కవిలోని భావుకత్వాన్ని. గళం లోని మాధుర్యాన్ని , ప్రవర్తనలోని సున్నితత్వాన్ని  మాటలో చురుకుదనాన్ని, కల్మషంలేని నవ్వులని  నడకలో ఠీవిని, స్వార్ధంలేని ప్రేమలని  స్నేహ గుణంలో ఉన్న స్వచ్చతని  ఏ మాత్రం సంకోచం లేకుండా ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది వ్యక్తులని కాదు గుణాలని ప్రేమించాలనిపిస్తుందిఅందుకనేమో .. మనకి ఇష్టమైన జాబితాలో ఎంతోమంది చేర్చ బడుతూనే ఉంటారు. అలా నా ఇష్ట [...]
నమ్మకమీయరా స్వామీ  నిర్భయమీయరా స్వామీ సన్మార్గమేదో చూపరా స్వామీ .. సుజ్ఞాన సూర్యున్ని మాలో.. వెలిగించరా చెడుకు ఎదురు పోరాడే  మంచినెపుడు కాపాడే  పిడుగుదేహమీయరా.. ప్రభూ.. ప్రేమతో పాటు పౌరుషం పంతము తేజమూ  రాచ గుణమూ ప్రభూ .. వినయం విలువలనీయరా  నమ్మకమీయరా స్వామీ లోన నిజం గుర్తించే  పైన భ్రమను గమనించే సూక్ష్మ నేత్రమీయరా.. స్వామీ .. సర్వమందించు నీ ప్రియ [...]
పదునారు కళల చంద్రుడు తన వెన్నెల కుంచెతో రాత్రిని చిత్రించాలని యుగాల తరబడి జాగారం చేస్తూనేవున్నాడు. వాక్య గుచ్ఛం ముడివిప్పితేవిడివడిన అనేక పదాల్లోనిండిన భావ పరిమళమేనేను అనబడే నా కవిత్వం  లోపం లేని చిత్రం చింత లేని జీవనంపరిపూర్ణమని భావించే జీవితంఅవి అసత్య ప్రమాణాలేకేవలం కవుల కల్పనలేజీవితమంటేనే......అనివార్యమైన ఘర్షణ మనిషి చెట్టుకి [...]
కథలో ఇంతకు ముందు ఏం జరిగిందో  మీ ఊహకే వదిలేస్తూ .. ********************** అతనక్కడ  అలా ఆగిపోయాడు, ఆమె ముందుకు ప్రవహిస్తూ ఒకసారి వెనుతిరిగి చూడాలనుకునే బలీయమైన కోర్కె ని బలవంతంగా అణిచి వేసుకుంది . అతననుకున్నాడిలా .. " అనుభవంలోనూ  అనుభూతిలోనూ  జీవితం ఉంది, సంక్లిష్టతలని అర్ధం చేసుకుంటూ జీవించడంలోనూ ఉంది. కుముదకి జీవించడం అనే విద్య బాగా తెలుసు " అని. అతను యింటికి వెళ్ళాక భార్య యెలా [...]
ఈ విశాల ప్రపంచంలో స్వేచ్ఛగా యెగిరే పక్షినవ్వాలనో, ఓ స్వచ్చమైన  సరస్సులో క్షణం కూడా ఖాళీ లేకుండా అల్లనల్లగా యీదులాడే వో చేపనవ్వాలని, పచ్చని తోటలో రంగుల సీతాకోక చిలకనవ్వాలని అలా పుట్టి వుంటే బాగుండేది కదా అని తలంపులు  యెన్నో యెన్నెన్నో లోలోపల. ఇవన్నీ కాకున్నా  ప్రవరుడిలా  దివ్య లేపనం  పూసుకుని హిమాలయాల్లోనూ , అందమైన కాశ్మీరంలోనూ తిరిగి వచ్చే లేపనం అయినా  పొంది [...]
1) కథ వ్రాసిన (వ్రాయబడిన అంటే గతంలో  చాలా ఏళ్ళ క్రితం జరిగిన విషయాలని జ్ఞాపకానికి తెచ్చుకుని వ్రాసిన  ) కాలాన్ని,ఆ నాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయాలని దృష్టిలో ఉంచుకుని కథని చదవడానికి పూనుకోవాలి.  2) కథల్లో నవరసాలలో దేనికో ఒక దానికి ప్రాధాన్యత ఉంటుంది. రచయిత కోణంలోనే పరకాయ ప్రవేశం చేసి  అర్ధం చేసుకోమని ఎవరూ చెప్పరు. పాఠకులు  తమ అభిరుచి మేరకే  తమకున్న  అవగాహన మేరకే కథని [...]
ఫోటో ఆల్బం చూస్తున్న వసంత ఒక్కసారిగా త్రుల్లిపడింది. ఆరెంజ్ పింక్ కలనేత బెనారస్ పట్టు చీర మోచేతి  దాకా తొడిగిన జాకెట్ తో అలంకరించినది అరువు నగలతో అయినా సహజమైన అందంతో పెళ్ళి కూతురిగా మెరిసిపోతూన్న హేమ ఫోటోని అబ్బురంగా చేతితో తడుముతూ యెంత బాగుంది యీమె అనుకుంది. దుర్మార్గుడు చేతిలో పడి పద్దేనినిమిదో యేటనే  అఘాయిత్యం చేసుకుందీ పిల్ల. పువ్వులా వుండే పిల్ల జీవితం [...]
అమ్మా ! మౌనస్వరాలని  మోస్తున్న నీ కంఠం విషాద సంగీతాన్ని వెదజల్లుతున్నట్లు వుంది మనసుకి ఇనుపతెరలు వేసుకోకు కనీసం ఓ మాట మాటాడి శాపమైనా ఈయరాదా ఉప్పుమూటలా నువ్వు నన్ను మోస్తున్నప్పుడు గజారోహణ చేస్తున్నట్లు సంబరపడిపోయిందీ నాన్న కోపానికో తిరస్కరణకో  గురైనప్పుడు పడిపోయి లతలా నిన్నల్లుకుని యెదిగిందీ ఉక్కుకవచంగా నీ మమత ధరించి ఊహలకి రెక్కలు తొడిగి యెగిరింది నేనే [...]
అప్పటి దాకా గోడల మధ్య బిగింపబడిన మనసుకి చల్లగా తాకిన స్పర్శ నూటమూడు జ్వర పీడనలో అమ్మ కొంగు వీవెనై పలకరించినట్లు  నీలాకాశంలో తెల్లగా మెరుస్తున్న కృష్ణపక్ష యేకాదశి నాటి నెలవొంక పక్షుల కిచ కిచలు కోడికూతలు కోయిల కుహు కుహు రాగాలు  ప్రకృతికి నేపధ్య సంగీతంలా ..  ఇంతలోనే భవనాల మధ్యనుండి వడిగా వాడిగా నడిచొస్తున్నసూర్యుడు .. పద పద మంటూ నిత్య జీవితపు [...]
బ్లాగ్ మిత్రులకు ఆహ్వానం  పుస్తకావిష్కరణ ఆహ్వానం"కుల వృక్షం"  ద్వితీయ కథా సంపుటి ఆవిష్కరణ.వేదిక: మధుమాలక్ష్మి ఛాంబర్ హాల్  (ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి) మొగల్రాజపురం, విజయవాడ. తేదీ : 08/04/2018 ఆదివారం సాయంత్రం. 05:30కిఅధ్యక్షత: డా. ఈమని శివనాగిరెడ్డి. సి ఈ వో సి సి వి ఏఆవిష్కరణ: శ్రీమతి పి. సత్యవతి ప్రముఖ రచయిత్రిపరిచయం: చందు తులసి -యువ కథా రచయితకథలపై విశ్లేషణ : [...]
మన సహ బ్లాగర్, కవయిత్రి  శ్రీమతి మంజు యనమదల (కబుర్లు కాకరకాయలు బ్లాగ్ ) "రాయికి నోరొస్తే " కథా సంపుటిని సమీక్షించి నన్ను ఆశ్చర్య పరిచారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమీక్ష "గోదావరి "  తెలుగు దినపత్రికలో ఈ సమీక్షని చూడవచ్చు.  ************** వనజ వనమాలి బ్లాగర్ గా అందరికి సుపరిచితులైన తాతినేని వనజ కథల సంకలం "రాయికి నోరొస్తే"లో కథలను చదువుతుంటే ఆ పేరెందుకు పెట్టారో అర్ధం [...]
అన్న కట్టిన కొత్తింటి చుట్టూ తిరిగి చూసి చాలా బాగుందిల్లు. అదివరకంటే విశాలంగా ఉంది .గాలి వెలుతురూ ధారాళంగా వస్తుంది,పైగా బోలెడన్ని మొక్కలు పెంచుకోవచ్చని సంతోషిస్తూ పడమటి వైపు గోడకి అవతల వాస్తుదోషం వుందని  విడగొట్టబడిన స్థలంలో బాగా పెరిగిన వేప టేకు చెట్లు,వేప చెట్టు చూసి  పోనీలే వాస్తు పిచ్చిలో పడి  మొక్కలకి జాగా అయినా  మిగిల్చారు అనుకున్నా.  ఎంతైనా తండ్రి [...]
రెప్పల తడి కథపై  వాయుగండ్ల శశి .. వ్రాసిన సమీక్ష ఇక్కడ .  ఈ రోజు సాక్షి ఫండే లో వచ్చిన వనజ తాతినేని గారి కథ. ఒకే వాక్యం లో చెప్పాలంటే సత్యవతికి కుక్క చనిపోయినప్పుడు వచ్చినంత ఏడుపు మొగుడు చనిపోయినప్పుడు ఎందుకు రాదు?కుక్క సారీ బుజ్జోడు చనిపోయినప్పుడు ఏదో లోపలిది ఏదోవదిలి వెళ్లినట్లు అయి వర్షంగా కుమిలి కుమిలి కురిసిన దుఃఖం ఒక్క చుక్కగాకూడా భర్త శవం పక్కన [...]
 భూమిక రజతోత్సవ సంచిక  మార్చి మాస పత్రికలో ..నేను వ్రాసిన  "నూతిలో గొంతుకలు " కథ. పత్రికలో కథని చదవండి ప్లీజ్ ! ఆడాళ్ళకి చెప్పుకోలేని కష్టం వచ్చినప్పుడల్లా ఇదిగో ఇట్టాంటి నూతులే సీతమ్మని భూదేవి  తల్లి తనలోకి పొదువుకున్నట్టు చల్లగా అక్కునజేర్చుకుంటుంది.  వినిపించుకునే మనసుండాలే కానీ వేల వేల నూతుల్లో నాలాంటి స్త్రీల లోగొంతుకలు వినబడుతూనే ఉంటాయి. నీ కలం [...]
ఈ రోజు సాక్షి Funday లో ఈ వారం కథ గా ప్రచురితమైన కథ "రెప్పల తడి" చదవండి ..   సత్యవతికి అర్ధరాత్రి లోనే  మెలుకువ వచ్చింది. శతాయుస్షులో సగం  దాటబోతున్నా  ఆమె   కాలాన్నిసద్వినియోగంగా  అరగదీయడం  ఇప్పటికీ నేర్చుకోలేకపోయానని బాధపడుతుంది   ఒళ్ళు అరగదీసి, ఇల్లు అరగదీసి, పాత్రలరగదీసి ఇంకా  పుస్తకాలని,  ఛానల్స్ ని  కీ బోర్డ్ ని  కూడా అరగదీసి చివరికి  మంచాన్ని [...]
కథకి ముందు త్వరలో ప్రచురితం కానున్న ఆ  కథని గూర్చి ..నా అంతరంగం .. ఓ కథ వ్రాస్తూ  ఇంతగా కన్నీరు పెట్టడం ఇదే మొదటిసారి. నా చేత కన్నీరు పెట్టించిన కథలో  పాత్రలకి లేని గొప్పదనాన్ని అపాదిద్దామనే ఆలోచన కూడా లేదు నాకు. తారసపడిన కొన్ని పాత్రలు రచయిత వ్యకీకరణకి కూడా అందనంత గొప్పవి  కూడా అయి వుండొచ్చని నేనూ వొప్పుకుంటాను. ఈ మధ్య ఒక సీనియర్ రచయిత అన్నారు "ఎవరి అనుభవాన్ని వారు [...]
వాస్తు పిచ్చితో మూలబడ్డ ఓ ఇంటి స్థలం ప్రక్కనుండి  వేలాది మందిలా  రోజూ నేను నడుచుకుంటూనే వెళతాను. ఖచ్చితంగా స్థలం యెదురుగానూ యెడమప్రక్కనూ కలుపుతూ  బ్లైండ్ మలుపు, వేగాలని నియత్రించడానికి ఓ స్పీడ్ బ్రేకర్.  నా హడావిడి జీవితంలో ఓ రోజూ ఆ రోజు చిన్నగా అనిపించే పెద్ద విచిత్రమే సంభవించింది. రోడ్డెంట నడుస్తూనే కనుకొసలనుంచి ప్రక్కకి చూస్తున్నప్పుడూ  ఓ పసుపు పచ్చని [...]
అందమైన హృదయం ఉన్న వారికి అన్నీ అందంగానే కనబడతాయని నానుడి.అలాగే అందంగా కనబడని వాటిని నిర్విద్దంగా తిరస్కరిస్తారని కూడా అంటూంటారు. "అతనెంత అందంగా ఉంటాడు" అని స్త్రీలు  బహిరంగంగా ప్రకటించడం కూడా నిషిద్దం కొన్ని కుటుంబాలలో అయితే  చూపులతో ఉరి వేసేస్తారు మరి. ఈ మధ్య నా ఫ్రెండ్ ఇలా అంది " వాడు అందంగా ఉండేవారికి వలవేస్తాడు ఆ అందాన్ని అడ్డంగా వాడి పారేసిన తర్వాత త్రోసి [...]
ఉదయాన్ని వెలిగిస్తూ..... నా ఇంటికొక కొత్త అతిధి వేంచేసింది తనని పసి పాపని చేతిలోకి తీసుకున్నట్లు రెండు వ్రేళ్ళ మధ్య మృదువుగా జొనుపుకుని తలనొంచి కనురెప్పలతో అల్లనల్లగా ఓ ముద్దిచ్చాను మరింత సన్న నవ్వుతో చిలిపిగా కన్నుకొట్టింది లోని అసహనాలని తృటిలో మాయం చేసింది హృదయమంతా శాంతి నింపింది ప్రాణ శక్తినంతా పోసి పెంచిన తల్లి తలపై కిరీటంలా మెరుస్తూనే అల్లరిగా [...]
కుముద చాలా విసుగ్గా చెప్పింది "ఊహలలో ఉన్నవన్నీ చేయాలనుకుంటే ఏ మనిషికి సాధ్యం కాదు ఊహించుకుంటే ఆనందం కల్గుతుందేమో కానీ దాన్ని అనుభవంలోకి తీసుకురావాలనుకుంటేనే కష్టంగా ఉంటుంది. అసలిలాంటి టాపిక్  మళ్ళీ రావడమే నాకు ఎలర్జీ గా ఉంది. ఫోన్ పెట్టేయండి" “మనసున్న మనిషితో మాట్లాడుకుంటే వొత్తిడి చికాకులు తగ్గుతాయని కాల్ చేస్తున్నాను,  పదిసార్లు చేసినా నువ్వు లిఫ్ట్ [...]
కృష్ణా తీరంలో త్వరలో విడుదల కానున్న నా రెండో కథా సంపుటి " కుల వృక్షం " టైటిల్ పేజీ
ఆడవాళ్ళ నోట్లో ఆవగింజ నానదు అనేది ఒట్టి అబద్దం. అందరి నోట్లోనూ నానదు.  వజ్ర కఠోరమైన సంస్కారముంటే యే గింజైనా నానుతుందని నా నమ్మకం.  విచారమేమిటంటే ..స్నేహాల ముసుగులో ఆత్మీయుల ముసుగులో నడిపే సంభాషణలు కూడా రక్షణ లేనివే ! సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండి మాటలు చేరవేయడమే కాదు ధ్వని ముద్రీకరించి, దృశ్యాలతో సహా చిత్రీకరించి ఇంకొకరికి చేరవేయడం వినోదం అయిపోయింది. కొందరి [...]
ఈ వేళ మనసేమీ బాగోలేదు.. త్వరత్వరగా రోజుని ముందుకు జరిపేయ్.. అయ్యో ! అప్పుడే ..ఇంత సమయం గడిచిపోయిందా..కాస్త నెమ్మదిగా వెళ్ళకూడదా ! కాస్త కాలాన్ని డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటే బాగుండును,దాచుకుని వాడుకోవచ్చు అనుకునే నాలాంటి అమాయక మానవమాతృలకి .. చిన్నదైన చిన్నమెదడు చెప్పిన విధం ఇట్టిది .. కావున ఒక్క క్షణమాగి చదివి తరించండని విన్నపాలు. పరుగులే పరుగులు .. కాలం నీ [...]
భార్య అయిన పాపానికి బిడ్డలైన పాపానికి ఒక మగవాడి లైంగిక,వికృత,ద్రోహ,నేర,మోస ప్రవృత్తులకి భార్య,పిల్లలు తలదించుకోవలసి రావడం, లేదా  "అయ్యో ,పాపం " అన్న ఇతరుల జాలి,సానుభూతిని భరించాల్సి రావడం నిజంగా విషాదకరం. లోకానికి కనబడకుండా దాక్కోవడం మరింత నరకం. ఇటీవల కాలంలో కొందరు రచయితల దిగజారుడు తనానికి ఆ రచయితలే పూర్తిగా భాధ్యులు అయినప్పటికీ సంబంధం ఉన్నా లేకపోయినా భార్యా [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు