జల్లెడ - బ్లాగులను జల్లించండి One Stop For Telugu Blogs బ్లాగు లిఖిత నుండి టపాలు 
నువ్వు వెళ్ళిపోయి మిగిల్చిన  గొప్ప దిగులు ఇక్కడ -***అప్పటికి, నువ్వింకా రాలేదు -పూవులు ఏరిదాచి ఉంచాను నీ కోసం ... కిటికీ తెరలలో తెల్లని కాంతి -నేలపై ఊగేనీడలు, హృదయ ఛాయతో! బయట గాలిలో, ఆకులువేలపిట్టలైఉన్నచోటే ఎగిరే చప్పుడు ...***తెలుసు నాకు, తెలుసు నాకుపద్యాన్ని పొదిగేస్వప్నకాలం ఇది కాదని -***నువ్వు వెళ్ళిపోయి మిగిల్చినగొప్ప కోత ఇక్కడ ...***ఇప్పటికీ, నువ్వింకా రాలేదు -***బయట, [...]
1 కొంచెంసేపు వర్షం కురిసి, మరి ఆగిపోయింది - నా చుట్టూతా ఇక, కొలవలేని ఒక నిశ్శబ్దం; ప్చ్; నువ్వెప్పుడూ ఇంతే! 2 కదలక నిశ్చలంగా చెట్లు; కూడా మరి రాత్రీ, ఆకాశం - గాలిలో తేమ ఏదో పలువరిస్తోంది - చెప్పు నాకు, నీ పేరేనా అది? 3 బాల్కనీ అంతా వాన వాసన - రాత్రంతా ఆకాశం ఇక్కడ కక్కుకున్నట్లు! తడచి ముద్ధయ్యి, వొంటరిగా చూడు, చూడు ... ఓ పూలకుండీ, ఓ కవితా వాటిని వ్రాసే ఈ [...]
1 It rained for a while, and then it stopped; there is a silence that one can  either understand or measure! Somehow, you always do this to me! 2 The trees stand still; So is the night & the sky; The dampness in the air Whispers something Tell me, is that your name? 3 The balcony reeks of rain! As if the sky has vomited the night! Drenched, all alone, look A
1 || ప్రతిధ్వని || నీ చేతులు వానని జ్ఞప్తికి తెస్తాయి, వాన తడిపిన మట్టినీ మట్టి తడిచిన ఆ సువాసననీ - నీ మాటలేమో రాళ్ళని రుద్దుకుని సాగే నీటి పాయలు - ఎంతటి అందమైన శబ్దం అది! 'రంగుల శబ్దంవి కదా నువ్వు' అని అన్నాను నేను నీతో, వానేదో రాత్రేదో తెలియని రోజు! *** ఇప్పుడు చూడు; వానాగిపోయాక వీధి దీపాల కాంతిలో, నా చట్టూతా మార్మ్రోగుతున్న రాలిన ఆకుల మహానిశ్శబ్దం! [...]
|| నో నెట్వర్క్ || బహుశా, తలుచుకోవు నన్ను నువ్వు - ఎప్పటిలాగే నువ్వు నీ లోకంలో, నీ cellలో తప్పిపోయి .. మరి, ఇక్కడా అంతకన్నా మెరుగుగా ఏమీ లేదు; నేనూ, లోయలాంటి ఎండా, సుళ్ళు తిరిగే గాలికి ఎగిరే చిత్తు కాగితాలూ, దుమ్ము వీధి చివర ఆగిన కారు కింద నీడలో, రొప్పే కుక్కలూ నిటారుగా, లోహ మృగాలై వేచి చూసే షాపింగ్ mallలూ, బహుళ అంతస్థులూ, antennaలూ ... *** బహుశా, తలచుకోవసలే నువ్వు నన్ను
1 రెండు ఖాళీ అరచేతులంత చీకటి ఒక రెక్క తెగి, కిటికీ అంచుకు వేలాడే సీతాకోకై, 2 ఊచలే ఇప్పటికి మిగిలిన వాస్తవం బంధీ అయినది ఏమిటో ఎవరో కూడా తెలియదు, 3 పగిలిన ఓ కుండై ఈ రాత్రి ఆకాశం అడగకు ఇక,  చుక్కలు మరి ఎవరి అశ్రవులని, 4 పెగిలీ పెగలని గాలి గొంతు; వొణికీ గుక్కపట్టీ, అది  పాడే పాట లోపలో మృత్యువైతే, 5 ఇదే నిజం ఇప్పటికీ; నిన్నే తలచి అంచు నుంచి జారి ఎటో కొట్టుకుపోయి [...]
ఎంతో పల్చని ఎండ, మరి ఓ పొరలా; సవ్వడి చేయని గాలి - ఆవరణలో తాకీ తాకని నీడలు త్రవ్విన మట్టికి పైగా చల్లిన నీళ్ళల్లో తడిచిన రాళ్ళు; మెత్తగా అమ్మ కళ్ళలాగా మెరుస్తో స్రవిస్తో నేలపై ఎప్పుడో రాలిపడినో పసుపు ఆకు; గవ్వలాగా, మరి ఒక శరీరంలాగా, ముడుతలతో ... *** ఎంతో పల్చని ఎండ, ఒక పొరలా; అక్కడే ఒక పిట్ట,  అటూ టూ ఎంతో తచ్చాట్లాడి, చిన్నగా, ఎటో ఎగిరే పోయినట్టు మరి అమ్మకి [...]
ఎలా ఉన్నావు అని అడగాలని ఉంది నిజంగానే, నా నెత్తురినంతా మాటల్లోకి వొంపి, ఊరకే, నీ పక్కన కూర్చోవాలని ఉంది నిజంగానే, ఏమీ మాట్లాడకుండా, నిన్నానుకుని, చిన్న నవ్వుతో నిన్ను వినాలని ఉంది నిజంగానే, శరీరం నిండుగా నిన్ను పీల్చుకుని, ఎటో దారి తప్పి పోవాలనే ఉంది నీతో నిజంగానే, నన్నేను మరచీ, మరోసారి బ్రతికీ, హా; నిజం. మరోమారు మరణించాలనే ఉంది నీలో, ఒక మెలకువలోకి [...]
పగలంతా ఇలాగే గడిచిపోయింది, గాలికై ఉగ్గబట్టుకుని అల్లాడక వేచి చూసే ఆకులాగే, మంచం మీద అమ్మ ఒక్కత్తే, ఇక  ఏదో యోచిస్తో; మరి కేటరాక్ట్ ఆపరేషన్ అయి, ఏమీ చూడలేక, కళ్ళప్పుడే తెరువలేక; ఏముంది? తన కళ్ళ కింద? వానకు తడిచే ఓ తోటా, లేక, నింగికెగిసే పక్షులా? చెట్లకు వేళ్ళాడే గూళ్ళా లేక గోధూళి, మబ్బులై వ్యాపించిన సాయంత్రాలా? చుక్కలు దీపాలై వెలిగే రాత్రుళ్ళా [...]
dear little lady you see don't you worry It's something like this you need to take more water perhaps, you need to increase your fiber intake you see more than anything else you should stop worrying about everything of every tom 'dick' and harry I mean your ex -boyfriends your guilt and your dog (not me! though of course I like licking you as well ) more
బహుశా ఎవరూ రారు; ఈ పాతఫాను ఒక్కటే, తిరుగుతో; అలసిన శబ్దం దాని రెక్కల్లో, వేడిమి; పొయ్యి ఆరిపోయాక మిగిలే బొగ్గు కణికెల్లాంటి చీకటి; ఆరినా ఇంకా కాలిపోతో, బయట, బాల్కనీలో గులాబీ మొక్క పగిలిన పెదాలైన ఆకులతో వడలే ఉండవచ్చు, నీళ్ళు లేక మట్టిముంత వద్ద ఎంతో తచ్చాట్లాడి, మరి పిట్టలు ఎగిరిపోయే ఉండవచ్చు ఆకాశం ఎండిన సరస్సై , పగుళ్లిచ్చి అట్లా నోరు చాచి, ఓ శిశువై గుక్కపట్టే [...]
వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది ఆ మెట్లన్నీ దిగి ఆయాసంతో రొప్పుతో అమ్మ, అగ్నికీలలవలే ఎండ; గాజుపెంకులు రాలినట్టు మరి దారంతా మెరుస్తో, కోసుకుపోతో - గేటు పక్కగా పెరిగిన వేపచెట్టు; ఎన్నో ఆకుల్ని రాల్చి, తనలో తానే వొదిగీ వొంగీ ఇక ముడతలు పడి; పక్షులు కూడా లేవు ఇప్పుడు. అన్నీ ఖాళీ అయిన గూళ్ళూ , ఎండిన కొమ్మలూ; ఎప్పుడైనా గాలి వీస్తే రాలే సన్నటి దుమ్మూ, [...]
మరి, ఎంతో ఘాడంగా కమ్ముకునే ఉన్నాయి మబ్బులు, పొరలు పొరలుగా వీచే గాలి, ఉన్నట్టుండీ ఉరిమే సవ్వడి; మరి ఈ మసక కాంతిలో చెమ్మగిల్లిన ఈ వెలుతురులో ... చినుకులు రాలే చప్పుడేనా అది? ఆకులు వణికి, పూలు ఇక, తలలు వాల్చే కాలమేనా, ఇది? సాగలేక ఇక ఏ చెట్టు కిందో చేరి, వొరిగి, కళ్ళు చికిలించి చూస్తో, ఇక ఎవరినో తలుస్తో, కనులు మూయవలసిన క్షణం ఆసన్నమైన, మలి దశా, లోకమిదేనా [...]
1 దీపస్థంబాలు ఎంతో వొంటరిగా అవి; మరి ఈ రాత్రిపూట, వడలిన పూలదండలైతే బస్స్టాప్లో, ఒక మూలగా ఇక కమ్మీకి ఆనుకుని నువ్వు ; చేతిలో సెల్ఫోన్, ఎర్రని జాబిలి. ఇంకా వేడిగా గాలి; నీ ముఖం నీ శరీరం, తెల్లని కుర్తీలో ఎంతో వొంటరిగా, అలసినో పుష్పగుచ్చమైతే, నీ కళ్ళల్లో, క్రమక్రమంగా చలిస్తో వ్యాపించే, జాడలు; అంతంలేని/ కాని ఈ దీపస్థంబాల నీడలు! 2 అనో ... ప్రేమ
1. గమ్యం ఎండలో వచ్చావు; ముఖాన తడి, పచ్చిక వొత్తిగిల్లినట్టు ఓ పక్కగా వొదిగి కూర్చున్నావు, పొదిగే పిట్టల్లాగా నీ కళ్ళు , అట్లా తెరిపారా నను చూస్తో; "నీళ్ళు కావాలా?" అడుగుతాను నేను: "ఊహు: వెళ్దాం" అంటావు నువ్వు . కదులుతాను నేను ఇక నీతో మరి, కానీ ఎటు వెడుతున్నానో నాకసలే తెలీదు! 2. balm అసంకల్పితంగా, నీ పెదాలని తుడిచాను నేను, నా ముంజేతికి లేతేరుపు రంగు 'స్ట్రాబెర్రి [...]
చీకటి పడింది; ఎవరో నింపాదిగా అన్యమనస్కంగా ఒక నెత్తుటి బొట్టుని పెద్దదిగా చేస్తోన్నట్టు రాత్రి;"you see, it's happening again. Again and again. How to take it? I'm dying. I'm dying of this neglect; Of this game, of this cruel game; of this cruel game called love; of this ... can't you see?" she said - అపార్ట్మెంట్ బయట, దూరంగా ఎక్కడో పగిలిన నేల. ఎండిపోయిన ఆకుల వంటి కాంతి; నారలు నారలుగా రాత్రి
చీకటి పడింది; వేలికొసతో ఎవరో  నింపాదిగా,  ఒక నెత్తుటి బొట్టుని పెద్దదిగా  చేస్తోన్నట్టు లోపల రాత్రి;"you see, it's happening  again. Again and again. How  to take it? You see, I'm dying. I'm  dying of this  neglect; Of this love; of this ... Can't you see?" she said. బయట పగిలిన నేలా  ఎండిపోయిన కాంతీ, మరిక  కంఠంలో ఒక బ్లేడై, సన్నటి వణుకై,  ఒక ప్రతిధ్వనై, ఎవరికీ ఎవరూ లేని ప్రకంపనై  
"నో మోర్ అఫ్ దిస్ షిట్" అతను అనుకున్నాడు, ఎన్నోసారో అసలే తెలియదు వరసగా భవనాలు వెనుకగా; మరి అక్కడే ఒక సరస్సు, ఊగిసలాడే అలలతో, లోకమంతా ఇంతేనా? ప్రొక్లైనర్లతో ఇంకా లోపలికి త్రవ్వుతో, ఏమీ మిగలనంతగా కొల్లగొట్టుకుని పోతో? ఛాతిలో ఒక హృదయం అంత కంత; వండ్రంగి పిట్ట ఒకటి పొడిచి పొడిచి చేసినట్టు; వలలో చిక్కినదేదో మరి శ్వాసకై తపిస్తోన్నట్టు: ఛత్ ... *** "నో మరి అఫ్ దిస్ షిట్" [...]
నీ అరచేతుల నిండా వెల్లుల్లి వాసన నా ముఖాన్ని ఇక ఆ చేతులతో నిమిరినప్పుడు, వొలిచిన రెమ్మలేమో ఇకా ఉదయపు పల్చటి ఎండలో నేలపై మెరుస్తో:మరి పొట్టేమో, రాలిన ఆకుల వలే గాలికి ఊయల ఊగుతో;  చూడు, ఋతువు మారుతోంది. మరొక వేసవి కొమ్మల్లోంచీ, కుళాయిపై ఆగి అరిచే కాకీలోంచీ, కొత్త కుండలోంచీ, చల్లని నీళ్ళై, నీ చేతులలోంచి జీవధాతువై మరో వేసవికై, ఇట్లా వొలిచిన వెల్లుల్లి రెమ్మలై, నీ [...]
ఎక్కడినుంచో చినుకంత మాట నిద్రలోకి, ఒక పసిచేయి వాలినట్టు, మెడ చుట్టూ చుట్టుకుని, ఏదో కలవరించి పూవై హాయిగా నిద్రలోనే సన్నగా నవ్వినట్టు, పెదాలపై ఒక చుక్కై తడితో మెరిసినట్టు కూడా! *** ఎక్కడినుంచో చినుకంత మాట నిద్రలోకి రాలి, కలలై వలయాలై ప్రేమగా నువ్వై వ్యాపిస్తో! 
ఎక్కడినుంచో చినుకంత మాట నిద్రలోకి, ఒక పసిచేయి వాలినట్టు, మెడ చుట్టూ చుట్టుకుని, ఏదో కలవరించి పూవై హాయిగా నిద్రలోనే సన్నగా నవ్వినట్టు, పెదాలపై ఒక చుక్కై తడితో మెరిసినట్టు కూడా! *** ఎక్కడినుంచో చినుకంత మాట నిద్రలోకి రాలి, కలల వలయాలై ప్రేమగా నువ్వై  వ్యాపిస్తో! 
మణికట్టు దాకా తెగిన చేతులు. ఇక, నీ ముఖాన్ని పొదివి పుచ్చుకోవడం ఎలా? ఓ నెత్తుటి ధార. శ్వాస అందక భాష, తెలుపు కాగితాల దిగంతాల చీకటి: ఇక్కడ(డే), నీ ముందు, మోకాళ్లపై వొరిగిపోయి నిను అర్దిస్తో తలను వొంచి నీకు లొంగిపోతో! *** మణికట్టు దాకా తెగిన చేతులు, అవి దారికిరువైపులా రాలిన రక్త వర్ణపు పూలు: అవే, చెల్లాచెదురై తడిచి చితికి, చివరికి అతనై, 'వొద్దు' అని, గాలికి చేతులు మోడ్చి! 
"దడదడమని బాదినట్టు, లోపల  ఒకటే శబ్ధం, పట్టేసినట్టు కూడా. ఏం చేయను నేను?" She asked him,  *** లేచి వెళ్లి,ఒక గ్లాసు మంచినీళ్ళూ మాత్రా తెచ్చి ముందు ఉంచాడు అతను, "please sleep, it's 12:00" అంటో! *** బయట మరి రాలిన వేప ఆకులు  రాత్రిలోకి కుంగి,  ఇంకా కొంచెంగా శిధిలమవుతో!
కనుల కింద తెగని రాత్రుళ్ళు, మరి  దారాల్లాంటి చీకట్లు అల్లుకుని ఒక తాడై మెడకి  చుట్టుకున్నట్టు: నువ్వో ప్రతిధ్వనివి  అయినట్టూ, ఇక  ఆ కంపన మొదలయినది ఎక్కడో తెలియక,మళ్ళీ మళ్ళీ తిరిగి   నిన్నే చుట్టుకుని,  'వదలకు' అని అర్ధించినట్టూ,  జీవితం ఒక బిక్షపాత్ర అయ్యి, నేనో  మూగ యాచకుడనై  అట్లా నీ ముందు నిలబడినట్లు!   ... *** true; your face is a paradise of peace but how come,  you are so fucking ugly
తేనెలాంటి చీకటి; మెరుస్తో ఒక చుక్క, మిణుగురై పావురం పిల్లై దాహమై నేలై గాలై పగిలిన పెదిమల నేనై, ఒక్క నేనే అయితే *** తేనెలాంటి చీకటి, చేదుగా విగతగా, మరి  చాచిన ఒక అరచేయిలా, ఖాళీగా మరో అరచేయి లేక విగతగా; you know, you're a freaky fucking lie!  
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు