"జనాలకి బుద్ధి లేదు, వారు వొట్టి గొర్రెలు, ఒక్కరికి కూడా సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యత లేదు, అందరూ స్వార్థ పరులే. లేకుంటే, ఇన్ని వేల కోట్ల అవినీతి కళ్ళ ముందు కనపడుతున్నా మల్లీ అతనికే వోట్లు వేస్తారా. అంటే వీరికి కొన్ని ముష్టి పథకాలు, పించన్లు పడేస్తే చాలా, ఇక ఆ నాయకుడు ఏం చేసినా వీరికి పట్టదా, ఇలా ఐతే ఈ దేశం ఏమై పోవాలి" ఇవీ గత రెండు రోజులుగా ఏ ఇద్దరు మిత్రులు కలిసినా వారి [...]