శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - కనుల రెప్ప లకట కత్తులాయె. ఆ.వె:   దుష్టుడైనవాడు దూరానగనుపింప  కలికి తిట్టుకొనుచు కనులలోన వానిబొమ్మదలచి వరుసరెప్పలగొట్టె  కనుల రెప్ప లకట కత్తులాయె.
అందరికీ 2018వ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. కందము:  హియరీజ్ కమింగు సీ న్యూ ఇయరిన్ ఫ్రంటాఫ్ యు ఫ్రెండ్సు హే టెల్ గ్రీటింగ్స్  ఇయరీజ్ వెయిటింగ్ ఫర్, నో ఫియర్సు, విష్ ఆల్ యు హ్యాపి, బెస్టిన్ ఫ్యూచర్. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - హరియే మహ్మదు కుదురుగ హరుఁ డేసు గదా కందము:  "పరమత సహనము" నాటిక  గురుకులమున వేయుచుండ గూడిరి నటులే  గిరిధర్ రాముడు మరియును  హరియే మహ్మదు కుదురుగ హరుఁ డేసు గదా!
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ దత్తపది - కన్ను, ముక్కు, చెవి,నోరు - రామాయణార్థంలో తేటగీతి:  ఒప్పు బోధించె వినలేదు చుప్పనాతి ఆగకన్నుల మిన్నపై కరిగె మ్రింగ  ముక్కుటంపుల సౌమిత్రి ముందుకురికె రోషమొప్పగ దూకెనో రుద్రుడగుచు
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ. కందము:  ప్రొద్దుననే లేచి నిదుర  శుద్ధిగ నా పరమ శివుని స్తోత్రంబిడుచు న్నొద్దిక నొదుగుచునుండిన  తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్. కందము:  రంగని గుడిలో దూరుచు  దొంగిలి తా విగ్రహమ్ము దొరుకక తృటిలో  దొంగయె తప్పించుక పా  రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా.  కందము:  ఎక్కువ జ్వరమున్నప్పుడు  మిక్కుటముగ తీపినోట మెక్కినయపుడున్ చక్కెర రోగిని తినుమన  చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 7 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - పండితులు వసింపని ధర పావనము గదా కందము:  దండిగ మంచీ చెడులను  ఖండితముగ తెలిసి జెప్ప గలిగెడి విజ్ఞుల్  ఉండిన మంచిది, కుహనా  పండితులు వసింపని ధర పావనము గదా!
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 3 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ దత్తపది - అవ్వ - తాత - అత్త - మామ....భారతార్థంలో కందము:  అవ్వల బంధుల జూచుచు  కవ్వడి తా తపన విడువ కదనముపైనన్  హవ్వాయని యత్తరి హరి  నవ్వుచు మామక యనుచును జ్ఞానము జెప్పెన్. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 3 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్. కందము:  భీతిల్లకు గ్రహణంబీ రీతిగ పూర్ణంబు బట్ట రేయిగ మారెన్  చూతువె, యదిగో తొలగెను  రాతిరి - రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్ కందము:  గురువారమ్ముపవాసము  సరి నీరే ముట్టు తాను, ఛాత్రుండొకడే   మరియారోజే విందుకు  గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - వరమే పది తలల వాని ప్రాణము దీసెన్.  కం:   నరవానరులను వదలుచు  పరులెవ్వరు చంపలేని వరమునుబొందెన్ చరియించకామమున కా  వరమే పది తలల వాని ప్రాణము దీసెన్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - పార్థసారథి పరిమార్చె పాండవులను. తే.గీ:  నరునియరదమ్ము చక్కగా నడిపెనెవడు? ఏమిజేసెను తా మేనమామ నపుడు? తోడు వీడకరక్షించె వాడెవరిని?  పార్థసారథి-పరిమార్చె- పాండవులను.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - మత్తుమందు సేవించుట మంచిదె కద. తే.గీ:  మాదకపు ద్రవ్య ములవాడు మానవుండు  మత్తులోనుండ వలదన మాన దలచి  తప్పు దెలిసి వైద్యుని గోరి తగను వీడ  మత్తు, మందు సేవించుట మంచిదె కద.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ దత్తపది - అరిసె,గారె,పూరి,వడ...రామాయణార్థంలో.   కందము:  అరి సెగలు గ్రక్కు శరమును  గురిజూచుచువేయ వడకె కోతులు, చెమటల్  మరిగారె, రామ శరణని  పొరలుచు వేడిరిగ కరుణ పూరితనేత్రున్. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 07 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య: సీతాపతి యన్న నెవడు శివుడే సుమ్మీ కందము: ప్రీతిగ మేనున సగమున చూతుముగా యుమను భవుని సోయగమొప్పన్ రీతిగ సతియన నామెయె  సీతా! పతి యన్న నెవడు శివుడే సుమ్మీ! 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 07 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ కందము:  ఈగతి పరమత గురువులు  వాగిరి తమ చుట్టునున్న భక్తులతోడన్  జాగరత భారతమ్మును  భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.  సీ: చీకుచింతను బోలు సీమటపాకాయ వత్తినే ముట్టించి వదలునాడు పరుల వృద్ధినిజూచి పడునట్టి ఈర్ష్యనే  చిచ్చుబుడ్డిగ గాల్చి చెలగునాడు తలదిరిగెడు చెడు తలపులన్నియు గూడ భూచక్రముగ మండి పోవునాడు  పరుష వాక్యమ్ముల పరుల హింసించెడి  పాముబిళ్ళలు కాలి పడిననాడు తే.గీ:    అహపు తారజువ్వను నింగి కంపునాడు   శాంతి మత్తాబులే వెల్గు [...]
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 07 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - విరసంబగు రచన యొప్పె వీనుల విందై. కందము:  కిరికిరి మాటల పాటను  సరిగా బాణీనిగట్టి చక్కగ పాడన్  ఉరుకుల పరుగుల యువతకు  విరసంబగు రచన యొప్పె వీనుల విందై.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - దున్నపాలు పిండ దుత్తదెమ్ము. ఆ.వె. ఆటలేన నీకు నన్నివేళలయందు  చెవిని బెట్టవేళ చెప్పుమాట  వేచియుంటినేను వినుమురా గాడిద!  దున్న! పాలుపిండ దుత్తదెమ్ము.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. న్యస్తాక్షరి:  ఏకాదశి ఛందస్సు- తేటగీతి నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "ఏ - కా - ద - శి" ఉండాలి. తేటగీతి:  ఏడు మొదటన పండుగ వేడుకగను  కాలపురుషుని స్మరియింప కదలివచ్చె  దయనుగోరుచు బూజించ రయము రండు శివము గలిగించు విష్ణునే చింతజేయ.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 07 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - కట్లపాము చేరి కౌగిలించె.  ఆ.వె.  తానుజూడనొకడు దైవోపహతుడేను  గ్రహపు పీడ పట్టి వదలదాయె  నేనునేస్తమనుచు నిట్టులే పలు యి  క్కట్లపాము చేరి కౌగిలించె
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.  కం: మహిషుని దునిమితివనుచును  మహిజనులిట దలతురుగద మహిమల తల్లీ! మహిళల నబలల  జెర'చెడు' మహిషుని సుతులెటుల గలిగె మరి మహిజెపుమా?   కం: పంచుము నీ శక్తులనే మంచిగ నీ యవనిలోని మహిళలకిపుడే దించగ దుష్టుల మదమును దంచగ మానమ్ముదోచు దనుజాధములన్. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 06 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. దత్తపది: డైనోర - బుష్ - యల్‍జి - డెల్ ..... భారతార్థంలో ఆ.వె:   భీముడపుడు చాల ప్రీతుడై నోరార  బుష్కలముగ స్తోత్రములను జదువ  ఆంజనేయుడట దయల్ జిలుకగజూడ   పవనుడెల్ల జూచి పరవశించె. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 06 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - వనితల ఖండించు వాడె బల్లిదుడగురా.  కం:  వనితల చెరబట్టిన నరు  గని యూరకనుండబోక కరవాలముతో    కనికరము లేక దుష్టుడ  వని, తల ఖండించు వాడె బల్లిదుడగురా.
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు