శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్ కందము:  గురువారమ్ముపవాసము  సరి నీరే ముట్టు తాను, ఛాత్రుండొకడే   మరియారోజే విందుకు  గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - వరమే పది తలల వాని ప్రాణము దీసెన్.  కం:   నరవానరులను వదలుచు  పరులెవ్వరు చంపలేని వరమునుబొందెన్ చరియించకామమున కా  వరమే పది తలల వాని ప్రాణము దీసెన్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - పార్థసారథి పరిమార్చె పాండవులను. తే.గీ:  నరునియరదమ్ము చక్కగా నడిపెనెవడు? ఏమిజేసెను తా మేనమామ నపుడు? తోడు వీడకరక్షించె వాడెవరిని?  పార్థసారథి-పరిమార్చె- పాండవులను.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - మత్తుమందు సేవించుట మంచిదె కద. తే.గీ:  మాదకపు ద్రవ్య ములవాడు మానవుండు  మత్తులోనుండ వలదన మాన దలచి  తప్పు దెలిసి వైద్యుని గోరి తగను వీడ  మత్తు, మందు సేవించుట మంచిదె కద.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ దత్తపది - అరిసె,గారె,పూరి,వడ...రామాయణార్థంలో.   కందము:  అరి సెగలు గ్రక్కు శరమును  గురిజూచుచువేయ వడకె కోతులు, చెమటల్  మరిగారె, రామ శరణని  పొరలుచు వేడిరిగ కరుణ పూరితనేత్రున్. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 07 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య: సీతాపతి యన్న నెవడు శివుడే సుమ్మీ కందము: ప్రీతిగ మేనున సగమున చూతుముగా యుమను భవుని సోయగమొప్పన్ రీతిగ సతియన నామెయె  సీతా! పతి యన్న నెవడు శివుడే సుమ్మీ! 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 07 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ కందము:  ఈగతి పరమత గురువులు  వాగిరి తమ చుట్టునున్న భక్తులతోడన్  జాగరత భారతమ్మును  భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.  సీ: చీకుచింతను బోలు సీమటపాకాయ వత్తినే ముట్టించి వదలునాడు పరుల వృద్ధినిజూచి పడునట్టి ఈర్ష్యనే  చిచ్చుబుడ్డిగ గాల్చి చెలగునాడు తలదిరిగెడు చెడు తలపులన్నియు గూడ భూచక్రముగ మండి పోవునాడు  పరుష వాక్యమ్ముల పరుల హింసించెడి  పాముబిళ్ళలు కాలి పడిననాడు తే.గీ:    అహపు తారజువ్వను నింగి కంపునాడు   శాంతి మత్తాబులే వెల్గు [...]
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 07 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - విరసంబగు రచన యొప్పె వీనుల విందై. కందము:  కిరికిరి మాటల పాటను  సరిగా బాణీనిగట్టి చక్కగ పాడన్  ఉరుకుల పరుగుల యువతకు  విరసంబగు రచన యొప్పె వీనుల విందై.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - దున్నపాలు పిండ దుత్తదెమ్ము. ఆ.వె. ఆటలేన నీకు నన్నివేళలయందు  చెవిని బెట్టవేళ చెప్పుమాట  వేచియుంటినేను వినుమురా గాడిద!  దున్న! పాలుపిండ దుత్తదెమ్ము.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. న్యస్తాక్షరి:  ఏకాదశి ఛందస్సు- తేటగీతి నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "ఏ - కా - ద - శి" ఉండాలి. తేటగీతి:  ఏడు మొదటన పండుగ వేడుకగను  కాలపురుషుని స్మరియింప కదలివచ్చె  దయనుగోరుచు బూజించ రయము రండు శివము గలిగించు విష్ణునే చింతజేయ.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 07 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - కట్లపాము చేరి కౌగిలించె.  ఆ.వె.  తానుజూడనొకడు దైవోపహతుడేను  గ్రహపు పీడ పట్టి వదలదాయె  నేనునేస్తమనుచు నిట్టులే పలు యి  క్కట్లపాము చేరి కౌగిలించె
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.  కం: మహిషుని దునిమితివనుచును  మహిజనులిట దలతురుగద మహిమల తల్లీ! మహిళల నబలల  జెర'చెడు' మహిషుని సుతులెటుల గలిగె మరి మహిజెపుమా?   కం: పంచుము నీ శక్తులనే మంచిగ నీ యవనిలోని మహిళలకిపుడే దించగ దుష్టుల మదమును దంచగ మానమ్ముదోచు దనుజాధములన్. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 06 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. దత్తపది: డైనోర - బుష్ - యల్‍జి - డెల్ ..... భారతార్థంలో ఆ.వె:   భీముడపుడు చాల ప్రీతుడై నోరార  బుష్కలముగ స్తోత్రములను జదువ  ఆంజనేయుడట దయల్ జిలుకగజూడ   పవనుడెల్ల జూచి పరవశించె. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 06 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - వనితల ఖండించు వాడె బల్లిదుడగురా.  కం:  వనితల చెరబట్టిన నరు  గని యూరకనుండబోక కరవాలముతో    కనికరము లేక దుష్టుడ  వని, తల ఖండించు వాడె బల్లిదుడగురా.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 06 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - వంక లేని దమ్మ రంకు లాడి ఆ.వె:  కూటికొరకు గాదె కోటి వృత్తులు సరి  దినము గడుప తనకు దిక్కులేదు  రోజుకొక్కరైన మోజు రావలె తన వంక, లేని దమ్మ రంకు లాడి. 
 శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 06 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ. తేటగీతి:   నీచ కీచకు భీముడే పీచమడచ నిజముదెలియక కృష్ణపై నిందవేసి  వానిమిత్రులు తలపోసి పలికిరిట్లు  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ.
చావకండి...బ్లూవేల్స్ "చేతబడి"...జాగ్రత్త.  కందము: ఆవల కాద్రా, దార్కా  ఆ"వల"లో నుంచినారు, అక్కాష్మోరా  బ్లూవేల్సు రూపమందున  మీ వేళ్ళనుబట్టి పొడుచు మీకన్నులనే.  కందము: ఆటా! కాదది పిల్లల  వేటది, వారల భవితకు వ్రేటది చూడన్ బ్రూటది, చావుకు బంపే రూటది,పెకలించ దాని రూటును మేలౌ. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 06 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - రాధికాప్రియుండు రావణుండు. ఆ.వె:  మదిని మెదులు గాద వదలక వెయ్యేళ్ళు   ఎంటియారు నటనలిందులోన  రామచంద్రమూర్తి, రారాజు పాత్రలు రాధికాప్రియుండు,రావణుండు.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 06 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ. కందము:  వాఙ్మయము చదువలేదుగ  వాఙ్మయమను పదముగూడ వ్రాయుట రాదే ప్రాఙ్ముఖుడగుచును నేర్వక  వాఙ్మయమున నున్నదెల్ల, వ్యర్థము సుమ్మీ.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 06 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. దత్తపది - కారు. వాచి. టీవి.సెల్లు మహాభారతార్థంలో ధృతరాష్ట్రునితో శ్రీకృష్ణుడు.  తేటగీతి:  కారు పాండవులెప్పుడు కానివారు వారు రాజ్యమ్ముకోసమై వాచిలేరు ఏమిటీ వింతవాదన లెరుకలేక  చెప్పునామాట వినకుంట సెల్లునయ్య. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 05 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - దోషమే కాదు చేయుట దొంగతనము. తేటగీతి:  వెన్నుడానాడె యుట్టిపై వెన్న పెరుగు  పాలు మ్రుచ్చిలి పెట్టె సావాసులకును  తెలియజెప్పెను పరులకై తిండి కొరకు  దోషమే కాదు చేయుట దొంగతనము.
నిన్న 2/09/2017 న "ప్రజ - పద్యం " ఫేస్ బుక్ గ్రూప్ వారు గుంటూరు సెంట్రల్ పబ్లిక్ స్కూల్ బ్రాడిపేట 19/4 నందు నిర్వహించిన "పద్య కవుల ఆత్మీయ కలయిక" కార్యక్రమములో సామాజిక పద్యాలతో పాటు నేను రచించిన " గుంటూరు " పద్యం. గుంటూరు పద్యం.  సీ:అమరలింగడిచట , నట పానకాలయ్య కోటేశుడొకవైపు కొలువుదీరశేషేంద్ర,కరుణశ్రి, జాషువా,తిక్కన్న వికటకవి కవిత్వ విభవమలర పలనాటి సీమయున్, బల్ [...]
దత్తపది: కమ్మ-మాల-మాదిగ-బాపన...అన్యార్థంలో. తేటగీతి:  వినుమా!లవంగమిలాచి  పిసరు పచ్చ కప్పురమ్మాదిగావేసి కాస్త పోక చెక్క సున్నమ్ము నాకుపై జేర్చ, కమ్మ  నైన కిళ్ళియగును బాప నరుగనివెత.
సమస్య - చినదానిన్ వరియింప గల్గును కదా చింతల్ సదా మిత్రమా మత్తేభము:  మనమున్ మెచ్చగనొక్కదాని గనుచున్ మాట్లాడగా చాటుగా  చిననాటన్ మదిమెచ్చు స్నేహితుడనే చేబట్టగా గోరితిన్ వినుమా నిన్నిక నిష్టమౌ మనముతో పెండ్లాడ నంచున్ వచిం  చినదానిన్ వరియింప గల్గును కదా చింతల్ సదా మిత్రమా
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు