అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు. !!! నవమాసముల్ మోసి, జవసత్వములపోసి జన్మయొసంగిన జనని, మహిళ! సహధర్మ చారియౌ సౌఖ్యప్రదాయియౌ సంతాన భాగ్యయౌ సతియు, మహిళ! తండ్రినే నడయాడు దైవంబుగానెంచి ప్రేమించు పుత్రీలలామ, మహిళ! అక్కగా,చెల్లిగా అనురాగ వల్లిగా ఆత్మీయతనుబంచు యతివ, మహిళ! జోడుచక్రాలలో తోడుగానొకటియై తేరునీడ్చెడు వీరనారి, మహిళ! సంసార నావను చక్కగా [...]
మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. హరునకు గిరిజా మానస హరునకు ఘనతాపపాప హరునకు త్రిపురా సురసంహరునకు మంగళ కరునకు కరమోడ్చి మ్రొక్క కలుగు శుభంబుల్ !!! శివదండకం (దండకం తొలి ప్రయత్నం,తప్పులను శివుడు క్షమించుగాక !!) ఓంకార రూపా మహాదేవదేవా మహాదివ్యతేజామహావేదవేద్యా మహాలింగరూపాసదాసాధుమిత్రా పవిత్రా త్రినేత్రా నమోచిద్విలాసానమో భూతనాథా గిరీశా సురేశా మహేశా ఫణీశామ [...]
ఘనులే చూడగ మౌనమున్ విడరుగా క్రౌర్యంబు వీక్షించుచున్ వినబోరెవ్వరు ద్రౌపదీవ్యధను రావే దాసి రారమ్మనన్ అనిలో దున్మెద కౌరవాధముల నాకడ్డంబు నెవ్వాడు, భీ మునికిన్ గోపమె భూషణంబగు ప్రజా మోదంబు సంధిల్లగన్ !!!
వేకువజాముచీకటిన వీరుల దున్మగ దొంగ చాటుగా భీకరమైన శస్త్రములు భీతిని గొల్ప జవానులన్ను రీ * పాకన జంపగా తనువు బాసిన ధీరుని జూడ గుండె నీ రై, కనువిప్పి  డాసె సమరంబున గూలిన ప్రాణ నాథునిన్ !!! * జమ్మూకాశ్మీరు ఉరీ గుడారము(సైనిక స్థావరం)
వడ ,పూరి ,దోస ,గారె ... లను అన్యార్థములో ఉపయోగిస్తూ భారతార్థంలో వ్రాసిన పద్యం  సమర మందున చంపుటల్ చావడములు సహజ మేగద... పూరించు శంఖమిపుడు అర్జునా యెట్టి దోసమ్ము నంటబోదు కౌరవుల్ గారె కారకుల్ కదనమునకు !!!
31 జిల్లాలతో రూపు దిద్దుకుంటున్న కొంగ్రొత్త తెలంగాణాకు సుస్వాగతం దసరా శుభాకాంక్షలు. వసుధన్ వర్ణ సువర్ణ పుష్పములతో భాసిల్లు బత్కమ్మ గి న్నిసులో జేరి విరాజమానసుమమై నీరాజనాలందగా కుసుమించెన్ తెలగాణరాష్ట్రమిల పల్ కొంగ్రొత్త జిల్లాలతో మిసిమిన్ గొల్ప పసిండి కాంతులిట జిమ్మన్ గ్రామ గ్రామాలలో దసరా వచ్చె వినూత్న శోభలతొ హృద్యమ్మై జనా రాద్యమై !!!
ధీరుడు వీరుడు ధర్మవి చారుడు శ్రీరాముడు గుణసాంద్రుడు దైత్యుం జీరగ లంకకుజని గం భీరుడు పోరాడె మిగుల బీభత్సమునన్ !!! (శంకరాభరణం బ్లాగు లో ఇచ్చిన సమస్యకు పూరణ )
వందనమయ మురళీధర సుందర మందారహార శోభిత వదనా వందనమయ రాధాప్రియ వందనమయ యదుకిశోర వందన మయ్యా!!! 
కోయిల పాటపాడె శతకోటి సుమమ్ములు వేచెపూయగా కోయని కోడి కూసెగద కోవెల లోపల గంటమ్రోగె  తా హాయిగవిప్పిపింఛమును ఆడెమయూరి మనోజ్ఞరీతి వి చ్చేయుము భాస్కరా గగన సీమకు , వెల్గులు  జిమ్మ పృథ్విపై !!! ఏడు గుర్రాలతో జోడు చక్రములేని తేరుపై తిరుగాడు దేవుడీవు , ఊరువుల్ లేని అనూరుని కరుణించి సారధి జేసిన స్వామివీవు పాలకడలిపైన పాము పడగలనీడ  పవళించు హరికంటి పాపవీవు కడలిపై పలువేడి [...]
కలవా ! లేవా ! దేవా నిను  కనుగొను టేలా? కలడందురు నిను కొందరు కలడన కనబడడు గాన కలడని యేలా పలికెద మందురు కొందరు కలవా? లేవా?యిల నిను కనుగొను టేలా?
ఎంతటి వారైన ఎంతటి ఘనులైన శివుని చెంతకు జేరంగ వలయు చివరకు, భగవత్ చింతనె శాంతి నొసంగును చింతించిన జీవితమ్ము చీకటి మయమౌ !!!
శంకరా !!! ఆకాశంబుననుండు గంగ తలపై అందాలు చిందించగా రాకాచంద్రుడు బాలుడై తనసిగన్  రాగాలు పండించగా శోకాలార్చెడు పార్వతమ్మ సగమై శోభిల్లగా నీయెదన్ లోకాలేలెడు శంకరా భవ హరా లోపంబులంగాల్చవే !!!
ఎదిగెడు తరువుల కెవ్వడు పొదిగెను పూవులను ప్రొద్దు పొడవక మునుపే కదిలీ కదలని ప్రాణుల వదలక నిడిపించు రేడు వాడే జగతిన్ !!! నను రక్షించెడు వేలుపు నిను సైతము రక్షచేయు నిక్కము సుమ్మూ ననునిను చరాచరమ్ముల దినదినమున రక్షజేయు దేవుండొకడే !!!
శంకర శశిశేఖర ప ల్వంకలు శిరమున తిరిగిన పావన గంగన్ సంకోచింపక విడువుము సంకటములు తొలుగు నేల సంతస మొందున్ !!!
జంగమ దేవర, శిరమున గంగా జలధార, మేన కరిచర్మంబున్, చెంగలువలరేడు సిగన, మంగళ కరుడైన వేల్పు మదినే గొలుతున్ !!!  
సిగపైనన్ నెలవంకతో శిరముపై శ్రీలొల్కు సద్గంగతో సగ దేహమ్మున గౌరితో కనులలో చంద్రార్క తేజంబుతో సెగ నేత్రమ్ముతొ నాగభూషణముతో చేతిన్ త్రిశూలంబుతో జగముల్నేలెడు జంగమయ్య శుభముల్జాల్వార జేయంగదే !!! వినబోరెన్ని సుసూక్తులంబలుక విన్వీధీ విహారంబులో కనులన్ మైకముగ్రమ్మ కొందరు ఖలుల్  కారుణ్య నిర్ముక్తులై జనుల జంపుచు నుంద్రు నుగ్ర గతి యజ్ఙానాంధ [...]
ముక్తిని బొందగోరెడు ముముక్షువు లందరి మేలుగోరుచున్ భక్తి రసాత్మ కంబయిన భాగవతంబును తెన్గు జేసి  స ద్భక్తుడు పోతరాజు పదబంధము లన్ మకరందమద్ది సు వ్యక్తము జేసె శ్రీహరిని భక్త జనావళి ప్రస్తుతింపగా !!! 
పాహియని వేడితే పరమ పదమే నంట! శుభకరుడు , భవహరుడు, శశి ధరుడు, జలధరుడు శివుడు,ఉమాదేవి విభుడు,శివుడు !!! విశ్వజన హితమునకు విషము ద్రాగిన వాడు, బ్రహ్మ కపాలముల దండ దాల్చిన వాడు కొడె నాగుల మెడనిండ చుట్టిన వాడు పులితోలు వలువగా మేన కట్టిన వాడు, శూల డమరుకములను కేల బట్టిన వాడు, శివుడు శోకమాపకుడు,.శివుడు! లయకారకుడటంట దయజూపు దొరయంట హరహరా యనినంత పాపహర మౌనంట కోరితే తీరైన [...]
కాకినిగని కోకిలయని మోకాలికి బోడితలకు ముడిబెట్టెడు  యా పోకిరులిటులన వింతయె ?కాకర బెల్లమ్మువోలె గడు పులుపుగదా !!! (శంకరాభరణం బ్లాగులో యిచ్చిన నేటి సమస్యకు పూరణ)
నీరే దొరకదులే క న్నీరే గతియనుచు జెప్పు నీరజముఖి యే ధారావాహికగన సమ కూరును దగినంత నీరు కూయుము తల్లీ !!!
 చిత్రమునుగన విచిత్రము చిత్రమ్ములసాక్షిగాను చెదరనిదృష్టిన్ పత్రిక చదివెడు అంజన పుత్రునిగన మానసంబు పులకించుగదా !!!
విందుల్ జర్చ లనేకముల్జరుగు లే విశ్వాసమున్ బెంచగా చిందుల్ వేతురనేకరీతి సభలో చీత్కారముల్ జేయుచున్ సందేహమ్ములు రాకమానవుగదా సద్వర్తనుల్ గాదనీ వ౦దే మాతరమన్నమాటచెవికి౦పై తోచదెవ్వారికిన్!!!
  తల్లి దండ్రిని గురువునే దైవమనుచు దలుచు గుణమున్న తనయుడే ధరణి యందు  సుజనుడనబడు బడయును సుఖములన్ని ధర్మ దేవత నాల్గుపాదాల నడుచు !!! సంసారాబ్ధిన మున్కలేయుచు సదా సత్యంబు తాదప్పకన్ పుంసామోహన రూపుడైన రాఘురాముంగొల్చు సన్మార్గుడే హింసామార్గము నుగ్రవాదములనే హీనంబుగానెంచి  వి ద్వాoసుండై నలరారు వాడె ధరణిన్ దక్షుoడగున్ యోగ్యుడౌ !!!
జనగణమన అధి నాయక వనజల ఘనతర హిమాద్రి వనరుల సముదా యని భారతజననీ త్రిభు వనపావనికివెత్రివర్ణ  వందన శతముల్ !!!   
 “చేతులారంగ శివునిఁ బూజింపఁడేని  నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని  దయయు సత్యంబు లోనుగాఁ దలఁపడేని  గలుగనేటికిఁ దల్లుల కడుపుచేటు” పై పద్యభావాన్ని వేరొక   వృత్తంలో గిరిజావల్లభు భక్తితో నెవడిలంగేల్మోడ్చి సేవింపడో హరినామంబును నిష్టతో నెవడు నోరారంగ కీర్తింపడో కరుణన్ సత్యము లోనుగా దలపకన్ కాఠిన్యతన్ బెంచునో ధరణింబుట్టగనేల తల్లులకుతాదైన్యంబుచేకూర్చుచున్ !!!
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు