch?v=DwYVpdiasGk&feature=youtu.be
'బివివి ప్రసాద్ హైకూలు' పై డాక్టర్ రెంటాల శ్రీ వేంకటేశ్వరరావు గారి ప్రసంగం.  భాగం 1/3 https://www.youtube.com/watch?v=HNDSYBl-Fx0&feature=youtu.be
ప్రజాశక్తి 'కవిపరిచయం' శీర్షికలో బివివి ప్రసాద్ కవిత్వం గురించి బండ్ల మాధవరావు పరిచయం. పత్రిక లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
విజయవాడలో ఈ నెల 12 న జరగబోయేబివివి ప్రసాద్ కవిత్వ సంపుటి 'నీలో కొన్నిసార్లు', హైకూల సంపుటి 'బివివి ప్రసాద్ హైకూలు' పుస్తకాల పరిచయ సభకు ఇదే ఆహ్వానం.  
'బివివి ప్రసాద్ హైకూలు' సంపుటి పై ఆంధ్రభూమి దినపత్రిక లో 5.9.2015 న బులుసు సరోజినీదేవి గారి సమీక్ష.. ఆంధ్రభూమి లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బి.వి.వి. ప్రసాద్ కవిత్వం లో ఏముంటాయి? ఈ లోకంపై కాస్తంత దయ, సన్నజాజి తీగలా చుట్టుకొన్న తాత్వికత, గొంతు విప్పి హాయిగా గానం చేసే జీవనానుభవాలు. ఇంతే! ఇంకేమీ కనిపించవు. మరీ ముఖ్యంగా వాక్య వాక్యంలోంచి దూసుకొచ్చి, పీకపట్టుకొని నులిమేస్తూ ఊపేసే ఉద్రేకాలు, భీభత్సాలూ, వాదాలు వంటివి. బి.వి.వి నాకు ఒక హైకూ కవిగానే ఎక్కువ పరిచయం. నిమ్మముల్లులా గుచ్చుకొనేవి అతని హైకూలు. బాధగా [...]
'నీలో కొన్నిసార్లు' పుస్తకం చేతుల్లోకి తీసుకొని ఈ కవిత్వం ఏం చెబుతోంది అని ఒకటికి రెండుసార్లు ప్రశ్నించుకొన్నాను. ఈ కవిత్వం ఈ కవి ద్వారా అక్షర రూపం దాల్చిందే అయినా, ఒక సంపుటంగా సమగ్రరూపం పొందినపుడు ఈ కావ్యానికి ఇక తనదైన అస్తిత్వం ఉంటుంది.మనిషి తననీ, సమాజాన్నీ, ప్రపంచాన్నీ, జీవితాన్నీ అన్నిటినీ ప్రశ్నించే, నిందించే క్రమంలో తనలోతుల్లో దేనికోసం వెంపర్లాడుతున్నాడు [...]
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/07062015/13 బివివి ప్రసాద్ హైకూలు డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://www.newaavakaaya.com/Short-Stories-Poetry-Essays/ebooks-bvvprasad-haiku.html ఆన్ లైన్ లో చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి:  http://bvvprasad.blogspot.in/2014/08/blog-post_9.html
ఆమె నాకు కవిత్వంరాయిలాంటి జీవితంలో కోమలత్వం చూపుతోన్న శిల్పం దయనీ, సౌకుమార్యాన్నీ, పసిదనపు ఆశ్చర్యాలనీ వెదజల్లే రసమయలోకంఉదయాస్తమయాకాశాల్లో  సూర్యుడు వెదజల్లే ఊహల్లోపలి ప్రపంచంవెన్నెల కాయటం, రుతువులు మారటం, కాలం మృదువుగా కరిగిపోవటంఆమెని దర్శించాను పలుమార్లుపూలు దయగా పూయటంలో, వికసించటంలో,రేపటి పూలకి దయగా చోటువిడవటంలోఆమె ఆకాశమనీ, నేను దానిలో [...]
ఎప్పుడైనా, ఏ పనిలోనున్నాఅంతకన్నా అపురూపమైనదొకటి నీలోంచి నిన్ను పిలుస్తూవుంటుందిపూలరేకులకన్నా సుతారమైన శూన్యమొకటిసీతాకోకపై ఊగే రంగులకన్నా కోమలమైన ఖాళీ మెలకువ ఒకటితల్లికి పసిపాప నవ్వు స్మృతిలో నిలిచినట్టు నీలోపలి నేపధ్యమై చలిస్తూవుంటుందిఆకలితో కనలే కళ్ళలోని, స్పర్శలోని దైన్యంకన్నా మృదువుగానీలోపలి దయాగుణాన్ని తడుముతూ వుంటుందిఎప్పుడైనా, ఏ పనిలో [...]
అందరూ ఉన్నట్లే వుంటుంది, అకస్మాత్తుగా ఒంటరితనం పరుచుకొంటుందిడాబామీది పావురాయి రెక్కల్నీ, కువకువల్నీ, నీడనీ వెంటపెట్టుకొని ఎగిరిపోతుందిపావురాయి ప్రపంచం ఖాళీ అయినచోట శూన్యం సుడితిరుగుతూ తనలోనికి లాగేస్తుందిలోకం ఎప్పట్లా మరోసారి దు:ఖమయమై కనిపిస్తుందినీతో ఏంపని చెట్లకీ, పిట్టలకీ, వాటిపై అలుపెరుగక ఎగిరే ఆకాశానికీ,మనుషుల నీడలకీ, గోడలకీ, తలక్రిందుల తెలివికీ [...]
గర్భంలో ప్రశ్నార్ధకంలా జీవం నింపుకొంటాము భూగోళం బిందువుపై ఆశ్చర్యార్ధకమై జీవిస్తాము జవాబునిచ్చే వాక్యంలా మేనువాల్చి మరణిస్తాము ప్రశ్న జీవం నింపుతుంది ఆశ్చర్యం జీవింపచేస్తుంది జవాబు మృత్యువవుతుంది మృత్యువంటే ఏమిటనే ప్రశ్న జవాబు తరువాత మిగిలే ఖాళీకాగితంలా ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది 13.04.2013
అందమైన దృశ్యమొకటి మేకుకి తగిలించినట్టు కవిత రాసాక ఒక పేరుకి తగిలించటం అలవాటు పేర్లెపుడూ ఎందుకో ఆకర్షించవు తరచూ చూసే మనిషైనా పేరు గుర్తురాక లోపలి మైదానంలో తడుముకొంటూ తిరుగుతుంటావు జీవించటంకన్నా, పేరు తెచ్చుకోవటం ముఖ్యం గనుక   పేర్లని గుర్తుంచుకొనే ప్రపంచంలో నువ్వొక వింతమనిషివి ఒక మనిషి ఎలా నవ్వుతాడో, స్పందిస్తాడో గుర్తున్నట్టు అతని పేరు [...]
గది బయటి అలికిడి ఎవరినో నీలో ప్రవేశపెడుతుందితలుపులు తెరిచి ఒక జీవితాన్ని ఆహ్వానిస్తావుఒక మనిషి, ఆయనతో కొంత కాంతి, కొన్ని రంగులూ, నీడలూఆయనలో కొన్ని శబ్దాలు, వాటిలోపల అగాధమైన నిశ్శబ్దంఒకరినొకరు చూస్తారురెండు మూలాల నుండి, అనంతయాత్రల నుండి,రెండు దహనక్రియల నుండి,పూవులా వికసించే, ముకుళించే చూపులతో ఒకరినొకరు తాకుతారుమాటలేవో చెబుతాయి, మౌనమేదో వింటుంది, అలలు [...]
నువ్వు వచ్చావని గుర్తుపట్టినట్టు తలవూపింది ఆమెఈ లోకంలో చివరి నిముషాలలో చివరి విశ్రాంతిలో వుందిఏయే నవ్వుల వెనుక ఏయే విషాదాల్ని దాచవచ్చోఆమె ముఖంలో పలుమార్లు దర్శించావు జీవితం పొడవునాఆమె ఎంత అమాయకురాలోఆమెని గాయపరిచిన ఎవరెవరు ఎంత అమాయకులోఅందరినీ గాయపరుస్తున్న జీవితమెంత అమాయకమోకాలం కన్నీటినదిపై నీ పడవప్రయాణంలో తెలుసుకొంటూనే వున్నావు  రాత్రి ఒక నిశ్శబ్ద, ఏకాంత [...]
మానుషప్రపంచం మరీ అంత భయావహమైంది కాదని నీ కలలోని భూతమే నిన్ను మ్రింగబోయినట్లునువ్వు విలువిస్తే బ్రతికే సమూహం నిన్ను కమ్ముకొంటుందని సమూహాన్ని చెరిపేస్తూ నిన్ను గుర్తుచేయాలనే ఇతను మాట్లాడుతున్నాడునీదైన ఆకాశం కిందికి, సూర్యకాంతిలోకి, నీవైన గాలితెరల్లోకి, శ్వాసల్లోకి,నీ చుట్టూ వాలుతూ, మాయమౌతున్న వెలుగునీడల రహస్యలిపుల్లోకినీవి కాని రణగొణధ్వనుల్లోంచి రహస్యంగా [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు