" ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే., చాలే చాలే ఇక చాలే " ఈ పాట పెళ్ళికి ముందు పాడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అదే పెళ్లి అయిన తరువాత పాడితే ఎలా ఉంటుందా అని రాయటం (అదే కంపు చేయటం) మొదలు పెట్టాను. అస్సలు చరణాలు మార్చాల్సిన అవసరమే రాలేదు. పల్లవి || ఇంకేం ఇంకేం ఇంకేం చావాలే... చాలే నీ గోలే... నీకై నువ్వే వచ్చి చచ్చావే .. ఇకపై నా ఖర్మే ..  గుండెల పైనా పాశం వేశావే ..  గుమ్మంలోకి [...]
లవ్వు , నవ్వు లేని మనిషి ఉంటాడేమో కానీ, కొవ్వు లేని మనిషి ఉండడు. అస్సలు ఏమీ చేయకుండానే వచ్చేది ఈ కొవ్వు. ఈ కొవ్వును, దాని ద్వారా వచ్చే బరువును ఎలా తగ్గించుకోవాలో అని, తెగ ఇబ్బంది పడిపోతుంటాం. Gym కి వెళ్ళటం, ఉపవాసాలు ఉండి కడుపు మాడ్చుకోవటం లాంటివి చేస్తూ ఉంటాం. డబ్బులు కట్టి జిమ్ వెళ్ళటమే ఒక ఎత్తు ఐతే, ఈ మధ్య అంత కన్నా వింత ఒకటి చూశా. ముందు మనం $500 కట్టి చేరాలి. మండలం రోజుల్లో, [...]
అర్ధ రాత్రి నిద్రలో నన్ను తట్టి లేపింది.  తను : "పెళ్ళైనా కూడా నాతోనే ఎక్కువ సేపు గడుపుతున్నావు, మీ ఆవిడ ఏమీ అనుకోదా ?" అని నా కళ్ళల్లోకి చూస్తూ అమాయకంగా అడిగింది. నేను తనని నా చేతిలోకి తీసుకుంటూ  నేను : "నువ్వు లేకుండా నాకు రోజు గడవదు. ఎవరేమి అనుకున్నా సరే, నిన్ను వదిలి నేను ఉండలేను". తను : "ఏదో మాట వరసకు అంటావే గానీ, కొన్ని రోజులకే నన్ను కాదని వేరొకదాని దగ్గరకు [...]
ఈ టపా  కేవలం పురుషులకు మాత్రమే! మహిళలు ఇక్కడితో ఆపేయాల్సిందిగా కోరుతున్నాను.  "చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో" అని చీర విలువ గురించి చాలా చక్కగా చెప్పారు, కవి చంద్రబోసు.  కానీ లుంగీ మాత్రం ఏమి పాపం చేసింది? లుంగీ మీద ఎందుకీ సీత కన్ను? చీరతో లుంగీకి కొన్ని వేల సంవత్సరాలుగా అనుబంధం ఉంది. కానీ లుంగీకి మాత్రం, చీరకు వచ్చినంత  గుర్తింపు రాలేదన్నది [...]
నరేంద్ర మోడీ, నాకు రాత్రి ఫోను చేశారు. మన దేశానికి Olympics లో ఎక్కువ పతకాలు రావటం లేదని చాలా బాధ పడ్డారు. "మనకు Olympics లో ఎక్కువ పతకాలు రావాలంటే ఏమి చేయాలి?" అని నన్ను అడిగారు. ఎప్పుడూ "చైనాని ఎలా ఎదుర్కోవాలి? పాకిస్థాన్ ని ఎలా నియంత్రించాలి? అమెరికాతో ఎలా ఉండాలి ?" అని ద్వైపాక్షిక విషయాలే అడిగేవారు తప్ప, ఇల్లాంటివి ఎప్పుడూ అడగలేదు పాపం. సరే, పెద్దాయన నోరు తెరిచి అడిగాడు, అది [...]
పాటలను కంపు చేసే పోటీలే గనుక ఒలంపిక్స్ లో పెడితే, మన దేశానికి బంగారు పతకం మాత్రం, నా ద్వారా ఖాయం అని తెలియజేసుకుంటున్నాను. 'యమహా నగరి , కలకత్తా పూరి' పాటను , అమెరికా స్టైల్ లో కంపు చేయటం జరిగింది. న్యూయార్క్ సిటీ , వాషింగ్ టన్ పూరి న్యూయార్క్ సిటీ , వాషింగ్ టన్ పూరి యమహొ న్యూ జర్సీ … గోల్డెన్ వారధి న్యూయార్క్ సిటీ , వాషింగ్ టన్ పూరి ఒక రామ బంటు నీ రుచినే మరిగెను [...]
పాటని కంపు చేయటం అంటే నా తరువాతే ఎవరైనా...... తాను-నేను సిమ్ - ఫోను తాను-నేను గాలి - ఫ్యాను  తాను-నేను డబ్బు - పన్ను తాను-నేను ఇంకు పెన్ను స్విచ్ తానైతే బల్బె నేను శునకం - బోను తాను-నేను నలుపు - కాకి  పూరీ  - పానీ   తాను-నేను ఉమెనూ - వైను ఇంగ్లీష్ నేను గ్రామర్ తాను పొలమే నేను ట్రాక్టర్ తాను  సైకిల్ నేను చైనే  తాను  బావి నేను బొక్కెన్ తాను
ఉదయం :  నిద్దర చాలని బద్దకమల్లే ఒళ్ళిరిచిందీ ఆకాశం రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చిందీ రవిబింబం వెలుతురు మోస్తూ దిగివస్తున్నది గాల్లో గువ్వల పరివారం సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమందీ పచ్చదనం మౌనంగా… ధ్యానంలో ఉందీ.. మాగాణం.. సాయంత్రం : నిద్దర కొచ్చిన  బద్దకమల్లే ఆవలించిందీ ఆకాశం సెహ్వాగ్ కొట్టిన సిక్సరు బంతై [...]
"తరలి రాద తనే వసంతం, తన దరికిరాని రాని వనాల కోసం" అని ఆ మహానుభావుడు పాడింది ఎన్ని సార్లు విన్నానో! బహుశా ఆ మాట నిజం చేయటానికేనెమో, ఆ పాటల వసంతమే నా దగ్గరకు వచ్చింది. సినిమా భాష లో చెప్పాలి అంటే ... ఎవరి గొంతు వింటే దేశ ప్రజల మనస్సు ఆనందంతో పులకరిస్తుందో ఎవరు పాడితే మేఘాలు సైతం గర్జించి వర్షిస్తాయో ఎవరి పాట వింటే, చావాలనుకునే వాడు కూడా బ్రతకాలి అనుకుంటాడో  ఎవరి పాట [...]
పెళ్ళికి ముందు : మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన... రాగాలు తీసే ని వల్లేనా...  ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న... ఈ మాయలన్ని నీ వల్లేనా... వెళ్ళే దారిలో లెడే చంద్రుడే ఐన వెన్నలే... అది నీ అల్లరేనా... ఓ చెట్టు నీడనైన లేనే పైన పూల వాన .... పెళ్ళి తరువాత : యోగాలు చేస్తున్నా, కంగారు పడుతున్నా, ఈ బాధలన్నీ నీ వల్లేనా... ఏ హాయి లేకుండా నే రగిలిపోతున్న, ప్రాణాలు తీసే నీ
ప్రేమించేటప్పుడు..... నువ్వు పక్కనుంటే బాగుంటాదే,  నీ పక్కనుంటే బాగుంటాదే నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదే  వెళ్ళిపోకె శ్యామల, వెళ్ళమాకె శ్యామల  నువ్వు వెళ్ళిపోతే శ్యామల, ఊపిరాడదంట లోపల  ఎక్కి ఎక్కి ఏడవ లేదే ఎదవ మగ పుటక, గుండె పెరికినట్టుందే [...]
నిన్న అతడు సినిమా చూస్తున్నానా.... అస్సలు ఆ సినిమా చూస్తున్నంత సేపు తివిక్రమ్ మీద ఈర్ష , అసూయలతో చూశాను. అస్సలు ఆ సంభాషణలు ఎలా రాశాడా అని. అలా మెచ్చుకుంటూ ఉండగానే ఒక పాట వచ్చింది. ఆ సినిమాలో పాటలు, మాటలకు ఏ  మాత్రం తీసిపోవు. ముఖ్యంగా ఆ పాట "సిరివెన్నెల గారు" రాసినది. ఆయన మాటల మాంత్రికుడు అయితే... ఈయన పాటల భేతాళుడు... సాదారణంగా అందంగా ఉన్న అమ్మాయి వెంట అబ్బాయిలు పడుతుంటారు. [...]
"మీలో ఎవరు కోటీశ్వరులు" మళ్ళీ వచ్చేసింది. అందరి సంగతేమో కానీ, నాగార్జున గారు మాత్రం ఇంకా కోటీశ్వరులు అవుతున్నారేమో అనిపిస్తుంది. "చిన్న బ్రేక్ , చిటికెలో వచ్చేస్తాను" అని చెప్పి ప్రకటనలు చింపేస్తున్నాడు. ఏదో మాట వరసకు చిటికెలో వస్తాను అన్నారు కదా అని చిటికెలు వేస్తూ కూర్చుంటే వేళ్ళు పడిపోవటం ఖాయం.  మొదటి అయిదారు ప్రశ్నలు వీజీగానే ఉన్నాయి కానీ, పోను పోను కష్టంగా [...]
అందరూ రాసే పాటల్లో భావం ఉంటుంది, కానీ సీతా రాముడు రాసే పాటల్లో భగవద్గీత ఉంటుంది. పాటల్లో భగవద్గీత ఏమిటనే విషయం గురించి తర్వాత చూద్దాం. పాట పాడిన గొంతుని బట్టి, ఆ పాట ఎవరు పాడారో చెప్పచ్చు(అన్నీ కాదు కొన్ని). అలానే కొన్ని పాటలు వింటూ చెప్పేయచ్చు, వాటిని మా సీతా రాముడు తప్ప ఎవరూ రాయలేరని. అంత పెద్దాయన్ని, అందునా ఆ మహా కవిని "సీతా రాముడు" అని పిలవటం ఏంటని అనుకోవచ్చు. [...]
విశ్వరూపం సినిమాలో " ఉండలేనంది నా ప్రాణం" అనే పాటను కంపు చేసే క్రమంలో, ఈ పాట పుట్టుకు వచ్చింది.  వలచిన గీత , తలచిన సీత, మొరవిన లేవ, దరికే రావా  ఎంత వేడినా కరుణే లేదే, పంతం వీడి నా వైపే రావే కిల కిల పలుకులు పలికిన కూన,  సూటిగ చెప్పిన, మెత్తగ చెప్పిన, సుతి మెత్తని నా మనస్సుతో చెప్పినా  మాటే లేదే, మనసే రాదే, నా పైనే ప్రేమే లేదా? నా పైనే ప్రేమే లేదా? పల్లవి [...]
అద్దంకి నుండి చాలా మలుపులు తిరిగి, మొత్తానికి  అమెరికా చేరాను. ప్రస్తుతానికి ఓ మాదిరిగా ఉంది.. చూడాలి అమెరికా ఎలాంటి మనుషులని కలుపుతుందో???? ఎలాంటి పాఠాలు నేర్పుతుందో... ఇక విషయానికి వస్తే...  ఇండియాలో అయినా, ఇక్కడ అయినా ఇళయరాజాని మాత్రం వదిలేది లేదాయే.... విమానంలో కూర్చొని, ఆకాశంలో ఎగురుతుంటే, నాకు నేనే రాజును అనుకున్నాను. అలా అనుకున్నానో లేదో, ఈ పాట నా ఫోనులో [...]
ఒక సరదా సన్నివేశం... అతడు సినిమాని "మా" లో మళ్ళీ చూసిన ఆనందంలో వ్రాస్తున్న టపా......   ---------------------------------------------------------------------------------------------------------- స్నేహితుడు : రాముడు .... ఏమిటిది??? నేను : టపా .... ఇంగ్లీషులో పోస్టు అంటారు అని, మా ఆవిడ గారు ఇప్పుడే చెబుతున్నారు , నువ్వు అడిగావు.  స్నేహితుడు :   తెలివిగా రాయద్దు రాముడు  నేను : చూశావా!!! బ్లాగు
క్రొత్తగా పెళ్ళైతే చేసే మొదటి పని .... గుళ్లని, పుణ్య క్షేత్రాలని దర్శించటం. అందులో భాగంగానే, పెళ్లి అయిన మూడో రోజు, సతీ సమేతంగా విజయవాడ అమ్మవారి గుడికి వెళ్లాను. ఏమి అదృష్టమో తెలియదు, వెళ్ళిన ప్రతి సారీ, అమ్మ వారి దర్శనం నిముషాలలో దొరుకుతుంది. ఈ సారి కూడా అలానే 100/- టికెట్టుతో పావు గంటలో దర్శనం చక్కగా అయ్యింది. భవ సాగరాన్ని బాగా ఈదేలా చూడమని అమ్మని వేడుకున్నాను. జనం కూడా [...]
"పెళ్ళంటే నూరేళ్ళ మంట.... " అని ఎవరు అన్నారో కానీ, అది అక్షర సత్యం. ఆ మంట జీవితానికి సరిపడా వంట చేసి పెడుతుంది, జీవితానికి సరిపోయే వెలుగుని ఇస్తుంది!!!!! "మొత్తానికి కవిగాడి పెళ్లి కుదిరింది" అని స్నేహితులు అంటున్నారు. ఆ కవిగాడిని నేనే.., ఆ పెళ్ళీ నాకే (నేను కవిని ఎప్పుడు అయ్యానో..., ఇప్పుడు అనవసరం). ఇప్పటికీ చాలా రోజుల తరువాత నన్ను కలిసిన పెద్ద వాళ్ళు, "ఇప్పుడు ఏమి [...]
ఈ పోస్టు చదివే ముందు ఈ వీడియోను చూడండి . లేకపోతె అర్ధం కాకపోవచ్చు స్నేహితుడు : ఇవాళ valentine's day తెలుసా నేను : తెలుసు, అయితే ఏంటి? స్నేహితుడు: చస్తున్నాను రా!!! ఇవాళ నా girl friend కి ఏదో ఒక gift ఇవ్వాలి, బండి మీద బయటకి తీసుకెళ్ళాలి నేను : తీసుకెళ్ళు స్నేహితుడు : నీకేమిరా, ఏ భజరంగ్ దళ్ వాళ్ళు చూస్తే spot లో పెళ్లి చేస్తారు. మా ప్రేమికుల కష్టాలు, బ్రహ్మచారివి నీకేమి తెలుసు రా? నేను: కష్టాలా?
చాలా రోజుల తర్వాత ఒక పాట రాశాను. అది కూడా మా సాఫ్ట్ వేరుల మీద రాయటం సంతోషంగా ఉంది. కాకపోతే పాట చాలా చిన్నదనే కొంచం భాదగా ఉంది. సినిమాలల్లో తరచూ మా వాళ్ళని కమేడియన్ గా, వెకిలిగా చూపిస్తూ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. సినిమాలల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చాలా మందికి మా సాఫ్ట్ వేర్ వాళ్ళంటే ఎందుకో కడుపు మంట. మంట ఒకటే అయినా దానికి కారణాలు మాత్రం అనేకం. కాకి పిల్ల [...]
చిన్నప్పుడు మా ఇంట్లో ఒక కుక్క ఉండేది. దాని పేరు 'రాజు'. కుక్క పేరు 'రాజు' ఏంటి అనుకుంటున్నారా? అడవికి రాజు ఎవరు? సింహం. గ్రామానికి సింహం ఎవరు? కుక్క. మరి కుక్కకి 'రాజు'అని పేరు పెడితే తప్పేంటి?? అది చచ్చిపోయి ఇవాల్టికి సరిగ్గా 20 సంవత్సరాలు అయ్యింది. 'రాజు' ఆల్సేషనూ కాదు, సెన్సేషనూ  కాదు. 24 గంటలూ ఇంటి బయట తిరుగుతూ ఉండేది. సాటి కుక్కలతో ఆడుకోవటానికి కూడా వెళ్ళేది [...]
 అది 1992 అనుకుంటా,రంగు చొక్కాలు తొడుకున్న వాళ్ళు టి.వి లో ఏదో ఆట ఆడుతున్నారు. మా పెదనాన్న మూర్తిగారు, అదే పనిగా చూస్తూ, తిడుతూ ఉన్నాడు. "అస్సలు ఏంటా ఆట? ఏమా గోలా?" అని అడిగాను. దానిని క్రికెట్ అంటారని చెప్పాడు. నేను కూడా చూడటం మొదలు పెట్టాను. ఒకతను, కరెక్టుగా బ్యాటుకు రెండింతలు ఉన్నాడో లేడో? నిలబెట్టిన పుల్లల మధ్యన, అటు ఇటు తెగ పరిగెడుతున్నాడు. "ఎవరతను అంత ఇదిగా [...]
చిన్నప్పటి నుండి సినిమా పాటలే ఎక్కువగా వినే వాడిని. శాస్త్రీయ సంగీతం అంటే కొంత ఆశక్తి ఉన్నప్పటికీ ఆ పాటలు విన్నది తక్కువే. ఎప్పుడైనా టీవీలో విన్నా కానీ విసుగు పుట్టేది. పాడిన లైనే పాడీ, పాడీ విసిగిస్తారేంటో అనుకునే వాడిని. బాల మురళి కృష్ణ గారి గొంతు వింటే, అస్సలు నచ్చేది కాదు. బహుశా బాల సుబ్రహ్మణ్యానికి బాగా అలవాటు పడిన చెవులు కావటం మూలాన అనుకుంటా!!  ఇది ఇలా ఉండగా, [...]
"విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు" అని మహానుభావుడు విశ్వనాధ సత్యన్నారాయణ గారి నవల చదివితే అర్ధం అయ్యింది, ఇంగ్లీషు నీతి లేని భాష అని. భాషలకు కూడా నీతీ జాతీ ఉంటాయా అనే కదా మీ అనుమానం. అస్సలు "నీతి" అనే పదానికి సమానమైన పదమే ఆంగ్ల భాషలో లేదట!!! ఎప్పుడో 1960లో రాసిన నవల. ఈ రొజుకి కూడా ఆ నవల చదవాల్సిన అవసరం ఉంది. ఆంగ్లం మోజులో పడి మనం ఏ తప్పు చేస్తున్నమో అందులో చమత్కారంగా చెప్పారు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు