రాష్ట్రంలో పాగా వేయడానికి చిరకాలంగా పని చేస్తున్నా ఫలితాలు చూపలేని బిజెపి మీడియా సపోర్ట్ సక్రమంగా లేకపోవడమే దీనికి కారణమని నమ్ముతోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి దిన పత్రిక, టీవీ చానెల్ ఏదో ఒక పార్టికి ఉపగ్రహంలా పై చేయడం కాదనలేని నిజం. యువనేత జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఒక దిన పత్రిక, ఒక చానెల్ నడుపుతుండగా, చంద్ర బాబు నాయడు తన కుమారునితో స్టూడియో -ఎన్ చానెల్ [...]
సన్ సంస్థ ఎలా నమ్మి వెంకట సత్యనారాయణ అలియాస్ సాయిని జెమిని న్యూస్ ప్రిన్సిపల్ ఎడిటర్‌గా పెట్టుకుందో దేవుడెరుగు.. అతడి ఆగడాలు భరించలేని స్థితిలో ఉన్నాయి. ఈ మిడిమిడి మేధావి తనకు తోడు మరో మహా మేధావిని తెచ్చి పెట్టుకున్నాడు. మార్గం లక్ష్మీ నారాయణ అనే ఇతగాడు జర్నలిజంలో చాల జూనియర్.. ఒక సాధారణ సబ్ ఎడిటర్ ను పట్టుకొచ్చి అవుట్ పుట్ ఎడిటర్‌ను చేసేసారు. నిజమే.. జెమినిలో ఏదైనా [...]
ఒకప్పుడు మీడియాను నియంత్రించిన చందబాబు నాయుడు, జర్నలిస్టులను పురుగుల్ల చూసే వారని చెబుతుంటారు. ప్రెస్ మీట్లో తనను వేలెత్తి ప్రశ్నించిన రిపోర్టర్ల ఉద్యోగాలు ఊడగొట్టిమ్చిన సందర్బాలు గతంలో చాల ఉన్నాయి. అందుకే ఆయనకు జర్నలిస్తులంటే చులకన భావం సహజం తాజాగా తన కుమారునితో పెట్టించిన టీవీ ఛానల్ ' స్టూడియో ఎన్ ' లో జర్నలిస్టులను అన్యాయంగా ఉద్యోగంలో నుండి తీసేసినా [...]
తెలుగులో భారీ పెట్టు బడులతో మరో కొత్త దిన పత్రిక రాబోతోంది. ఉత్తరాదికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ఈ పత్రికను తేనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పత్రిక హెడ్లు కూడా నిర్ణయమై పోయారు కూడా.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ ఈ పత్రికకు ఎడిటర్‌గా నిర్ణయం అయిపోయారు. మల్టీ కలర్‌తో ఇప్పుడు ఉన్న పత్రికల కన్నా ఎక్కువ పేజీలు , తక్కువ ధరతో రానున్న ఈ [...]
న్యాయం చేయడంలో విఫలం అయ్యారు. అసలు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఎవరు? హరి ప్రసాదా? జనార్ధనా? ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గడ్డు రోజుల్ని ఎదుర్కొంటున్నారు. టీవీ చానెల్స్ ఉద్యోగాల్లో కోత విధించే పనిలో పడ్డాయి. ఖర్చులు తగ్గించు కోవడంలో భాగంగా సీనియర్లను సాగనంపి, వారి స్థానంలో కొత్తవారిని తక్కువ జీతాలకు తీసుకుంటున్నాయి. ఎక్కడా [...]
కోతికి కొబ్బరి కాయ దొరికితే ఎలా ఉంటుంది.. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండ బెడితే ఎలా ఉంటుంది.. ఎలాంటి అర్హతలు లేని విజయవాడకు చెందిన చుండురి వెంకట సత్యనారాయణ ఉరఫ్ సాయి ఏకంగా జెమిని న్యూస్ ప్రిన్సిపల్ ఎడిటర్ అయిపోయాడు. ఇదంతా కాస్ట్, ఏరియా మహత్యం. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా సాయి ప్రసిద్దుడని మీడియా వర్గాలు ఘోషిస్తున్న అదే పెద్ద అర్హత అన్నట్లుగా జెమిని-సన్ టీవీ [...]
చానెళ్ళు ప్రారంభించడం.. ప్రారంభించగానే లేదా ప్రారంభానికి ముందే తప్పుకోవడం శివరామకృష్ణకు బాగా తెలుసు. సీనియర్ జర్నలిస్టు శివరామకృష్ణ అధ్వర్యంలో.. కొందరు పెద్ద పారిశ్రామిక, రాజకీయ నాయకుల సహకారంతో ప్రారంభం కానున్న చానెల్ 4 గురించి జర్నలిస్ట్ వర్గాలు ఆసక్తిగా చర్చించు కుంటున్నాయి. జర్నలిస్టులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మూతపడ్డ హెచ్.వై. టీవిని కొనుగోలు చేసి [...]
హైదరాబాద్ జర్నలిస్ట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే. ఒక చానెల్ కు చెందిన ఘరానా రిపోర్టర్ ఒక భూమి వివాదం సెటిల్ చేయించడానికి రెండు కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఈ వ్యవహారం ఎక్కడో బెడిసి సదరు చానెల్ యాజమాన్యానికి తెలిసిపోయింది. ఎవరో వీడియో తీసి సీడీలు వారికీ పంపారట. సదరు యాజమాన్యం వారు వెంటనే ఈ రిపోర్టర్ చేత రిజైన్ చేయించారు. వారం రోజుల్లో ఈ కారణ [...]
తెలుగులో మరో కొత్త న్యూస్ ఛానల్ రాబోతోంది. ఉత్తరాదికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తెలుగులో ఛానల్ పెట్టాలని ప్రయత్నిస్తోంది. వారికి బెంగలూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, కన్నడ భాషల్లో వార్త, వినోద టీవీ చానెళ్ళు తీసుకురావాలని ఈ సంస్థ భావిస్తోందని ఢిల్లీ జర్నలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే వారు [...]
' ఎబౌట్ తెలుగు మీడియా ' త్వరలో సొంత పోర్టల్ ద్వారా మీ ముందుకు రాబోతోంది. ప్రింట్, ఇ-ఎడిషన్లను త్వరలోనే వస్తున్నాయి. ఆసక్తి గల జర్నలిస్టులు abouttelugumedia@gmail.com. కి దరఖాస్తులు పంపవచ్చు.
టీవీ-9 సాయి అలియాస్ విజయవాడ సాయి ఆ చానెల్ కు రిజైన్ చేసాడని తాజా వార్త. ఇది నమ్మలేని వార్తే.. రవి ప్రకాష్ కు నమ్మిన బంటు సాయి టీవీ-9 కు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమిటి ? ఇందులో ఏదో తిరకాసు లేదా? సాయి ' జెమిని న్యూస్ ' లో చేరుతున్నట్లు సమాచారం. విజయవాడలో ఉండే సాయిని హైదరాబాద్ తెచ్చి సి.ఎం. బీట్ ఇవ్వడం ఏమిటి? ఇప్పుడు ఆయన రిజైన్ చేయడం ఏమిటి? ఇది డ్రామా కాదా? సాయికి, రవి ప్రకాష్ కు [...]
రాష్ట్రంలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ పెయిడ్ ఆర్టికల్స్ పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలు పత్రికలూ, చానెళ్ళు అభ్యర్థుల దగ్గర డబ్బు తీసుకొని ప్రత్యేక వార్తలు, స్టోరీలు ఇచ్చాయి. డబ్బు ఇవ్వలేని అభ్యర్థులకు మీడియాలో సరైన ప్రచారం జరగలేదు. ఈ అమ్ధంపై దేశ వ్యాప్తంగా చర్చ [...]
టీవీ చానళ్ళ రేటింగ్ మయాజాలానికి అంతు లోకుండా పోతోంది. మన మీడియా సర్కిల్స్ లో ప్రతివారం చానెల్ రేటింగ్ పేరిట వస్తున్నఎస్.ఎం.ఎస్.ల మతలబు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఛానల్ రేటింగ్‌ల వెనుక ఏదో కుట్ర ఉందని పలువురు జర్నలిస్ట్ మిత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు న్యూస్ చానెల్ రేటింగ్‌లు పలు సందేహాలకు తావిస్తున్నాయి. ఈ రేటింగ్ లలో నిజమెంత? కొన్ని ఛానల్ [...]
ఐ-న్యూస్ వదిలిపెట్టి ఎన్-టీవీలో చేరిన రాజశేఖర్ తన వెంట సొంత పటాలాన్ని తీసుకెళ్ళాడు. అప్పటికే అక్కడ కీలక స్థానాల్లో ఉన్న జర్నలిస్టులను ప్రాధాన్యత లేని స్థానాలకు బదిలీ చేసి తన వారినందరినీ నింపేశాడు. కొంత మంది పాత జర్నలిస్టులను నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించేశారు. ఈ పరిణామాలు కొమ్మినేని శ్రీనివాస రావు లాంటి సీనియర్ జర్నలిస్టులకు మింగుడు పడకున్నా జాయమాన్య [...]
చుక్కాని లేని నావలా పయనిస్తున్న జెమిని న్యూస్ చానెల్ కు ఎడిటర్ గా సాక్షి టీవీ ఔట్ పుట్ ఎడిటర్ గా పని చేసున్న బి.టి.గోవింద రెడ్డి పేరు ఖాయమైందని తెలుస్తోంది. ఈ పోస్ట్ కోసం జెమిని పాత కాపులైన భావ నారాయణ, సతీష్ బాబు పేర్లు కుడ వినిపించాయి. సన్ నెట్ వర్క్ యాజమాన్యం మాత్రం జెమిని సీఈవో సంజయ్ రెడ్డి ప్రతిపాదనల మేరకు గోవింద రెడ్డి పేరు మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. సంజయ్ ' [...]
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఎలాంటి పరిశోధన లేకుండా ఒక చానెల్ మరో చానెల్‌ను చూసి గుడ్డిగా వార్తలు ప్రసారం చేయడం అందరికీ తెలిసిందే. ఎక్కడో రష్యాలో ఉన్న ఒక నిషేధిత పత్రికకు చెందిన పొర్టల్ రాజశేఖర రెడ్డి మరణంపై అల్లిన కల్పిత వార్తను గుడ్డిగా ప్రసారం చేయడం ద్వారా రాష్ట్రంలొ విధ్వంసానికి కారణమైన మన టీవీ చానెళ్ళను చూసి ప్రజలు అసహ్యించుకున్నారు. ఇందులో [...]
అందరూ ఊహించినట్లే జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుంది. హైకోర్టు తీర్పుతో జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఇంతకాలం ఇళ్ళ స్థలాలు వస్తాయని గంపెడాశలు పెట్టుకున్న జర్నలిస్టులకు నిరాశే మిగిలింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నా తీర్పు ఎన్నేళ్ళకు వస్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో జవహర్లాల్ నెహ్రూ [...]
ఎ.బి.ఎన్.ఆంధ్రజ్యోతి రాష్ట్ర గవర్నర్ ఎన్.డి.తివారి రాసలీలపై సాహసోపేతమైన వార్తను ప్రచారం చేసి ఆయన్ని సాగనంపడంలో సక్సెస్ అయింది. నిజంగా వారి పరిశోధన అద్భుతం. అయితే మన రాష్ట్ర మీడియాలో కూడా ఇలాంటి శృంగార పురుషులు ఉన్నారనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. మరి వారి లీలలు లోకానికి తెలియాల్సిన అవసరం లేదా?.. మీడియాలో మహిళ శీలాలతో ఆడుకుంటున్న నీచులు చాలా మందే ఉన్నారు. మీడియలో [...]
ఇళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు కోసం మరొకడు ప్రయత్నించాడట. తెలుగు మీడియాకు ఈ సామెత సరిగ్గా అతుకుతుంది. రాష్ట్రంలో తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాల ంధ్య మీడియాలో చీలిక చాలా స్పష్టం. టీవీ చానళ్ళు, పత్రికలు రెండు ఉద్యమాలకు వెనుక నుండి చక్కని సహకారాని అందిస్తున్నాయి. ఇందులో ఎవరి స్వార్ధం వారికి ఉంది మరి. తెలంగాణా వస్తుందో, సమైక్యంధ్రే నిలుస్తుందో తెలియదు కానీ [...]
తెలంగాణా ఉద్యమం తెలుగు మీడియాలో అంతులేని విభేదాలను సృష్టించింది. రాష్ట్ర జర్నలిస్టులు ప్రాంతాల వారిగా విడిపోయారు. హైదరాబాద్ జర్నలిస్టులో సాధారణంగా తెలంగాణా జర్నలిస్టులే అధికం సహజంగా వీరంతా ప్రాంతీయ మమకారంతో తెలంగాణా ఉద్యమానికి బాహటంగా మద్దతు ఇస్తారు. ఈ విషయం ఆంధ్రా, రాయలసీమ జర్నలిస్టులకు మింగుడు పడనిదిగా మారింది. తెలంగాణా జర్నలిస్టులు ప్రెస్ మీట్లలో [...]
ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కర్నూలు, మహబూబ్ నగర్, క్రిష్ణా, గుంటూరు జిల్లాలు వరదల్లో మునగడం మన టీవీ చానళ్ళ దాహాన్ని తీర్చింది. అందరికన్నా తామే ముందు వరద వార్తలు ఇచ్చామని ప్రతీ చానల్ గొప్పలు చెబుకుంది. కొన్ని చానళ్ళయితే శ్రీశైలం డాం కొట్టుకు పోతోందంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేసి, తర్వాత నాళిక కర్చుకొని తమ వార్తలకు స్పందించే అధికారులు తక్షణ సహాయక చర్యలకు [...]
కోర్టు అనుకూలంగా ఎప్పుడు తీర్పు చెబుతుందా. ఇళ్ళ స్థలాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు చేదు వార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజశేఖర రెడ్డి దుర్మరణం తరువాత ఈ అంశాన్ని పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు. కోర్ట్రు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. [...]
జెమినిన్యూస్ చాలా కాలంగా తలకాయ లేకుండానే నడుస్తోంది.. అదేనండీ హెడ్ అంటే బాస్ లేకుండా అనమాట. మధు వెళ్ళిపోయిన రెండేళ్ళకు సతీష్ బాబు జెమినిన్యూస్ ఎడిటర్ అయ్యారు. సతీష్ బాబు కూడా రిజైన్ చేసి ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా ఇంతవరకూ కొత్త ఎడిటర్ నియామక జరగలేదు. బహుషా తక్కువ జీతం తీసుకుంటూ ఎండీ కిరణ్ తిట్లు తినేవారెవరూ దొరికి ఉండరు. తాజాగా సన్ గ్రూప్ ఎపీ సీఓఓ గా వచ్చిన సంజీవ [...]
మీడియా మిత్రుడికి జోహార్!ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి అస్తమయం తెలుగు ప్రజలందరికీ విచారాన్ని కలిగించింది. రాజశేఖర రెడ్డి జర్నలిస్టుల సంక్షేమం కోసం విశేషంగా పని చేశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కోర్టు కేసు కారణంగా ఇది కార్యరూపం దాల్చక వై.ఎస్.ను కోల్పోవడం బాధారం. జర్నలిస్టులకు మెడిక్లైం, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు