క్రితం ఏడాదిలో అనుకుంటా మా అన్నయ్య Sacred Chants, Holy Chants సీరీస్ సీడీలు కొన్ని కొన్నాడు. ఫ్యూజన్ మ్యూజిక్ పధ్దతిలో చేసిన కొన్ని స్తోత్రాలూ, అష్టకాలు ఇందులో ఉన్నాయి. వినడానికి చాలా బావుండి, మనసులో అలజడిగా ఉన్నప్పుడు ప్రశాంతత నింపే విధంగా ఉన్నాయి సీడీలు. అన్నయ్య కొన్న చాలా రోజులకి ఈమధ్యనే అవి కాపీ చేసుకుని తెచ్చుకున్నా నేను. వాకింగ్ కి వెళ్ళినప్పుడు, వంటింట్లో పని [...]
image from - google సంగీత కళాశిఖామణి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి సంగీత నివాళి.._/\_ సంగీత విద్వాంసులు ఉన్నారు..ఇంకా పుడతారు...  కానీ ఇటువంటి మహా విద్వాంసులు ఇక పుట్టబోరేమో...:( ఈ అద్భుతమైన కచేరీ వినిపిస్తూ, నేను వింటూ ఆనందించడం మినహా ఏమీ చెయ్యగలను... చాలా అల్పురాలిని! యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో డా.పప్పు వేణుగోపాలరావు గారితో శ్రీ కృష్ణమూర్తి గారి సంభాషణ... చివరలో
మధుర గాయకుడు హరిహరన్ స్వయంగా స్వరపరిచిన "Horizon(1988)" అనే గజల్స్ ఆల్బం ఉండేది మా ఇంట్లో. హరిహరన్ వాయిస్ మొదటిసారి విన్నది అందులోనే నేను. ఆ ఆల్బమ్ లో మొత్తం ఎనిమిది గజల్స్ ఉంటాయి. అన్ని బాణీలూ హరిహరన్ వే .అన్నీ కూడా చాలా చాలా బావుంటాయి. గజల్స్ మధ్యన వచ్చే సంతూర్ వాదన వింటుంటే మనసు ఎటో గాల్లో తేలిపోతూ ఉంటుంది. అంత బాగా స్వరపరిచారు హరిహరన్. ఆ కేసెట్లో మొదటి గజల్ "ఆజ్ భీ హై మెరే [...]
ఇందాకా నెట్ లో వార్తలు చదువుతుంటే.. అమితాబ్ చెప్పిన వాక్యాలు విని లతాజీ కళ్ళల్లో నీళ్ళు తిరుగాయని, ఆవిడ ట్వీట్ చేసారన్న వార్త కనబడింది. (http://zeenews.india.com/entertainment/celebrity/when-amitabh-bachchan-made-lata-mangeshkar-cry_1500535.html) ఆ వాక్యాలు ఒక ప్రముఖ గజల్ లోనివి. వెంఠనే గజల్ రారాజు మెహదీ హసన్ పాడిన "मोहब्बत करनेवाले कम ना होंगे" అనే ఆ అద్భుతమైన గజల్ వెతుక్కుని విని ఆనందించాను
image from google 1990 లో ఉత్తమ హిందీ చిత్రం జాతీయ  పురస్కారాన్ని అందుకున్న చిత్రం "దృష్టి". గోవింద్ నిహలానీ దర్శకత్వంలో శేఖర్ కపూర్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలు చేసారు. ఈ చిత్రానికి ప్రముఖ హిందుస్తానీ గాయని కిశోరీ ఆమోంకర్(Kishori Amonkar/किशोरी आमोणकर) సంగీతాన్ని చేసారు. నాలుగు పాటలూ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతబాణీలే. పాటలు కూడా ఆమే పాడారు. ఒకటి మాత్రం డ్యూయెట్ ఉంది. అది కూడా
ఫోటో కర్టసీ: గూగుల్ పదిహేనవ శతాబ్దానికి చెందిన సంత్ సూరదాసు(सूरदास) ప్రసిధ్ధి చెందిన కవి, వాగ్గేయకారుడు, కృష్ణభక్తుడు. పుట్టుకతో అంధుడైన సూరదాసుకి పేదరికం మూలానో ఏమో తల్లిదండ్రుల లాలన అందక ఆరేళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టేసి వ్రజ్ లో స్థిరపడిపోయాడు. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మథురానగరి సమీపంలోని ప్రాంతం ఇది. సుధ్ధాద్వైత గురువు వల్లభాచార్యులు అతడిని [...]
భారతీయ తంత్రీవాయిద్యాలైన వీణ, సితార, సంతూర్ మొదలైనవాటికి తోడుగా పాశ్చాత్య వాయిద్యాలైన వయొలిన్, గిటార్, మేండొలిన్ మొదలైన వాయిద్యాలను కూడా శాస్త్రీయ సంగీత వాదనకు జతపరిచారు మన భారతీయ సంగీతకారులు. విచిత్ర వీణ, సరస్వతి వీణ, రుద్ర వీణ మొదలైన రకరకాల వీణలను శాస్త్రీయ సంగీతకారులు ఉపయోగిస్తారు. పాశ్చాత్య వాయిద్యమైన హవాయీన్ గిటార్ ను కొద్దిగా మార్చి "మోహన వీణ" అనే పేరుతో [...]
నాకెంతో ప్రియమైన హిందుస్తానీ గాయకులు శ్రీ పండిట్ జస్రాజ్ గారు... సంగీతఙ్ఞుడిగానే గాక వ్యక్తిగా కూడా ఇష్టుడు నాకీయన. సాదాసీదాగా, చలాకీగా ఉంటారెప్పుడూ. ఎనభై ఏళ్ళ పైబడినా ఇంకా ఎంతో ఎనర్జిటిక్ గా చెక్కుచెదరని చిరునవ్వుతో కనబడుతూ ఉంటారు.  పూర్వజన్మ పుణ్యాన ఇలా భారతావనిపై జన్మించి వారి ఖాతాలో ఉన్న సంగీతామృతాన్ని మనలపై చల్లేసి మాయమైపోయారు మన దేశంలో ఎందరో సంగీత [...]
అర్జెంట్ గా ఊరు వెళ్ళాల్సిన పని వచ్చింది.. అందుకని ఈ టపాతో ఈ సిరీస్ ఎండ్ చేసేస్తున్నాను.. నా లిస్ట్ లో మిగిలినవన్నీ కలిపి ఒకే టపాలో ఇరింకించేస్తున్నాను. ఖాళీగా ఉన్నప్పుడు చూడండి :) ***   ***    *** ఇవాళ మొదట బొంబాయి సినిమాలో నాకెంతో ఇష్టమైన + నా ఫేవొరేట్ సింగర్ పాడిన పాట..  Uyire  Uyire.. Minsara Kanavu తమిళంలో "Minsara Kanavu", తెలుగులో "మెరుపు కలలు",
మిన్నలె, చెలి, రెహ్నా హై తేరే దిల్ మే.. పేర్లతో మూడు భాషల్లోనూ వచ్చిన ఈ సినిమా పాటలు మూడూ భాషల్లోనూ సూపర్ డూపర్ గా హిట్ అయిపోయాయి. సాహిత్యం, భాషల కన్నా సంగీతానికే ఇక్కడ మార్కులు పడ్డాయి. ప్రతి గల్లీలో, ట్రైన్లో, టివీల్లో, రేడియోలో అన్నిచోట్లా రిలీజైన కొన్నాళ్ళ పాటు ఈ పాటలే. సంగీత దర్శకుడిగా "హేరిస్ జైరాజ్" మొదటి సినిమా అనుకుంటా ఇది. ఈ తమిళ్ సాంగ్స్ కేసెట్ పెట్టుకుంటే [...]
పదే పదే కొన్ని పాటల్ని కేవలం సంగీతం కోసమే వినాలనిపిస్తుంది. ఈ సిరీస్ మొత్తం ఆ మ్యూజికల్ ఇంట్రస్ట్ వల్లే. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన అద్భుతమైన ట్యూన్స్ లో కొన్ని బాలచందర్ చిత్రం "డ్యూయెట్" లోని పాటలు. సినిమా ఓ మాదిరిగా ఉంటుంది. కేవలం పాటల కోసం భరించాలంతే. అసలు సినిమా వచ్చిన కొత్తల్లో ఆ తమిళ్ పాటలు ఎన్నిసార్లు విన్నామో లెఖ్ఖలేదు. నాకు ఆ తెలుగు డబ్బింగ్ పాటలు నచ్చక తమిళ్ [...]
"ఉల్లాసం" అని ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వచ్చింది. అజిత్, విక్రమ్, మహేశ్వరి.. ఇంకా రఘువరన్, బాలు కూడా ముఖ్యపాత్రల్లో నటించారు. "ఉల్లాసం" పేరుతోనే తెలుగులోకి డబ్బింగ్ చేసారు. అందులో రెండు మూడు పాటలు బావుంటాయి. కార్తీక్ రాజా నే సంగీతం. అన్నింటిలోకీ "Veesum Kaatrukku " అని ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాటొకటి నచ్చేది నాకు. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ కూడా బావుంటుంది. ఈ పాట విన్నప్పుడల్లా నాకు [...]
'లలలాల లాలాల... లాలాలలాలాలా..' అనే హమ్మింగ్ అలా చెవుల్లో అప్పుడప్పుడూ నాకు వినబడుతూ ఉంటుంది..భలే బావుంటుంది. ఇది " Intha Siru Pennai  .. " అనే పాటలోది. ప్రభుదేవా , మీనా నటించిన Naam Iruvar Namakku Iruvar అనే చిత్రం లోనిది. ఇంతకన్నా ఎక్కువ వివరాలు ఈ సిన్మా గురించి తెలియవు.  కార్తీక్ రాజా సంగీతం. హరిహరన్, విభాశర్మ పాడారీ పాట. ఈ పాట క్రింద లింక్ లో వినచ్చు:  http://7starmusiq.com/
వినీత్, సోనాలి కులకర్ణీ జంటగా "May Madham" పేరుతో వచ్చిన ఈ సినిమాని తెలుగులో 'హృదయాంజలి' పేరుతో డబ్బింగ్ చేసారు. తర్వాత అక్షయ్ ఖన్నా,సోనాలి బేంద్రే లతో హిందీలో రీమేక్ చేసారు. నాకు అసలు సినిమాలోని తమిళ్ సాంగ్స్ బాగా నచ్చుతాయి. వైరముత్తు సాహిత్యాన్ని అందించిన ఈ పాటలకు రెహ్మాన్ సంగీతాన్నందించారు. ఇందులో పాటలన్నీ బోలెడన్నిసార్లు రిపీటవుతూ ఉండేవి ఛానల్స్ లో.  అన్నింటికన్నా [...]
"కరుత్తమ్మ" అనే చిత్రంలో దాదాపు అన్ని పాటలూ బాగుండేవి. సినిమా కూడా టివీలో వచ్చినప్పుడు చూసిన గుర్తు. కాస్త భారమైన సినిమా అయినా బావుంటుంది. భారతీరాజా సినిమా. ఇది "వనిత" పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసారని గుర్తు. రెహ్మాన్ సంగీతం. 'Porale Ponnuthayi' పాట తెలుగులో "పూదోట పూసిందంట" అని ఉండేది. ఇది sad version కూడా ఉంది కానీ నేను హేపీ వర్షన్ నే వినిపిస్తాను:) మిగతావాటి తెలుగు వర్షన్స్ [...]
ఇవాళ ఒకే సినిమాలోవి రెండు పాటలు.. తెలుగులో 'ఆశ ఆశ ఆశ' పేరుతో డబ్బింగ్ చేసిన ఈ తమిళ్ మూవీ పేరు "ఆశై". అజిత్ హీరో. అప్పట్లో అజిత్ సినిమాలన్నీ చూసేసేవాళ్లం.. మరి బావుంటాడు కదా :) ఈ సిన్మాలో వీరోవిన్ బావుంటుంది కానీ పేరు గుర్తులేదు.  సరే పాటల్లోకొచ్చేస్తే "మీనమ్మా..." అనే పాట, "pulveli pulveli.." అనే పాట రెండూ చాలా బాగుంటాయి. ఇంకోటి అజిత్ ది సోలో సాంగ్ ఒకటి ఉంది .అది కూడా బావుంటుందని గుర్తు.
    భాష తెలీదు.. ఒక్క ముక్క అర్థం కాదు కానీ ఆ రాగం.. ఆ పదాలు.. ఎందుకో మనసుకు ఎనలేని ఆనందాన్ని ఇస్తాయి. రికార్డ్ అయిన కేసెట్స్ వచ్చాకా ఈ పాటను మళ్ళీ మళ్ళీ వెనక్కి తిప్పుకుని వినేదాన్ని..!  ఇళయరాజా ఏం చేసినా మహాప్రసాదం. పాడినా అంతే. ఆయన గళం నచ్చనివారూ ఉన్నారు. కానీ నాకు ఆయన పాడిన పాటలన్నీ కూడా ఇష్టమే. "కుర్ర కళ్ళు చీర గళ్ళలో దారే లేక తిరుగుతున్నవి.. ముంచే మైకమో మురిపించే [...]
సన్ టివిలో "Pepsi Ungal choice" ప్రతీ వారం చూసిన రోజుల్లో 'ఉమ' అనే అమ్మాయి హోస్ట్ చేసేదా కార్యక్రమాన్ని. బోలెడుమంది ఫాన్స్ ఉండేవారా అమ్మాయికి. ముద్దుగా బావుండేది ఆ అమ్మాయి కూడా. అందులో నచ్చిన పాటలన్నీ లిస్ట్ రాసుకుని, పేర్లు గుర్తుండకపోతే నటీనటుల పేర్లు రాసిపెట్టి, అప్పట్లో మద్రాసులో చదువుకుంటున్న మా కజిన్కి ఆ లిస్ట్ పంపించి ఆ పాటలన్నీ రికార్డ్ చేయించుకున్నాను. వాటిల్లో [...]
ఒకప్పుడు రికార్డ్ చేయించుకుని మరీ చాలా ఎక్కువగా విన్న తమిళ్ సాంగ్స్ లో ఒకటి.. "మలరే మౌనమా.."!! విద్యాసాగర్ అందించిన అతి మంచి పాటల్లో ఒకటి. బాలూ, జానకీ స్వరాలు ఈ పాటకి ప్రాణం అనడమే సబబు.  ఈ పాట గురించిన కొన్ని వివరాలు.. ఒక తమిళపాటల వీరాభిమాని మాటలు క్రింద లింక్ లో చదవచ్చు... http://bharadhibimbham.blogspot.in/2006/05/malare-mounama-duet-of-this-decade-i.html మనసుకు హాయి కమ్మేసేలాంటి ఈ
తెలుగువాళ్ళు గర్వించదగ్గ గొప్ప కళాకారుడు.. ఇంతకన్నా ఏమీ చెప్పలేకపోతున్నా..:(
  పొద్దున్నే ఈ పాట గుర్తుకు వచ్చిందెందుకో ..:) రేడియోలో చిన్నప్పుడు బాగా వినేవాళ్ళం...! వేటూరి రచన చాలా బాగుంటుంది.. చిత్రం: దారి తప్పిన మనిషి  సంగీతం.. విజయ భాస్కర్ అని allbestsongs.comలో ఉంది.. (http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=8017) యూట్యూబ్ లింక్:
ఒకే చిత్రంలో సాహిత్యంలో కాసిని మార్పులతో రెండు పాటలు, ఒకే ట్యూన్ లో , రెండు సిట్యుయేషన్స్ లో చాలా చిత్రాల్లో పెడుతూంటారు. వాటిని "టేండమ్ సాంగ్స్" అంటారు. సాధారణంగా ఇలాంటివి ఒక హ్యాపీ, ఒక పేథోస్ ఉంటుంటాయి. అలాంటి టేండమ్ హ్యాపీ సాంగ్స్ సాధారణంగా మేల్, ఫీమేల్ వర్షన్స్ కొన్ని సినిమాల్లో ఉంటుంటాయి. "కభీ కభీ"లో రెండు వర్షన్స్ ముఖేష్ పాడినవే. నిన్న 'కభీ కభీ' లో పాట పోస్ట్ [...]
कल और आयेंगे नग्मों की खिलती कलियाँ चुननेवाले मुझ से बेहतर कहनेवाले तुम से बेहतर सुननेवाले कल कोई मुझको याद करे क्यों कोई मुझको याद करे मसरूफ ज़माना मेरे लिए क्यों वक्त अपना बरबाद करे పొద్దున్నే పదే పదే ఈ ప్వాక్యాలు గుర్తొస్తే పాట పెట్టుకుని విన్నా...कल कोई मुझको याद करे.. क्यों कोई मुझको याद करे.. मसरूफ ज़माना मेरे लिए क्यों वक्त अपना बरबाद करे..:-) అద్భుతమైన కఠిన సత్యం కదా!! [...]
  ఈ మధ్యన Fmsలో ఎక్కువగా వస్తున్న "బారిష్...." అనే పాట చాలా బావుంది. చిత్రం పేరు 'YAARIYAN' ట. నాకు ట్యూన్, లిరిక్స్ రెండూ నచ్చాయి. పాట: బారిష్.. పాడినది: మొహమ్మద్ ఇర్ఫాన్, అడిషనల్ వోకల్: గజేంద్ర వర్మ సంగీతం: మిథున్ సాహిత్యం: మిధున్ female version link: singer: Tulsi kumar http://youtu.be/LnbqusICm88 link for yaariyan audio songs and downloads: http://
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు