కాపిటల్   అధ్యాయం -15 యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా విభాగం-5 కార్మికునికీ యంత్రానికీ మధ్య ఘర్షణ పెట్టుబడి పుట్టిన నాడే పెట్టుబడి దారుడికీ వేతన శ్రామికుడికీ ఘర్షణ ఏర్పడింది. కార్ఖానా ఉత్పత్తి దశ మొత్తంలో - ఆరంభం నుంచీ అంతం దాకా-ఈ ఘర్షణ కొనసాగింది. నతానియేల్ ఫోర్ స్టర్ అన్నట్లు యజమానులూ వాళ్ళ పనివాళ్ళూ ఎడతెగని యుద్ధంలో ఉన్నారు. యజమానుల లక్ష్యం వాళ్ళ పని వీలైనంత [...]
కాపిటల్   అధ్యాయం -15 యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా విభాగం -4 ఫాక్టరీ  (కర్మాగారం) ఫాక్టరీలో యంత్రవ్యవస్థ ఉంటుంది. అది స్త్రీల శ్రమనీ, పిల్లల శ్రమనీ స్వాయత్తం చేసుకుంటుంది. తద్వారా దోపిడీ చెయ్యడానికి కావలసిన కార్మికుల సంఖ్యని పెంచుతుంది. శ్రామికుడికి ఉండే విడి సమయాన్ని,అంటే సొంత పనులకు వాడుకునే కాలాన్ని కూడా లాక్కుంటుంది – పనిదినాన్ని పొడిగించడం ద్వారా. యంత్రాల [...]
మార్క్స్ కాపిటల్ -  అధ్యాయం 15 యంత్రాలూ - ఆధునిక పరిశ్రమా విభాగం- 3 శ్రామికుని మీద యంత్రవ్యవస్థ ప్రభావాలు శ్రమ సాధనాల్లో విప్లవమే ఆధునిక పరిశ్రమకి నాంది, ఆరంభ బిందువు. యంత్రాన్ని నడిపే శక్తి ఆ యంత్రం లోనే ఇమిడి  ఉంటుంది. అందువల్ల మనిషి కండబలం మునుపటంత అవసరం ఉండదు. కొద్దిపాటి  శక్తి ఉన్న వాళ్ళు సరిపోతారు. స్త్రీలూ, పిల్లలూ  కూడా యంత్రాలవద్ద పని చెయ్యగలరు. కనుక [...]
అధ్యాయం -15 యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా విభాగం -2 ఉత్పాదితానికి యంత్రాలు బదిలీ చేసే విలువ శ్రమ ప్రక్రియకు అవసరమైన అంశాలు: 1.మానవ చర్య, అంటే శ్రమే 2. శ్రమ జరిగే పదార్ధం 3. శ్రమ చేయడానికి వాడే పనిముట్లు 2,3 అంశాల్ని(శ్రమ పదార్దాన్నీ, శ్రమ సాధనాల్నీ) కలిపి ఉత్పత్తి సాధనాలు అవుతాయి. మానవ శ్రమ కొత్త విలువను సృజిస్తుంది.తన సొంత విలువ కన్నా ఎక్కువ విలువని [...]
అధ్యాయం -15 యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా విభాగం -1 యంత్రాల అభివృద్ధి యంత్రాలకు ముందు అచ్చుపనిలో యంత్రాలు రాక ముందు ఒక కొయ్య దిమ్మ  మీద  బొమ్మనో, అక్షరాలనో చెక్కి గుడ్డమీద అద్దేవారు.తర్వాత కాగితాల మీద వట్టేవారు.. పనిచేసే పనిముట్టు ఆ దిమ్మే. దాన్ని పట్టుకుని శ్రామికుడు అచ్చు వేసేవాడు. గంటకి చాలా తక్కువ కాపీలు మాత్రమే తియ్యగలడు. దీన్ని దిమ్మ అచ్చు (బ్లాక్ [...]
మార్క్స్ అదనపు విలువ సిద్ధాంతం  2018  మే 'అరుణతార' లో వచ్చింది   ఆర్ధిక వేత్తలు అందరూ ఒక పొరపాటు చేశారు.  అదనపు విలువని దానికదిగా, దాని  స్వచ్చమైన రూపంలో పరిశీలించలేదు. దాని ప్రత్యేక రూపాలైన లాభంగా, అద్దెగా పరిశీలించారు.-‘అదనపు విలువ సిద్ధాంతాలు’ -సంపుటి 1.40  అలా విడివిడిగా పరిశీలించినందువల్ల సిద్ధాంత పరంగా దోషాలు దొర్లాయంటాడు. అందుకే ఆయన ముందు అదనపు విలువని [...]
మళ్ళీ పెరుగుతున్న మార్క్స్ ప్రాధాన్యత 2017 ఏప్రిల్ ‘వీక్షణం’ లో వచ్చింది ‘మార్క్స్ సహస్రాబ్ది మహామేధావి’ అని 1999 లో బి.బి.సి. సర్వే ప్రథమస్థానం ఇచ్చింది. లిబరల్ ఆర్థికకవేత్తలు ‘మార్క్స్ మళ్లీ వచ్చాడు’ అంటున్నారు. ఆర్థిక వృద్ధి బాగా ఉన్న వికాసకాలం (బూం)లో ఆర్థికవేత్తలకు మార్క్స్ గుర్తురాడు. ఎవరైనా గుర్తుచేసినా తేలిగ్గా తీసేస్తారు. ఆయన చెప్పినవి తప్పని [...]
కమ్యూనిస్టు ప్రణాళికా – పెట్టుబడీ 'వీక్షణం' మేనెల సంచికలో వచ్చింది  కమ్యూనిష్టులకి ముఖ్యమైన పుస్తకాలు రెండు : ప్రణాళిక, కాపిటల్. ప్రణాళిక మార్క్స్ ఎంగెల్స్ ఇద్దరూ కలిసి రాసింది. 1848 లో విడుదలైంది. నేడు యూరప్ ఖండాన్ని కమ్యూనిజం అనే  బ్రహ్మరాక్షసి ఆవహించింది. దాన్ని భూస్థాపితం చేయడానికి పాత యూరప్ లోని పాలకవర్గాలన్నీ పోప్ మతాధిపతీ, జార్జ్ చక్రవర్తీ, మెటర్నిక్, [...]
కార్ఖానా ఉత్పత్తీ-దాని పెట్టుబడిదారీ స్వభావమూ ఒక పెట్టుబడిదారుడి అజమాయిషీలో శ్రామికుల సంఖ్య పెరగడమే సహకారానికి, ప్రత్యేకించి కార్ఖానా ఉత్పత్తికి సహజమైన ఆరంభ బిందువు. మొదట్లో మరింతమంది కార్మికుల్ని కలపడంలో పెట్టుబడిదారుడికి ప్రేరణ/ఉద్దేశ్యం ఆర్ధిక పరమైనది, సాంకేతికపరమైనది కాదు: ఎంత ఎక్కువ మందిని పెట్టుకుంటే అంత ఎక్కువ అదనపు విలువ వస్తుంది. ఒక పెట్టుబడి [...]
కార్ఖానాలో శ్రమ విభజనా – సమాజంలో శ్రమ విభజనా కార్ఖానా ఉత్పత్తి పుట్టుక, దానిలోని మామూలు  అంశాలు చూశాం. తర్వాత డిటైల్ శ్రామికుడి గురించీ, అతని పరికరాల గురించీ  తెలుసుకున్నాం. చివరగా మొత్తం యంత్రాంగాన్ని పరిశీలించాం. ఇప్పుడు కార్ఖానా ఉత్పత్తిలో శ్రమ విభజనకూ, సామాజిక శ్రమ విభజనకూ ఉన్న సంబంధాన్ని టూకీగా చూద్దాం. నాగరిక జాతుల్లో మూడు తరహాల [...]
శ్రమ విభజానా, కార్ఖానా ఉత్పత్తీ శ్రమకాలం రెండు భాగాలుగా ఉంటుంది- అవసర శ్రమ కాలం, అదనపుశ్రమ కాలం. మొదటి భాగంలో ఉత్పత్తయ్యే విలువ శ్రామికునిది. రెండో భాగం లో ఉత్పత్తయ్యేది పెట్టుబడిదారుడిది – అదనపువిలువ. కనుక పెట్టుబడి దారుడి తపనంతా రెండోభాగం పెంపు మీదనే. ఇందుకు రెండు మార్గాలున్నాయి: 1.అవసర శ్రమకాలం స్థిరంగా ఉండగా, పనిదినాన్ని పొడిగించడం. అప్పుడు అదనపు శ్రమకాలం [...]
సహకారం చిన్న యజమానీ-పెట్టుబడిదారుడూ ఇద్దరు ముగ్గురు పనివాళ్ళని పెట్టుకొని, బతకటానికి తానుకూడా వాళ్ళతో పాటు పనిచేసే వాడు కచ్చితమైన అర్ధంలో పెట్టుబడిదారుడు కాడు, ‘చిన్న యజమాని’. ఎక్కువమంది  శ్రామికుల్ని పెట్టుకుని, తానూ పనిచెయ్యకుండా, పెద్ద పరిమాణంలో సరుకులు ఉత్పత్తి చేసేవాడు  పెట్టుబడిదారుడు. “ఒకేకాలంలో, ఒకే చోట, ఒకే యజమానికింద ఒకే రకమైన సరుకు [...]
     కమ్యూనిస్ట్ అని ఐన్‌స్టైన్ మీద అమెరికా నిఘా “ఇప్పుడున్న పెట్టుబడిదారీ సమాజంలోని ఆర్ధిక అరాచకత్వమే అరిష్టానికి కారణం అని నాభిప్రాయం” “ఈ అరిష్టాల్ని పోగొట్టాటానికి ఒకే మార్గం ఉన్నదని ధృవీకరించుకున్నాను- సోషలిష్ట్ ఆర్ధిక విధానాన్ని నెలకొల్పటం” “(ఆ విధానం) సామాజిక లక్ష్యాల దిశలో సాగే విద్యావిధానాన్ని అనుసరించి ఉండాలి.అలాంటి ఎకానమీలో [...]
వృత్తి మేస్త్రీ ఉత్పత్తీ - పెట్టుబడిదారుడి ఉత్పత్తీ పెట్టుబడి దారుల ఉత్పత్తికి ముందు, వృత్తిమేస్త్రీల ఉత్పత్తి ఉండేది.దాన్ని వెనక్కి నెట్టి  పెట్టుబడి దారీ ఉత్పత్తి ముందుకొచ్చింది. పెట్టుబడి దారీ ఉత్పత్తి విధానం ఎప్పుడు మొదలయినట్లు? ఒక పెట్టుబడిదారుడు ఎక్కువమంది  శ్రామికులని పెట్టుకున్నప్పుడు; అంటే విస్తృతస్థాయిలో  శ్రమ ప్రక్రియ నిర్వహించినప్పుడు; [...]
భాగం 4   సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి అధ్యాయం 12 సాపేక్ష అదనపు విలువ భావన పనిదినం రెండు భాగాలుగా ఉంటుంది – అవసర శ్రమకాలం, అదనపు శ్రమ కాలం.  పెట్టుబడిదారుడు శ్రమశక్తికి చెల్లించిన విలువని  పునరుత్పత్తిచేసే కాలం అవసర శ్రమకాలం. దాన్ని దాటి శ్రామికుడు మరికొన్ని- 2,3,4,6  - గంటలు పని చేయగలడు. అది అదనపు శ్రమకాలం వాస్తవానికి, నిర్ణీత ఉత్పత్తి పరిస్థితుల్లో,సమాజాభివృద్ధి [...]
అదనపు విలువ ఉత్పత్తి  pdf https://drive.google.com/open?id=1YTlUyTXUw5jMKoRvXtq1HXmodLQSVryg
అధ్యాయం 11 అదనపు విలువ రేటూ, అదనపు విలువ మొత్తమూ పెట్టుబడి రెండు భాగాలుగా ఉంటుంది. 1.ఉత్పత్తిసాధనాలమీద పెట్టేది. 2. శ్రమశక్తి కి వెచ్చించేది. మార్క్స్  మొదటి దానికి  స్థిరపెట్టుబడి అనీ, రెండోదానికి  అస్థిరపెట్టుబడి అనీ పేరుపెట్టాడు. రెంటిలో ఏది లేక పోయినా శ్రమప్రక్రియ సాగదు. సాగితేనే విలువా, అదనపువిలువా ఉత్పత్తవుతాయి. ‘అదనపు విలువ రేటు’ (అధ్యాయం 11)లో ఒక ఉదాహరణ [...]
మామూలు పనిదినం కోసం పోరాటం 14 వ శతాబ్దం మధ్యనుండీ 17వ శతాబ్దం చివరి వరకూ పనిదినం పొడిగింపు పనిదినం అనేది ఏమిటి? పెట్టుబడిదారుడు డబ్బు సొంతదారుడిగా, కార్మికుడు శ్రమశక్తి సొంతదారుడిగా మార్కెట్ కి వస్తారు. శ్రామికుడు తనసరుకైన శ్రమశక్తిని అమ్ముతాడు, పెట్టుబడిదారుడు దాని రోజు విలువ చెల్లించి కొంటాడు. అమ్మినవాని  శ్రమశక్తిని  రోజు పాటు వాడుకునే హక్కు [...]
పనిదినం- 2 అదనపు శ్రమ కోసం అత్యాశ- కార్ఖానా దారూ, జమీందారూ అదనపు శ్రమ పెట్టుబడితో మొదలవలేదు.అంతకుముందే ఉంది. ఏసమాజంలో అయితే ఉత్పత్తి సాధనాలు కొందరి హక్కుగా ఉంటాయో, అక్కడ తన సొంత పోషణకి తోడు ఉత్పత్తి సాధనాల యజమానుల పోషణకు కూడా అదనపు శ్రమ చెయ్యాల్సి ఉంటుంది.ఆ  శ్రామికుడు, స్వేచ్చాయుతుడయినా, కాకున్నా ఇది తప్పదు. ఆ యజమాని ఎథెన్స్ కి చెందిన ప్రభువర్గీ యుడు కావచ్చు, [...]
పనిదినం- అధ్యాయం 10 విభాగం 1.పనిదినం  పరిమితులు పనివాళ్ళు ప్రతిరోజూ  టయానికి పనికి పోయి పనయ్యాక టయానికి ఇళ్ళకెళతారు. అంటే వాళ్ళు 8 గంటలో 10 గంటలో12గంటలో  పనిచేస్తారు. అందువల్ల మామూలుగా పనిదినం స్థిరమైనది  అనుకుంటారు. ఒకవేళ 8,10,12, గంటలకన్నా ముందే ఇళ్ళకి పొతే ఎకానమీ దెబ్బతింటుందని లేదా పెట్టుబడిదారులు ఫాక్టరీలు ముయ్యాల్సి వస్తుందనీ అనుకుంటారు.తక్కువ పనిగంటల కోసం [...]
కాపిటల్  మొదటి సంపుటం-  మూడో భాగం పరమ అదనపు విలువ ఉత్పత్తి అధ్యాయం 9 – అదనపు విలువ రేటు 1. అదనపు విలువ రేటు- అంటే ఉత్పత్తి ప్రక్రియలో పెట్టిన పెట్టుబడి పెరుగుతుంది. అది కొన్న వాటి విలువకన్నా ఎక్కువవుతుంది. పెట్టిన పెట్టుబడి(C) రెండు భాగాలుగా ఉంటుంది: 1. స్థిర పెట్టుబడి, ఉత్పత్తి సాధనాలమీద పెట్టింది. 2. అస్థిర పెట్టుబడి, శ్రమ శక్తి మీద పెట్టింది. స్థిర [...]
స్థిర పెట్టుబడీ - అస్థిర పెట్టుబడీ కాపిటల్ –అధ్యాయం 8 శ్రమ ప్రక్రియలో పాల్గొనే అంశాలు ఇవి: 1. ఉత్పత్తిసాధనాలు - శ్రమసాధనాలూ, శ్రమ పదార్ధాలూ, ఉపపదార్ధాలూ. ఇవి పాదార్ధిక అంశాలు. 2. శ్రమ . ఇది మానవాంశం. రెండూ కలిస్తేనే ఉత్పత్తి సాధ్యం అవుతుంది. శ్రమ ప్రక్రియలో పాల్గొనే వివిధ అంశాలు ఉత్పాదితం విలువని ఏర్పరచడంలో భిన్నమైన పాత్రలు పోషిస్తాయి. శ్రమ ఒక్కటే, ఫలితాలు [...]
      శ్రమ శక్తి సరుకు, శ్రమ కాదు – మార్క్స్ ఆవిష్కరణ           అదనపువిలువసిద్ధాంతానికి ఆధారపీఠం ఇదే ఉత్పత్తయిన సరుకు  విలువలో ఒకభాగం శ్రామికుడికి వస్తుంది. రెండో భాగం పెట్టుబడిదారుడికి పోతుంది. మార్క్స్ కి ముందు ఆర్దికవేత్తలకు ఈవిషయం తెలుసు. ఈ రెండో భాగం పెట్టుబడి దారుడు ఏమీ చెల్లించని  భాగం అని కూడా తెలుసు. అంతకన్నా ముందుకు పోలేకపోయారు. అంటే, చెల్లించని [...]
సమానవిలువలే మారకమవుతున్నా, అదనపు విలువ ఎలా వస్తుంది? ఇదీ  సమస్య.మార్క్స్ ముందు  అర్ధశాస్త్రజ్ఞులు పరిష్కరించలేక పోయిన సమస్య ఇదే. మార్క్స్ సమస్య అదనపు విలువ ఉన్నదని కనుక్కోవడం కాదు. అంత  వరకయితే స్మిత్, రికార్డోలకు తెలుసు. స్మిత్ :”పదార్ధాలకి కార్మికుడు కలిపే విలువ .......రెండుభాగాలవుతుంది. ఒకటి వాళ్ళ వేతనాలు చెల్లిస్తుంది, రెండోది యజమాని లాభాలు చెల్లిస్తుంది.” [...]
కాపిటల్ మూడో భాగం అధ్యాయం-7- పరమ అదనపు విలువ ఉత్పత్తి విభాగం 2. అదనపు విలువ ఉత్పత్తి అదనపు విలువ ఉత్పత్తి పెట్టుబడిదారుడు సొంతపరుచుకున్న ఉత్పాదితం ఒక ఉపయోగపువిలువ - నూలైనా, బూట్లయినా. ఒక అర్ధంలో బూట్లు సామాజిక పురోగతిని సూచించేవే. మన పెట్టుబడిదారుడు నిస్సందేహంగా పురోగామే. అయినప్పటికీ, అతను  బూట్లని, అవి ఉపయోగపు విలువలు అనే ఉద్దేశ్యంతో  ఉత్పత్తి చెయ్యడు. అవి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు