ఎవరు నువ్వు?శిలగా మారిన నా హృదయాన్నిఉలితో మళ్ళీ ఎందుకు చెక్కుతున్నావు?మాసిన గాయాన్ని, మూసిన తలపుల తలుపులనుతెరవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు?అడిగితే కారణం చెప్పవు.పైగా నాకా హక్కు లేదంటున్నావు.ఎవరు ఇచ్చారు నీకు ఇంత చనువు?  
గుండెలోని బాధ కళ్ళలో నీరుగా మారి కారిపోయిన క్షణాలెన్నో.. గుండె కరగలేదు నీరు ఇంకలేదు.. జరిగేది జరుగుతూనే ఉంది కారే కన్నీళ్ళకి చెలియ కట్టలు లేవు .. సాగేది జీవితం జరిగేది సంఘర్షణ. మనసుకూ మనిషికీ మిగిలేవి కన్నీళ్ళే... కళ్ళ నిండా నీరే తోవ కానరాని కన్నీటి చెలమలే.. అడుగడుగున గుండె బరువు తీరినా.. మనసు కుదుట పడినా కన్నీళ్ళ వల్లేనేనేమో. .. కురిసి కురిసి వెలవటం ఆగి ఆగి వర్షించటం [...]
తనని చూశాక.. నన్ను నేను మరచాను.. చూసింది కళ్ళతోనే నిలచింది మనసులో.. మనసు మనసులో లేదే- ఇదేం మాయో.. ఉన్నది నేలపైనే ఎగురుతున్నట్టుంది గాలిలో.. ఎమయిందో ఎమో నాకు.. సంతకం చేసినట్టుంది తొలివలపు.. నింగీ-నేలా కలసినట్టు పగలూ-రాత్రి జంటయినట్టు సూర్యుడు వెన్నెల కురిపిస్తున్నట్టు నేలపై ఎగురుతున్నట్టు గాలిలో తేలుతున్నట్టు మంచు కాలినట్టు మనసు చెదిరినట్టు ఏమిటో ఈ అల్లరి మనసు చేసే [...]
ప్రియా నే మునిగిపోయా నీకమ్మనీ తలపులలో నువుతప్ప వేరే ఆలోచనలు లేవు గుండెలో నువులేని నిమషాలు లేవు నా ప్రతిపనిలో ఎందుకు ఇలానను బందించావు నీఊసులలో మరువలేని గుర్తులను మిగిల్చావు హ్రుదయంలో ఇపుడు కనిపించకుండా రగిల్చావు బాధను మనసులో ఒంటరిగా నేచూస్తున్నా నీకోసం కన్నీటితో ఇక నీవు లేని నాజీవితాన బ్రతకలేక చావాలనుకుంటున్నా.
ప్రియా నీకు దూరం అయి నాబ్రతుకు భారం అయింది కనుల నిండా కన్నీరే మిగిలింది విధి ఆడిన ఆటలో నే బలిఅయిపోయా నా ఊపిరి అయిన నీవు నను విడిచిపోయావు తిరిగిరాని లోకానికి నాతోడు లేకుండా ఒంటరిగా బ్రతకమని నను ఒదిలేసిపోయావు నీ హ్రుదయంలో కలకాలం దీపంలా వెలగాలనుకున్నా చివరికి నాజీవితం చీకటి అయి నిరాశగా కూచున్నా ఆనందఘడియలు సమాధిచేస్తూ శోకంతో జీవించమని వదిలేసావు.
ప్రియా నీవు పరిచయం అయిన కొద్దిరోజులకే చిగురించెను నాలో కొత్తఆశలు ఇన్నిరోజులు మూగగా ఉన్న నాఆలోచనలు నీరాకతో ప్రతినిమిషం నీతలపులలో తేలిపోతున్నవి మనసు ఎందుకో దిగులుగా ఉంటుంది నీమాట వినకపోతే అనుదినం నువు లేకుండా ఒక్కఘడియకూడా ఉండలేను అంటున్నది నా హ్రుదయం నీతోడు లేకపోతే ఏమవుతుందో ఈ జీవితం
నా మదిలో గుట్టుగా దాచిపెట్టిన గుప్పెడు ఊహలు స్వేచ్ఛగా గువ్వల్లా ఎగరాలనిఉవ్విళ్లూరుతున్నాయి.. ఓ క్షణం కళ్ళు మూసుకుంటే రెప్పల మాటున రోజు గడిచినట్టుంది.. గోడకున్న కుందేలు గడియారం చెవులు పట్టుకు ఎంత లాగినా ఒక్క ఘడియా కదలదే! ఒక్కో సూర్యోదయం కోసం ఎన్నెన్ని అహోరాత్రాలు వేచి చూశానో కదా! అలా కొన్ని యుగాల నిరీక్షణ అనంతరం నా తపస్సు ఫలించి నా కళ్ళ ముందు నువ్వు అవతరించావు.. [...]
ఓకవిత రాయాలని వుంది నీ ఒడిలో తలపెట్టి మెరిసే ఆ కన్నులు పూయించే వెన్నెలను ఆస్వాదిస్తూ.. పెదాలపై విరిసిన అరనవ్వును మీటుతూ.. కెంపులయిన చెంపలపై గారాలు పోతూ గాలికెగురుతున్న ముంగురులను చూస్తూ... ఓ కవిత రాయాలనుంది నిశ్శబ్ధ రాగంలో .. మనసు కోయిల పాడే పాటను నీ మృదు మధుర పదాలలో వినాలనీ.. గుండె గొంతుక దాటి రాని మాటలన్నీ నీ మౌనంలోనే వింటూ.. ఈ గుప్పెడు గుండెకు ప్రాణం పోసే ఆగుండె [...]
ప్రతీక్షణం నువ్వు నన్ను చూస్తూ ఉండక పోవచ్చు ...? ప్రతీ నిమిషం నువ్వు నాతో మాట్లాడకపోవచ్చు ...? కానీ...! నీ ప్రతీ ఆలోచనలో నేనుంటానని... నీ గుండె చేసే ప్రతీ స్పందనలో, నా పేరువినపడుతుందని... నువ్వు తీసుకునే ప్రతీ శ్వాసలో, నీ ఊపిరి నేనే అని నాకు తెలుసు...!! అందుకే అందరాని దూరంలో నువ్వున్నా...! అందకుండా పోతావనే ఆలోచన నాకు రాదు....!! ఎందుకంటే ...!! అందమైన మన ప్రేమ పందిరిలో, నన్ను అల్లుకుపోయిన [...]
నీ ఇంటి దీపం నేనన్నావు ... నా హ్రుదయాన్ని మంటలతో ముంచెసావు... నీ ఊపిరి నేనన్నావు ... నా మనసుని దోచి ఒంటరిగ గెంటేశావు .. నీ గుండె లయ నేనన్నావు.. నడి సముద్రంలో నావాలా ఒదిలేశావు... నీ కంటి చూపు నేనన్నావు.. నన్ను ఎదురు చూపులకు బలి చేశావు......!!!
నేనే లేని లోకం నాది . . , నాకే తెలియని కలలే నావి . . . ! నా ప్రాణం నువ్వైపోయేవేళ . , నన్ను పిలిచే పిలుపు నీదే . . , నేను తలచే పలుకు నీదే . . . ! నన్ను నేనే మరిచే వేళ . , చూసే ప్రతీ చోట నువ్వే . . , నడిచే ప్రతీ బాటా నీ జ్ఞాపకమే . . . ! నువ్వు లేని ఈ ఒంటరి వేళ . .
వెన్నెలై చేరనా నీ కలువ కన్నులలో.., మొగ్గనై పూయనా..., నీ పెదవంచు చిరునవ్వులో.., ప్రేమపుష్పమై విరియనా నీ హృదయపు తావిలో..., తోడునై నడవనా నువు వేసే ప్రతి అడుగులో.., నన్ను నేనే మరచిపోనా నీ తలపులు నను తాకే నిమిషములో...!!!
ప్రియా! నీ చిలిపి అల్లరుల కొంటెతనం నా తనువంతా చేసెను గడసరి మారాం నిత్యం నే కోరుకుంటున్నా నీ అనురాగం నీవు తోడుంటే కొత్తగా ఉంది ఈ ప్రపంచం ప్రతి ఉదయం నామది ముంగిట వికసించే నీ ప్రేమ కుసుమం నీ నీడలో నా బ్రతుకంతా అయింది బృందావనం ఈ జీవితం ఇక అనుకున్నా నీ కోసం మనసా,వాఛా చేసా ఎపుడో నీకే అంకితం....!
మాట్లాడటమే సరిగా రాని నేను ప్రతి క్షణం నీతో మాట్లాడటానికే వేచి చూసేదాన్ని.. ఎవరిని పట్టించుకోని నా కళ్ళు నీ దర్శనం కోసం ఎప్పుడూ ప్రతిక్షణం వెతుకుతుండేవి.. నువ్వు లేనప్పుడు నాది ఒంటరి ప్రపంచం నువ్వు వచ్చాక నేను మరిచాను అ ప్రపంచం.. నీవు పరిచయం కానప్పుడు నేనెవ్వరో అన్న ఫీలింగ్ నువ్వు వచ్చాక నాలో ఎక్కడో చెప్పలేని దైర్యం.. ఇంతకు ముందు నాకోసం నేను.. నువ్వు వచ్చాక నీకోసం [...]
చెలీ! ఏమని వర్ణించను నీ సొగసులను సెలయేటి అలలులా నీ నల్లని కురులు ఆ కురులలో అలల మాటున నురగలులా సన్నజాజుల ఘుమఘుమలు కలువపూలను మైమరపించే నీ కాటుక కనులు పున్నమి చంద్రుని పోలే నీ నుదుట తిలకం నీ ఎర్రని అధరాలు చిందించే తీయని మకరందం సూర్యకాంతిలా ప్రతిబింబించే నీ ముఖ సౌందర్యం పడుచుదనం పరువాలను పైటచాటున దాచుకుని గడుసుదనం కలగలిపి కొంటేగా నను చూస్తుంటే నిలువగలరా ఎవరైనా [...]
మేని పులకించిపోతుంది నీ చూపుల కిరణాలు సుతిమెత్తగా యదను మీటుతుంటే.., మది మురిసిపోతుంది నవ్వుల రత్నాలు నాపై చల్లేస్తుంటే.., ప్రాణం గాలిలో తేలుతుంది నీ ఊహా చిత్రానికి ప్రాణంపోస్తుంటే.., భావం తడబడుతోంది శిలలాంటి నా మదిలో శిల్పంలా నువు మారుతుంటే.., ఏమని చెప్పను ఈ భావాన్ని ఎలా చూపను మనసులోని ప్రేమని..!!
తీరిక లేని ఎన్నో పనులు తెలుసా అవేంటో నీకోసం ఎదురుచూడాలి నిన్ను చూడాలి నీతో మాట్లాడాలి నీ పలుకు వినాలి నీతో నవ్వాలి నిన్ను నవ్వించాలి నీతో కలిసి నడవాలి ఇలా అన్నీ .. ఇన్ని తీరికలేని పనులమద్య సూర్యుడు ఎప్పుడొచ్చివెలుతున్నాడో కూడా తెలీడంలేదు నేస్తం .. !!!!
చెలీ! నీ జ్ణాపకాలలో ఉంటున్నా ప్రతిక్షణం కనిపిస్తున్నావు నీవు క్రొత్తగా అనుదినం సంధ్యాసమయన పచ్చికపై నీకై నా ఎదురుచూపు వీచే గాలి నీ చెలీ రాదా అని తుంటరి పలకరింపు నా చుట్టూ అల్లుకున్న నీ తీపిగుర్తులు నీవైపు లాగుతున్నాయి నడిరాతిరిలో నీ ఆలోచనలు వెన్నెలను పంచుతున్నాయి మనసు చాటున మునుపెన్నడూ లేని కోరికలు నీతో చెప్పలేక అవుతున్నా తనమునకలు నా కనులు చూసి అయినా [...]
ఈ ప్రపంచంలోకెల్లా ఘోరమైన శిక్ష ఏంటో చెప్పనా మనం ఇష్టపడ్డ వ్యక్తి మనకి దూరం కావటమే , అందులోనూ ప్రేమించిన అమ్మాయి ... నువ్వంటే నాకు ఇష్టం లేదు , నన్ను మర్చిపో అన్నప్పుడు మాటలు రాక నిలబడతాడు ... అప్పుడు , ఆ నిమిషం మనసులో కలిగే బాధుందే అది చావుకన్నా దారుణమైంది ... అలాంటి శిక్ష నువ్వు నాకు వేసావ్ .... ఈ లోకంలో ప్రేమకన్నా సంతోషాన్నిచ్చేది ఏదీ లేదు అలాగే బాధనిచ్చేదీ ఏదీ లేదు ... ఒక [...]
ప్రియా!నీ పరిచయంతో మనసంతా మధుమాసం నీ స్నేహంతో జగమంతా క్రొత్తదనం ప్రతినిమిషం నీ తీయని మాటలు నా చుట్టూ మదిలో నీ ఆలోచనలే కలవరపెడుతున్నవి ఒట్టు నీ జ్ణాపకాలు నిదురపోనియ్యకున్నవి నీవైపే నా పాదాలు పరుగులుపెడుతున్నవి నా ఆశలు నీ జతకై ఎదురుచూస్తున్నవి చిలిపి ఊహలు నీ దరి....చేరుకోమంటున్నవి!
నీ నువ్వు తెలుసు..........నీ మనసు తెలుసు నీ చూపు తెలుసు.....నీ మాట తెలుసు నీ నవ్వు తెలుసు......నీ మౌనం తెలుసు నీ అలోచన తెలుసు..నీ ఆవేశం తెలుసు నీ ఇష్టం తెలుసు.....నీ కష్టం తెలుసు... నీ గురించి ఇన్ని తెలిసిన నాకు, నీలో నేనున్నానో లేదో...నాకింకా తెలియదు.. నీవంటే నాకున్నది ప్రేమో,ఆరాధనో,ఇష్టమో,కోరికో.. నాకు తెలియక నీన్ను అడుగుదామని వస్తే! ఏమిటీ ఎదో అడగాలనుకుంటున్నావ్? అన్న ప్రశ్న నీ నుండి.. [...]
ప్రేమంటే నువ్వే అని తెలిసిందినీతో గడిపిన క్షణాలలో..,స్వర్గమంటే తెలియదు కానీఅది పంచే హాయిని చూశాను నీ చెలిమిలో...,దూరమైనా దగ్గరగా ఉన్నాను ప్రేమ నిండిన నీ హృదయంలో..,నరకానికి అర్థం తెలియదు కానీఅందులో ఉండే బాధను చూశాను నీ ఎడబాటులో...,కలలు కనడం తెలిసినా గానీఅందులోని కమ్మదనాన్ని చూశాను నీ సాన్నిహిత్యంలో..,పదములు ఎన్నో వ్రాశానుగానీఅవి కవితలా మారడం చూశానునీ తలపు తాకిన [...]
స్వచ్ఛమైన మనసుతో చేరువయ్యావు.., నీ గుండె గూటిలో నన్నే కొలువుంచావు.., నా గుండెలో యద చప్పుడు నువ్వు.., నిజమైన ప్రేమకు అర్థం నువ్వు.., ప్రతి నిమిషం నాతో ఉన్నాననిపిస్తావు., మరుజన్మలో కూడా మరువలేని ప్రేమనందించావు.., ప్రతి ప్రేమకవితకు ప్రాణం పోస్తున్నావు.., నా ప్రాణం నువ్వైపోయావు..
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు