‘‘నేనూ అచ్చుతప్పు అనుకున్నాను కానీ, ‘పెరుగన్నం’ కాదు ‘పురుగన్నమే’! ఒకప్పుడు
‘పురుగులు పడి ఛస్తావ్’అని తిట్టేవారు కానీ- ఇప్పుడు పురుగులు తిని హాయిగా
బ్రతకచ్చు అనే సిద్ధాంతం వచ్చింది. మాంసాహారం అంటే ఏదో కోడి, మేక, గొడ్డు కావచ్చు
కానీ, ఆకలి తీరాలంటే ఐక్యరాజ్యసమితే ఇప్పుడు ‘పురుగులు తినండి’ అంటోంది’’. అన్నాడు
రాంబాబు.
‘‘చైనావాళ్ళు కండ చీమల్ని మనం మరమరాలు [...]




