శ్రీరామనవమికి అమ్మ చేసే ఈ వడపప్పు మాకు చాలా ఇష్టంగా ఉండేది. ఇది మామూలుగా కూడా సాయంత్రాలు సలాడ్ లాగ చేసుకుని తినచ్చు.. ఎలాగంటే.. * అరకప్పు మామిడి కోరు * ముప్పావు కప్పు కొబ్బరి కోరు * కప్పు నానబెట్టిన పెసరపప్పు * తగినంత ఉప్పు, కారం లేదా చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు * అరచెంచా నూనెలో అరచెంచా ఆవాలు, చిటికెడు ఇంగువ ఇంగువ వేసిన పోపు. పైన చెప్పినవన్నీ ఒక గిన్నెలో బాగా [...]
winter melon, ash gourd లేదా white gourd అని పిలవబడే బూడిదగుమ్మడి కాయతో మనం ఎక్కువగా ఒడియాలు పెట్టుకుంటాం కదా. దానితో కూర, పప్పు, హల్వా, సూప్ మొదలైనవి కూడా చేసుకోవచ్చు. ఎన్నో ఔషధగుణాలున్న ఈ బూడిదగుమ్మడి కాయను ఈ విధంగా రకరకాల వంటల్లో వాడతారని నాకు బొంబాయిలో ఉన్నప్పుడు తెలిసింది. అక్కడ మార్కెట్లో కూరలతో పాటూ బూడిదగుమ్మడికాయలు, కట్ చేసిన ముక్కలు బాగా అమ్మేవారు. నేను మినప్పిండి కలిపి అట్టు
మ్యాగీ మంచిది కాదు, వద్దు... అని వింటున్నా అప్పుడప్పుడు నెలకొకసారి తినేలా ఒక పేకెట్ కొనేదాన్ని మా పాప కోసం. వెజ్ ఆటా నూడుల్స్, ఓట్స్ నూడుల్స్ అంటూ ఏ రకం కొన్నా అవన్నీ కూడా మంచివి కాదనే ఆర్టికల్ ఒకటి చదివాకా, రెండేళ్ళుగా మ్యాగీ అనేది పూర్తిగా కొనడం మానేసి ప్లైన్(ఎగ్ లెస్)  నూడుల్స్ కొని పాపకు చేసి పెడుతున్నాను. మ్యాగీ కన్నా బెటర్ అయినా అది కూడా నెలకు ఓ రెండు సార్లు [...]
నిన్న రాత్రి మొదటిసారి చేసిన ఈ ప్రయోగానికి ఏం పేరు పేట్టాలో అని ఆలోచిస్తే.. 'జొన్న మొలకల ఉప్మా' అనచ్చేమో అనిపించింది. జొన్నలని(Jowar) ఒకపూటంతా(6,7hrs) నానబెట్టి, నీళ్ళు తీసేసి, రాత్రికి పల్చటి కాటన్ బట్టలో మూట కట్టచ్చు.. లేదా బాగా డ్రైగా చేసేసి ఏదైనా గిన్నె/బాక్స్ లో వేసి మూత పెడితే పొద్దుటికి మొలకలు వచ్చేస్తాయి. పెసలైనా, బొబ్బర్లైనా మొలకెత్తించడానికి ఇదే పధ్ధతి. ఒకవేళ [...]
బజార్లో ఇప్పుడు రకరకాల కంపెనీల వారు 1+1ఆఫర్లతో రకరకాల సూప్స్ అమ్ముతున్నారు. చలి కాలం భోజనం తయారయ్యేలోపూ లేదా సాయంత్రాలు వెచ్చవెచ్చగా సూప్ తాగితే బావుంటుంది. కానీ బజార్లో దొరికేవాటిలో ప్రిజర్వేటివ్స్ వాడతారు. అవి ఎక్కువగా తినడం మంచిది కాదు. సో, ఇంట్లో మనం స్వయంగా చేసుకున్న సూప్ అయితే అన్నివిధాలా ఆరోగ్యకరం. క్రింద రాసిన పధ్దతిలో టమాటా ఇంకా కార్న్, స్వీట్ కార్న్, [...]
"మొత్తుకూర..?" ఇదేం పేరని నవ్వుకోకండి. దొండకాయల్ని మొత్తి చేసే కూర కాబట్టి మేం దీనిని మొత్తుకూర అంటాం. ఈజీగా, త్వరగా అయిపోయే కూర ఇది.  ఎలా చెయ్యాలంటే: * ముందర దొండకాయల్ని కడిగి రెండువైపులా కొసలు కట్ చేసేసుకోవాలి. (లేతవైతే చేతితో గిల్లేసినా చాలు. ఒకోసారి అదీ చెయ్యను నేను :)) * పచ్చిమిర్చి, అల్లం తొక్కే రాయి/కల్వం తీసుకుని ఎవరిమీద కోపం ఉందో వాళ్లని తల్చుకుంటూ దొండకాయల్ని [...]
వంకాయ-కొత్తిమీరకారం చక్కగా నవనవలాడే లేత వంకాయలు మార్కెట్లో దొరికినప్పుడు నాకు గబుక్కున తట్టేది ఒకటే కూర "వంకాయ-కొత్తిమీరకారం". గుత్తి వంకాయలైనా, మామూలు వంకాయలైనా ఫ్రెషా కాదా అనేది వాటి ముచికను బట్టి తేల్చచ్చు. ఫ్రెష్ అయితే ముచిక ఆకుపచ్చగా ఉంటుంది. లేకపోతే కాస్త వాడినట్లు ఉండి రంగు మారిపోయి అసలు ఆకుపచ్చగానే ఉండవు. ఇప్పుడు కొత్తిమీర కారం గురించి చెప్పుకుందాం. [...]
మా బుజ్జెమ్మ కోరికపై మొదటిసారి చాక్లేట్ కేక్ చేసాను.. ఇప్పుడే అయ్యింది. వేడివేడిగా తింటే బాగుంది..:) ఓవెన్ లేకుండా చేసిన ప్రయోగం. ఎక్స్పరిమెంట్ చేసా కాబట్టి డేకరేట్ చెయ్యడానికి చెర్రీస్, క్రీం చెయ్యడానికి ఫ్రెష్ బటర్ రెడీగా లేవు. సో, ఈసారి మళ్ళీ చేసి డెకరేషన్ తో పాటూ రెసిపీ చెప్తాను :-) 
శ్రావణమాసంతో పాటూ శెనగలు రావడం కూడా మొదలైపోయింది.. మరి వాటిని ఎలా చెల్లుబాటు చేస్కోవాలో ఆలోచించాలి కదా!  శెనగలతో ఏమేమి చేయచ్చు అంటే.. * ముందు వాటిని మూటకట్టి మొలకలు తెప్పించాలి. అప్పుడు వాడుకుంటే ఆరోగ్యకరం. * మొలకెత్తిన పచ్చి శెనగలు ఓ గుప్పెడుదాకా తినగలం :) * ఉడకబెట్టుకుని ఉప్పు,కారం వేసుకుని ఇంకాసిని తినచ్చు. * ఇంకా వంకాయ, క్యేబేజీ మొదలైన కరల్లో, ఉప్మాల్లో కాసిని [...]
మా చిన్నప్పుడు ఎక్కువగా తిన్న ఈవినింగ్ స్నాక్ ఇది. ఈజీగా అయిపోతుందనేమో అమ్మ చేస్తూండేది. మహారాష్ట్రలో "కాందా పోహా" అని బ్రేక్ఫాస్ట్ గా ఇది ఎక్కువగా తింటూంటారు. అక్కడ హోటల్స్ లో కూడా ఇది ఒక ఐటెమ్ గా దొరుకుతుంది. మేం బొంబాయిలో ఉండగా మావారి ఆఫీసులో శనివారాలు బ్రేక్ఫస్ట్, లంచ్ పెట్టేవారు స్టాఫ్ కి . అప్పుడు రెగులర్ గా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ "కాందా పోహా" ఉండేది వాళ్ళకి. [...]
శరీరాన్ని చల్లబరిచే గుణమే కాక అరుగుదలకూ, ఎసిడిటీకీ కూడా మంచి మందైన పుదీనా అకులను ఏదో విధంగా భోజనంలో include చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. పుదీనా రైస్, పుదీనా పచ్చడి, పుదీనా నిలవ పచ్చడి, పుదీనా కారం, పుదీనా రైతా మొదలైనవి నేను చేస్తుంటాను. ఇవాళ చాలా సులువుగా చేసుకునే పుదీనా కారం గురించి చెప్తాను.కావాల్సినవి:రెండు కట్టలు పుదీనా రెండు, మూడు పచ్చిమెరపకాయలుతగినంత [...]
టూ మినిట్స్ మ్యాగీ కన్నా సులువు ఈ పచ్చడి చెయ్యడం. కరెంట్ లేదు.. మిక్సీ లేకుండా పచ్చడి ఎలా చెయ్యడం అన్న దిగులు ఉండదు. మిక్సీలో తిప్పాల్సిన అవసరం లేని ఈజీ అండ్ సింపుల్ పచ్చడి ఇది!ఎలాగంటే:* ముందు ఓ చిన్న చెంచా నూనెలో ఆవాలు,మినపప్పు,జీలకర్ర,ఇంగువ పోపు పెట్టుకోవాలి. పోపు వేగాకా కట్టేసే ముందు అర చెంచా కారం వేసి బాగాకలిపి స్టౌ ఆపేయాలి. (కారం ఇష్టం లేకపోతే ఒక పచ్చిమిరపకాయ, [...]
బెండకాయలు మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పై ఫొటోలో లాగ మధ్యకు చీరి, సన్నగా పొడుగ్గా ఉండేలా తరిగి కూర చేస్తే తినడానికీ, చూడటానికీ కూడా వెరైటీగా ఉంటుంది :)  శనగపప్పు కారం ఎలా చెయ్యాలో క్రింద రెసిపీలో రాసాను. అక్కడ ఓసారి చూసి వచ్చేయండి..:) http://ruchi-thetemptation.blogspot.in/2012/06/blog-post_04.html * ఈ శనగపప్పు కారం బీరకాయ, దొండకాయ, వంకాయ, కాకరకాయ మొదలైన కూరల్లో
ఇదివరకూ మొక్కజొన్న వడలు, పొంగడాలు విడివిడిగా రెసిపీలు రాసాను . ఈసారి మొక్కజొన్నలతో పొంగడాలు చేయడం ఎలానో చెప్తానేం..! మా నాన్నగారు హార్ట్ పేషంట్. ఆయిల్ బాగా తక్కువ వాడాలి కాబట్టి సాయంత్రం స్నాక్స్ క్రింద మా అమ్మ ఇలా రకరకాల పొంగడాలు వేస్తూంటూంది. మొక్కజొన్నలతోనే కాక బొబ్బర్లు, సోయా బీన్ గింజలు, మొలకెత్తిన పెసలు మొదలైనవాటితో రోజుకో రకం పొంగడాలు చేస్తుంది అమ్మ. [...]
ఊరగాయలు తినడమే మానేసామని ఈసారి అసలు ఆవకాయలూ అవీ వద్దనుకుంటూనే మొత్తానికి అనుకోకుండా పెట్టేసాను. ఏదో పని మీద బజారుకి వెళ్ళి అక్కడ ముక్కలు కొడుతుంటే చూసి ఉత్సాహం వచ్చేసి, గబగబా ఓ నాలుగు కాయల్ కొనేసి, ముక్కలు  కొట్టించేసి, పక్కనే వలిచిన వెల్లుల్లి అమ్ముతుంటే అవి కూడా కొనేసి, ఇంటికొచ్చేద్దారిలో పప్పు నూనె కూడా కొని,  ఇంటికొచ్చాకా రాత్రి పదకొండున్నరకి కూచుని ఆవకాయ [...]
చాలా రోజుల్నుంచీ నాకు తెలిసినవి, నేను పాటించేవి కొన్ని 'వంటింటి చిట్కాలు' రాయాలని.. ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి.. కానీ కొత్తగా వంట మొదలుపెట్టే వారికి, తెలియనివారికి ఉపయోగపడతాయని రాస్తున్నాను. 1) ఆకు కూరలు ఫ్రిజ్ లో పెట్టేప్పుడు వేళ్ళు కట్ చేసేసి, న్యూస్ పేపర్లో గానీ, వేరే ఏదైన కాగితంలో గానీ చుట్టి కవర్లో పెడితే ఎక్కువ రోజులు ఉంటాయి. పేపర్ని రోల్ చేసినట్లు కుట్టాలి. [...]
1.రెగులర్ దోసావకాయ: పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్ లో అన్ని సీజన్స్ లో ఎక్కువగా కనబడే ఇంస్టంట్ ఆవకాయ..దోసావకాయ! అప్పటికప్పుడు అతిథులు వస్తున్నారంటే గబగబా వంట చేసేస్తాం కదా.. అలాంటప్పుడు చటుక్కున ఫ్రెష్ ఆవకాయ పెట్టడానికి మామిడికాయలు దొరకని సీజన్ లో అయితే మిగతావాటికన్నా దోసావకాయ అయితే చాలా బావుంటుంది. ఓ గంట, రెండు గంటల్లో రెడీ అయిపోతుంది! చేయడం కూడా ఈజీనే..  * ఒక అరకేజీ [...]
వడపప్పు రెసిపీ ఏమిటి అనుకుంటున్నారా? ఇది అమ్మ మా చిన్నప్పటి నుండీ శ్రీరామనవమి కి చేసే స్పెషల్ వడపప్పు. పానకం, ఈ వడపప్పు పెద్ద గిన్నెతో చెస్తే అటొచ్చి ఇటొచ్చీ తినేసి సాయంత్రం అవ్వకుండానే నేనూ ,తమ్ముడూ రెండు గిన్నెలూ ఖాళీ చేసేసేవాళ్లం. అందులోనూ మా ఇంట్లో బెల్లం ఉండేది కాదు పంచదార పానకమే :) ఇంతకీ ఈ వడపప్పులో స్పెషల్ ఏంటంటే 'మామిడికోరు'!  ఎలా చెయ్యాలంటే.. ఒక టీ గ్లాస్ [...]
వీకెండ్స్ లో గానీ, కాస్త తీరుబడిగా ఉన్నప్పుడు గానీ హెవీ టిఫెన్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా.. సాంబార్ ఇడ్లీ బదులు సాంబార్ గారె చేస్తే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఏమంటారు?  గారెలు వేసే మినప్పిండిలో కాస్త అల్లం,పచ్చిమిరపకాయలు కలిపితే మసాలా గారెలు అయిపోతాయి కదా! * ఎంత క్వాంటిటీకి అంటే 250gms మినపప్పుకి పది పన్నెండు పచ్చిమిరపకాయలు, రెండంగుళాల అల్లం సరిపోతుంది. * అందులో తోటకూర [...]
"అంతా mango మయం... మార్చంతా mango మయం..." అని పాడుకునేదాన్ని ఒకప్పుడు.. కొన్నేళ్ల పాటు! పచ్చి మామిడికాయలు మార్కెట్లో కనబడ్డం ఆలస్యం.. మా అత్తగారు అలా కొంటూనే ఉండేవారు సీజన్ అయ్యేదాకా. సీజన్ లో పచ్చిమామిడి కాయలు వస్తూంటే మా అమ్మ ఆవబద్దలు, మెంతి బద్దలు మాత్రం వేసేది. నేనేమో పచ్చి మామిడి జ్యూస్ , చుండో  చేసేదాన్ని. ఇంకా పచ్చిమామిడి పులుసు మా అన్నయ్య బాగా చెస్తాడు. నే [...]
ఇదివరకూ పచ్చి టమాటా తో మెంతి బద్దలు పెట్టుకోవడం రాసా కదా.. ఇప్పుడు పచ్చి టమాటా చట్నీ ఎలానో చూద్దాం! పండుటమాటాలు పచ్చడి చేసుకున్నట్లు సేమ్ ప్రొసీజర్ లో అన్నంలోకి పచ్చడి చేసుకోవచ్చు. (చింతపండు అక్కర్లేదు) అలా కాకుండా టిఫిన్స్ లోకి కాసిని పల్లీలు వేసి చట్నీ చేసుకుంటే చాలా బావుంటుంది. ఎలాగంటే.. * పావుకేజీ పచ్చి టమాటాలు కడిగి, ముక్కలు చేసి రెండు చిన్న చెంచాల నూనెలో [...]
'అడై' తమిళనాట బాగా ఫేమస్సు! ఊతప్పం లాగనే 'అడై' కూడా కాస్త మందంగా ఉంటుంది కానీ అడై పిండితో దోశ కూడా వేయచ్చు. మందంగా కాకుండా మామూలు దోశలా ఉండి. టేస్ట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కావాల్సినవి: మామూలు బియ్యం లేదా ఉప్పుడు బియ్యం: 11/2 cup మినపప్పు :1/2 cup (వెయ్యకపోయినా పర్లేదు. ఇది నా సొంత ఆప్షన్ :)) పెసరపప్పు: 1/2 cup శనగపప్పు: 1/2 cup కందిపప్పు: 1/2
Pasta in white Sauce without adding cream ఓసారి ఓ బఫే లంచ్ కి వెళ్లినప్పుడు అక్కడ 'లైవ్ పాస్తా కౌంటర్' లో 'ఫుల్ క్రీమ్ పాస్తా' టేస్ట్ చూసినప్పటినుండీ అది చెయ్యమని మా అమ్మాయి పేచీ! మ్యాగీ వాళ్ళదో ఎవరిదో రెడీమేడ్ క్రీమీ పాస్తా(టూ మినిట్స్ మ్యాగీ లాంటిది) కొన్నాం కానీ అది బాలేదుట. హోటల్లో చేసినట్లే కావాలని గొడవ. సరే మరి తప్పుతుందా? పాస్తా కొనుక్కొచ్చా. ఆ పాస్తా రకాల్లో నాకన్నింటి కన్నా
చాలా కాలం నాకు జీరా రైస్ పెద్దగా నచ్చేది కాదు. ఒట్టి అన్నంలో జీలకర్ర వేసుకుని ఏం తింటాం? అదేమన్నా బిరియానీనా? అని తేలిగ్గా తీసిపారేసేదాన్ని. కానీ జీలకర్ర ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకున్నాకా ఈ మధ్యన ఎక్కువగా వండుతున్నా.  జీలకర్రలో కొన్ని ముఖ్య గుణాలు: అరుగుదలకి మంచిది, అజీర్ణాన్ని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది, రక్తాన్ని శుధ్ధి చెయ్యగలదు, పాలిచ్చే తల్లులకి [...]
చిలకడ దుంపలో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి6; ఐరన్, మెగ్నీషియం మొదలైన మినరల్స్ ఉంటాయి. మిగతా దుంప కూరల్లో కన్నా వీటిల్లో పీచుపదార్థం ఎక్కువ. బరువు పెంచదు. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. ఎదిగే పిల్లలకు ఎముకలు, పళ్ళు బలంగా ఉండేందుకు ఇది సహాయపడుతుందిట. అందుకని వారంలో ఒకసారైనా ఈ దుంపలను ఆహారంలో చేర్చుకోగలిగితే [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు