ఏదీ?అనురాగంపంచే అమ్రృతాల అమ్మ "ఒడి" ఏదీ?అక్షరాలు నేర్పించే ఆనందాల ఆ"బడి" నిర్లక్ష్యపు నీడల్లో చేరామిక "అంగడి" ఆకలిమంటల్లో అడుగులు "తడబడి" గుప్పెడుమెతుకులకై బ్రతుకుతెరువు"కెగబడి" వెక్కివెక్కి ఏడుస్తూ దిక్కులుచూస్తున్నాం ఆదుకొంటారని "పొరబడి" (హ్రృదయవిదారకమయిన వీధిబాలల ఈ దయనీయస్ధితినుండి ఆదుకొనిఅక్కున చేర్చుకొని వారినీ రేపటి భావిభారతపౌరుల్లా [...]
ఎటు చూసినా .....   నీ అడుగుల సడి . ప్రతీ జడిలో   నీవేనని తడబడి , ఘడిఘడికీ      మకరందపుమధుజడిలో నీ తలపులు చొరబడి , నిద్దుర  కొరవడి ఆ  ఊహల  ఒరవడిలో నులివెచ్చని నీ ఒడిలో ... తలవాల్చిన నా మది   అది  తనువును విడివడి విహంగమాయే వినీలగగనానికెగబడి, అరఘడియైనా నువు లేక నేను పూవు లేని తావిని  నీ జత లేని నేను  సిరా లేని పెన్ను  నువ్వెంట లేని గమనం  అది ఎండమావి పయనం నీతో నడచిన సప్తపదుల [...]
ఈరోజు ఆంధ్రజ్యోతి "తరుణి"లో నాగురించి ప్రచురించిన ఆర్టికల్ మరింతగా ఎదగాలని మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ..... శ్రీమణి
కరిమబ్బుదొంతరల తెరనుదీసి,చిరువానతుంపరల చినుకుల్లకురిసి, కోటిదీపాలకాంతుల్ల వెలుగుల్లమెరిసి సిరిమువ్వ అందియల ఘల్లఘల్లనుచు సిరులుదోసిటబోసి, చిరునవ్వు కలబోసి, ముంగిళ్ళరంగుల్లముగ్గల్లె మురిసి, ఆనందహరివిల్లై వెల్లివిరిసి తరలొచ్చె సిరిలచ్చి పసిడిపాదాలా.. సిరులొచ్చి ప్రతిఇంట పొంగిపొరలేలా.... అందరికీ దీపావళి శుభాకాంక్షలతో....                      . .  శ్రీమణి.
తెలుగురక్షణవేదిక ఆధ్వర్యంలోఅనంతపురంలో కళారత్నశ్రీపొట్లూరిహరిక్రృష్ణగారిసారధ్యంలో అంగరంగవైభవంగా నిర్వహించిన 33గంట44నిమిషాల55సెకన్ల ప్రపంచరికార్డు కవిసమ్మేళనంలో పాల్గొని సాహితీప్రముఖుల చేతులమీదుగా ఘనసత్కారం అందుకొన్న శుభతరుణం.....శ్రీమణి
గౌరవనీయులు,మనప్రధానమంత్రి వర్యులు శ్రీ మాన్ శ్రీ నరేంద్రమోడీగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ...నోట్లరద్దు  సంధర్భంలో ఆ పెద్దాయన సంచలనాత్మక నిర్ణయం గురించి నే రాసిన కవిత . పెద్దాయనా...మీకభివందనం సంచలనం,సంచలనం,చరిత్ర పుటలను కుదిపేసిన సంచలనం   విప్లవాత్మకం ఆర్ధరాతిరి మన నరేంద్రుని తెగుదెంపు నిర్ణయం. దావానలమై కాలాసురుల ఖజానాలు దహనం గావించే ఆ నిమిషం. మన [...]
తాటితాండ్ర గుర్తుందా... తినని వారెవరైనా వున్నారా...తాటికాయను పెద్దగా గుర్తించరు గానీ దానిలో ఎన్నెన్నో ఔషధగుణాలున్నాయోనట. చిన్నతనానికీ...తాటితాండ్రకూ ఏదో అవినాభావసంబంధం వుందనిపిస్తుంది. అలాంటి తాటితాండ్రను ప్రస్ధుతిస్తూ..... చిన్నకవిత(హాస్యానికి). తాటితాండ్ర తాటితాండ్ర ఏమి రుసే నీ రసం నిండా నడిసంద్రంలోవున్నా. మండుటెడారి లో వున్నా.. మానోట్లో నీ [...]
ధరహాసపునీమోమును గని విరబూసిన సుమమనుకొని ఝుమ్మని తుమ్మెద గ్రోలబోయెనే.....శ్రీమణి
ప్రేమంటే గెలుపు ప్రేమంటే మలుపు ప్రేమంటే తియ తీయని తలపు ప్రేమంటే వసివాడని వలపు ప్రేమంటే ఓదార్పు ప్రేమంటే మాయని మైమరపు ప్రేమంటే ఒక హాయి నిట్టూర్పు ప్రేమంటే జత హృదయాల పలకరింపు ప్రేమంటే ఒక తొలకరి పులకరింపు ప్రేమంటే అనురాగసుధల చిలకరింపు ప్రేమంటే నమ్మకమనే తెగింపు నిజమైన ప్రేమెప్పుడూ త్రిప్పదు మడమ ఓడిపోతే అది కేవలం మోహపు భ్రమ ఎప్పటికీ ప్రేమ మకరంధాన్నే చిందిస్తుంది [...]
రెపరెపలాడే కనురెప్పలమాటున గుప్పుమన్నకలలెన్నెన్నో గుప్పెడుగుండెల చప్పుడు మాటున ఉప్పొంగుతున్న అలలెన్నెన్నో...శ్రీమణి
ఎంకన్న ఇయ్యాల పలకరించాడు పలుకుల్లో తేనెల్లు చిలకరించాడు       బంగారుఉయ్యాల      కలలవాకిట్లో     కొంగుబంగరుతల్లి    అలిమేలుమంగతో         చింత తీర్చగచిటికెలో వచ్చావా సామీ... చిత్రమేదో..నీ చిత్తమేగాసామీ..."ఎం" కన్నీరు తుడిచి పన్నీరు పోసి, వెతలన్ని తీసేసి వెన్నెల్లు బోసి, చిన్నబోయిన నాకు చిరునవ్వుపూసి  నేనున్నా ..నీకంటూ నావెన్నుగాసి చింత తీర్చగచిటికెలో వచ్చావా [...]
మహాసాహిత్యశిఖరం నేలకొరిగిపోయింది. మహావ్రృక్షం మట్టి కలిసింది మహోజ్వలతేజం మసకబారిపోయింది మహా కవిసామ్రాజ్య ధీరం మరలిరాని తీరాలకు తరలి పోయింది. అమ్రృతాక్షరాల మహాధ్యాయం మధురపుటలను మిగిల్చి ముగిసిపోయింది. తెలుగునేలసిరిసిల్లవాసి, సుమ సౌరభాల సాహితీ  సిరులరాశి‌,మామనిషి "సినారే " మా మనసులు కాజేసి,మము కన్నీళ్ళ పాల్జే"సినారే " మము శోకసంద్రాన ముంచే"సినారే " ఎంత పని [...]
ఎద నందన వనమున  సుమసుగంధ వీచిక ప్రేమ, హృదిస్పందన శృతి లయగా  వినిపించిన మృదుగీతిక ప్రేమ, మది సాంతం నిండియున్న  వింత విషయసూచిక ప్రేమ,  పడుచు మనసున విరిసిన మల్లియ ప్రేమ, కురిసిన వెన్నెల ప్రేమ  కలలమాటున.... కనురెప్ప చాటున....  కన్నుగీటుతూ పలుకరించిన కలవరింత ప్రేమ  తొలి పులకరింత ప్రేమ  ఇదే ప్రణయ ప్రబంధం  జతహ్రృదయాలు రాసుకొనే రసమయ గ్రంధం.                       ........... .   శ్రీమణి
మరువగలమా...మహాత్మా... మహోన్నతమౌ నీ మానవతా గరిమా..., అభివర్ణించగలమా...అభిజ్ఞా.. నీ అత్యద్భుత కర్తవ్యధీక్షాపటిమ. అక్షరాలుచాలునా.... అంబేద్కరా.. అలుపెరుగని నీ అకుంఠిత సేవాస్ఫూర్తికి, కడజాతి వారికై కధనరంగ సింగంలా... ఎడతెగనీ..నీ తెగింపు. మరువగలమా.. సమసమాజస్థాపనకై అస్ప్రశ్యత శ్రృంఖలాల తెగనరకుటకై, వెలివాడల బ్రతుకుల్లో..తొలిదివ్వెను రువ్వేందుకై దళిత జనోద్దరణకై, నువ్విచ్చిన [...]
రమణీయమదివో రఘుకులాన్వయుని కళ్యాణము కమనీయమదివో  కమలాలయని కళ్యాణము అద్భుతమదివో అమోఘమదివో, అపూర్వమదివో .. అమృతాస్వాదనమదివో అయోధ్య రాముని కళ్యాణము  కాంచిన కన్నులభాగ్యమేభాగ్యము కొలచిన చాలట  నిత్యసౌభాగ్యము జానకి రాములనిత్య కళ్యాణం  జగమంతటికీ పచ్చతోరణం ఆకాశం ఆణిముత్యాల పందిరి  ఆ ధారణి  ధగధగ పెళ్లిపీట. పట్టంచు పావడాలు,పట్టుపీతాంబరాలు  చిగురు మావిళ్ల [...]
ఏ  మధుర రాగాలు ఆలపిస్తుందో  ఏ మకరంధ కలశాలు గుమ్మరిస్తుందో  ఏ అంబరాల సంబరాల  మోసుకువస్తుందో  ఏ సంతసాల సంతకాలు చేయవచ్చిందో  ఆ ఆనంద డోలికల ఓలలాడిస్తుందో  ఏ మలయమారుతాల మైమరపిస్తుందో  వచ్చింది నవవధువై  తెలుగులోగిలికి  వెలుగుల్లు చిలికి  వెన్నియలు కలిపి  వన్నెల కానుకిచ్చింది  మధు మాసపల్లకినెక్కి  మరు మల్లియ పరదాల  మత్తకోకిల  రాగంలా  మధురోహల [...]
సంధ్య వాలిపోయే  సూరీడింటికి ఎల్లిపోయే  గువ్వలు గూటికి చేరిపోయే  నీ అలికిడయినా  లేదాయె నాలో  అలజడేదో మొదలాయె  ఎటు చూసినా .....  నీ అడుగుల సడి . ప్రతీ జడిలో  నీవేనని తడబడి , ఘడిఘడికీ  మకరందపుమధు జడితో   నీ తలపులు చొరబడి , నిద్దుర  కొరవడి ఆ  ఊహల  ఒరవడిలో నులివెచ్చని నీ ఒడిలో ... తలవాల్చిన నా మది   అది  తనువును విడివడి విహంగమాయే వినీలగగనానికెగబడి, అరనిమిషమయినా నువు లేక [...]
అలివేణి  ఆధరమ్ములు మకరంధపు ఝరులని తలచి  తుమ్మెద ఝుమ్మని గ్రోలబోవగా  ఇoదువదన సౌదర్యంఇనుమడించ మదనుడినీ మంత్రముగ్ధుని గావించగా  ఉవిద పాదాల పారాణి శోభించ ప్రకృతి పరవశించి పోగా ఎలతీగబోణి కూని రాగాలు ఎలకోయిలకే చలనం తేగా     కలికి  కాటుక కన్నుల కాంతికి కలకంఠులందరికీ కనులు కుట్టగా  చెలియ సిగ సోయగాన మల్లియ మరువం  వెలవెలబోగా జవ్వని జడపాయలు జలపాతాలై [...]
ఎన్నెన్నో అందాలు, వెన్నెల సిరిగందాలు మది బృందావనిచేరే మృధు మందారాలై ఆకాశం నీలి అందాలు అందుకోమంది నాకోసం జాబిల్లి మధువు చిలకరించింది కూనలమ్మ కులుకులిచ్చింది వానలమ్మ వలపులిచ్చింది కోకిలమ్మ కొత్తరాగమాలపించింది పరువాలచిలకమ్మ  పంచాదారపలుకులిచ్చి పలకరించింది సయ్యాటనేర్పింది వయ్యారికలువభామ ఒంపుసొంపులద్దింది సంపెంగపూరెమ్మ పులకింత పంచింది [...]
కాకమ్మ,పిచ్చుకమ్మ కథ వినని వారున్నారా ..! పిచుకమ్మే మన కిష్టమయిన కథానాయిక మనపిట్టకధల్లో ... పిచ్చుకగూళ్ళను చూస్తూ అమ్మ చెప్పే కమ్మని కథలు వింటూ పెరిగాం...  పిచుకమ్మ లేని కమ్మని బాల్యం  ఊహించగలమా ...  చిట్టిపొట్టి పిచుక మట్టికలవబోతుందంటే తట్టుకోగలమా ...  మనకు మచ్చికయిన పిచ్చుక మచ్చుకుకూడా కనబడదంట  బంగారు పిచ్చుక  పిట్ట కధలకే పరిమితమంట   అంతరించబోతుందట అందాల [...]
ఆమాతృమూర్తికి  ఏం తెలుసు ... తను తరిమేయబడ్డానని, కన్నకడుపుకేం తెలుసు కన్నబిడ్డలు  కటిక పాషాణాలని, కలనయినా అనుకొందా ... జన్మనిచ్చుటలో  మరు జన్మమెత్తిన అమ్మనే  అంగడికీడుస్తారని , నడిరాతిరి  నడివీధి కుప్పతొట్టికి తనను కానుకిస్తారని, అరక్షణములో వస్తానని ఆరుబయటే వదిలేసి వెనుదిరిగి చూడకున్నా,.. నీరెండిన కళ్ళతో నిరీక్షిస్తూనే ఉంది,  ఆ అమ్మను చూస్తే  అమ్మతనమే [...]
 ఊది ఊది ఊపిరి ఆగిపోయే వరకు ,పీల్చేసై ,  టన్నుల కొద్దీ సిగరెట్లు కాల్చేసై . జల్సా చెయ్ , .  హద్దులు మరచి,విందులో, కనువిందుగా ,...  మందుతో బహు పసందుగా ...  వెలిగించు రింగురింగులుగా..... పొగ గుప్పించు ఎలాగూ... రేపటి నీ బ్రతుకు ఆరిపోయే దీపమేగా... వెలుగెక్కువే .. మసి పట్టిన ఊపిరితిత్తులెలాగూ నీ ఊపిరితీసి నిను మట్టి కలుపుతాయి.  నీ ఆయువు ఆవిరయినా ...  నిండు బ్రతుకు నీవల్లే [...]
చిలకమ్మ అడిగింది చిగురాకుని  చిరునవ్వు వెల యెంతని?  భ్రమరమ్ము అడిగింది పూబాలను తను చవులూర్చు మధువేదని ?  చిరు కోయిల అడిగింది వాసంతాన్ని  తను అరుదెంచు ఘడియేదని   కలువభామ అడిగింది చందమామని  వెన్నెలొలకబోసి తను చుంబించరావా... అని  తరచి తరచి అడిగింది రాధిక బృందావనిని  వలచిన తన జతగాని  జాడేదని.                  సాలిపల్లిమంగామణి@శ్రీమణి  
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు