నీ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రవాహంలా, ఆగక. నువ్వేనా ఇంతగా మాట్లాడుతున్నది.. అనుమానంగా నీ వైపు తిరిగి చూసాను.. ప్రక్కన ఉన్నది నువ్వే మరి.. మాటలూ నీవే, కానీ నీ పెదవులు కదలవేం ? నీ గొంతు అలసిపోదేం ?  బహుశా మాట్లాడుతున్నది నువ్వు కాదు.. నీ మౌనం. విన్నది నేనేనా, లేక నాలో ఉన్న నువ్వా ? ఏమో. మనం వేరు కాకపోతే ఎంత బావుణ్ణు. జ్ఞాపకంలా. 
కవిత్వమంటే ఏమిటో ఇంకా తెలీని రోజులనుంచి, నన్ను ఎంతో ప్రభావితం చేసిన కవి సినారె. కాస్తో కూస్తో రాయడం మొదలుపెట్టాక మెల్లమెల్లగా ఆయన విశ్వరూపాన్ని వీక్షించగలిగాను. కొందరి కవిత్వం ఉత్తేజపరుస్తుంది, మరికొందరిది లాలిస్తుంది, ఇంకొందరిది ఆలోచింపచేస్తుంది.. ఇలా ఎన్నో.. నాకు అర్థం అయినంతవరకూ సినారే విశిష్టత ఏంటంటే ఏ కోవలోకి ఆయన్ని నెట్టలేం. ఆయన కవిత్వం ఒక జీవితం. అందులో [...]
అర్థం కాని మాటలు ఎందుకు నాచే కన్నీళ్ళు పెట్టిస్తాయి. అక్కరే లేని అనుభవాలు ఎందుకు జ్ఞాపకాలై వెంటాడుతాయి.. ఏ దూరం తగ్గించని దారులు.. ఏ గమ్యం చేర్చని దూరాలు.. ఎందుకు నేను ఇంకా ఇంకిపోతున్నా.. నాలోకే.. లేని నా లోకే.. గట్టు ఆవలి సంగతులు ఎందుకు నన్ను పలకరించవు ? నేను లేని కలల్లాగ.. నేను చెప్పని గతం లాగ.. నిన్ను నన్నూ.. అందరినీ.. అంతాన్నీ.. ఇముడ్చుకున్న శూన్యం ఎక్కడ ? నేను లోని నే [...]
(శ్రీ శ్రీ "ఐ" చదివిన ఆవేశంలో..) ఐ గుండె వెలుతుర్లో జ్ఞాపకాలు పోగేస్తూ.. వంతెన లేని తీరాలను ఊహల్లో దాటేస్తూ. ఇంతటి అంతటి విశ్వంలో ఓ అణువునై.. పరమాణువునై.. ఆ నాలోనే ఓ విశ్వాన్ని మోస్తూ. ఐ. నిన్నతో ఆగక.. నేటితో అలవక.. రేపుని తెలీని క్షణాలతో నిర్మిస్తూ.. నిరీక్షిస్తూ. ఐ.
నువ్వు రాసిన కవితనవుతా నీ కన్నీటిలో చినుకునవుతా గెలిపించే గాయన్నై. జ్ఞాపకం లో నువ్వు ని. రేపు లో నీ నీడని. నీ పుట్టుకలో నీ కారణాన్ని నీ చావులో నీ గమ్యాన్ని నువ్వే నేను చెప్పడానికి అర్థమే లేని మాటలా. నీ నేను. నేను. 
తన ఒంటరితనమే తన అస్తిత్వం.. నేను కావాలనే బయట ఉండిపోతాను. నా గతమే తన సర్వస్వం, కన్నీళ్ళు కనపడనివ్వలేదు నేను. వెనక్కే వెళ్ళే పరుగు పందెంలో తనదే గెలుపు.. నేను తృప్తిగా ఓడిపోయాను. మా ఇద్దరి ప్రయాణాలు వేరు. దారులు వేరు. గమ్యాలు కూడా. కానీ కట్టిపడేసిన జీవితం కలిసి నడవమంటుంది.. ఓ నాలుగు క్షణాలు. నాకు తెలుసు ఈ బంధం కాలానికి అందదు.. ఆలోచనలకి కూడా. ఎందుకంటే నేనే లేని చోట [...]
ఈ ప్రయాణం గమ్యంతో అంతమవ్వదు.. ఈ పయనానికి అంతమే గమ్యం. ఏ విరామం, విశ్రాంతి నాకు ఆటవిడుపు ? కళ్ళు వెతుకుతూనే ఉంటే, కాళ్ళు చతికిలబడ్డా, ఆలోచనలు ఆగక అలసిపోతుంటే, కళ్ళు మూతబడ్డా.. "నేను" లేని ప్రపంచం కోసం నేను మథనపడతాను. "నా" లోనే. "నా" అంతా. ఏ సందు చివరో నేను ఆగిపోతాను. ఏ తెలియని మలుపు వద్దో. అది నాకు ఇష్టమైనదో కాదో.. నేను ఓడినట్టో, లేక గెలిచినట్టో.. నా వెంట ఇకా రాని "నా" [...]
అన్నీ సగమే మధ్యలో ఆగిపోయిన మాటలు.. నన్ను వెంటాడతాయి. కొన్ని బంధాలు.. మరికొన్ని కన్నీళ్ళు. ఇంకొన్ని దూరాలు.. వెంటొచ్చే తీరాలు. అన్నీ సగమే.  నాలో తమని దాచేసుకుంటాయి. సాగే జీవితమూ సగమే నాది. మిగిలినదంతా ఒంటరితనం. నిండుగా.
చాలా యేళ్ళ క్రితం నిన్నే పెళ్ళాడుతా చిత్రం చూసి, ఇదేం అంత గొప్ప సినిమా కాదే అని నిట్టూరుస్తుంటే, నలుగురూ మొత్తబోయారు. అప్పట్లో అదో కళా ఖండం మరి. ఓ సాయంత్రం కాఫీ తాగుతూ, ఆ చిత్రం గురించి నాలానే ఫీల్ అయిన మా శారద పిన్ని ఏం తేల్చారంటే, మనలోనే లోపముంది అని.. జనాలకి అలా తీస్తేనే నచ్చుతున్నాయనీ..మరి అందరూ అలా నచ్చుకుని మెచ్చుకున్న చిత్రం, నాకు మాదిరిగానే రుచించడాన్ని నేను [...]
కుంభవృష్టిలో నిలుచున్నా, ఎండిన గుండె తడవ్వదు. ఒంటరితనం. ---------- నీతోనూ లేను, నువ్వు లేకుండానూ లేను. గతం. ---------- దారులు నను చీల్చుకుపోతాయి.. మాటలు దాటుకుపోతాయి. నీడలు జారుకుంటాయి. దోబూచులాడుతూ.. వెలిగి ఆరుతూ.. నిలుచుండిపోయాను. నేను మాత్రం ఒంటరిగా. ఏ చీకటికో.. సాక్ష్యంగా. లేదా ఏ గాయనికో.. గమనానికో. బహుశా.. వీధి దీపం. -------- మాటలతో దాచేసాను.. మౌనాన్ని. --------
మొన్న వారాంతంలో సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే ఇచ్చి నిర్మింప చేసిన కుమారి 21F చూసాను. ఈ మధ్య కాలం లో ఇంత డివైడడ్ టాక్ ఎక్కడా వినలేదు. కొందరు ఓహో సూపర్ అంటే, మరికొందరు చీ, థూ అని. సినిమా కి పెద్దగా అంచనాలతో వెళ్ళలేదు నేను. ఇంటెర్వల్ ఫీలింగ్ అయితే, ఏముంది ఈ సినిమా లో ఓ నాలుగు పెద్దల సన్నివేశాలు తప్ప అనిపించింది. కానీ చివర్లో కొన్ని సీన్లు బానే వచ్చాయి. [...]
కవిత, కవి చేతి రాతలోనో, కవి గొంతులోనో, ఇంకా అర్థవంతం గా ఉంటుంది. కొన్ని సార్లు మాటలే కాదు, మౌనాన్ని కూడా వినాలి. ప్రపంచ పదులు, గుల్జార్ కవితలు, కవి గొంతులో విని ఎన్ని వందల సార్లు మురిసిపోయానో నేను. కవి యొక్క గాత్ర ధర్మం కంటే, భావాన్ని వినగల్గితే, కవిత ఇంకా అందంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎప్పటినుంచో, పోస్ట్ చేసే కవితలకి శబ్ధాన్ని జోడిద్దామనే ఆలోచన ఉన్నా, పెద్దగా [...]
బ్రతికేస్తున్నా ఇరవై నాలుగు గంటలూ, మనసుకి దగ్గరైన క్షణాలెన్ని.. అడుగులతో వేల మైళ్ళు దాటేసినా, తగ్గిన దూరాలెన్ని.. అర్థం లేని మాటలు, అక్కర్లేని కన్నీళ్ళు, ఎన్ని పారేసుకున్నా, గుండెకి తోడుగా దొరికిన నేస్తాలెన్ని.. ఏం ప్రయాణమో ఇది, సాగే కొద్ది సన్నమైపోతోంది. ఎదిగే కొద్ది ఒంటరైపోతోంది.. ఇదే జీవితం అని సరిపెట్టేసుకున్నా, ఇలా కాదు, మారోలా అంటూ అనుక్షణం [...]
జ్ఞాపకాల జ్ఞాపకాలు.. కొన్ని క్షణాలు, గుర్తే కాదు.. అనుక్షణం గుర్తుకు రావడమూ గుర్తే. మనసు తలుపు తీసి తొంగి చూస్తే, ఎంత తడో, గుండె నిలువెల్లా సేద తీరడానికి. రేపు ఉందో, లేదో, ఎవరికైనా.. ఎవరికి తెలుసు ? ఈ రోజంతా, నిన్నను గుర్తుకు తెచ్చుకుని బ్రతికేసాను. అదే నేను. కన్నీళ్ళ సావాసమే అయినా, గతం ఓదారుస్తుంది. బహుశా నేనూ జీవించానని గుర్తు చేసి.. నిన్న, మొన్నల లెక్కలు ప్రక్కకు [...]
కొన్ని నెలల క్రితం నేను కౌముదికి పంపిన కవిత "గుప్పెడు చీకటి" ఈ నెల సంచికలో ప్రచురింప బడింది. వీలు చూసుకుని ఓ లుక్కు వేయండి. కౌముది
కొన్ని చిత్రాలు చూసిన తరువాత చాలా కాలం మన ఆలోచనల్లో వెంటాడుతూ ఉంటాయి. ఈ మధ్యే వచ్చిన "తల్వార్" అలాంటిదే. కొన్నేళ్ళ క్రితం నొయిడా జంట హత్యల ఉదంతం తెలిసిందే. ఆ కేసు నేపధ్యాన్నే కథగా చేసుకుని మలచబడింది తల్వార్. నేరం, పోలీసు, పరిశోధన, వ్యవస్థ, దాని అవస్థ, ఈ అంశాలన్నిటి వెనుక, ఎక్కడో నక్కే న్యాయం. ఈ పరిస్థితి ని ఎలాంటి అనవసర హంగులు లేకుండా వీలైనంత నిజయితీగా చిత్రీకరించారు. [...]
కన్నీళ్ళు.. వెలుగే లేని గదిలోకి, పరిగెత్తాను, గుండె నిండా ఉన్న వేదనంతా, వెలికి తరిమేద్దామని. నన్ను చూసి నా కన్నీళ్ళు సిగ్గుపడ్డాయేమో.. నేను లేని చోటు కావాలన్నాయి.. తాము బయటపడాలంటే.. ఎక్కడెక్కడో తిరిగాను. నేను లేని నా కోసం. దొరకనూ లేదు.. నా కన్నీళ్ళు నన్ను వదలనూ లేదు.
గుండెని తడిమే చిత్రం - "పీకు" హీరోలు, అనవసరపు పాటలు, అతికించిన కామిడీ, అర్థంలేని కథ.. ఈ గొడవలు ఏమీ లేకుండా, ఒ చిత్రం చూద్దామనుకుంటే, తప్పక చూడాల్సిన చిత్రం "పీకు". సున్నితమైన కథాంశం, మనలాంటి మామోలు పాత్రలు, ఇది నిజమే అనిపించే చిత్రీకరణ వెరసి "పీకు". కొన్ని కథలు, నవ్విస్తూనే ఆలోచింప చేస్తాయి. పాత్రలతో పాటు, మనల్నీ కథలో కలిపేసుకుని, మనసంతా తడిమి, భాదో, సంతోషమో తెలియని [...]
నిన్న మా అన్నయ్య పంపితే చదివాను, "ఆంధ్రప్రదేశ్" అనే పత్రికలో ప్రచురితమైన "మా నాన్న" అనే కవిత. మమోలు మాటల్లోనే చెప్పినా ఎంతో లోతైన అనుభూతిని మిగిల్చింది ఈ కవిత. అమ్మ గురించిన కవితలు ఎన్నో చదివాను కానీ, నాన్నని వర్ణిస్తూ రాయబడ్డవి కాస్త తక్కువే అని చెప్పాలి. భావుకత, అనుభవం సరైన పాళ్ళలో మేళవించిన కవయిత్రి తిరుమలాదేవి గారికి హృదయపూర్వకమైన అభినందనలు. http://ipr.ap.nic.in/AndhraPradeshPatrika/
ఎంత వేగం అందుకోను.. నానుంచి నేను పారిపోడానికి. ఎంత కాలం వేచిచూడను.. నిన్నను మళ్ళీ తెచ్చేసుకోడానికి. ఎన్ని పుట్టిన రోజులు.. తిరిగి పుట్టేయడానికి. ఎంతటి బంధాలు.. చావుని ఆపేయడానికి. ఇంకా ఎన్ని జీవితాలు. నేను లేకపోవడానికి.
విషయం లోకి వెళ్ళేముందు చిన్న ఉపోద్ఘాతం ఇస్తాను. ఫాథర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్ గా చెప్పుకోదగిన శాస్త్రజ్ఞుడు అలెన్ ట్యూరింగ్. ఆయన దశాబ్ధాల క్రితం ఒక చిన్న పరీక్షను ప్రతిపాదించాడు, దాని ముఖ్యోద్దేశం కంప్యూటర్ ని ఇంటెలిజెంట్ అని ఎప్పుడు అనచ్చు అని. మరీ లోతుల్లోకి వెళ్ళకుండా క్లుప్తం గా చెప్పుకుంటే, ట్యూరింగ్ ఏమన్నాడంటే, ఏ రోజు అయితే ఒక మనిషి తను నేరుగా చూడకుండా [...]
మనిద్దరం.. మనిద్దరం కలిసి నడుస్తుంటే, మధ్య దారిలో ఎక్కడో, కాలం తప్పిపోయింది. మనం వెతుక్కుంటూ.. చెరో దారీ అయ్యాం. కాలం ఇద్దరికీ దొరికింది. జీవితం ?  
ఏప్రిల్ నెల సంచికతో "కౌముది" సెంచరీ మైలు రాయి దాటేసింది దిగ్విజయంగా. నెల నెలా తెలుగు సాహితీ వెన్నెలని విరజిమ్ముతూ, ఎన్నో ఖండాంతరాలను పలకరించి, పులకరింప చేసిన మన కౌముది మరెన్నో మైలు రాళ్ళు దాటాలని మనసారా కోరుకుంటున్నాను. కొన్నేళ్ళ క్రితం, ఓ రోజు అంతర్జాలం లో తెలుగు వెలుగు ఎక్కడైనా కనిపిస్తుందా అని వెతుకుతుంటే దర్శనమిచ్చింది కౌముది. ఆ క్షణం నా అనుభూతి నాకు ఇంకా [...]
మా బుడ్డోడు నేర్పినవి.. పడిపోయినా అడుగు ఆపక్కర్లేదని.. ఎగిరే పక్షికే కాదు.. అస్తమించే సుర్యుడికీ టాటా చెప్పాలని.. పాట ఏదైనా మనకొచ్చిన నాట్యం చెయ్యొచ్చని.. అప్పుడప్పుడు సరదాగా నాలుగడుగులు వెనక్కి వెయ్యచ్చని.. చిరునవ్వులు పంచడానికి పరిచయం అక్కర్లేదని.. గాయాలని తడుముకుని ఏడవద్దని.. చందమామని క్రిందకి రమ్మని రోజూ పిలవచ్చని.. చెప్పడానికి మాటలెందుకని..
--- గతానికి ఎదురీత. చీకట్లో.. కలలో. కలవరింతతో. --- నీ కళ్ళతో ఏంచూస్తాను.. నా లోపల్లోకి. గుడ్డి చూపులు. --- నువ్వు నేను గెలిచానన్నావ్.. ఇంకో నువ్వు నేను ఓడానన్నావ్.. నేను బ్రతికి.. పొయాను.. అంతే. --- వెతకడమే సుఖం. భయం లేదు. ఏదో పోగొట్టుకుంటానేమో అని. --- జీవితం లో అన్నీ రెండే.. నిండా భిన్నమైనవి.. వెలుగు చీకట్లు.. సుఖ దుఖాలు.. నేను, నీ దృష్టిలో నేను. --- తేదీలు మారాయి.. మనుషులూ..
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు