“నాకు స్నేహితులు నాకు అది అలవాటు చేసారు” “ఆ అమ్మాయి ప్రేమ వల్లె నా చదువు పాడయింది” “మా భర్త, పిల్లల వల్ల నా కెరీర్ లేకుండా అయ్యింది”  “మా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్లే ఈ చెత్త కోర్స్ తీసుకోవాల్సి వచ్చింది” కొందరు వారి జీవిత నిర్ణయాలకు వేరే వాళ్ళను ఎందుకు బాద్యులను చేస్తారో అర్థం కాదు. ఆత్మవిమర్శ లాంటివి వాళ్ళు చేయరేమో! మంచి జరిగితే వాళ్ళే కారణం, చెడు జరిగితే [...]
ఈ మధ్య నాకు తెలిసిన ఇద్దరు పిచ్చాపాటిగా వర్తమాన విషయాలపై వాదోపవాదాలు చేసుకుంటుండగా వినటం జరిగింది. అందులో ఒకతని వాదన సారాంశం ఇలా ఉంది. “ఆ నాయకుడిని ఉరికే ఇన్ని కోట్ల జనం అతనికి మద్దతు పలికి, ఓట్లు వేయరు కదా! అతని ఉపన్యాసాలకు జనం ఎలా వస్తారో చూసావా? అతను ఒక మేధావి. అతన్ని ఒక పల్లెత్తు మాట అన్నా నేను సహించను” సామాజిక మాధ్యమాల పుణ్యమా అని, ఈ మధ్య ఈ రకం వాదన [...]
తన  చాయను చూసాక వచ్చిన ఆ అనుభూతిని, తన  చిట్టి గుండెని విన్నాక   వచ్చిన ఆ పులకరింతని! తన కదలికలు నా అరచేతికి తాకాక వచ్చిన ఆ ఉత్సాహాన్ని, ఏం చేస్తుందో, ఎలా ఆలోచిస్తుందో, ఎలా ఉంటుందో, ఏం అనుకుంటుందో లాంటి ఎన్నో సమాధానం దొరకని ఆ ప్రశ్నలను తన జీవిత గమ్యంలో ఆశల లక్ష్యాలకు నా వంతు బాధ్యత పై కలిగిన సందేహాలను సమయంతో పోటి పడుతూ అమ్మ కడుపులో హాయిగా [...]
 ఎవరో అడిగారు నన్ను, “ఏంటి బాస్, ఆ సినిమా చూస్తున్నారా మొదటి రోజు”, ధియేటర్ లో ఆ సినిమా చూడొద్దని నిర్ణయించుకున్నా అని చెప్పా! ఏదో గ్రహాంతరవాసిని చూసినట్లు నన్ను అదో రకంగా చూసారు. నాకు సినిమా అంటే ఒక ఖాళీగా ఉన్నప్పుడు ఆహ్లాదం కోసం చూసే వినోదం. అది హోదాకు చిహ్నం కాదు. మొదటి రోజు, మొదటి వారం చూసాను అని సామాజిక మాద్యమాలలో, స్నేహితులతో చెప్పుకోవటానికి! నేను మొదటి [...]
ఒకరోజు ఆఫీసులో పని చేస్తున్నాను, ఇంతలో నా సహోద్యోగి ఒకరు వచ్చి మా ఆవిడ మన ఆఫీసు దగ్గరికే వచ్చిందండి, తను బయట వెయిట్ చేస్తుంది. మీరు కూడా రండి, పరిచయం చేయిస్తాను అని చెప్పారు. ఆ సహోద్యోగి నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉండటం, దేశం కాని దేశంలో ఉన్నప్పుడు కలివిడిగా ఉండటం అవసరం కాబట్టి, సరే అని చెప్పాను. తను నేను కలిసి బయటకు వెళ్ళాము.  తను ఒక్కతే అక్కడున్న [...]
కనురెప్పల వెనకున్న బాధను ఓదార్చావు నిదురించే సమయాన కలలను కరిగించావు నవ్విస్తూ కవ్విస్తూ ఊసులు వల్లించావు నీకోసమే నేనంటూ ఏవేవో చెప్పావు నేనిచ్చిన నా ప్రేమే అపురూపం అన్నావు నా ముందు నీకన్నీ త్రుణపాయం అన్నావు, భాసటగా  నా తోడే నీ ధైర్యం అన్నావు  నాతోడే ఈ జీవిత పరమార్థం అన్నావు విశ్వంలా మన ప్రేమకు అంతేలేదన్నావు నా మంచే అన్నావు, నన్నే విడిపోయావు, నా [...]
నా తోడే నీ బాధని నా ఊసే నీకు శాపమని నా మాటే ఒక మోసమని నా ప్రేమే ఒక కపటమని, నా వైపే ఇక చూడనని గాయపడింది నా హృదయం ఒక్కమాటతో మన బంధాన్ని తెల్చేసావని!! నే వేచి ఉన్న రోజులు మరిచావా నీ నవ్వు కోసమని నాలో మార్పులు చూసావా నీ సౌఖ్యం కోసమని నా కన్నుల ఆరాటం గమనించావా నీ ప్రతిబింబం కోసమని అహాన్ని చేరనివ్వని నా తాపత్రయాన్ని తరిచావా మన బంధం పదిలత కోసమని బాధతో యదంతా [...]
“నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి!!!” అందరం కలిసి ట్రిప్ కి ఎక్కడికి వెళ్ళాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు, తన మనసులో ఉన్నది చెప్పరు, వేరే వాళ్ళ మనసులో ఉన్నది మాత్రం అడుగుతారు. సరే, విన్నాక ఏదో ఒక నిర్ణయానికి వస్తారా అంటే అదీ కాదు, మిగిలిన వాళ్ళందరూ ఒకే మాట చెప్పాలంటారు. నలుగురు మనుషులు ఉన్నప్పుడు అందరూ ఒకే మాట మీద నిలపడి ఉండటం కష్టం కదా, అదే [...]
మనకు కొందరి  వ్యక్తుల విలువ, వారు దూరం అవుతున్నప్పుడు, అయినప్పుడు ఎక్కువ తెలుస్తుంది. వారు మనతో ఉన్నప్పుడు వారి ప్రాధాన్యత మనకు కనిపించదు, మనకు వాళ్ళ లోపాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఆ లోపాలనే పెద్దగా చూస్తూ వాళ్ళను విమర్శించడం, మనం వాళ్ళ వల్ల ఇబ్బంది పడిపోతున్నాం అని ఎక్కువ ఫీల్ అయిపోతుంటాం. కాని కొన్ని సంవత్సరాల తరువాత వెనక్కి మళ్ళి చూసుకుంటే మనకు వారి విలువ [...]
ఆ మద్య ఇండియా ఆఫీసు కి  వచ్చిన ఒక అమెరికన్ మేనేజర్, టీం అందరితో మాట్లాడుతూ, మాటల మద్యలో, ఆ టీం లో ఉన్న ఒక అమ్మాయిని మీది ప్రేమ పెళ్ళా  లేకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్ళా అని అడిగాడు. ఆ అమ్మాయి కొంచం ఇబ్బందిగానే ఫీల్ అవుతూ మాది ప్రేమ పెళ్లి అని చెప్పింది. అది విన్న మా టీంలో మిగిలిన వాళ్ళు ఒకరి మొఖం ఒకరు చూసుకున్నాం, ఆమె అబద్దం ఎందుకు చెప్పిందా అని!! ఆమె పెద్దలు కుదిర్చిన [...]
"కొంత మంది నాకు నచ్చరు, వాళ్ళతో నేను  ఎప్పుడు చూడలేదు, మాట్లాడలేదు, వాళ్ళ గురించి వినలేదు కూడా! కాని వాళ్ళను చూడగానే వాళ్ళు నాకు నచ్చరు.  కారణం? కారణం అంటూ ఉండదు అలా నచ్చక పోవటానికి. కొందరు నచ్చరంతే!!” కొంత మంది ఎందుకు నచ్చరు చూడగానే, వాళ్ళ వేషదారణ? వాళ్ళ హవాబావాలు? వాళ్ళను వాళ్ళు ప్రెసెంట్ చేసుకునే తీరు? వారిని చూసి అసూయ? వాళ్ళు మీకు పోటి అని మీరనుకోవటం? ఏదైనా [...]
“ఏమండి...” “మ్, చెప్పు” “మీకు బాగా కొవ్వు ఎక్కువైందండి” “నేను కూడా అదే అనుకుంటున్నా, వచ్చే వారం నుంచి జిమ్ వెళ్తా..........” “నేను అంటున్నది మీ శరీరం లో ఉన్న కొవ్వు గురించి కాదు....” “..............”
అమ్మయినా అడగందే అన్నం కూడా పెట్టదంటారు, కాని నన్ను అడక్కుండానే ఈ గ్రూపులో అక్కున చేర్చుకున్న ఆదర్శ వాట్సాప్ గ్రూపు సభ్యులైన మిమ్మల్ని వీడి వెళ్లి పోతున్నందుకు నన్ను క్షమించండి. ప్రొద్దునే లేవగానే కనీసం పక్క రూమ్ లో ఉన్న అమ్మా నాన్నలకు గుడ్ మార్నింగ్ అని చెప్పే ఓపిక లేకున్నా, ఈ గ్రూపులో అందరికంటే ముందు లేచి మరీ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టె ఆ గొప్ప [...]
అమెరికా కు వచ్చి దాదాపు వారం కావొస్తోంది. హోటల్ రూమ్ లో ఉండేవాన్ని. ప్రతీ రోజు ఆఫీసు కి వెళ్ళటం, మళ్ళి హోటల్ రూమ్ కి రావటం, ఇంటర్నెట్ లో ఇల్లు గురించే వెతకటం, ఇదే వ్యాపకం అయిపోయింది. ప్రతీ రోజు లాగే ఉదయం లేచి ఫార్మల్ డ్రెస్ లో రెడీ అయ్యి, లాప్ టాప్ బ్యాగు పట్టుకొని,  హోటల్ లాబీ రూమ్ లోకి వచ్చాను. నేను హోటల్ బయటికి వేల్లబోతోంటే, ఒక యాబై ఏళ్ల అమెరికన్ నాకు హలో అన్నట్టు [...]
మన జీవిత గమనంలో తారసపడే అంతులేని వ్యక్తులలో మనం మనకు పరిచయం అయిన కొంత మంది వ్యక్తులలో ఉన్న దాగి ఉన్న potential ను గుర్తిస్తాం. ఆలా దాగి ఉన్న ఆ శక్తిని వేరే వాళ్ళు లేదా ఆ వ్యక్తులే చూడకపోవచ్చు. ఆ పరిస్థితులలో మనం వారికి మన సలహాల ద్వారా, ప్రేరణా పూరిత మాటల ద్వారా, నిర్మాణాత్మక విమర్శల ద్వారా వారిలో ఉన్న ఆ ఉపయోగించుకొని శక్తి ని వారి జీవిత ఆశయాలకు, అబివృద్దికి అనుగుణంగా [...]
నలుగురు కలిసి ఏదో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. మొదటి వ్యక్తి : ఎక్కడికి వెళ్దాం? రెండో వ్యక్తి : మనం నలుగురం కలిసి వెళ్ళడం ముఖ్యం, ఏ ప్లేస్ అయినా నాకు ఒకే! మూడో వ్యక్తి : నేను ఎక్కడికైనా రెడీ, నువ్వు డిసైడ్ చేసేయ్. నాలుగో వ్యక్తి: నువ్వు ఎక్కడికి అంటే నేను అక్కడికి రెడీ. నాకు ప్రాధాన్యతలు ఏమి లేవు. మొదటి వ్యక్తి : సరే  మరి, అందరు ఎక్కడికైనా ఒకే అంటున్నారు [...]
చిన్నప్పటి నుంచి తన తమ్ముడి చదువు కోసం, కెరీర్ కోసం తాపత్రయపడి, తమ్మున్ని ఒక మంచి స్థానం లో పెట్టిన ఒక అన్నయ్య పరిస్థితి ఆర్ధికంగా బాగా దిగజారిపోయింది. అన్న మీద ప్రేమను, తనకు చేసిన సహాయాన్ని మరిచిపోని ఆ తమ్ముడు, ప్రతీ నెల అన్నకు కొంత డబ్బు ఇవ్వాలి అనుకున్నాడు. ఇవ్వటం మొదలు పెట్టాడు కూడా! గతాన్ని స్వగతంగా చూడని, మద్యలో వచ్చిన ఆ తమ్ముడి బార్యకు, ఆ తమ్ముడు అన్నకు [...]
సాధారణంగా గ్రూపుతో మనం ట్రిప్ కి వెళ్ళినప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్లు జరగదు, ఆ ప్రదేశంలో పరిస్థితుల వల్ల కావొచ్చు లేదా ఇతరత్రా కారణం వల్ల కావొచ్చు. కాని ఈ వ్యక్తి ఆలా జరిగితే ఒప్పుకోరు, తను ఎలా అయితే ఊహించుకున్నారో అలాగే ఈ ట్రిప్ అంతా జరిగిపోవాలి అని పట్టు పడతారు, మొండి కేస్తారు. వీళ్ళు బాద్యత తీసుకోరు, కాని విమర్శకు మాత్రం ముందు ఉంటారు. ఆ ట్రిప్ బాద్యత [...]
మనం ఇప్పుడు సమాచార స్రవంతి యుగంలో ఉన్నాము, మన దగ్గర ఉన్న తక్కువ సమయానికి  కు, మనకు అందుబాటులో ఉన్న అంతులేని సమాచారానికి మద్య ఆగాదం పెరుగుతూ పోతోంది. ఇది సమాజం పై అనేక రంగాలలో, అనేక రకాలుగా ప్రభావం చూపిస్తోంది. మరీ ముఖ్యంగా, మన మానవ సంబందాలపై!! ఈ మద్య చాలా మంది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళను అనాలోచితంగా judge చేయడం సాదారణం అయిపోయింది. ఎదుటి వ్యక్తి ఉన్న పరిస్థితులను అర్థం [...]
మా ఆఫీసు టీం లంచ్ లో పిచ్చాపాటిగా కార్ల గురించి మాట్లడుకుంటున్నాము. అందరూ వారి వారి దగ్గర ఉన్న కార్ల గురించి చెబుతున్నారు. ఆ గ్రూపులో అప్పుడే కొత్తగా తన కెరీర్ మొదలుపెట్టిన అమ్మాయి ఇలా అంది. “నా దగ్గర ఆడి కారు లేటెస్ట్ మోడల్ ఉంది” అక్కడున్న వాళ్ళందరూ ఓఓఓహ్ అని కోరస్ ఇచ్చారు. ఆ అమ్మాయి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ, “నేను కొనలేదు, మా పేరెంట్స్ [...]
ఈ మద్య ఈ సినిమా ఆడియో ఫంక్షన్లు చూసారా!!! ప్రతీ ఆడియో ఫంక్షన్లలో ఒకటే రకమైన సీడీ వేసి అరగదీస్తుంటారు. ఈ ఆడియో ఫంక్షన్లను చూస్తుంటే, చిన్నప్పుడు విన్న ఒక కథ జ్ఞాపకం వస్తుంది. మీలో చాలా మందికి తెలిసిందే, ఆవు వ్యాసం. ఆనగనగా ఒక ఊర్లోని స్కూల్ టీచర్, ఒక పిల్లాడికి ఆవు పైన వ్యాసం రాసుకొన్ తీసుకొని రా అని చెప్తాడు. మరుసటి రోజు ఆ పిల్లాడు, తను రాసుకొచ్చిన ఆవు వ్యాసాన్ని ఇలా [...]
కొందరి కక్కుర్తి చూస్తే, ఆ కక్కుర్తికే సిగ్గనిపిస్తుందేమో!! నేను పని చేసే పాత ఆఫీసులో ఇద్దరు ఉన్నత ఉద్యోగుల కథ ఇది. ఇద్దరూ ఆ సమయానికి పెళ్లి కాని ప్రసాద్ లే!! ఇద్దరికీ బాగా జీతాలు వచ్చే ఉద్యాగాలే, ఇద్ధరూ వేరు వేరు రూమ్ లలో ఆఫీసు దగ్గరలో ఉండేవారు. మొదటి వ్యక్తి, ప్రతి రోజు ఒక వాటర్ బాటిల్ డబ్బా తీసుకోచ్చేవారు. ఆఫీసులో దాదాపు అందరూ వెళ్ళిపోయాక, బ్రేక్ అవుట్ వెళ్లి, ఆ [...]
గత డిసెంబర్లో అట్లాంటా ఎయిర్ పోర్టు లో ఓర్లాండో వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాను. సంవత్సరాంతం కావడంతో ఎయిర్ పోర్టు అంతా కోలాహలంగా ఉంది. నేను ఒక పక్కన కూర్చొని ఏదో చదువుతూ ఉండగా, అమెరికన్ పిల్లలు  ఆడుకుంటున్న అరుపులు వినిపించాయి. నేను పుస్తకం పక్కన పెట్టి వాళ్ళను, వారి ఆటనూ చూస్తూ కూర్చున్నాను. ఒక పాపా, ఒక బాబు, ఇద్దరూ 6 ఏళ్ళ లోపలే ఉంటారు అనుకుంటా, ఒకరిని ఒకరు [...]
“అడగటం కోసం అడుక్కోవటం, అడుక్కోవటం కోసం అడగటం” అడగటం మరియు అడుక్కోవటం మద్యలో ఉన్న తేడా ఏంటో చెప్పటానికి పై వాక్యాన్ని రాసాను. అడగటం లో చనువు ఉంటుంది, అడుక్కోవటం లో నిస్సహాయత ఉంటుంది, “అడుగుతున్నమా” లేదా “అడుక్కుంటున్నామా” అన్నది మనం అవతలి వ్యక్తులను ఎంత బాగా అర్థం చేసుకున్నాం, ఎంత దగ్గరి వాళ్ళు అని అనుకుంటున్నాము అన్నదాని పై ఆధారపడి ఉంటుంది.  ఎప్పుడు అడగాలో, [...]
వేసవి సెలవుల తరువాత, అప్పుడే స్కూల్ మొదలయింది. నేను అప్పుడు తొమ్మిదవ తరగతి, ఆ ఎనిమిదవ తరగతిలో మార్కులు సరిగ్గా రాకపోయినా, హాజరు శాతం బాగా ఉంది అన్న ఒకే ఒక్క కారణంతో, నన్ను తొమ్మిదవ తరగతికి పంపించారు. ఒకరోజు, మా క్లాసులోకి అందరు ఉపాద్యాయులు వచ్చి, వచ్చే ఏడాది 10 వ తరగతి బోర్డు పరిక్షలు ఉంటాయి కాబట్టి, మేము తొమ్మిదవ తరగతి విద్యార్థులను ఏ, బి, సి అనే సెక్షన్ల కింద వేరు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు