తెలీకుండా దొంగలా  దూరిందీ అహంకారం నాకు తెలీకుండా నన్ను మంది చూపుల్లో ఉంచింది మందికి అతికించి మందిలో బ్రతికించి నాలో నేను గడిపే కాలం ,  ఇంకో విజయాన్ని దూరం చేసింది గునపంలా గుచ్చి  గుణపాఠాన్నిచ్చి  నిరాశా నిట్టూర్పుల  నీతుల్ని నిలిపింది  మౌనం దాటిన మాట ముల్లు గా గుచ్చుతుంటే  ఫలాల సంచికి ఇంకో చిల్లోటి పడింది  -సత్య 
తడిసిన కన్నుల ధ్యానము ... కృష్ణా  నీమీది మోహము ... ఎడబాటు మంటల దాహము ... కుదురుకున్న ఎదురుచూపు  వెదురైపోతే ... నిదురంతా నీ తోనే కలైపోతే... ఆవేదనతో తనువెల్లా కాలిపోతే... నివేదనతో అంతరంగం ఖాళీ ఐపోతే... ఆలాపన గాయాల్లోంచి రాగము .. బ్రతుకు విరహ గానము ... నీ ప్రేమే అమ్రృత పానము ... --సత్య 
కవిత్వమంతా మూర్ఖత్వమే మాటలు పెంచిన మమత్వమే మారిందీ లేదూ మార్చిందీ లేదు బతుకులో విలివల్ని కూర్చింది లేదు పిలిచిందీ లేదు పలికిందీ లేదు ఆర్తులకి హస్తాన్ని చాచింది లేదు నా కవిత్వమంతా మూర్ఖత్వమే మాటలు పెంచిన మమత్వమే కదిలిందీ లేదు కదిపిందీ లేదు జడమైన హృదయాల కుదుపింది  లేదు తెలిసిందీ లేదు తెలిపేదీ లేదు మనసుల్నీ తట్టీ ఆడిగింది  లేదు   నా కవిత్వమంతా [...]
|| జై శ్రీమన్నారాయణ || ఆదరనీయులైన  పాఠకులకి నమస్కారాలు. నీలహంస బ్లొగ్ లో  విజయ  నామ సంవత్సర ఉగాది సందర్భముగా  నిర్వహింపబడిన కవితా పోటీలో  “ కొలను  “    కవితకు గాను విజేతగా నిలిచిన   శ్రీమతి  పి. వసంత లక్ష్మి  గారికి   నా హృదయ  పూర్వక అభినందనలు ... వారికి 116 రూ ॥  పారితోషకమివ్వబడుతుంది  .   పాఠకులు కూడా వారి అభినందనలు వసంత లక్ష్మి  గారికి అందజేయగలరని [...]
" తీపి కొలను "  ఆ కనుల చూస్తూ ఓడిలొన పవళిస్తూ    మురిపాల మాటల్లో  తేలిపోతూ.... ఒడ్డుకడ కూర్చోని ఆ లేత పాదాలు నీటిలో ముంచి ఆడిస్తూ ఉంటే...  తీరనీ కోరికల ఈరేటి బంధాల తీపిగుర్తులనిచ్చే  తీపి కోలను!     పైట సవరించి నడుమున బిగించి తేట నీటి కోసం ఒంగేనో పడుచు.. బిందె నిండా నీళ్లు నడుమొంపున నిలిపి సాగనొంపుతుపుంది  తీపి కొలను!  రుచులెరుగక  మెతుకు ఆశనొదలక [...]
"కొలను"  పై లలిత గారి కవిత  (పిల్లల కోసం)  :  పిల్లలు ఆడుకునే తోటలోనే పెద్దలు నడవడానికో బాట బాతులు నడుస్తుంటాయి ఆ త్రోవలో, కొలను ఒకటుంది కదా మరి ఆ చోటులోనే! బాట మధ్యలో వంతెన ఒకటుంది కొలను దాటడానికి అది ఉపయోగపడుతుంది దాని క్రింద నీళ్ళలో తిరుగాడుతుంటాయి తిండి కోసం తాబేళ్ళు కొన్ని. ఆ తోటకి వచ్చినప్పుడు ఒకసారి, పెద్దవాడు తీశాడు ఒక [...]
ప్రముఖ కవి  డా॥ . ఆచార్య ఫణీంద్ర గారు పంపిన ఈ పద్యాన్ని సగౌరవ కుసుమంగా స్వీకరిస్తూ, పంపినందుకు వారికి ఎన్నో ధన్యవాదాలు తెలుపుతున్నాను.  తలయు, తోక లేదు - కలదు పెద్ద కడుపు! నింపుకొందు దాని నీటి తోడ! కప్పుకొందు మేన - కలువ పూల 'గౌను'! 'కొలను' నేను - ముద్దు గొలుపుచుందు! -డా॥ . ఆచార్య ఫణీంద్ర  వారి బ్లాగ్  :  http://dracharyaphaneendra.wordpress.com/ మరిన్ని వివరాలకై ......
.  “అల (జడి’ లేని )కొలను “ కొలనును నేను....మెలికలు తిరిగే వయ్యారాలతో వగలోలకబోసే కొండవాగును కాను-గిరి శిఖరాల పదపడి వడి దూకే ఉధృత జలపాతమూ కానుకొలనును నేను....ఉరుకులు పరుగులతో ముంచెత్తే వరదలతోసాగే నిరంతర చైతన్య స్రవంతిని కాను...ఉత్తుంగ తరంగాలతో ఉన్మత్త కెరటాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూఅగాధాల బడబానలాలుఅగమ్య తీరాలు కలిగిన కడలిని కానుకొలనును నేను....నాదో చిన్ని ప్రపంచం [...]
మావూరినడిబొడ్డున కలదు మంచినీళ్ళ కొలను వూరూరా కలదు ఈరీతిగ కొలను కొలను లేని వూరు వూరే కాదు సంకల్ప బలము లేని సాధనౌ సుమీ కళకళలాడును వర్షాకాలమందు వయ్యారి కొలను నిప్పులకోలిమిజేయు కాలమున తనబలిమి పోయి నోరెళ్ళపెట్టును విరాగి కొలను సమతూకమౌ చలికాలమందు వేకువఝామున పొగమంచు మ్రింగగా అంచులు కానరాని అందాలు అందించు కుందనాల కొలను సూర్య కిరణాలు తాకి పులకరించే పుడమి [...]
నా అంతరంగపు కొలనులో వికసించెను వింతసోయగపు కలువ నిండైన భక్తిపుష్పము కొంతైనను రాగద్వేశాది పంకము నంటక అంతరేంద్రియములు చంద్రునికై పరితపించు కలువవోలె నే అంతః శుద్ధిన ధ్యానించెద అంతర్యామిని  - జానకి కంకిపాటి  
                                      కొలను  కొలను ..  అక్కడెక్కడో ,ఒక ఊరి మధ్యలోనో  ఊరి చివరో కాదు..  కొలను అనగానే  వికసించిన కమలాలు,  బద్దకించి ముకుళించని  మొగ్గలు  నిదానం గా చెరువులో తలలు ఒంచి  నీరు తాగే పశువులు ,  బిందెలు నీటిలో ముంచి ఊరి వార్తల ఊట విప్పి ,  ఊరించుకునే పల్లె స్త్రీలు , గోచి బిగించి, తల దించి  బుడుమ్గమని మునిగే పల్లె  పిలకాయలు, మడి తడి  అంటూ అసింటా
--------------------------- మాయమైన ఊరి కొలను -------------------------------- ఊరి మధ్యన కొలనొక టుందికొలని గట్టున కోవెల ఉందికోవెల వెనుక తోటొక టుందితోట నిండుగా సందడి ఉందిదగ్గరలోనే బడి ఒక టుందిబడి పిల్లల సందడి ఉందిసందడి చేసే పిల్లలందరికికోవెలతోట విడిదే నండిచెట్ల మీద పలు చిలకల కిలకిలచెట్ల కింద మన పిల్లల కిలకిలబాలల పరుగుల కటునిటు చెదరిఎండుటాకుల గలగల గలగలమధురఫలాలూ పరీమళాలుసీతాకోకచిలుకల
"సూర్యుని కోసం"  ఉరుకు పరుగుల తోటి  ఉప్పొంగి పోయాను  సన్న జల్లుల తోటి  స్నాన మాడాను  వర్ష కాలపు నడుమ నలిగి పోయాను శీత కాలము వచ్చె  చల్లగా ఉండె  నీలి మబ్బుల నడుమ  నింగిలో నువ్వు  ఆడుతూ పాడుతూ  గంతులిడు తున్నావు  నా దరికి రావా  నన్నేలు కోవా  కలువ పూవులు పెట్టి  పచ్చగా చెండేసి  తామరాకుల తోటి  పైట కప్పాను  నాకు కవితలు రావు  కవనాలు [...]
సరసు తరగల తీవియలపై  గగన నీలిమల "స'రాగాలు' "   నా అంతరంగం -  సహస్ర దళ నళినమై   విరబూయు చున్నది, ప్రియ సఖీ!    హృదయమున్నది మనిషికేగా!  కలలు, కల్లలు ఎడదకేగా!  కొలను ఒడ్డున కాస్త సేపు  ఆసీనులయ్యీ గడిపితే;  కలత దీరును కాస్తసేపు;  మరి,  ఆ కొన్ని క్షణాల  తీపిదనపు తూకమెంతో తెలుపగలవా!? ఆ కొన్ని నిముషమ్ముల  కొలత ఎంతో చెప్పగలవా!!? నేస్తమా!  కలవరమ్ముల [...]
శ్యామలరావు గారి కవిత .  కాలమేఘవృష్టికల్లోలితం నా మనస్సరోవరం కోలుకోవటానికి తప్పక కావాలి నీ‌ సహాయం  బాలార్కకోటిసుందరతరమైన నీ దరహాసం నాలో ప్రతిఫలించటం లేదే అని నా విచారం     నాలుగుమూలలా నాలుగుపురుషార్థాల ఒడ్లు కాలం చేసిన దెబ్బలకు చాలా గండ్లు పడ్డాయి చాలా ఆశాశోకమోహాల చచ్చు బురద వచ్చి నాలో పేరుకుపోయిందనే నా కున్న విచారం నీ‌ మనసైన నా మనసు [...]
"కొలను" - కవితా పోటీ కి వచ్చిన  మంజు గారి  మొదటి కవిత : " జీవిత కొలను " అంతరంగపు కొలనులో  అలజడి రేపే ఆలోచనా తరంగాలు  అలల సుడిగుండాలు ఎన్నో....!! కలువల అందాలు కొన్ని...  ఆరాధనతో స్పృశిద్దామంటే...    చుట్టుకునే అడ్డుతీగలు ఎన్నో....!! సూర్య చంద్రుల కిరణాల తాకిడితో...  అచ్చెరువందే ఆనందంతో  పులకరించే కలువ తామరలు  జీవిత గమనాన్ని చూపే దిక్సూచీలు ....!! మది అంతరంగం [...]
|| జై శ్రీమన్నారాయణ  || ఆదరనీయులైన పాఠకులకి నమస్కారాలు! భావకులకిదే ఆహ్వానం! తరలిరండి!!... కవితా వస్తువు లో దూరి అంతరాత్మగా మారండి... ఆగిపోయిన అంతరంగాన్ని స్పృశించండి... అందిన అలోచనలని కవితగా రాయండి... " కొలను "   దీనిని కవితా వస్తువుగా తీసుకొని, ఉగాది-కవితగా బ్లొగర్లకందించ గలరని మనవి. "కాదేదీ కవితకనర్హం"  ఇది బహిరంగ-సవాల్ (open challenge)! ఆలోచించకండి ....
జీవితం అడగకుండా పోంది చెప్పకుండా పోగొట్టుకునే పుట్టుక చావుల మధ్యన తెలియక గడిపిన కాలం ... కాలం తయారుచేసుకున్న అవసరాలకి తీర్చుకోవాల్సిన తాపాలకీ నడుమ గత్యంతరంలేక ఏర్పరుచుకున్న గతి - అంతరాల నిరీక్షణ.. నిరీక్షణ... ఉద్వేగావేశాల మధ్యన నిచ్చేష్ట నిట్టూర్పుల మధ్యన సాగలేని ఆగలేని స్తబ్దమైన ఆలోచన... ఆలోచన... అడగకుండానే అల్లేసుకుని చెప్పెకుండానే చేరిపోయి తెలియకుండా [...]
He who knows not and knows not that he knows not is a fool; avoid him. He who knows not and knows that he knows not is a student; teach him. He who knows and knows not that he knows is asleep; wake him. He who knows and knows that he knows is a wise man; follow him.                                                                                             Persian apothegm, Sanskrit
అసంపూర్తిగా ఆగిపొయిన సగం ఆలోచనలు మలుపుతిరిగి తిరునాళ్లలా మళ్ళీ వస్తున్నాయి ఈ రేయి లో...  నిశి మసిలో రగులుతున్న చల్లని వెన్నెల బోరున గోడుని వెల్లబోసుకుంటుంది  ఈ రేయి లో... బరువెక్కిన కనురెప్పలు అసహాయయంగా నిలుపుకోలేని నీళ్ళని వదిలేస్తున్నాయి  ఈ రేయి లో.. తళుకు-బెళుకు తారలు లక్షలు కలిసొచ్చినా నా తిమిరాన్ని తొలగించలేకున్నాయి ఈ రేయి లో  .. నీ వెచ్చని తొలికిరణం [...]
ఆడ-మగ, పెద్దా-చిన్నా, ధనిక-పేద, ముందు-వెనకా, ఇలా ఎన్ని చెప్పుకున్నా....  సమానత్వం అనేది ఓ ఆదర్ష పదం... చిన్నప్పుడు సామాన్య శాస్త్రంలో చదుకున్నట్టు ఆదర్ష-వాయువు ఆదర్ష జలం లాటి సిధ్ధాంతాలుంటాయి కాని  వాస్తవానికి అవి లోకంలో ఉండవు...  సమానత్వం కూడా అలాంటిదే ..... లోకంలో మనము ప్రత్యేకమని మనకి ఎప్పుడైతే తెలిసొస్తుందో , అప్పుడే మనం పోల్చికోవడం మానేస్తాము...  సరిచూసుకోవడం, [...]
ఆస్వాదించ లేనిదే అందించ లేము .... బాధ్యతలు నిర్వర్తించ లేనిదే బంధాలనుంచి బయటపడలేము ... ప్రేమించ లేనిదే  ప్రేమేమిటో చెప్పలేము ...  'వివేకానందు' లం కాకుండా వివేకానందుడంటే ఎంటో తెలుసుకొలేము ...  -సత్య
-- ముడుచుకున్న పూరెక్కల మాటుననీ మత్తు మధూ ధారలు త్రాగి,నీ గుండెలపై రాత్రంతా నిద్దురపోయి,తెలియనట్టుగా తిరిగి వెళ్ళే తుమ్మెద కోసంఎదురు చూసి చూసి, తేరుకొని,నిరీక్షణలోంచి తేరుకుని, విచ్చుకున్నచిరునవ్వేమో నీ రూపం !!పరువాల పంకం లోంచి పైకుబికినపరిణతి లావుంది నీ పరిమళం!!!-సత్య నూతన సంవత్సర శుభాకాంక్షలతో... మీ  -సత్య 
కష్టాల  కరుణకి  కృతజ్ఞతలు  కృష్ణా! ఎందుకంటే... కన్నీళ్ళతో కడిగితేనే  కళ్లల్లో నీవుంటావ్ ! -సత్య 
 అరచేతి శూన్యమైందని తెలిసి  నాచేతిలోంచి  నేనే జారానని తెలిసి  మాంసకుహరంలో  మనిషిగా దూరాను  కాదు కాదు దూర్చబడ్డాను!  "మాయ" కూడా  నాకు మంచిచేస్తుందని  అజ్ఞానంకూడా  ఆనందాన్నిస్తుందని...  మాయని మళ్లోసారి  కోద్దామని,  ఈసారైనా చీకట్లని చీల్చి,  చైతన్యం వైపుకొద్దామని ,  ఆశతో వచ్చాను ...  సరళంగా జీవిస్తూ  విరళంగా చింతుస్తూ...  మనసులోని మాధవున్ని  మళ్ళీ మళ్ళీ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు