లీలగా జరిగినది లాగి చెప్తానుగోలలో గుర్తున్నది గోరింతలు చేసి చెప్తాను నేరుగా చూసింది నరికి నాకు నచ్చింది చెప్తాను బేజారు అయ్యేదాకా బెంబేలు  ఎత్తేదాకా అదే అదే చెప్తాను అన్నట్టు ఉన్నది ఇప్పటి ఛానెళ్ల పరిస్థితి dengue  జ్వరాలు వచ్చి పిల్లలు పెద్దలు న్యాయమూర్తులు చనిపోతుంటే ఇదేంటి ప్రభుత్వం ఏమి చేస్తోంది అని నిలతీసే ధైర్యం లేని పత్రిక లలిత [...]
చాలా కాలం అయ్యింది ఏదైనా రాసి  వృత్తిపరమైన మార్పులు ఆ మార్పుల వలన వచ్చిన తలనొప్పులు... మధ్యలో నాకు పెళ్లి అవ్వటం ఇలాంటి చాలా పరిణామాల మధ్యన నా టపాలు టపా కట్టేశాయ్... కానీ ఇన్నాళ్ళకి మళ్ళి అవి తిరుగుటపాలో వచ్చాయి అని చెప్పటానికి ఆనందిస్తున్న.ఇక నించి సాధ్యమైనంత వరకు నెలకి ఒక టపా అన్నా రాద్దాం అని అనుకుంటున్నాను.-మీ నేస్తం 
"హాయ్!! హలో !! నమస్తే!! ఆదాబ్ !! వేల్కం టు చెంప చెళ్ళుమన్నది - సక్సెస్ మీట్ ...................దీనిని మీకు అందిస్తున్న వారు స్కూటర్ అగర్బత్తి మరియు రావణరాజ్ అడ్డకట్టు పంచలు.మీరందరు మెచ్చిన అండ్ మీకు నచ్చిన చెంపచెళ్లుమంది పది వేల  ఎపిసోడ్ సందర్భంగా మీకోసం ఈ సక్సెస్ మీట్. "అంటూ గుక్కతుప్పుకోకుండా గాలి పీల్చకుండా ...తాను బట్టల్లో చేసిన పొదుపు మాటల్లో ఏ మాత్రం చేయకుండా [...]
ప్రేమికుల రోజు సందేశాలు చూసి ఫేసుబుక్  లో సరదాగా రాసిన కవితనీ నవ్వులే నా లోకమేనువ్వు వుంటే లేదు ఏ శోకమేనువ్వు లేకుంటే అది శాపమేనిన్ను విడిచి పోవుట నరకమేనీవు లేని ప్రతి ఘడియ వ్యర్ధమేనీవు లేకుంటే  లేదు ఏ అర్ధమేనేను వేసే ప్రతి అడుగు నీ కోసమేనా ప్రేమకు లేదు ఏ అంతమే
సఖివై చేరావు నా సహవాసాలు మార్చావుసడిలేని నా బ్రతుకులో అలజడులే రేపావుజడివానలో గొడుగులా నా కడగళ్ళలో నిలుచావుకడకు నన్నొదిలి నా ఎదలో గాయం మిగిల్చావు  
సంతోష్ అలా సుకన్య గురించి ఆలోచిస్తూ ఫోన్ చేస్తూ కంగారు పడుతూ వుండగా ముందు ట్రాఫిక్ మన్ను తిన్న పాము లాగా మెల్లగా కదలసాగింది. సంతోష్ తొందరగా ఇంటికి వెళ్ళటానికి దొరికిన ఏ కొంచెం ఖాళీ వదలట్లేదు. అతనికి  టెన్షన్ వల్ల బాగా చెమటలు పట్టేసాయి. ఇంకా తట్టుకోలేక హెల్మెట్ తీసి బండి నడుపుతున్నాడు.అతను అలా కష్టపడుతూ మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళే డొంక రోడ్డు లోకి [...]
"నేను నువ్వంటూ వేరే వున్నా నాకివేళ నాలో నువ్వునట్టుగా ....." అంటూ మోగుతోంది సంతోష్ ఫోన్. ఆ కాల్ తన భార్య సుకన్యనించి వచ్చింది.తనకొక్కదానికే ఆ టోన్ వస్తుంది. ఇంకో 10  కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఇల్లు వచ్చేస్తుంది. బండి వేగం ఇంకా కొంచెం పెంచాడు సంతోష్.మామూలుగా వేరే ఎవరైనా కాల్ చేస్తే డ్రైవ్ చేస్తూ మాట్లాడతాడు కాని సుకన్య అలా మాట్లాడితే తిడుతుంది [...]
నా మిత్రుడు నాకు పంపిన ఈ-మెయిల్ ఇక్కడ పొందుపరుస్తున్నాను. పాపం ఆ తండ్రికి సాద్యమైనంత సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను.Hi All,A 11 year old kid who is by birth deaf and dumb, has got an oppurtunity to become like us.After some tests the doctors have given hope for the kid and his family, that he would both listen and will be able to speak only if he gets operated.The cost of operation and medicines is 10 lacs and it is on 12th Jan 2012 in Visakhapatnam.The kids family is very poor and his Dad is a local school teacher. His father was able to arrange 6 lacs and still in need of rest of the amount. So if we can help the kid and contribute some amount even if its 50 or 100.. it will be very helpful for the kids operation and medication.Remember  “Small Drops Make A Mighty [...]
నీ గోకుడు...సాటేవ్వడుహే పరపరమంటూ ఎదురుగా ఎగబడుతూ గోకి నఖలని ధనా ధనా దించే...ఏ... జొరే....హమేషా గరగర అంటూ కలయపడి కలకలమే రేపే బినా ఏ భళా బురా సోచే...కామన్ ఎవేరీబడి లెట్స్ గీక్ గీక్ గీక్ నీ గోకుడువనావే..వనావే..వనావే...వనావే..సాటేవ్వడువనావే..వనావే..వనావే...వనావే..దురద జాడ తెలియగనే దుమ్ముదులుపు తక్షణమే  పనికి రాదు కనికరమే గోకుకొనుట అవసరమే వదలనురా  దురదలనే ప్రళయ [...]
ప్రతి బిల్డ్ కి కొత్త బగ్గులు వస్తుంటే కడుపు మండిన ఒక టెస్టర్ పాడుకుంటున్న పాట:(ఖలేజా లో "సదా శివ సన్యాసి...పాటను గుర్తుతెచ్చుకోండి)సదా శివ సన్యాసి మా డెవలపర్ సన్నాసి  వాడి బగ్గులు చూసి పొంగినాయి నా కళ్ళు వాచీ ఏ బటను క్లిక్కు కాదుగాడ్రాపు డవును లిస్టే రాదుగా చూడ చెత్తగా ఉంటాదిరా వేసేయ్ రా ఊరు వాడా దండోరా !!ఏ స్టయిలుల ఏ స్క్రిప్టుల పొడ లేదురా  ఏడు [...]
ఒక హైదరాబాదీ గా నాకు కనీసం నెలకి ఒక రోజు పైన మాట్లల్లో ఏదో ఒకటి వినిపిస్తుంది..నేను ఉండే చోట దేని ప్రభావం ఎక్కువ ఉండదు కనుక వీటి వలన నాకు వచ్చిన నష్టం ఏమి లేదు. కాని దీని ప్రభావం కొన్ని వర్గాల ప్రజల మీద భారీగా పడుతోంది. ఆ వర్గం పేరే బడుగు బలహీన మరియు మధ్య తరగతి వర్గం. ఈ వర్గం ప్రజలు రోజు పని చేస్తే కాని వాళ్ళ ఇంటిలో పొయ్యి వెలగదు. పని కి పోకపోతే పస్తే చాలా [...]
ఒక ప్రియుడు తన ప్రియురాలుని పొగుడుతూ ఇలా అన్నాడటసుతిమెత్తని నీ పాదాలు తెచ్చెను గజ్జెలకి అందంసుమధురమైన నీ పలుకులు తెచ్చెను భాషకి అందంసువర్ణభరితమైన నీ మోము తెచ్చెను అద్దానికి అందం సుగుణాలభరితమైన నీతో బంధం తెచ్చెను నాకు ఆనందం
"పెళ్లి అంటే నూరేళ్ళ పంట... ముట్టుకుంటే మంట... ఎందుకొచ్చిన తంట" వీటిలో ఏదో ఒకటి పెళ్లి కాని అమ్మాయి కాని అబ్బాయి కాని మనసులో అనుకునేదే. వాళ్ళు అలా అనుకోవటానికి వారి వారి కారణాలు చాలానే ఉంటాయి. ఇలాంటి పెళ్లి మీద నా ఆలోచనలు చెప్పాలి అని ఈ టపా:)ఏదో సినిమా(తులసి అనుకుంట) లో వెంకటేష్ గుక్కతిప్పకుండా 2 నిముషాలు చెప్తాడు.పెళ్లి గురించి ఏడు నించి ఒకటి దాక అంకెలు వచ్చేటట్టు [...]
మొత్తానికి నా జీవితం లో ఇంకో మైలురాయి చేరుకున్నా...నేను ఒకటవ తరగతిలో చేరేందుకు సరిపడా వయసు వచ్చింది నాకు...ఏంటి అర్ధం కాలేదా సరిగ్గా మూడు రోజుల క్రితం నాకు ఈ ఐ.టి రంగం లో ఐదేళ్ళ అనుభవం వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఐ.టి రంగం లో మొదటి తరగతి(టీం లీడ్) చదవచ్చు అన్నమాట. ఒక్క సారి నా ఈ ఐదేళ్ళ ప్రయాణాన్ని నెమరు వేసుకుంటే ఇలా అనిపించింది. ఎన్నో ఆసలు ఎన్నో కలలు మనసు నిండుగా [...]
సినిమా తారలు ఐ. టి లో పని చేస్తుంటే వాళ్ళ పంచ్ డైలాగులు ఇలాగ ఉండేవేమో:చిరంజీవి: 1. వీర బగ్గర్ రెడ్డి...! బాగ్గే కదా అని లైట్ తీసుకుంటే హైకు కట్ చేస్తా!!!2.తన బగ్గులని వెతకటానికని ఒక కొత్త టెస్టర్ ని తీసుకుంటే ఆ టెస్టర్ తో డైలాగు...   "థాంక్స్ చెప్పకు..నువ్వు కూడా నాలుగు బగ్గులు వదిలేసి ఇంకో ముగ్గురికి ఉద్యోగం ఇప్పించు...వాళ్ళని థాంక్స్ [...]
యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి కష్టాలు...పండగ లేదు పబ్బం లేదు రాతిరిలేదు పగలు లేదు...పెళ్ళాం లేదు పిల్లలు లేరు పని మాత్రం గంపెడుంటది...యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి బ్రతుకులు...సెనివారమెల చేలినేంట పెట్టుకొని సినిమాకి పోతే...సెల్లుమోగే గుండె పగిలే..ఆఫీసుకి రమ్మని ఫత్వాలు వచ్చే...మెల్లంగ చూసి చెలి చెవిన వేస్తే చీ..పో అంటే చీదరించి పంపే...యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి [...]
నూతన సంవత్సర శుభాకాంక్షలు...ఈ ఏడాది మీరు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను ఖర నామ సంవత్సరం మీ కరములని సంపదలతో నింపాలని కోరుకుంటూ .....మీ నేస్తం
కారుమబ్బులు కమ్ముతున్న సమయం..కుమార్ ఆకాశాన్ని పట్టించుకొనే పరిస్థితిలో లేడు. తన ముందిప్పుడు రెండే మెదులుతున్నాయి. ఒకటి తనను ఇంతటివాడిని చేసిన తల్లిదండ్రులు రెండు తను ప్రేమించిన సరోజ. వాళ్ళలో ఎవరిని వదులుకోలేడు కాని ఇద్దరు ఉండే దారి కనపడట్లేదు. చాలా రోజులనించి ఈ సమస్య పరిష్కారం కోసం అలోచించి ఇంకా ఆలోచించలేక ఏ సమాధానం దొరకక తన చావుతో సమస్య [...]
నిన్న మిలియన్ మార్చ్ లో విగ్రహాలు పడగొట్టటం నాకు ఎందుకో బాధ గా అనిపించింది. అవి ప్రాణం లేని విగ్రహాలు వాటిని పడేస్తే పోయేది ఏముంది అని అడగచ్చు నిజమే  వాటికీ ప్రాణం లేదు. కాని వాళ్ళకి ఈ ప్రాంతీయ గొడవలకి కూడా  ఎటువంటి సంబంధం లేదు. అసలు వాళ్ళు జీవించిన సమయం లో ఈ రెండు ప్రాంతాలు లేవు [...]
నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాకు హృతిక్ రోషన్ అంటే బాగా ఇష్టం. కాని అప్పుడు వుండే లిమిటెడ్ బడ్జెట్ కి అన్ని సినిమాలు చూడటం అయ్యేది కాదు. అలా ఇష్టం కొద్ది చూసిన ఒక సినిమా "లక్ష్య"..అందులో "మై ఐసా క్యు హుం" అని ఒక పాట వుంటుంది. అందులో డాన్సు కోసం పడి పడి చూసేవాడిని ఆ పాటని నా కంపూటర్ లో పెట్టుకొని...కాని అప్పుడు నాకు తెలియదు నా జీవితం లో అది situational  సాంగ్ [...]
ఉవ్వెత్తున ఎగసిపడే సంద్రం ఉనికి కోల్పోయిన క్షణంరహదారి రణగొణ ధ్వనులు మరచి మూగబోయిన క్షణంఉదయభానుడు ప్రజ్వలజ్యోతి నశించి నల్లబోయిన క్షణంనన్ను వీడి నా ఆత్మ అంతర్ధానమవుతున్న ఆ క్షణం
చిన్నప్పటి నించి మనకి మన పెద్దవాళ్ళు చాలా చెప్తుంటారు. ఉదాహరణకి పగిలిన అద్దంలో తల దువ్వకూడదు, రాత్రిళ్ళు గోళ్ళు తీయకూడదు ఇలాగ. కాని ఎందుకు అని అడిగితే మాత్రం చాలావరకు "అది మన ఆచారం" అనో "అది అంతే" అనో సమాధానం వస్తుంది. నాకు ఇది నచ్చక నేనే సమాధానం వెతకటం మొదలు పెట్టాను. ఇవి కేవలం నా ఊహాజనిత కారణాలే  నిజమైన కారణాలు అవచ్చు కాకపోనువచ్చు.ఈ మధ్య వరకు నేను [...]
చాలా మంది మిత్రులు దీపావళికి మనం కాల్చే టపాసుల వలన శబ్దకాలుష్యం, వాయుకాలుష్యం జరుగుతాయి అని కాబట్టి దీపావళికి టపాసులు కాల్చొద్దు అని నాకు చెప్పారు. నేను చాలా ఆలోచించగా నాకు అనిపించినా కొన్ని విషయాలు చెప్దాము అని ఈ టపా రాస్తున్నాను. పాతకాలం లో  దీపావళికి ఎవరి ఇళ్ళలో వాళ్ళు టపాసులు చేసుకొనే వారని మా నాన్న చెప్తుంటారు. అప్పుడు ఇంటిలో చేసే టపాసులు అంత హానికరమైనవి [...]
మొదటి సారి గగన ప్రయాణం చేస్తున్న ఒక వ్యోమగామి అంతరిక్షంలోనించి భూమిని చూస్తూ..... కనుబొమ్మల ముందు కనపడు గోళమునకనువిందు చేయు పచ్చిక కాన రాగకన్నులముందర గ్రహాలూ బంతులు కాగా  ధరణిని గాంచినాతడు మిక్కిలి సంతసించే!కాంతులీను తారల నడుమ మనసు మోహనరాగమాలపించగాకనురెప్పలు గ్రహగతులకు తాళము వేయగాతేలియాడు శరీరము తాళమునకు నాట్యమాడగాకనుమరుగవుతున్న ధరణి కాంతులాతని కన్నుల [...]
అది జనవరి మాసం...సంక్రాంతి సమయం... దూరం గా నక్కలు నిద్రపోతున్న సమయం...దగ్గరలో ఉన్న కోళ్ళు కూస్తున్న సమయం.నలుపంటే  ఇష్టంలేని రామేశం రామేశ్వరం నించి తిరిగి వస్తున్న సమయం.....రామేశం రామాలయం సందు తిరుగుతుండగా అడ్డం గా ఒక నల్ల కుక్క తన వీపు మీద నల్ల పిల్లిని ఎక్కించుకొని ఎదురుగా వచ్చింది. దానిని చూడగానే రామేశం రామనామం జపించటం మొదలెట్టాడు. అలాగే భయపడుతూ నల్ల పిల్లి కుక్కని [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు