ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 29-06-2017 న వ్రాసిన  పద్యములు. పద్య పక్షం - 5  సర్కారు బళ్ళు - చదువుల గుళ్ళు? ఆ.వె.  బళ్ళు నాడు గనగ పంతుళ్ళు దైవాలు    పిల్లలకునుజూడ గుళ్ళు నిజము  గోడకుర్చిశిక్ష గ్రుద్దుళ్ళు మొట్టుళ్ళు  సైచినేర్చినారు చదువులపుడు.   కం. ఇబ్బడుల నాడు జూడగ  నిబ్బడిముబ్బడిగ జదివి రెందరొ [...]
ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 09-06-2017 న వ్రాసిన  పద్యములు. పద్య పక్షం - 4  తొలకరి చినుకులు - రైతుల తలపులు.   వేడి తొలగించు తొలకరి చినుకులు.....  ఉ:  సూటిగ వేడిబాణములు సూర్యుడు వేయగ గుండెలయ్యొ, హా!  బీటలు వారి క్షేత్రములు  బీడుగ మారగ ఝల్లుఝల్లనెన్  ఘాటుగవేడి మ్రొక్కగను గాలికి గాలియె మేఘమాలలన్  మీటుచు వచ్చి చల్లుచును మీకిదె [...]
ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 22-05-2017 న వ్రాసిన  పద్యములు. పద్య పక్షం - 3 వృద్ధాప్యం - కష్ట సుఖాలు.   కం:  పుట్టెడు వారికి పుడమిని పుట్టెడు కష్టములు గలుగు ముదిమినిననుచున్   తట్టెడు తలపుల తలపకు   తట్టెడు సుఖములు గలుగును తగుజాగ్రతతో.  సీ: బట్టతలగ, ముగ్గు బుట్టగా జుట్టౌను  మసకబారుచు చూపు మందగించు  చెవులు వినగలేవు [...]
ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 12-05-2017 న వ్రాసిన  పద్యములు. పద్య పక్షం - 2 జలవనరుల సద్వినియోగం.  ఆటవెలది:   వేదమంత్రములను వేనోళ్ళజెప్పిరి  జలము గొప్పదనము జనము వినగ  జవము జీవమందు జనులకు జలమున  జలము లేనినాడు జనము లేరు.   ఆటవెలది:  జగము వృద్ధినొందు జలసిరియేనిండ   నీరు లేనినాడు నీరుగారు కుండయైన నిండకుండగ నానీరు   నిండుకున్న [...]
ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 21-04-2017 న వ్రాసిన  పద్యములు. పద్య పక్షం - 1  కార్మిక సంక్షేమం. సీసము:  బట్టనేయుట మంచి భవనముల్ గట్టుట  గనులబొగ్గులతీత కల్లు గీత  పాత్రలన్ జేయుట వాహనాల్ నడుపుట  యంత్రనిర్మాణమ్ము లందుగూడ  మరియు రోడ్లును రైలు మార్గాల పనులందు   రకరకముల పరిశ్రమలలోన   నగర శుభ్రతలోన నా " ఇస్రొ" ఘనతను  పాలు పత్రికబంచు [...]
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 11 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - పరమపదము లభ్యమగును పాపాత్ములకే. కందము:  పొరబడి పాపము జేసియు సరిపశ్చాత్తాపమంది సద్వర్తనులై  హరినమ్మి వేడుకొనగా  పరమపదము లభ్యమగును పాపాత్ములకే.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 11 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ దత్తపది: దొర-డబ్బు-అప్పు-వడ్డి ... తో ఋణగ్రసుని బాధ కందము:  అప్పును గోరగ దయతో నప్పుడె దొరగారె యిచ్చినారుగ లక్షన్  చప్పున డబ్బును, గానీ తిప్పలె మరి చక్రవడ్డి దీర్చగ నెటులో. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 11 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.   ఆ.వె:  గౌరవించబోను కన్నవారి, బుధుల  ధర్మ మింత నేను ధరణిసేయ  నాదిదేవు మదిని యసలు గొల్వననుచు  బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.
ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు జనవరి 2017 న వ్రాసి పంపిన పద్యములు. మోటారు వాహన చోదకులు -  రహదారి భద్రత   *************************************** ద్విచక్ర వాహన చోదకుడా!   కందము:  తలపై రక్షణనిడగా  తలపైనను జేయవేల, ధర జారిపడన్  తలనేల బట్టుకొందువు  తల నేలను దాకి పగుల తదుపరి నరుడా! ******************************************** మోటారు వాహన చోదకుడా!  ఆటవెలది
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 11 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్ కం:  బిరబిర పాలవి పొంగిన  నురుకుచు చేతులనుబట్టి నువు దింపకుమా  తరుణీ!పట్కారను నుప  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్
అందరికీ విళంబి నామ వత్సర ఉగాది శుభాకాంక్షలు.   ఆ.వె:  కామమదియె తీపి కారమే క్రోధమ్ము   లోభమగులె యుప్పు లోని మోహ    మగును వగరు చేదు మత్సరమ్మేయగు పులుపు మదమె యగును పూర్తిగాను. ఆ.వె: అరులనారుబట్టి యరచేత తగుపాళ్ళు  పెచ్చుమీరకుండ  పచ్చడిగను తలచియదుపుజేయ  ధరణిలో నరునకు  నిండు జీవితమ్ము పండుగగును. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 10 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ దత్తపది: తల - మెడ - కడుపు - వీపు, భారతార్థంలో కీచకుడు సైరంధ్రి తో.... దేవీ బాపుమెడద వెత  రావే నాతలపు దీర్ప రాగముతోడన్ ఈవే కడు పులకింతల నీవీ పుడమిని పొదిగొను నిక్కము దివినే. 
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.  సీసము:  మంచి పనులజేయ మనసులో తలపోయ  మారీచ సోదరుల్ మసినిబూయు  చూడ గట్టితలపు సుగ్రీవమున గోర   వాలిపోవు ప్రతిగ  వాలిగాడు  పుణ్యకార్యమొకటి బూనిసేయుదమన్న  కుంభకర్ణుని మత్తు కూడియుండు చక్కటినిర్ణయమ్మొక్కటే వలెనన్న   తలలు పదిగమొల్చి దాడిసేయు ఆటవెలది:  నోరు విల్లు గాగ  తీరుగా వేయగా  నారివోలె దలచి నాల్క తోడ  రామనామ మనెడు [...]
సమస్య - రంభకు మూతిపై మొలిచె రమ్య నవాంకురమైన మీసముల్. జృంభణమైన పల్కులను చేరుచు మాటలనాడు, వాడహో  గుంభనమైన చర్యలను కోర్కెలదాచక జేయు నిష్టతన్ డింభకుడేమిగాదు, కన డిగ్గున రమ్మని కన్నుగొట్టులే      రంభకు, మూతిపై మొలిచె రమ్య నవాంకురమైన మీసముల్.
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమశ్శివాయ. సీ:  పట్టు వస్త్రమ్ముల పట్టియడుగలేనుగజచర్మ ధారివే గదరనీవుపంచభక్ష్యమ్ముల నెంచికోరుదమన్నవిషమె నీ బువ్వని వింటి నేనుబంగారు నగలనే వరమీయ మందునానాగులే మెడలోన నగలు నీకుఒక్క వాహనముకై మ్రొక్కుకుందమటన్నకదలని యాంబోతు గలదు నీకు ఆ.వె:శక్తి గోర నీకు సగములేనే లేదుఎన్ని యీయమందు "సున్న" వానివినుము నేనె యిత్తు [...]
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 10 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - ధనలక్ష్మీ వ్రతమొసంగు దారిద్ర్యమునే. కందము:  వినకను నీమము నిష్టల గొనకొని చెప్పంగ బుధులు క్రొత్తగ వేడ్కన్  గుణములనెంచక చేసిన  ధనలక్ష్మీ! వ్రతమొసంగు దారిద్ర్యమునే.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 10 1- 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును. ఆ.వె:  గౌరవించబోను కన్నవారి, బుధుల  ధర్మ మింత సేయ ధరణినేను  నాదిదేవు మదిని యసలు గొల్వననుచు  బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 10 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - గాంధి స్వాతంత్ర్య యోధుఁడు గాడు నిజము తే.గీ:  శాంత్యహింసల బోధించి సత్య శీల  ములను ప్రజలకు తెలుపుచు ముఖ్యమనెను  గీత బోధల నమ్మెను కేవలముగ  గాంధి స్వాతంత్ర్య యోధుఁడు గాడు నిజము
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - విజయ దశమి వచ్చు విదియ నాడు ఆ.వె:  శెలవులిచ్చినారు చిన్నవానికి పాఠ  శాలయందు, వాడు వీలుజూచి బయలుదేరు గాద పండుగే మనకిక  విజయ దశమి, వచ్చు విదియ నాడు.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్.  కందము:  మిద్దెనుగట్టించుక తా ముద్దుగ జొచ్చుటకు మంచి మూర్తంబడగన్  పెద్దలుజెప్పగ జేరెను  చద్దుల బ్రతుకమ్మ నాడె, షంషాద్ బేగమ్. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - రావణ కుంభకర్ణులకు రాముఁడు తమ్ముఁడు మామ వాలియే. ఉత్పలమాల:  చేవనుగల్గి బంధువులె చేయుప్రదర్శన లెన్నొ యేండ్లుగా  నీవిధి వీధినాటకములిచ్చటనచ్చట వేయుచుంద్రుగా  బావయ చెప్పుచుంటివిను వారలమధ్యన వావివర్సలన్  రావణ కుంభకర్ణులకు రాముఁడు తమ్ముఁడు మామ వాలియే.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - నాగుల ముద్దాడె లలన నాగులచవితిన్ కందము:  నాగుల పటమును దెచ్చెను నాగులకే పూజసేయ నయముగ పతియే  బాగున్నదనుచు భక్తిని   నాగుల ముద్దాడె లలన నాగులచవితిన్
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.  సీసము:  గోమయమ్మును దెచ్చి కొట్టి ముద్దలుజేసి గొబ్బిళ్ళు జేసిన గురుతు దలచి హరిదాసు కోసమై యరదోసిలిని బట్టి  బియ్యమ్ము దెచ్చెడు వేడ్క దలచి  సన్నాయి మేళమ్ము శ్రావ్యమ్ముగామ్రోగ   గంగి రెద్దులగంతు  ఘటన దలచి తోకనే తగిలించ తూకమ్ముతోలేచు  గాలిపటమ్ముల మేలు దలచి  తేటగీతి:    నాటి గుర్తులు మనమున నాటియుండ  ఉత్తరాయణ కాలమే [...]
అందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు.  సీసము: ఉదయమ్ముననులేచి మదినిండ హాయితో భోగిమంటల చుట్టు తిరిగి తిరిగి ఆముదమ్ము చెవుల నాముదమ్మున వేసి దూదుండలను లోన దూర్చిదూర్చి కుంకుళ్ళ రసముతో గొనిరేగుపండ్లను వేసి నీటిని తల పోసిపోసి కళ్ళుమండెడువేళ గండ్రుప్పు నేనోట నయముగానేబుగ్గ నాన్ చి నాన్ చి తేటగీతి: క్రొత్తబట్టల ధరియించి [...]
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 09 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్.  కందము:  మెల్లగ కాళీయునిపై  నల్లనివాడెక్కిత్రొక్క నా బుసల సెగన్  అల్లన తటిపై తీగెకు  మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్. 
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు