కౌముదిలో ప్రచురింపబడుతున్న "గాలిసంకెళ్ళు"  ఇక్కడ..  'కౌముది'కి ధన్యవాదాలతో..
గొంతుక్కూర్చుని మౌంజి పేనుతున్న నరసింహం దృష్టి అదాటున వీధి వైపు మళ్ళింది. అనంతప్ప సకుటుంబంగా కోరడి వెలుపల చెమటలోడుకుంటూ నిలబడి ఉన్నాడు. నరసింహం చాటంత మొహం చేసుకుని "బావా.." అని సంతోషంగా కేక వేసాడు.  వెనగ్గా నిలబడ్డ వసంతలక్ష్మి అన్నగారి వైపు చూస్తూ పలకరింపుగా నవ్వుతోంది. ఆ పక్కనే ఉన్న చిన్నారిపై నరసింహం చూపు ఒక్క క్షణం తారట్లాడింది. పీట మీద నుండి గభాలున
కౌముదిలో ప్రచురింపబడుతున్న "గాలిసంకెళ్ళు" పద్నాలుగో భాగం ఇక్కడ.. 
నేలపై పారాడుతూ వెతుకుతోంది ఇళై. ప్రాతస్సంధ్యావందనం పూర్తి చేసుకుని, దేవతార్చన మందిరానికి అటుగా వెళ్తున్న కులశేఖరుడు కుమార్తెని చూసి ఆగాడు. దీక్షగా మూలమూలలా వెతుకుతోందా అమ్మాయి. "ఏం వెతుకుతున్నావమ్మా?" "ఉహూ.." "నాకు చెప్పు.. నేనూ వెతుకుతాను." తానూ మోకాళ్ళమీద కూర్చుని పచ్చలు తాపడం చేసిన నేలపై ప్రతిఫలిస్తున్న ఆ చిన్నారి మోముని చూసి మురుసుకుంటూ [...]
చిరచిరలాడించే చుఱుకుటెండ. గుండిగలతో సేవకులు మోసుకొస్తున్న చల్లని నీళ్ళు ఎన్నైనా చాలడం లేదు.. ప్రాసాదం చుట్టూ వేలాడదీయబడిన వట్టివేళ్ళ చాపలపై ఇలా చల్లితే అలా ఆవిరైపోతున్నాయి. లోపలి గదులలో వట్టివేళ్ళ సువాసనలు, కవాటాలకి ఆవల వార ఏపుగా పెరిగిన మరువపు గుబాళింపులూ కలగలిసి గాలిలో తేలివస్తున్నాయి.  రత్నపీఠం పై కూర్చున్నాడతను. ముత్యాల బాహుపురులు, రత్నకంకణాలతో [...]
"కూ...... తుక్ తుక్ త్వైను..." సిరి కేరింతలు నా ఆలోచనలని చెదరగొట్టాయి. లక్కరంగు ట్రైన్ బొమ్మని నేలమీద పాకిస్తూ దాని వెంట తనూ గుండ్రంగా పాకుతోంది. ఆ తేనెరంగు మొహంలో ఉబికివచ్చే సంతోషం నా మనసులోకి ప్రశాంతంగా పంపిణీ అయ్యేది ఎప్పుడూ. వారంలో ఎంతమార్పు! "పరమేశ్వర్ గారు.." ఫోన్ తెచ్చి నా చేతికిస్తూ చెప్పింది
నెలనెలా కౌముదిలో ప్రచురించబడుతున్న "గాలిసంకెళ్ళు" తొమ్మిదవ భాగం ఇక్కడ
'ఎంత ఎద్దైనా గిద్దెడు పాలైనా ఇవ్వకపోతుందా?' అన్నంత ఆశపడ్డాను.. దాని పేరు విని. కథ కొసాకూ మానికెల కొద్దీ సుద్దులు మాత్రం గరిపి పంపింది. దాని ప్రవరేమైనా ఆషామాషీ అనుకున్నారా.. తాండ్ర వారింట పుట్టి, చెలికాని వారింట కొన్నాళ్ళు పెరిగి, ఉప్పలపాటి వారింట పెద్దై.. కాకర్లపూడి వారి మన్ననలందుకుంది. "చెవులు రిక్కించుకుని, తోక నిగిడించి, బోర విరుచుకుని నడుస్తూంటే.. చూసి తీరాలోయీ.. [...]
"ఇంతుదయాన్నే లేచావేంటే! ఏ ఊరు పండిందో!" పింజె పెట్టిన చీర నీళ్ళలో ముంచి జాడిస్తున్నదల్లా తలెత్తి అడిగింది అమ్మ. మాట్లాడకుండా సందులో మూలనున్న రోలు మీద కూర్చుని బ్రష్ నోట్లోకి తోసాను. "మాయదారి అలవాట్లు! లేవే రోలు మీంచీ.. ఎన్ని సార్లు చెప్పాలి నీకు? పాతికేళ్ళొచ్చినా పెళ్ళవ్వట్లేదందుకే!" అమ్మ విదిలించిన నీళ్ళు మొహం మీద పడి చచ్చేంత చిరాకొచ్చింది. గయ్ మని ఒంటికాలిమీద [...]
"కోట ఎదురుగా ఉదయం తొమ్మిదింటికి కలుస్తాం. నువ్వేమో బస్సో, రైలో దిగి బయటికి వచ్చి అటువైపు వచ్చే ఆటో ఎక్కుతావ్.""ఊ..""కూరలమ్మే వాళ్ళ హడావిడి, వేసవి చిరచిర...""లాల్చీ చివర్లతో మొహం తుడుచుకుంటూ నేను.." నవ్వాడు."లాల్చీ? నువ్వు టీషర్ట్ వేసుకుంటావనుకున్నాను.""యంగ్ గా కనిపించాలనా? ఓకే ఓకే..""లాల్చీ బావుంటుందన్నానని కూరల మార్కెట్టుక్కూడానా..""నేను మీ ఊరొస్తున్నది కూరల [...]
అలివిని బలివి కొడితే బలివిని బ్రహ్మదేవుడు కొట్టాట్ట! "నా ఉదయపు కాఫీ కప్పునీ, అర్ధరాత్రి ముసుగేసుక్కూర్చుని చూసే కామెడీ సినిమానీ తప్ప దేన్నీ నేను సీరియస్ గా తీసుకోనండీ!" అని జోకాననుకుని ఎవరితోనో ఇలా ప్రగల్భాలు పోయానో లేదో, అలా ఠపీమని మొట్టికాయ తిన్నాను. అది నాకు కపాల మోక్షాన్నిచ్చినంత పనిచేసిన విధంబెట్టిదనినా.. మా ఇంటి పంచపట్టున గోడకి వేలాడే సన్మానపత్రం చాలా [...]
కౌముదిలో..  నేను రాస్తున్న "గాలిసంకెళ్ళు" ప్రచురితమవుతోంది. Happy New Year!
చిన్నమ్మా, వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ ఓపిక లేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ ధైర్యంలేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళమధ్య డైనమేట్ పేలాలి డైనమోలు తిరగాలి పేలాయి డైనమేట్లు.. చాలా సార్లు! "సమాజం" ఎంత పెద్దపదమో! బరువుగా.. దినపత్రికల్లోనో, కవితల్లోనో, ఉపన్యాసాల్లోనో మాత్రమే ఇమిడే పదం. అక్కడ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు