నీలోని నిన్నునొదిలేసొచ్చేయ్మనిద్దరం ఓ ద్వీపమౌదాంశతాబ్దాల చరిత్ర మౌనంపై నడిచొచ్చేయ్ఓ విశ్వ శకలమవుదాంఅన్నింటినీ కత్తిరించేసుకుంటూ….స్పెర్మ్ తీకాలోని జీవకణంలా ఓ దిశకోశం నేనూవెల్వెట్ స్వప్నాలంచులపై నిల్చొని నువ్వూఒక్క కలైనా నిజం కాకపోతుందాని….ఓ ఉల్కపైనో, స్వాతిముత్యంపైనోమాటలుకట్టుకున్న నా సంతకం నిన్ను పలకరిస్తుందిగులిస్తాన్లో గుల్మొహర్లు దోపుకున్న [...]
1.నువ్వున్న ఆ క్షణంకాలంపై ఓ పచ్చబొట్టు2.ప్రపంచానిక్కట్టుకున్న వారధిపైనుంచిఅన్నీ ఒంపేసుకుని నన్ను నేను ఖాళీ చేసుకున్నాతరుముకొస్తున్ననీ నవ్వుని తురుముకోడానికైనా...3.నిద్రలో జోగుతున్న గడియారమేదోఉలిక్కిపడి గంటలుకొట్టినట్టునువ్వెప్పుడూ నాకో అద్భుతమే సుమాసముద్రంపై నడిచినట్టూగడ్డిపరకల కొసలపైనున్నమంచుబిందువులతో నీ బొమ్మగీస్తున్నట్టూ4.శరత్పూర్ణిమ [...]
రాత్రిపై నుంచి నడిచొచ్చానాగుప్పెడంత చీకటినీ తెచ్చుకోలేకపోయాను!కళ్ళకింద కలలన్నీ కన్నీళ్ళలోకదులుతూకథలుగా మారలేకపోయాయిఓ అక్షరంలో కూర్చుని మరొకదాంతో చెప్పుకుంటూ ఉంటానుప్రతీపదం ఓ కన్ఫెషన్ బాక్స్ మరి...దొర్లుకొస్తున్న ఖాళీ సీసాల్లా కొన్ని జ్ఞాపకాలుఖాళీలకి ఫ్రేముకట్టి మరీ మోస్తాయి..సమాధికాబడని జ్ఞాపకాలు కొన్ని!తడిసిన కాగితంలోని అలుక్కుపోయిన అక్షరాల్లాఈ [...]
నువ్వు ప్రేమించావన్న ఆ క్షణం మరీ బరువెక్కింది గర్వంతో!ఆ ముందు క్షణాలన్నీ కాలిబూడిదయ్యాయి.ఆ గతకాలపు కుప్పలోంచిఏ ఫినిక్స్ లేస్తుందో నీ ప్రేమని చూపిస్తూ!*"నేనున్నాను, నీవల్లే"అని అనుకోవడం మాములుగా జరగదునువ్వున్నా లేకున్నా ఇకప్రేమరాహిత్యం ఉండదు, జీవితాంతం!* *'నువ్వ’ నే అద్దంలో నా అహం కన్పడుతూనే ఉంటోంది, మండుతూనా మనసుకీ, నీ ప్రేమకీ మధ్యఈ బైరాగత్వం ఉంటూనే [...]
గుడికన్నా ముందే పలకరించేఆ డైభ్భై ఏడు మెట్లూ డైభ్భై ఏడు కథలుకష్టం వెనుకే సుఖమన్నది చెప్పడంకోసమన్నట్టు * ఒంపులుతిరిగుతూ ఊరించే ఆ మెట్లమీదేబాల్యం చిన్నపాదాలతో.... ఒక్కోమెట్టుని వెనక్కి నెడుతున్నాననే ఆనందంలోనూఅమ్మ చెయ్యి ఆసరాలోనూ కథలు అవసరం అన్పించవుగతాన్ని ఎక్కడో కలిపేసె ఆలోచనలో అమ్మవర్తమానాన్నివొదిలేసె ఖంగారులో నేనుకొన్న జ్ఞాపకాలు......* * ఓ మెట్టు చివర్న అప్పుడె [...]
నా అలసిన కనురెప్పలదిగువన దాక్కున్న కథలన్నీనీ గుసగుసల్లోంచి పుట్టినవే సుమా!ఒఠ్ఠు, ప్రేమసాచ్చి....ఎప్పుడు కురిసినా, ఎలా కురిసినాఓ తన్నమయత్వంతొ కురుస్తూంటూందిఏరికోరి,  మరీకొన్నింటిని బంధించబోతానానగ్నంగా పట్టుకున్నానేమోసిగ్గుతొ వేళ్లసందుల్లోంచి జారుకుంటయిఆ సిగ్గులోనూ నువ్వే కన్పడ్డావులే....భోరున కురిసినప్పుడల్లా, తెలియని విషయమేదోకుండలతో [...]
మా వోడొస్తాడా? -----------------సూరీడు సచ్చిపోనాడో, ఇయ్యాల మరిదాక్కుండీ పోనాడో మేగాలెనకాతలఏం సెప్పాడు కాదు వొర్సం గురించి"వొత్తాదిలేవే, రాకెక్కడికి పోతాదిఈ మడుసులకి బువ్విచ్చేది మనమే కదేమరి ఈ వొర్సానికి మనం కావాలిదానికీ మనం కావాలి యాడికి పోతాదిలే!"ఆడు సిన్నప్పట్నుంచి  అట్టాగేఆటికేసి సూత్తూనే ఉన్నాముంతలొలకబోసుకోలేదుమావ తిడతాడు,,,,అట్టా సెయ్యొద్దనిపొలానికీ నీళ్ళు [...]
౧ఆ కళ్ళు రెండూ--తియ్యని సంగతులన్నీ దాచుకున్నతేనెతుట్టల్లాచరిత్రపుటల్లో ఇమడలేనినగ్నసత్యాలేవో ఒంపటానికి సిధ్ధం౨రవీకౌముదుల జుగల్బందీ విన్యాసానికినీ జమిలినేత్రాలు వేదికయ్యాయనుకుంటానలుపు నచ్చిందీ అప్పుడెచీకటిని చుట్టుకున్నదీ అప్పుడేనాలోంచి నీలోకి మకాం మార్చిందీ అప్పుడె!౩కళ్ళంతా నన్నెప్పుడూ నింపుకుని ఉంటావేమొపరువాల పొంగుతో పోటీపడుతుంటాయిఅందుకే నిన్ను [...]
ఓ మరణం తర్వాత..... ధర్మజుడూ లేడు, యక్షప్రశ్నలూ లేవుఓ అగమ్యగోచరం...ఓ దిగులుఇవాళ్టి వర్షాన్ని నువు చూడలేదనోరేపటి సూర్యోదయం నిన్ను తాకదనో.....మరణాన్నీ ప్రేమించావేమోఅది నీ గుమ్మంలో నిలబడ్డాఅటు ఒత్తిగిలిపడుకోలేకపోయావుఉత్తచేతుల పంపలేకపోయావునీముఖంలోకి చూడలేక, నిన్ను కబళించలేకాకాలాన్ని వెంటతెచ్చుకుందటగాముఖం చాటేసిన మృత్యువుఈ మరణం తర్వాత--నువ్వూ ఓ నిరాకార [...]
మాటకు మరణంలేదుఏ వాక్యమూ నశించిపోదు.....నువ్వు మౌనివో, యోగివోనీ చుట్టూ నిశ్శబ్ద సమాధి కట్టుకుంటావుమరణానికెలాగూ భాషలేదు, ఇక జీవితమా కొన్ని గుర్తులసమ్మేళనమే అని చెప్తూనె ఉంటావు....నిశ్శబ్దంగా!తెల్లవాడివో, రంగద్దుకున్న అతివాదివోనువ్వంటించిన ఆ కూ క్లక్స్  క్లాన్ శిలువమండుతూనె ఉంది, తెల్లగా! ఏంచెప్పలేక సతమతమవుతూ!మనిషివో, మరమనిషిలా తయారయ్యావోకణాన్నీ, క్షణాన్నీ [...]
నువ్వెళ్ళిపోతావ్.... (ఓ మాయమైన ఆలోచనకోసం) నువ్వెళ్ళిపోతావ్......నా సంగీతాన్ని నాకొదిలిపాళీ చివర్న అక్షరం మురిగిపోతుందన్నాగొంతుమధ్యలో ఓ భావమేదో వెక్కిళ్ళలాఇరుక్కుందన్నా మాయమైతావు,ఏ తియాన్మెన్ స్క్వేర్‌లోనో, బోగన్ విలియాల్లోనొవెతుక్కోమంటూ!నిశ్శబ్దంలోపల  తవ్వుకుంటున్న సమాధిలోనొక్రికెట్ పక్షి చెట్టుకు కొట్టుకుంటూ పిల్చిన పిలుపులోనొనువ్వు [...]
అవును..ఏదీ రెండోసారి అనుభూతించలేనుఏరెండు అనుభవాలూ ఒకే గూడు కట్టుకోలేదుఏ రెండు జ్ఞాపకాలూ ఒకేగుడ్డన కుట్టలేకపోతున్నాడీ దర్జీఏ ఇద్దరీ మరణమూ ఒకటి కాలేదెప్పుటికీ!నిస్తేజ, నిరాసక్త తెల్లగోడలూఏవేవో కథలు చెప్తుంటాయి, కొత్తవిచూసిన ప్రతిసారీ...చిరిగిన ప్రతి క్యాలండర్ పేజీతిరగబడని ఓ చరిత్ర పాఠం....ఎప్పుడూ పాతగా అన్పించదేం?మనసుతో నడిచిన ఆ రాస్తాఎప్పుడూ కొత్తే!కాలికడ్డం [...]
నేనూ, నా సముద్రం ఎక్కడపుట్టిందో, ఎలా పుట్టిందో..... గుండెల్లోకి చేరుస్తుంటుంది ఓ నిశ్శబ్దాన్ని! ఏకచేరీలో చూడనివాయిద్యపరికరాలన్నింటినీ మోసుకొచ్చిందితనలోనే మోస్తూ, తనే వాయిస్తూ......పాటమొదల్లోని భీతావహ నిశ్శబ్దంకొన్ని క్షణాలే....కంటిబిగువున అదిమిపెట్టలేని దుఃఖంలాఫెళ్ళుమన్న గుండె పగిలి రోదించినట్టుఉవ్వెత్తున లేచిపడే నిలువెత్తు కెరటం!వేయి మృదంగాల ఘోషగా [...]
1.కురవకుండానే వెళ్ళిపోయిన మేఘంప్రేమలేఖ సగంలో విరిగిపోయిన పాళీ2.పరిష్వంగపు కలలో మెలకువవెన్నెల రాత్రిలో ఒంటరితనపు అలసట3.అమ్మతెచ్చిన ఆరేసిన బట్టల్లో ఆటజొన్నపొత్తులని కాల్చని నిప్పులపొయ్యి 4.ఊరొదిలి వెళ్ళిపోతున్న పక్కింటమ్మాయిఎవ్వరికీ కన్పడకుండా ఆమె ఊపిన చెయ్యి5. అమ్మతో గుడికెళ్ళి శఠగోపంకోసం మారాంవయసుడిగిన తాటిముంజల్లో వెతుకులాట6. జ్ఞాపకాల సహచర్యం ఓ [...]
వర్షం.....!!        నా బయోగ్రాఫర్!! వర్షం నా బలమైన బలహీనత! పృధ్వంటే వర్షానికున్న బలహీనతలా... నువ్వంటే నాకున్న ప్రేమలా. నేలని చేరే ప్రతీ చినుకు గోళం నా గుండెలపైనుంచే జారుతున్న భావన! స్వర్గం నుండి నన్ను పలకరించే కొరియర్ లా! ఎన్నెన్ని నిండుగోళాలని అలా నాలా వర్షిస్తూనే ఉన్నయ్ తమ ఆత్మకథని చెప్తున్నట్టు... వాటిలో వాటికి ఎంత తొందరని నిన్ను చేరాలనే నా [...]
కొన్ని అనుభూతులంతే        కలానికీ కలవరపాటేజ్వరంలా చుట్టుముట్టేసితుఫాను మేఘాల్లా కమ్మేసిపోతుంటాయికురవకుండానే!అప్పుడప్పుడుఆకాశాన్ని కోసుకుంటూ మీదపడినఆ నాలుగు వర్షపుచుక్కలూగుండెని తడిపి మరీ పలకరింపు!తడికోసం వెతికిన ఆ రెండు చేతులూ వెనక్కొస్తుంటాయి చిత్రంగా!లీలామహల్లో మార్నింగ్ షో,మట్టివాసన చినుకుల నేపథ్యంగాఓ  హాఫ్ చాయ్,యూనివర్శిటీ లైబ్ర్రరీ సాక్షిగా ఆకలి [...]
మీదేహం! పింగాణీ గుండెలకిగాజుపూల బొత్తాములతో....వెన్నెలని తొడుక్కున్న సూర్యుడిలాఆ మంటలు దాగిన గుండెలూమంచుముక్క ఆపధ్ధర్మపు కర్కశత్వంలా!మీ మార్మిక దేహం!తడారిన ఆడతనపు ఆక్రందనఓ సగం పైనా.......నిర్జీవకణాల మగసిరి సిగ్గెండిన నాభి దిగువగా.....!తెగించలేనిమౌనం, తెగువతగ్గినమానంరెండింటితోమొహంచాటేస్తూ మీరు....రాయిలా వక్షం, పరాయిలా మోహం....మనసుని [...]
అప్పుడప్పుడు నా అక్షరం మొరాయిస్తుందిమండకుండా---ప్రతీ అక్షరంలోనూ ఓ ప్రమిదకొన్ని గుడ్డిగా, కొన్ని దివ్వెగాకొన్ని అక్షరాలంతేసిరా చుక్కలుగానే మిగిలిపోతాయికన్నీరెండిన కళ్ళలా......ప్రతీ అక్షరం ఓ ప్రస్థానంరెండింటిమధ్య ఖాళీఓ ఇరుకు మజిలీ!ఒక్కోసారిఎక్కడో, ఏ కాగితంనుంచోజారిపోయినిరాశ్రయంగా నన్ను వెతుక్కుంటూఅతుక్కుంటూ....నా దగ్గిర ఓ కావ్యమౌతుంది.ఎన్నిపోరాటాలకి [...]
అమ్మపాల రంగుఅవసరం లేకపోయిందిఅవసరం....ఆకలయిందిఅమ్మకి ప్రేమయిందినీ ఉచ్ఛాసనిశ్వాసాల శృతిలయలుజోలపాడుతూనే ఉంటయ్అవసరం ప్రేమయిందినీకు మమతానురాగమైందిగోడక్కొట్టిన క్యాలండర్లానీ నడుముచుట్టూ నాచూపులునీతో ఈ జన్మాంతరాన్ని సాధించాలని! ప్రేమతో!పునరుక్తంటూ చీరకొంగుతోకొట్టినప్పుడల్లా మొహంచాటేసానునువ్వే కదాని!నా రెప్పలల్లార్చడం మర్చిపోయినప్పుడల్లాసిగ్గుపడ్తూనె [...]
ఎన్ని కన్నీటి స్నానాలనిఎన్నెన్ని రోదనలనిమనసుని దాటిన ఆవేదనా రాగాలుజైలు గోడలని తాకిన వేదనా సంఘర్షణలు!రాత్రికీ పగలుకీ తేడా కోసం వెతికినక్షణాలే అన్నీను నా సోలోలోకలల్ని కోసేసిన తృళ్ళిపాటువెంటాడే స్మృతుల గగుర్పాటుతోజతకల్సిన ఒంటరి రాత్రులు!ఎవరికెరుకని......!అనుభూతించిన గుండెకి తప్ప....ఎన్నో జ్నాపకాలు, మరెన్నో ముద్రలుఏడు చువ్వల్ని పట్టుకున్న చేతులుకన్నీళ్ళతో [...]
రెండు నగ్నాక్షరాల మాయరెండు మనసుల రసమయ క్రీడ!జీవితపు శృతిలయల చిత్తరువుభావలజడుల గ్రాఫిటీప్రేమనిండినమనసుగదిగోడలనిండాప్రేమామృతపు తేనియతుట్టలేకలలకీ రంగులద్దీమనసుకీ ఉనికినిచ్చిమనిషితనానికి ఉపిరులూదేప్రేమతనంఓ కొంటెతనం!మౌనానికీ అర్ధాన్నిచ్చీకళ్ళకీ భాషనిచ్చినప్రేమఓ మతంప్రేమమనసు సింగారానికిఓ కొలమానంవిధాత సృష్టినుంచి ఓ బహుమానం!ప్రేమ విస్ఫోటనా కాంతిమనసంతా [...]
ఆ రాత్రి ----- నా కంటి వెలుగునే తన నెల వంకని చేసుకుని తటిల్లతలా మెరిసి మాయమౌతూ నవ్వుల శశాంక చీకటి అంచులను మేస్తూ తెల్లగా మెరుస్తున్నఈ నైట్ వాచ్మన్.... వెన్నెల వెండి తెరలో నుంచి తొంగి చూస్తూ‎ మబ్బుల తివాచీపై ఇంద్రధనువులా తన వైభవాన్ని ముద్రిస్తూ ముద్దు కౌముది
"ది డర్టీ పిక్చర్" ఓ జోగిని స్వగతంపుట్టినప్పుడు పురిటివాసనన్నారుఆడపిల్లేనా అని మూతి ముడిచిన ముదితలుమరో దేవుడి భార్య పుట్టిందన్నారునా చిన్ని నుదుటిరాతా రాస్తూ....నా డిబ్బి చిల్లరకు మట్టి వాసనన్నారుఅమ్మా! నా డిబ్బి పగులగొట్టనే!నన్ను పెద్దమనిషని సంబరాలుపసుపులో పచ్చగా చేసిన దేహంఆ రోజు--నా పావడాలు పసుపునా పరుపు పసుపునా ఒడలన్నీ పసుపు...నన్ను పెద్దమనిషనన్నపెద్ద [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు