చిచ్చుబుడ్లకు బదుల్   చచ్చు బుడ్లిచ్చిరి కాకర పూగుత్తి కాలదయ్యె విరి మతాబుల బదుల్   సురసురాలిచ్చిరి డాంటపాసుల వొత్తు లంట వయ్యె భూచక్రములు కాస్త బూజు పట్ఠె తడిసి విష్ణు చక్రమ్ములు వెలుగ వయ్యె తారజువ్వ లరచి తడబడి తడబడి నింగి కెగుర లేక నీల్గుచుండె ఆంధ్ర కిచ్చిరి ' టపాసులు ' కేంద్ర మిదిగొ ! రాదు ప్రత్యేక హోదా , పరాయి మనము , చాలు ' ప్యాకేజి ' మన్ను , యెంచక్క [...]
గరుడుపై నిడుచక్కి గగనాని కెగబ్రాకి కోపానల జ్వాల కోల జేసి వింటి నారికి జేర్చి మంటికి మింటికి కణ కణ విస్ఫులింగాలు రాల నాధుండు డస్సి విణ్ణాణంబు వీక్షించ గరుడుండు గువ్వయి కానుపింప జడిసి సురాసుర లుడిగి భువి బడంగ బ్రహ్మ మేల్కాంచి విభ్రమము దొడర కదన రంగాన గల నరకాసురుండు నీ కొడుకునమ్మ ! చంపొద్దని యడు గిడుచు ఏడ్చి గీపెట్టి చేతులు మ్రోడ్చు చున్న చిత్రవధ జేసె కొడుకును , [...]
చదువులమ్మ మమ్ము చల్లగా దీవించె సిరుల కొమ్మ మాకు చేరువయ్యె సిరియు చదువులమ్మ  జీవించి రీ యూరి బలిజ లిండ్ల వెలసి కొలువుదీరి . కోట బలిజ లైరి కొలువులు వెలయించి రాజసమ్ము నాడు రాజ్యమేలె పేట బలిజ లైరి పేరైన వాణిజ్య సరణి పూని మథ్య తరములందు . ఒజ్జబంతులైరి ఊరు ఊరంతయు గురువు లనగ నాడు గౌరవమ్ము ఇంజనీర్లు , వెజ్జు లిప్పటి తరమందు పెద్ద చదువు లందు పేర్మి కలిమి . తల్లి దయలు గలుగ [...]
ఎన్నో తరముల నుండియు పన్నుగ మా పెద్దలంత పండిత కవులే , మున్నిట కావ్యములు వెలసి యున్నవి కొన్నింటి దెల్పు దుదహృత మొనరన్ తోట నరసింహ దాసు చేతో ముదముగ ' రామ రామ ' శతకము నేర్పడగ జెప్పె పిండ మాది జన్మాంతమై వెలయు కథన మద్భుతమ్ముగ వెలయించె నందు బుధుడు దరిమడుగు వంశ ధీనిధు లిరువురు కవి సోదరులు రచించిరి కావ్యాల్ అరయన్ మల్లయ , కామయ లరుదగు పండితులు బలిజ లందు ప్రముఖులున్ ప్రౌఢ [...]
రచయితెవరో తెలియదు . ఒక మిత్రుడు fb లో ప్రచు రించారు . రచయితకూ సేకరించిన సదరు మి త్రునికీ ధన్యవాదములు . అందరూ చదువ దగ్గది . *****************   చిరంజీవి ------- కి, అమ్మ దీవించి వ్రాయునది. నేను క్షేమంగానే ఇల్లు చేరాను. కోడలు ,పిల్లలు కులాసా అని తలుస్తాను. నా అంతవాడివి నువ్వైయ్యావు, నీ కుటుంబం నీది. మీ ఇంట్లో మీరు మీకు నచ్చినట్లు నడచుకొంటారు. కానీ,తల్లిగా నీకు ఇష్టంవున్నా లేకపోయినా [...]
చెడుపై కడదాకా యీ పుడమిని పోరాడి దుర్గ  పున్నెపు ప్రోవై కడుకొని మంచికి విజయము గడియించెను మార్గ దర్శిగా నిల్చి సదా . చెడుపై పోరాడు డటం చడుగడుగున విజయ దశమి సందేశ మిడున్ చెడుపై పోరాడుటయే పుడమి జనులు దుర్గ గొలిచి పూజించు టగున్ . ఏటేటా విజయ దశమి పాటింతుము గాని  దాని పరమార్థమ్మున్ దీటుగ పాటించ గలుగు నాట గదా ! విజయ దశమి నవ్యత దాల్చున్ . మన దాకా వచ్చు వరకు మనకేమీ [...]
దురిత దూర , 'దుర్గ' , దుర్మార్గ నాశని , దోష వర్జిత , సతి , దుష్ట దూర , సమధిక గుణ దోష సర్వఙ్ఞ , సమభావ , సకల జగతి నేలు సాంద్ర కరుణ . తరణిని తారాధి పతిని తరచిన తాటంకములుగ దాల్చిన తల్లిన్ , పరదేవతను మనంబున పరి పరి భావింతు బ్రతుకు పండుట కొఱకున్ . అమ్మా యని ఆర్తి గదుర అమ్మను నోరార బిలిచి నంతనె యెదలో అమ్మతనపు వాత్సల్యము క్రమ్ముకొనగ నెదకు హత్తు ఘనత దుర్గదే .
నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు వాగ్దేవి ! శారదా ! వందనములు , తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి ! బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు , బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి ! పరదేవతా మాత ! వందనములు , పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు పరబ్రహ్మ రూపిణీ ! వందనములు , జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు వర సరస్వతీ మాతరో ! వందనములు , ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి వరలు [...]
పలు భాషల పరిచయములు పలు గ్రంథాంతర పరిచయ ప్రావీణ్యములున్ పలు దేశ విశేషానుభ వ  లసద్బుధులుగ 'జిలేబి'వారిని దలతున్ అందరము పెద్దవయసులో కడుగిడితిమి ఆట విడుపుగ నిట నొక చోట చేరి కదిసి మచ్చటించు తరిని  కాస్తటు నిటు మాట లొలుకుట సహజమ్ము  మాన్యచరిత ! వారం రోజులు మీమీ తీరులు తెన్నులు దెలియక  తికమక పడి  యే తీరున నుండిరొ యని  హితు లారయ వెదుకాడిరి హితురాలని కాదా ? పెద్దవారు [...]
రత్నగిరీశ్వరున్ గొలువ రమ్మని బిల్చిన బిడ్డవెంట నే న్నూత్న మనో విభూతి వలనొప్పగ వెళ్ళితి , నెంత వేడుకో ! యత్నము సాంతమున్ మదికి హాయి నొసంగెను ,  జన్మ పుణ్యముల్ నూత్నములై యదృష్టముల నొక్కెడ గూర్చిన భాగ్య మొప్పగా - కను విందుగా క్రింది గర్భాలయమ్ములో శ్రీచక్రయుతముగా చెలువు మెరయ బ్రహ్మాది దేవతల్ పడి పడి మ్రొక్కిన పాదాలు గంటిని పరవశమున కడు శోభనము పైన గర్భాలయమ్ములో శివ , [...]
పిఠాపురం వెళ్ళేను , పురుహూతికా సతీదేవిని దర్శించుకున్నాను . తన్మయత్వం చెందేను . ---------------------------
ఎవ్వార లీవిశ్వ మెంతేని నేర్పుతో కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి కాచి రక్షించునో కనుల నిండ ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక చరియించ పాప సంహరణ చేయు ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన జ్యోతుల నందించి యునికి నేర్పు ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి అంతటను నిండి  తనయందె అంత నిండి వెలుగు మూలపు టమ్మకు వేల నతులు .
కనియెన్ రుక్మిణి  ' చంద్ర మండల ముఖున్ , కంఠీరవేంద్రావల గ్ను , నవాంభోజ దళాక్షు , చారుతర వక్షున్ , మేఘ సంకాశ దే హు , నగారాతి గజేంద్ర హస్త నిభ బాహున్ , చక్రి , పీతాంబరున్ , ఘన భూషాంకితు , కంబు కంఠు , విజయోత్సాహున్ , జగన్మోహనున్ ' .                           ------ బమ్మెర పోతన
హస్త సాముద్రికం బందించి భవితను నేడె కళ్ళకు గట్టు నేర్చి యొకడు జ్యోతిష్యము మనుష్యజాతికి తగిలించి గతుల నాపాదించు ఘను డొకండు పేరును సంఖ్యగా పేర్చి యిట్టటు మార్చి నెంబరు గేమాడు నేర్పరొకడు తాయెత్తు గట్టి మంత్రాలు మాయ లొనర్చ నేమమ్ము గల మహనీయు డొకడు అంద రున్నత కులజులే , అందులోను శాస్త్ర పాండితీ ధిషణులే ,  చదువు నింత గొప్పగా వాడుచున్నారు , గొప్ప వారె ! భారతావని చల్లగా [...]
కొలిచిన వారికి కొండంత వేలుపై సద్బుధ్ధి నిచ్చు ప్రసన్న మూర్తి పిలిచిన దిగివచ్చి విఘ్నాలు తొలగించి కార్యసిధ్ధి నొసగు కార్య మూర్తి ఆకులలుములు దెచ్చి యర్చించినా మెచ్చి ఘన కటాక్షములిచ్చు కరుణ మూర్తి కుడుములే నైవేద్య మిడినను తృప్తుడై మనసార దీవించు మహిత మూర్తి మూడు గుంజీలు దీసినా మోదమంది నెమ్మి కోరిన వరములు గ్రుమ్మరించు భక్త సులభుండు  సకల సంపద ప్రదాత శ్రీ [...]
 ఆడేవు దొంగాట ఆయశోదా దేవి కొంగు మాటున జేరి రంగు మార్చి కూడేవు సయ్యాట కోరిన రాధతో పయ్యెద కొంగు నింపార విడక పాడేవు మురళి రూపానల జ్వాల ర గిల్చి జగముల నూగించి బ్రమల మాడేవు గో గోప చూడా మణులతోడ మామూలు బాలుడై మసలు కొనుచు బుధ్ధి మంతుని పగిది రూపున యదేమి యల్లరిర ? యయ్యొ ! గోపికల్ తల్లడిలిరి , జగతి నంతను మోహ విచలిత జేసి మాయ జేయుదు వేమిరా ! మమ్ము కృష్ణ !
' వందే కృష్ణ జగద్గురుమ్ ' విమల విశ్వజ్ఞాన గీతార్యుకున్ వందే వ్యాసునికిన్ మహద్గురునికిన్ వందే చతుర్వేదకున్ వందే సాయికి సద్గురూత్తమునికిన్ వందే జగత్రాతకున్ వందే వెంకయ సామికిన్ మము సదా వర్దిల్లగా జూడగాన్
తెలుగు పద్యం ----------------- చొక్కిన యొకజంట చూచుకుంటున్నట్లు పలుమార్లు చదివించు భ్రాంతి ముంచి ప్రియమార నొకజంట పిలుచుకుంటున్నట్లు చెవులలో నింపైన చవులు నింప శ్రుతి మించి యొకజంట చుంబించు కొన్నట్లు పెదవుల మాటల మధువు లద్ద కసిదీర నొకజంట కౌగిలించుచు పొందు నానంద రస మగ్న మనుభ వింప ముద్దు మాటలు దొర్లించి ముదము గూర్చ సొగసు టూహల భావ మంజూష నింపి తియ్య మామిళ్ళు తేనెలో దిగిచి [...]
ఊహింపంబడె నల్లనయ్య నలుపొక్కొక్కర్కియొక్కోటిగా సాహిత్యానలతప్తులై యొకరు తా సారించి నల్పే తనన్ తా హీనంబుగనెంచి శ్యామలుని యొద్దంజేరెనం , చొక్క రా శ్రీ హర్షుండు విముక్త కీర్తి సితుడై శ్రీ దేహుడైనట్లుగాన్ . మరియు నొకరు విశ్వంబు మాడ్కి విశ్వ విభుడును నలుపనె , జలద విభవ మొంది శ్యామలుండయ్యె ననె నొక్క రా మదన జ నకుని  నైన సంశయము మానదు మనంబు . వలచిన భామినీ మలయజ కలయ [...]
జయ కృపారసము పైజల్లంగనే నీవు నల్లనివాడైన నమ్మినారు పద్మ నయనములు బరుపంగనే నీవు నల్లనివాడైన నమ్మినారు తలకట్టు పింఛంపు వలలు వేయంగనే నల్లనివాడైన నమ్మినారు నవ్వురాజిల్లు మో మివ్వటిల్లెడు నీవు నల్లనివాడైన నమ్మినారు నమ్మి చెల్వలు మానధనంబు లివ్వ దోచుకొనిపోయి యెక్కడో దూరినావు మల్లియల నడిగెద రాయమాయకులు , క నియు కనుపడ వేమిర ! కమనీయ రూప !
దేవకీ వసుదేవు దేహచాయలు తెల్పు నంద యశోద వర్ణాలు తెలుపు రాధికా రమణీయ రాగబంధము తెల్పు రుక్మిణీ భక్తిస్థ రుచియు తెలుపు తగ రతీ మన్మథ తాదాత్మ్యములు తెల్పు మునుల తపో ఙ్ఞాన ములును తెలుపు భారతాంతర్గత భావ జాలము తెల్పు గీతామృతంపు సత్కీర్తి తెలుపు బ్రహ్మ తెలుపు సరస్వతీ ప్రమద తెలుపు లక్ష్మి తెలుపు శేషాహి తల్పమ్ము తెలుపు పాల సంద్రమ్ము తెలుపు మా భక్తి తెలుపు నీకెలా [...]
వలచిన భామినీ మలయజ కలయ సం బంధియై తనుచాయ కందె గాని మరకత మణిమయ మధుపర్కములు గట్టి డాలున తనుచాయ డస్సె గాని తల్లి యశోదమ్మ తనర నగరు ధూప మేసిట్లు తనుచాయ మిర్రె గాని గొల్ల పిల్లల తోడి కోడిగంబున యాడి కూడంగ తనుచాయ కుదిసె గాని యెవరు చెప్పిరి నలుపని యేను నమ్మ నా జగన్మోహనాకారు డా మనోహ రుండు జగము పరవశించు రూపసి యగు కృష్ణుని తనుచాయ శోభన కృత సితమ్ము .
మనోఙ్ఞమైన సీసపద్యము ------------------------------- అవగాహనేహా సమాయత్త విభుదరా ట్కమనీయ మణి శతాంగములనంగ తాటాక సేతు సందర్శనేచ్ఛా గత స్థిత సమున్నత మహా శిఖరులనగ నేతదుజ్వల ధరానేతృ సంపాదిత మూర్తి భాస్వద్కీర్తి మూర్తులనగ ముక్తా మణీ యుక్త మోహనాంబర చుంబి వరుణ రాజన్య గోపురములనగ నిలిపె గుల్లూరి నల్ల చెర్వలుగు నందు ముప్పదియు మూడు రా కంబములు జెలంగ చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి రుచిర [...]
మా కుల్లూరు -- ప్రాచీన శివాలయం ------------------------------------------ మా కుల్లూరు గ్రామం చెరువు కట్ట క్రింద , అలుగుకూ - కోట శిథిలాలకూ మథ్య ప్రాచీన శివాలయం శిథిలావస్థలో ఉండేది . మా బాల్యంలో సదరు శిథిలాలలో ఆడుకునే వాళ్ళం . శివాలయానికి ఉపయోగించిన గోధుమ వర్ణపు పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు ఊడి చెల్లా చెదురుగా పడి ఉండేవి . నల్లరాతితో చెక్కబడి నిగనిగలాడుతూ పెద్ద నంది విగ్రహం కూడా ఉండేది .
మా కుల్లూరు - శాసనాధారాలు ------------------------------------- ఈ క్రింది శాసనం వెంకట పతి రాయలు ఈ ప్రాంతాన రాజ్యం చేస్తున్నప్పటి కాలానిది . ఇందులో శాలివాహన శక సంవత్సరం వ్రాయ బడి ఉంది . 1574 అనుకుంటాను . ఇది కుల్లూరు చెరువు అలుగు వద్ద ప్రతిష్టించ బడినది . సదరు రాజు చింతపట్ల రుద్రప్ప అనే చెరువుల నిర్మాణ నిపుణుని పిలిపించి కుల్లూరు నల్ల చెరువుకుఅలుగునిర్మించవలసినదిగాసబహుమానముగాఆనతివ్వడం , [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు