ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ చింతా సీతారామాంజనేయులు గారు మలిచిన నృత్య రూపకం "సాగరసౌధం" గూర్చిన అన్వేషణ తో పాటుగా నా చిరు అనుభవం కలగలిసిన అనుభూతి.  ఎవరికైనా ఈ నృత్య నాటిక పరిచయం ఉంటే పూర్తి పాటల సాహిత్యం సంపాదించటానికి సహాయపడండి.అలుపన్నది యెరుగక పరవళ్ళతో, ఉరవళ్ళతో ఉరికే నదిని చూస్తే- ఉప్పొంగే ఆనందం,  అలాగే- అంతులేని అనురాగం, ఆవేశం, అదుపులేని ఆరాటం కూడ [...]
మిసమిసల రేకుల పొది వసంత వేడుకకి బాకా ఊదుతుంటే..   పుడమి లో పుష్పకాలం పరవశాల పల్లకీలో ఊరేగుతుంటుంది...!
Illinois State Bird- Northern Cardinal అంటూ కాస్త గౌరం ఎక్కువే ఇస్తుంది ఈ అమ్మి..కానీ, "బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది," అని వెంట వెంట వస్తుంది.. ఎట్టా పలికేది నేను.. నా పక్షిగానం ఎరుగని మనసు కాదులే అని సరిపెట్టుకుంటా మరి! పెట్టిన మేత, పళ్ళు రుచి చూసి పోతా...      
ఆంధ్రమాత గోంగూర వరకు మరి నేను భోజనం పెట్టే మాతనే!అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియో శివః |నమస్కార ప్రియో సూర్యః బ్రాహ్మణో భోజనప్రియః ||హరిహరులు, సూర్యచంద్రులు అలరారిన లోగిలి మాది! నిత్యం లక్ష్మీ కళ ఉట్టిపడే పెరటి తోట, వాకిలి తట్టున వనం మా ఇంటికి చిరునామా... నువ్వుల నూనె/కాచిన ఆవనూనె నలుగుతో అభ్యంగన స్నానం అదీ కుంకుళ్ళు/శీకాయ పులుసుతో తలారా స్నానం కర్చూరాలు, బావంచాలు, [...]
"పిడికెడు బియ్యం పిచ్చుకకి వేసి, గంపెడు సంబరం నాదేనంటూ ఎగిరితే ఊరుకోనోచ్.. అరిచి గీ పెట్టి, 'చిన్ని నా పొట్టకి నీవే రక్ష' అని నీకు అనిపించేలా చేసి మరీ సాధిస్తా నా భుక్తి," అంటూ ఇదిగో యిలా ...!
దుప్పట్లో మిన్నాగు లా ఇదేమిటో అనుకుంటున్నారా!? స్నేహ కి నాకు నడుమ ఒకానొక ఉదయాన- అమ్మా! ఇక్కడ చీకటిగా ఉంది ఏమి పిల్లల్రా ఈ మాత్రం వెలుగు చాలదా? నువ్వే చూడు..చాలా చీకటిగా ఉందమ్మా, Light అనకుండా Bright ఏంటి? సరే! లైట్ వేసుకో గిన్నెలో చీకటిగా ఉంది, లైట్ వేస్తే ఎలా పోతుంది? లైట్ చెయ్యాలిగా... ప్చ్! స్నేహీ.. వస్తున్నా ఉండు చూడు, ఎంత చీకటిగా ఉందో! ఇంకొంచం పాలేస్తావా ఓ......ర్నీ, "టీ" [...]
తెలుగు పాటలు విని కూనిరాగాలు తీసేవారికి ఓ క్విజ్ .. విన్నారా ఈ పాట?  "కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా ... అదేరా ప్రేమంటే కన్నా" విని ఉన్నట్లయితే ఇంతకన్నా బాగా మరెవరైనా చిత్రీకరించగలరా...!
Bird watchers/lovers! Hawk on my Deck..నేనీ ప్రకృతీ పరమైన పురా పునీత పరవశాన- పరవళ్ళు తొక్కుతూ- ఇలా...! ఏ మాట కామాటే చెప్పుకోవాలి; ఇంత దగ్గరగా, కేవలం 5 అడుగుల దూరం కి (నడుమ కిటికీ అడ్డుగా ఉన్నా) గ్రద్ద వచ్చి వాలటం అదేదో గండభేరుండ పక్షి వచ్చినంత సంబరం గా ఉంది. దశదిశలా తన చూపు, తన రూపే దశావతారాలు నాకు... "ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు అలసి ఉంటావు" అని ఇరువురమూ ఒకరికొకరం...మేత వేసీవేయగానే
11/11/2016:  ఓరోరి నువ్వుండ్రా, ఆమె గోరు సూరీడ్ని చూస్తూ తచ్చిట్లాడేప్పుడు వచ్చి కాచుక్కూచ్చున్నాము. ఇదిగో మనం బొద్దు గా కాక స్థూలకాయం పెంచుతూ ఉన్నామంటే, రాబోయే చలికాలం లో ఉధృతి ఎక్కువంట,   ఇదిగో అందుకే ఈ బల్లలు బోర్లేసి "రండర్రా వర్కౌట్ చేద్దాము, చైర్ స్వింగ్, చీర్ఫుల్ సింగ్," అంటూ రొద; తన కొత్త పిట్టయోగ క్లాసులో చేరితేనే మేత పెడుతుందట.."నీ అల్పాహారం నువ్వే సాధించు, లే [...]
చెప్పేస్తే ఒక పనై పోతుంది- నాకు హాయి, నలుగురికి నవ్వు లేదా ఎకసెక్కం కాదూ మూతివిరుపు కసింత ఊదాసీనత కొండొకచో యేదో భావన కలుగుతుందిగా!? పుట్టగానే నాకు ఇవ్వబడిన పేరు "పార్వతి" అది మా సీతమ్మామ్మ పెట్టారు కనుక, నేను నానమ్మ కూచిని కనుక, క్రమేణా అమ్మ మార్చుకున్న 'ఉష' కన్నా "చిన్న సీతమ్మ" గా చలామణి అయ్యాను, ఆ పేరు విన్నప్పుడు కోపం వచ్చినా, "నేను 'పారు' ని లేదా 'ఉష' ని," అని [...]
మేఘపు మెరుపు రూపు మారుతుంటేనే ఈ బింబపు ఆకృతి ఊహామాత్రం గా తోస్తుంది కదా!? ఇప్పుడు నేను మేఘాన్ని చూస్తున్నానా..భ్రమణం తో నా చూపు ఆవరణ మార్చే మౌనమూర్తి భూమి ని కాంచానా..నిశ్చలంగా నిలిచినా కర్మసాక్షిని దర్శిస్తున్నానా..ప్రతి ఉదయం లో నాలోని ఒక నేను ఉద్భవిస్తూ వస్తున్నానని మాత్రం తెలుసుకున్నాను...!  (సప్త అశ్వాల సాక్షి గా కొన్ని ఉదయాల పయనాలు ఈ చిత్రమాల తో సమాప్తం, అందరికీ [...]
తనకన్నా ముందుగా మరేవో జాడలు వెలికి వచ్చాక, తప్పదన్నట్లు సాగినంతనే మరి కొన్ని మాయమౌతాయి..ఉద్భవం ఉన్నచోట నిష్క్రమణ కూడా తావు చేసుకుంటూ ఉండదూ...మరి!
ఊడల్లా నేలలోకిదిగుతుంటాయి కొన్ని వెలుగు ధారలు ఒడుపుగా కొసలు ముడివేస్తూ ఊయలూగుతుంటుంది ఒంటరి గాలి నీడలే ఇటుకలుగా కొమ్మకి కొమ్మకీ వంతెన వేస్తూ పనిచేసుకుంటూ పోతుంది పగటివేళ ...!
నల్ల మబ్బులు రెక్కలు విప్పుకుని రివ్వు రివ్వున  ఎగిరిపోతాయి అల్లరి గువ్వలు అమాంతం పట్టేసి రయ్యి రయ్యిన లాక్కుని వస్తాయి ...! 
అదేవిటో పొడుస్తూ యే ఛాయలో ఉన్నాడో ఆలాపిస్తూ 'గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ' అంటూ అసలు కంటి ఆవరణకి వస్తూ ఏ రూపున ఉన్నాడో ఆ ఛాయలకి ఎవరూ పోరేమి!? అదేమో గానీ ఇదిగో అసలు పొద్దుగూకులా పూస్తూనే ఉండేటి పూవు!
దొంగాటల, దోబూచుల మునిగి తేలుతూ ఉంటాడతను తటాలున ఆకాశం దారి పరిచి చూపులకి జాడ తెలుపుతుంది.. దాగని ద్యుతులు వ్యక్తమయే వేళలో మదిలో కొత్త రంగు మిగిలిపోతుంది...!
మంచు పరుచుకుని ఉన్నప్పుడు ఆకాశం రాత్రంతా తెల్లగా కనిపిస్తుంది, తెల్లారుతుండగా రంగుల కుంచె పని మొదలుపెడతాడు ఆదిత్యుడు...
ఓ వెలుతురులో వన్నెలు మరింత ఒదిగి వేకువ పట్ల ఒక అణకువ ని మనసంతా వ్యాపించేలా చేస్తుంటే..ఇలా...!
ఇరుకుబాటలో ఇరుసులేని బండిలో కృషీవలుడు, చెంత సోయాచిక్కుడు, మొక్కజొన్న విత్తుల మూటలు, ఐదుమాసాల్లో అవి పండించును బంగారు పంటలు. కాలినడకన ఎదురువస్తూ, ఏరువాకని తలపోస్తూ నేను. చుట్టూరా విరగకాయనున్న పళ్ళతోటలు, బళ్ళునిండే గుమ్మళ్ళ, ఖర్బూజాల తీగెల మడులు ఆ పూలలో తల పెట్టుకుని ఎన్నో దుఃఖాలను జయించాను...  తల్లితండ్రులు పెంచే తాత్కాలిక తోటలు- ఏడాదికొక యజమాని- మరొక రకపు [...]
"మడత విప్పి పరిచిన నూలుచీరలా మంచుతెర, ఇంద్రధనుస్సు లో ముంచితీసిన కుంచె గీతల్లా వెలుగుధారలు... " అనే ఎత్తుగడతో ఒక శీతగానం రాసాను ఆ మధ్యన.. పాశ్చాత్యులకి నాలుగు ఋతువులు, అవి కూడా కవుల కల్పనలో చూడనక్కరలా; కంటికి స్పష్టంగా మనసుకి మరింత దిట్టంగా తెలిసే ఋతువుల నడుమ విభజన, వాటి రాకపోకలు వలననే ప్రకృతి తో ఇక్కడ మనిషికి మరింత అవినాభావ సంబంధం ఏర్పడుతుందని నా అనుభవరీత్యా [...]
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..మా పూలే పేర్చితీ ఉయ్యాలో బొమ్మలు బొమ్మలు గుమ్మాడి..మా కాయే చెక్కీతి గుమ్మాడి అని పాడేసుకునే అక్టోబర్ లోకి వెళ్ళేలోపుగా ఐదు నెలల ఆత్రం ఉంటుంది.. The love of gardening is a seed once sown that never dies -Gertrude Jekyll (తోటపని పట్ల ప్రేమ అనేది ఒకసారి నాటుకున్నాక ఎప్పటికీ చనిపోదు – గర్ట్రూడ్ జాకేల్) మే నెలాఖరులో వచ్చే “మెమోరియల్ డే” నాటికి ఇంటి లోపల వేసి ఉంచినదో,
ఆ మధ్య మా అబ్బాయ్ ఒక మాట అన్నాడు "అమ్మా! నిన్ను గనక బార్బిక్యూ (కుమ్ములో కాల్చటం) చేస్తే ప్రపంచంలో వంటకాలు అన్నిటికన్నా రుచికరంగా ఉంటావ్," అని.. అంటే వాడు నరమాంస భక్షకుడు అని కాదు అర్థం, అదీ నన్ను గూర్చిన ప్రశంసల్లో భాగం!  నేను ఆకుకూరలు మెండుగా, తాజా కూరగాయలు ఇంకాస్త నిండుగా కూర్చి వంటలు చేస్తాను కనుక. నా ఆరోగ్యం సమస్తం శాకాహారం మీదుగానే ఉందని చెప్పలేను ఎందుకంటే [...]
“గులాబీల తావులీనే కులాసాల జీవితాల విలాసాలివే, వికాసాలివే” - సముద్రాల రాఘవాచార్యులు గులాబీ తో ఎవరెవరికి ఎలాటి అనుబంధమో, అదెంత మధురభావనయో నాకైతే తెలియదు కానీ, పిన్న వయస్సులో బార్టర్ పద్దతి నేను ఆచరణ లో పెట్టగలిగాను అనంటే అందుకు మాత్రం ఈ పూలే కారణం.. ఆపై, పదేళ్ళ ప్రాయంలో ఇంటి తోట నా ఆజమాయిషీకి రావటం తో తొలివిడత అనుభవాల్లో సింహభాగం ఈ పూలమొక్కల పెంపకం [...]
వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్ శంకరుని వంటి దైవము లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే   వంకాయ ప్రశస్తిని తెలపటానికి నిజానికా చాటువు ను చాటుచేసుకుని చెప్పనక్కరలేదు కాకపొతే బసవరాజు అప్పారావు గారి పాట అడ్డం పెట్టుకుందామంటే ఆయన గుత్తొంకాయ కి మాత్రమే పట్టం గట్టారు; ఆపై ‘కూరలోపల నావలపంతా,’ అని వెర్రిపిల్లతో పాడించి నా సమగ్ర అభినవ వంకాయ వంటల [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు