భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకమైన స్వదేశీ ఉద్యమం 1905, ఆగష్టు 7న ప్రారంభమైంది. విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి భారతీయులంతా స్వదేశీ వస్త్రాలను తమకు తామే తయారుచేసుకోవడం ప్రారంభించారు. ఆ రకంగా దేశ స్వాతంత్య్ర సమరానికి ఊపిరి... దేశ సంస్కృతికి ప్రతీకగా నూలు వడికే రాట్నం నిలిచింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగష్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం.  తెలుగు [...]
అరకు ఆర్గానిక్ కాఫీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందంటే 'ఔనా!' అని ఆశ్చర్యపోయేవారే ఎక్కువ. ముఖ్యంగా మన తెలుగువాళ్ళు. అరకు కాఫీ ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఎగుమతి అవుతుందన్న విషయం కార్పొరేట్ సంస్థల అధిపతులకు తెలిసినంతగా రోజూ కాఫీ తాగే సగటు తెలుగు కాఫీ ప్రేమికులకు తెలియదు.  పారిస్ లో అరకు కాఫీ స్టోర్:      మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ [...]
మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా పుణ్యమాని ముఖాముఖి మాటలకు బదులు చాటింగ్ లు, బంధుత్వ పలకరింపులకు బదులు లైకింగ్ లు, అభిరుచి వ్యక్తీకరణకు లేదా భావ ప్రకటనకు షేరింగులు అలవాటయిపోయాయి. వ్యక్తులు ఎదురుపడితే మాట్లాడటానికి తెగ మొహమాట పడిపోయి, బింకంగా సిగ్గుపడుతూ, ముడుచుకు పోయే వారు సైతం సోషల్ మీడియాలో విభిన్న ఫోజుల్లో సెల్ఫీలు పెడతారు. 'lol' అంటూ డైనమిక్ గా మాట్లాడతారు. [...]
అది 1999వ సంవత్సరం. దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ ప్రాంతంలో ఓ రాత్రి పబ్ లో కూర్చున్నారు కొంతమంది మిత్రులు. వారి మాటల్లో పుట్టింది 'మొవంబర్' అన్న పదం. నవంబర్ నెల పొడుగునా మీసాలను కత్తిరించకుండా పెంచి, తద్వారా మిగిలిన డబ్బులతో పాటు, మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వచ్చిన డబ్బుల్ని స్వచ్ఛందంగా ఒక సామాజిక కార్యక్రమం కోసం దానమివ్వాలి. అదీ 'మొవంబర్' లక్ష్యం. [...]
నిను వీడని నీడను నేనే... !   ఒక మారుమూల అందమైన ప్రదేశానికి పని మీద వెళ్ళిన ఒకతను అప్పుడే హోటల్లో దిగాడు. భార్య కూడా ఆ ప్రదేశం చూస్తే బాగుండు అనుకున్నాడు. ఎలాగూ కొద్ది రోజులుగా ఇద్దరికీ కీచులాటలతో మనసు చికాకుగా ఉంది. ఈ ఊరికి వచ్చేటప్పుడు కూడా ఒకరినొకరు అరచుకున్నారు. ఈ సమయంలో ఇలాంటి చోట ఇద్దరం గడిపితే చికాకులు తొలగిపోతాయి. మనసులు ప్రేమతో రీఛార్జ్ [...]
గెలుపును పంచుకోడానికి అందరూ వస్తారు. అదే ఓటమి భారాన్ని మాత్రం మనం మాత్రమే మోయాలి.   పి.వి. సింధు సాధించిన విజయం దేశానికి గర్వకారణం అనడంలో మరోమాట లేదు. ఈ విజయం ఆమె గెలవాలని కోరుకున్న ప్రతి భారతీయుడికీ చెందుతుంది. ఇంతటి విజయం తరవాత సింధు అందరి అమ్మాయి అయ్యింది. రజనీతో సహా  అమితాబ్ నుండి సల్మాన్ వరకు ఆమె ఫాన్స్ అయ్యారు. తెలుగు రాష్ట్రాలు పోటీపడి మరీ ఆమెకు కోట్లు [...]
తనదాకా వస్తే గానీ...       టీవీ జర్నలిస్ట్ అర్నబ్ గోసామి ఒక రైతును ఇంటర్వ్యూ చేస్తున్నాడు.  అర్నబ్: మీ మేకలకు ఏం మేపుతారు? రైతు: ఏ మేకకు? తెల్లదానికా? నల్ల మేకకా? అర్నబ్ : తెల్ల మేకకు ఏం పెడతారు? రైతు: పచ్చగడ్డి  అర్నబ్ : మరి నల్ల మేకకు? రైతు : దానికి కూడా పచ్చగడ్డే పెడతాను.  అర్నబ్ : మేకలను ఎక్కడ కట్టేస్తారు? రైతు : తెల్ల మేకనా? నల్ల మేకనా? అర్నబ్ : తెల్ల [...]
వాట్సప్ పంచ్ ఓ పెద్దాయన హెయిర్ కటింగ్ సెలూన్ కు వెళ్ళాడు.  ఆయనకు అప్పటికే తలమీది వెంట్రుకలన్నీ రాలిపోయి కేవలం 8 వెంట్రుకలు మిగిలాయి. 'వీటిని ఏం చెయ్యమంటారు... కత్తిరించాలా, లెక్క పెట్టాలా ?' వెటకారంగా అడిగాడు బార్బర్. 'కాదోయ్! రంగేయాలి.' తాపీగా చెప్పాడు పెద్దాయన. 'తలలు బోడులైన తలపులు బోడులా' అన్న సామెత గుర్తుకు రావట్లేదూ?!           
వాట్సప్ పంచ్  ( రాంబాబు -సోంబాబు)     1 కిరాయి హంతకులైన రాంబాబు, సోంబాబులు ఇద్దరూ ఒక  కారుకు బాంబు ఫిక్స్ చేస్తున్నారు. రాంబాబు ఫిక్స్ చేస్తుండగా సోంబాబు వాడికి సహాయం చేస్తూ అడిగాడు..  ''ఒక వేళ మనం ఫిక్స్ చేస్తున్నప్పుడే ఈ బాంబు  పేలిపోతే ఏం చేస్తావు?'' ''మరేం పర్వాలేదు. నా దగ్గర ఇంకోటి ఉంది''  రాంబాబు సమాధానం.   2 రాంబాబు: ''కారు కొన్నావంట. ఏ కారు?'' సోంబాబు: [...]
కొరడా దెబ్బలు ఒక భారతీయుడు, ఒక అమెరికన్, ఒక పాకిస్థానీయుడు సౌదీ అరేబియాకు చెందిన విమానంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. వారు చేసిన నేరానికి శిక్షగా ఒక్కొక్కరికీ 50 కొరడా దెబ్బలు శిక్ష విధించారు అధికారులు. వారు ముగ్గురూ శిక్షకు సిద్ధపడుతుండగా, శిక్షను అమలుపరిచే షేక్ వచ్చి ఇలా
  భారతదేశం గురించి అధ్యయనం చేసి రమ్మని కొన్ని  ఏలియన్ లను భూమ్మీదకి పంపించారు గ్రహాంతర వాసులు. భారతీయుల సామాజిక లక్షణాలపై అధ్యయనం చేసిన ఒక ఏలియన్ తన నివేదికను ఇలా గమ్మత్తుగా ఇచ్చింది.  (గమనిక: ఇది కేవలం నవ్వుకోడానికే సుమా! ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే వాట్సప్ ను తిట్టుకోండి. ఎందుకంటే ఇది వాట్సప్ లో సర్క్యులేట్ అవుతోంది మరి. నేను కేవలం అనువాదకుడిని [...]
మకుటం కోరని మహారాజు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. కానీ నవంబర్ 19న 'అంతర్జాతీయ పురుషుల దినోత్సవం' (International Men's Day) జరుపుకుంటారనిగానీ, జరుపుకోవచ్చని కానీ మనలో ఎంతమందికి తెలుసు?  ఐక్య రాజ్య సమితి ఆమోదంతో మొదటగా ట్రినిడాడ్ మరియు టొబాగోలో 1999లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంతకంటే ముందు రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్ ప్రారంభించారని, [...]
                                                                                                 'మూన్ను ఆరు' అంటే స్థానిక భాషలో  మూడు సెలయేళ్ళు అని అర్థం. ముత్తిరపూజ, నల్లతాని, కుందాళ అనే మూడు నదులున్న ప్రదేశమే 'మున్నారు' అని  కొందరు, మట్టుపెట్టి, నల్లతాని, పెరియవరు నదుల వల్ల ఆ పేరొచ్చిందని కొందరు అంటారు. నైరుతి ఋతుపవనాలు భారతదేశాన్ని తాకినప్పుడు...  అంటే  వర్షాకాలపు తొలి చినుకులు
మున్నార్ పట్టణం  'మూన్ను ఆరు' అంటే స్థానిక భాషలో  మూడు సెలయేళ్ళు అని అర్థం. ముత్తిరపూజ, నల్లతాని, కుందాళ అనే మూడు నదులున్న ప్రదేశమే 'మున్నారు' అని  కొందరు, మట్టుపెట్టి, నల్లతాని, పెరియవరు నదుల వల్ల ఆ పేరొచ్చిందని కొందరు అంటారు. నైరుతి ఋతుపవనాలు భారతదేశాన్ని తాకినప్పుడు...  అంటే  వర్షాకాలపు తొలి చినుకులు మున్నార్ లోనే పడతాయి. ఆ మాటకొస్తే  సంవత్సరమంతా ఇక్కడ వర్షం [...]
' శ్రీమంతుడు ఏమన్నాడు? అనగానే మహేష్ బాబు గురించి ఏదో చెప్పబోతున్నానని  అని మీలో చాలా మంది అనుకుని ఉంటారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సినిమా అంతగా అందరికీ నచ్చేసింది. అదీగాక మహేష్ బాబు కూడా చూడ్డానికి రాకుమారుడిలా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక కుర్రకారు అయితే నిన్నటివరకూ మూలన పడేసిన సైకిళ్ళను బయటికి తీసి, రిపేర్లు చేయించుకుని మరీ రోడ్లపై తిరిగేస్తున్నారు. [...]
                                                                           ఎవరు పేద? బాగా డబ్బున్న మారాజు ఒకరు, తన కొడుకుకు పేదరికం అంటే ఏమిటో తెలియచెప్పాలని పల్లెలకు తీసుకుపోయాడు. కొద్ది రోజులు తిరిగొచ్చాక కొడుకును అడిగాడు ''పేదరికం అంటే అర్థమైందా'' అని. అర్థమైందన్నాడు కొడుకు. ఏమర్థయ్యిందో చెప్పమన్నాడు. కాపలా కాసేందుకు మన దగ్గర ఓకే కుక్క ఉంటే వాళ్ళ దగ్గర అరడజను కుక్కలున్నాయి. ఈదులాడేందుకు
ఇంతింతై వటుడింతై...  ఒక పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులంతా పాల్గొన్నారు. 'దానికి సంబంధించిన ఫోటోలు  కావాలనుకున్న విద్యార్థులు కాపీకి 10 రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు అని నోటీసు పంపండి' అని ప్రిన్సిపాల్ తో చెప్పాడు చైర్మన్. 'అలాగే సర్ !' అనేసి బయటకు వచ్చిన ప్రిన్సిపాల్ నోటీసు తయారుచేయకుండా టీచర్లను పిలచి 'కాపీ ఒక్కింటికి 20 రూపాయలు తెమ్మని చెప్పండి' [...]
లంచ్ బ్రేక్ లో ఏదైనా హోటల్ లో భోంచేద్దామని ఆఫీసు నుంచి బయటకు బయలుదేరాడు మేనేజర్. వరండాలో ఆఫీసు క్లర్క్, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ లు కనిపించేసరికి తనతో పాటు రమ్మన్నాడు. బీచ్ పక్కనే ఉండటంతో సరదాగా నడిచి వెళ్తున్నారు. అలా వెళ్తుంటే మేనేజర్ కాలికి ఒక పాత దీపం లాంటిది తగిలింది. ఆలీబాబా అద్భుత దీపం అని అరిచారు మిగిలిన ఇద్దరూ.  'అయితే దీన్ని రుద్ది, కోర్కెలు తీర్చే [...]
ఒక నియోజకవర్గంలో ఓటు వేసేందుకు అర్హత ఉన్నవారు 100 మంది ఉన్నారనుకుంటే, అందులో ఓటరు జాబితాలో పేరున్న వారు 80 మంది ఉంటారు. పోలింగ్ శాతం 60 అనుకుంటే  ఆ 80 మందిలో ఓటేసిన వారు 48 మంది అన్నమాట. గెలుపొందిన అభ్యర్థి లేదా పార్టీకి మళ్ళీ 60 శాతం ఓట్లుపడి విజయ ఢంకా మ్రోగించింది అనుకుంటే ఆ 48 మందిలో 28-29 మంది ఆ అభ్యర్థికి ఒటేశారన్న మాట. అంటే 100 మంది ఓటర్లలో ఒక ముప్పై మంది మాత్రమే బలపరిచిన [...]
ఎవరైనా చనిపోయినప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుతూ.. 'ఆయన మరణం ఒక తీరని లోటు' అని అలవాటుగా అనేస్తుంటారు. ఉన్నంత కాలం జనాన్ని పీడించి, భయపెట్టి వేధించిన వాడు పోయినప్పుడు, 'పీడా విరగడై పోయిందిరా బాబు' అని జనం సంతోషిస్తుంటే వీళ్ళెంటి తీరని లోటు అంటారు అనిపించేది. ప్రజాసేవ పేరు చెప్పి కబ్జాలు చేసి, దౌర్జన్యాలు చేసి, కోట్లు కూడపెట్టి, అధికారాన్ని అడ్డంగా వాడుకుని ఎవడైనా [...]
అబ్దుల్ కలాం వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసు. కానీ అందరూ తెలుసుకోవలసింది ఏంటంటే ఆ వ్యక్తిత్వాన్ని అలా చెక్కిన శిల్పులెవరూ అన్నది. కలాం గారు చెప్పిందే ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పుకుందాం.  కలాం చిన్నతనంలో ఒకరోజు...  కలాం వాళ్ళ అమ్మ ఓ రోజు రాత్రి ఇంట్లో అందరికీ రొట్టెలు చేసి పెట్టింది. అయితే పని ఒత్తిడిలో పడి  రొట్టెలు మాడిపోతున్న విషయం ఆమె గమనించలేదు. కూరతో సహా ఆ [...]
పొందికైన ముక్కుకు ఒక్క లోహపు పోగు తగిలిస్తే ముఖంలోని అందమంతా అక్కడే పోగు పడుద్ది. నచ్చిన మగ హృదయాన్ని కొల్లగొట్టాలంటే, ముక్కెర పెట్టిన ముక్కే ఎర. అందుకే దాన్ని ముక్కెర అన్నారేమో.  ఎప్పుడూ పోష్ గా కనిపించే మన హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడూ ఒక సినిమాలోనో, ఒక పాటలోనో ముక్కుకు ముక్కెరతో కనిపించి యువహృదయాలకు గిలిగింతలు పెడతారు.  నువ్వొస్తానంటే నేనొద్దంటానా [...]
బాహుబలి (ఓ కట్టప్ప కథ!) ..   బాహుబలి సినిమా మొదటి ఐదు రోజుల్లో రూ.215కోట్లు వసూలు చేసిందంట. నిజమే అయ్యుండొచ్చు. కానీ వసూలు చేసింది సినిమా కాదు. వసూలు ఏజెంట్లు చాలా మంది ఉన్నారు. టివి మీడియా, ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా, రాజమౌళి(దర్శకుడు కాబట్టి తప్పదనుకోండి), నిర్మాతలు (కోట్లు పోసాక రాబట్టుకోవాలి కదా మరి), సినీ అభిమానులు... ఇంకా చాలా మంది ఏజెంట్లు ఉన్నారు. ఒక్క [...]
అపుడెపుడో 'మొఘల్ - ఎ - ఆజం' సినిమాని చూడ్డానికి, హైదరాబాద్ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనం బళ్ళు కట్టుకుని ముందురోజే నగరానికి చేరుకునే వారంట. రాత్రంతా లైన్లోనే కునికిపాట్లు పడి, తెల్లారే టికెట్టు దక్కించుకుని సినిమా చూసి పోయేవారంట. 'రోజులు మారాయి' సినిమాకు కూడా అలానే జరిగిందంటారు ఆ తరం వాళ్ళు. నా చిన్నతనంలో ఎన్టీఆర్, కృష్ణ, ఏయన్నార్ సినిమాలకు మొదటిరోజు మొదటి ఆట చూసి రావడం [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు