శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-03-2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్.    కందము:  మగటిమి మత్స్య యంత్రమును   తెగి పడగను నరుడు కొట్ట  దిగువకు వేగన్ తెగ మెచ్చుకొనగ నందరు  గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్.   
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-03-2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు తే.గీ:  పూల విల్లును చక్కగా బూని చేత  బీరమాడుచు బాణముల్ వేయ నతని  మసి యొనర్చెను, శంకరున్ మన్మథుండు లొంగదీయుట గలదటే లోకమందు.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 02 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - రాముని సుతుఁడర్జునుండు రావణు గెలిచెన్. కందము:  సోమూ!కుశుడెవ్వడురా?  భీమునితమ్ముండెవడుర? భీమ రణంబున్  రాముండెవరిని గెలిచెను?  "రాముని సుతుఁ- డర్జునుండు- రావణు గెలిచెన్."
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 02 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్. కందము:  ఓసారెంటీయారూ! మీ సములన్ గనఁగఁ గలమె మేదినియందున్  వేసము కృష్ణుని రూపున  మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 02 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - అక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.  కందము:  ముక్కున కోపమ్మేలనె  ముక్కెరనే దెత్తునీకు ముడవకె మూతిన్ మక్కువ దీర్చగ రా ! రమ  ణక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 01 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్. కందము:  ప్రీతిగ కొందరు కావ్యపు  వ్రాతల రామాయణమ్ము రంకనిరి గదా!  పూత చరిత్రుల కథ నా  'బూతు పురాణమ్ముఁ' జదువఁ బుణ్యం బబ్బున్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29- 01 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు తేటగీతి:  తనదు చీరెల సొమ్ములన్ తరచి చూచి  తమకు లేవని లోలోన కుమిలి తలచు  ఎదర ప్రక్కింటి వారల ఈర్ష్య మరియు  దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17- 01 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - రణమే యవధానమందు రహి మంగళమౌ కందము: గణములు యతులును తప్పక  వణకక నిచ్చిన సమస్య వాక్చాతురితో  చెణుకులతో సరసపు పూ  రణమే యవధానమందు రహి మంగళమౌ.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 01 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - రామునకు మువ్వురు సతు లారతు లొసగిరి తేటగీతి:  పుట్టినదినము వేడుక బూని సేయ హారతిమ్మని జెప్పగా దారలకును దశరథుండట, ముందుగా దరినిజేరి రామునకు, మువ్వురు సతు లారతు లొసగిరి
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 12 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ   దత్తపది: హస్త-చిత్త-స్వాతి-మూల....షడ్రసోపేత భోజనాన్ని వర్ణిస్తూ తేటగీతి:  స్వాతిశయమున తెల్గుభోజనము దినుడు ఆహ!స్తవనీయ మైయుండు నారు రుచుల  చిత్తమందున మరువరు జిహ్వ రుచుల మొత్తమారోగ్య కరమౌను మూలబడరు.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 12 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - విల్లది రామునకునైన విరువదరమ్మే.  కందము:  చల్లని సాయం సమయము మెల్లగ తుంపరలజల్లు, మిన్నున గనగా  నల్లన సరి విరిసిన హరి   విల్లది, రామునకునైన విరువదరమ్మే?
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 12 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ దత్తపది: మేరీ - యేసు - సిలువ - చర్చి....శ్రీకృష్ణుని స్తుతి మత్తేభము:  కనగా భాసిలు వజ్ర దేహుడు మహా కారుణ్య కాశమ్ముతో  చొనిపెన్ గాభువి శాంతినిండ నదియే సుజ్ఞానమౌ గీతగా  వినుమేరీతిగ నైన మాధవుమదిన్ వేడంగ రక్షించుగా  జనులన్ బ్రోవగ వాడె దిక్కుగదరా చర్చింప నేముండురా!
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 12 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై.  కందము:  ఖాట్మండు నుండి నీవే  చాట్మని ఫేస్బుక్కులోన చాటింగిడుచున్ జూట్మిల్ వద్దకు రమ్మన  కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 12 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - వేంకటపతికి భామలు వేయిమంది తే.గీ: ఎక్కగోరుచు గిన్నీసు బుక్కులోన మ్రొక్కు దీర్చగ నెంచుచు నొక్కచోట  తలల నీలాలనిచ్చిరి తన్మయమున  వేంకటపతికి, భామలు వేయిమంది.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 11 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్. కందము:  గౌరియన భూమి యర్థము  వేరొకటిగ గలదు జూడ వివరింపంగా నీరీతిగ ననుకొనుమిక  గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్.  
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 11 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - పద్మములు ముకుళించెను భానుఁ జూచి.  తేటగీతి: మంత్ర మహిమను దెలియగ మానవతియెరవిని బిలువగ, సరగున భువిని జేరి కేలు బట్టగ సిగ్గున కుంతి నేత్ర పద్మములు ముకుళించెను భానుఁ జూచి. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 11 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు తే.గీ:  ఇంటివైద్యుండు వచ్చితా నిటులజెప్పె  పాల ఉబ్బస మీమెకు పూల వాస నసలు బడదుగ జాగ్రత్త, నయమగునులె  రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు.
ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 11-10-2017 న వ్రాసిన  పద్యములు. పద్య పక్షం - 12     “భారత రాజ్యాంగము-అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ ” కం:  భావప్రకటన మంచిదె నా వాదమె గొప్పదనుచు ననకను  చర్చన్ చేవగ చక్కని భాషణ    చే!వగజెందక నటునిటు జేయగవలెగా.  కం:  హక్కులనందరు దెలియుచు చక్కగనే జెప్పుచుంద్రు సరిసరి నిజమే    యెక్కడ బాధ్యత నెరుగరు  తిక్కగ [...]
ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 26-09-2017 న వ్రాసిన  పద్యములు. పద్య పక్షం - 11     “టీవీ సీరియళ్ళు-సమాజంపై ప్రభావం ”  కం:   సీర్యలు జూచెడి వేళల  భార్యను పిలువంగజూచు భర్తను గనుచున్  మర్యాదగ జెప్పరులే   మిర్యాలను నూరుదిరిక మీదను వినరా! ఆ.వె:  చుట్టములునురాగ చూడరే యొకకంట  నొక్కకంట జూచు చుండు టీవి  మాటలాడ బోరు  [...]
ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 10-09-2017 న వ్రాసిన  పద్యములు. పద్య పక్షం - 10    “వైద్యరంగం-మారుతున్న సమీకరణాలు ” సీ: హస్తవాసిగలిగి యందరు రోగుల  బాధలన్నియుగూడ బాపువారు  వాస్తవాలనుదాచి భయములన్ బెంచుచు దోబూచులాడుచు దోచువారు కాలునేదన్నుచు గట్టియాయువునిచ్చి  నేలపై ప్రాణమ్ము నిల్పువారు కాలనే దన్నుచు ఘనమైన [...]
ప్రత్యేక హోదా - న.మో. నమహ  కం:  తెలుగుల సయామి కవలల  తలుపులు మూయుచును కోసి తదుపరి సరి కో తలనే మాన్పుట  కొరకై   తలపైనను చేయరేల తలలే లేవా!  కం:  మోదెను హస్తము గతమున  మోదీయే మోది నేడు మోసముజేసెన్ మోదము లేనేలేద    మ్మో! దీనిని గనుచు నేపి మూల్గుచునుండెన్.    కం:  హెచ్చుగ నిచ్చితిమనునట  ఇచ్చినదే బిచ్చమందు రిచ్చట, చూడన్ హెచ్చుల తచ్చుల లెక్కకు  పిచ్చియె పట్టేను ప్రజకు వేదన [...]
ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 24-08-2017 న వ్రాసిన  పద్యములు. పద్య పక్షం - 9  తెలుగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర - మన కర్తవ్యం  ఆ.వె.  మాత  గాద మనకు మాతృభూమియుగూడ దివిని మించుగొప్ప, తెలియు మనకు    మాతృభాష గూడ మరిజూడ గొప్పదే  మరువబోకు దాని మడువబోకు.   ఆ.వె.  చిన్నవారికెపుడు  నాన్న, అమ్మ గాక  మమ్మి డాడియనెడు మాట నేర్పి  [...]
ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 13-08-2017 న వ్రాసిన  పద్యములు. పద్య పక్షం - 8  “సమాజ శ్రేయస్సు--నా కర్తవ్యం”  కం:  దేశమన మట్టిగాదని  దేశమనగ మనుషులనుచు  తెలియగవలె నీ    దేశమ్మేమిచ్చెననక  దేశమునకు నీవిడునది తెలియుచు నిడుమా.  కం: ఎన్నికవేళల నేతల  మన్నిక దలపోసి యెన్న మాన్యుడవీవే  ఎన్ని కలలైన దీరును  మన్నిక నీనోటవడక మను [...]
ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 27-07-2017 న వ్రాసిన  పద్యములు. పద్య పక్షం - 7  “మాదక ద్రవ్యాల మత్తులో యువత-నాశనమవుతున్న భవిత” సీ: గంజాయిదమ్మునే గట్టిగా నెగబీల్చి  దిమ్ముగా నట్టిట్టు  దిరుగువాడ  కొకెయిన్ను చాటుగా కొసరికొసరివాడి  మత్తుతో మాటుగా  మసలువాడ  ఆహెరాయిన్నునే యాబగా దట్టించి మైకమ్ము మరిమరీ కోరువాడ       బ్రౌనుషుగరు [...]
ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 07-07-2017 న వ్రాసిన  పద్యములు. పద్య పక్షం - 6 విచ్ఛిన్నమౌతున్న వివాహవ్యవస్థ - సంతానంపై దాని ప్రబావం   ఓ సతీపతులారా! తే.గీ:  అర్థనారీశ తత్వమ్ము నర్థమరసి ఈశుపరివార వైవిధ్య మింత దెలిసి సతియు పతియును కూడగా, జగతి  బ్రతుకు కాదు భారమ్ము తీరుబంగారు కలలు. విడిపోవాలనుకునే దంపతులారా? సీ:  స్వర్గమందు బడిన [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు