ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు చాలాసేపు మాట్లాడింది అబ్బూరి వరదరాజేశ్వరరావుగారితో. ‘లోహిత’నుప్రారంభించినప్పుడు జయ ప్రభతో కలిసి బాగ్‌లింగంపల్లిలోని ఛాయాదేవిగారింటికి వెళ్ళినపుడు ఆయన గలగలా మాట్లాడుతుంటే ఆవిడ లోపల్నించి తినడానికి ప్లేటులో అమర్చిన జంతికలో, [...]
మార్చి నెలాఖరు… చేస్తున్న పనులన్నీ సంతృప్తికరంగా ముగిసాయి. ఓ రెండు రోజులు ఎటైనా ఎగిరిపోదామని మనసు రొద పెడుతుంది. ఎక్కడికెళ్ళాలి? ఎండలు చూస్తే మండుతున్నయ్‌. అయినా సరే వెళ్ళాలి. నల్లమల కళ్ళముందు కొచ్చింది. రా… రా… అని పిలవడం మొదలుపెట్టింది. ఆకురాలు కాలం… అడివంతా నగ్నంగా, నిజరూపంతో సాక్షాత్కరించే కాలం. పచ్చదనం మచ్చుకైనా కనబడదు. అయినా సరే వెళదామని [...]
--కొండవీటి సత్యవతి........................................ ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను.ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లితండ్రులు.నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి.వృద్ధాశ్రమంలో తమ తల్లి తండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు.ఇక్కడున్న చాలా మందికి పెద్దపెద్ద ఇళ్ళు,కొందరికి పొలాలు,ఆస్తులూ ఉన్నాయి.ఎవ్వరూ [...]
రేపటి కల  -కొండవీటి సత్యవతి హాలంతా చప్పట్లతో మారుమోగుతుంటే అశ్విని నిటారుగా నడుస్తూ స్టేజిమీదకు వెళ్ళింది. ”యువనాయకురాలు” పురస్కారం స్వీకరించింది. మరోసారి చప్పట్లు… ఆగకుండా. ముందు వరుసలో కూర్చున్న అనన్య కళ్ళల్లో నీళ్ళుబికాయి. కన్నీళ్ళ మధ్య అశ్విని ముఖం మసకబారినట్లయింది. జర్నలిస్టుగా తాను సాధించిన విజయాల్లో అశ్విని కథ చాలా గొప్పది. ‘అశ్విని విజయం వెనక [...]
మా అమ్మకి 50 ఏళ్ళ వయసపుడు మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయినపుడు నేను హైదరాబాదులో అనామకంగా ఉన్నాను. ఆయన చనిపోయాడని నాకు చెప్పకుండా నన్ను ఊరికి రమ్మన్నారు. నేను వెళ్ళేటప్పటికి మా నాన్న లేడు. మా అమ్మని మా పడిమీద వసారాలో చీకట్లో కూర్చోబెట్టారు. ఎవరెవరో రావడం, మా అమ్మ, అక్కలు, వదిన గొల్లుమంటూ ఏడవడం. నాకు అలా ఏడవడం రాదు. మా వీథి అరుగుమీద కూర్చుని మా నాన్నని [...]
చెట్టు మీద పిట్టల్లే నన్ను స్వేచ్చగా పెంచిన నాన్న.......... ఈ రోజు తండ్రుల దినమట.మా నాన్నని తలుచుకుంటుంటే ఏమి గుర్తొస్తుంది.ఆయన రోజంతా చేసిన కష్టం గుర్తొస్తుంది.పొలంలో ఆరుగాలం పనిచేసిన రోజులు గుర్తొస్తాయి.మా ఆవు కోసం పచ్చగడ్డి కోసుకొచ్చి మా వీధి అరుగు మీద అలా వొరిగి నిద్రపోయే నా నాన్న గుర్తొస్తాడు.మా ఆవు కోసం చిట్టు... తవుడు గంపలో కలుపుతుంటే చెంబుతో నీళ్ళు పోసిన దృశ్యం
చట్టాలూ – సహాయ సంస్థలూ… మనం – కె. సత్యవతి, పి. ప్రశాంతి...మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినం అభినందనలు. ‘హేపీ న్యూఇయర్‌’ లాగా ‘హేపీ ఉమన్స్‌ డే’ ఒక గ్రీటింగ్‌లాగా పడికట్టు పదంగా మారిపోయింది. ఎన్నో సవాళ్ళ మధ్య, హింసాయుత పరిస్థితుల్లో, మతమౌఢ్యపు అంధకారంలో నిత్య పోరాటం సల్పుతున్న ఆధునిక మహిళకు అరుణారుణ అభివందనాలు, అభినందనలు. మత అసహనం తోడేళ్ళ గుంపులాగా వెంటాడుతున్న ఈనాటి [...]
 కొండవీటి సత్యవతి . నిర్మల మొబైల్ ఫోన్లోంచి ఖయ్‌మంటూ విజిల్ శబ్దం. ‘‘నన్నిక పనిచేసుకోనివ్వదా’’ అనుకుంటూ ఫోన్ లేసి చూసింది. అనల అమెరికా నుంచి... వాట్సప్‌లో మెసేజ్. ‘‘అమ్మా! నేనొస్తున్నాను. టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. నువ్వు కూడా శెలవు పెట్టేయ్’’ ‘‘క్రిస్మస్ శెలవులు ... ఆ తర్వాత సంక్రాంతి శెలవులు’’ ‘‘సరె అన్నూ! ఏ రోజు బయలు దేరతావు’’ ‘‘డిశంబరు పది... మనం నాలుగురోజులు [...]
ఫోటోల కోసం నా ఫేస్ బుక్ పేజీని దర్శంచండి https://www.facebook.com/satyavati.kondaveeti Chai-enge 16 th Story ~ కొండవీటి సత్యవతి గారితో జీవన'చాయ్' 11. 26. ఈ రాత్రి ఒక స్నేహశీలి గిరించి రాయాలని, రేపటి స్నేహితుల రోజుకి ఒక కానుకలా ఇవ్వాలని ఇప్పటికే రాసిన దానికి ఇంట్రడక్షన్ జత చేస్తున్నాను. తను సత్యవతి గారు. స్నేహానికి చిరునామా. భూమిక' తొలి పరిచయం తోనే ఈ విశేషణం ఎలా సాధ్యం అంటే 'ఒక మెతుకు
ఈ రోజు తండ్రుల దినమట.మా నాన్నని తలుచుకుంటుంటే ఏమి గుర్తొస్తుంది.ఆయన రోజంతా చేసిన కష్టం గుర్తొస్తుంది.పొలంలో ఆరుగాలం పనిచేసిన రోజులు గుర్తొస్తాయి.మా ఆవు కోసం పచ్చగడ్డి కోసుకొచ్చి మా వీధి అరుగు మీద అలా వొరిగి నిద్రపోయే నా నాన్న గుర్తొస్తాడు.మా ఆవు కోసం చిట్టు... తవుడు గంపలో కలుపుతుంటే చెంబుతో నీళ్ళు పోసిన దృశ్యం గుర్తొస్తుంది.మా తోటల్లో కూరగాయల మొక్కలకు దిగుడు [...]
మనకి అన్నీ ఉత్సవాలే ఏముంది సెలబ్రేట్ చేసుకోవడానికి?? ఏమి సాధించామట??? భళ్ళున గాజులు పగలకొట్టడం మానేసారా??? కృరంగా బొట్టు చెరిపేయడం మానేసాసా?? తెల్ల చీరలు కట్టించడం మానేసారా?? సొంత బిడ్డల పెళ్ళి మంటపంలోకి గౌరవంగా పిలవడం నేర్చేసుకున్నారా?? "పరమ పవిత్రత" ఆపాదించి అందరి మెడలకి తాకించే తాళి బొట్టుని ఆమె మెడకి కూడా తాకించే సంస్కారం అలవరుచుకున్నారా? పొద్దున్నే [...]
                                                          కొండవీటి సత్యవతి నాగార్జున సాగర్‌ వెళ్ళే దారిలో, గుర్రంగూడ గ్రామంలో ఈ విపాశన సెంటర్‌ వుంది.జూలై 19 వ తేదీన 1.30కి విపాసన సెంటర్‌ చేరాను. 2.15 కంతా అప్లికేషన్‌నింపడం అయ్యింది. అప్లికేషన్‌ నింపాక పద్మజ అనే ఆవిడ దగ్గరికి (టీచర్‌)వెళ్ళమన్నారు.  అన్ని నియమాలకు కట్టుబడివుంటారా? రూల్స్‌ మరియు [...]
జనవరి 26,సాయంత్రం 5 గంటలకు ,సుందరయ్య విజ్ఞాన కేంద్రం,బాగ్ లింగం పల్లిప్రొఫెసర్: ఉమా చక్రవర్తి,కోసాంబి చారిత్రక దృక్పధం -ఇవాల్టి ఆలోచనలుబుక్ రిలీజ్ ........హైదరాబాద్ బుక్ ట్రస్ట్(2007 లో భూమిక ప్రచురించిన ఉమా చక్రవర్తి ఇంటర్వ్యూ...ఆమె హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ......) ప్రతిస్పందన → సమూల పరివర్తన ద్వారానే స్త్రీవిముక్తి సాధ్యం Posted on August 10, 2007 by భూమిక (డా|| ఉమ చక్రవర్తితో డా|
(ఇటీవల మహిళా సమత సొసైటి వారితో కలిసి పసిపిల్లల మరణాలు అధికంగా...ప్రమాదకర స్థాయిలో నమోదైన మద్దెలచెరువు గ్రామాన్ని సందర్శించాను.. దాని మీద నేను రాసిన రిపోర్ట్ ఇది.దీనిని మహిళా శిశు అభివృద్ధి శాఖ వారికీ,వైద్య ఆరోగ్య.కుటుంబ సంక్షేమ శాఖవారికీ సమర్పించాను. గత సంవత్సరం లో నన్ను అమితంగా బాధించిన సంఘటనల్లో ఇదొకటి. ఈ గ్రామం లో నమోదైన ఐ ఎం ఆర్ జాతీయ గణాంకాల్ని ప్రభావితం [...]
మీటింగులు..పనులు....భూమిక పత్రిక పని...హెల్ప్ లైన్ కేసులు...ఎంత వొత్తిడి ఉన్నా 5.30 అయ్యేసరికి రవీంద్ర భారతి మీద వాలిపోవడం...తొలిరోజు గీత...మలిరోజు మూడో రోజు నాతో ప్రశాంతి...ప్రాణనేస్తాల తో కలిసి రసాస్వాదనం...వనమాలి అనే సాంస్కృతిక సంస్థ ...వీటి బాధ్యులు దేవి...శాంతారావ్...మహేష్.మూడు రోజులపాటు 5.30 నుంచి 10.30 దాకా నాటకం నన్ను పూనింది...మొదటి రోజు రాయలసీమ
నా జీవితంలోప్రేమకే స్థానంపూజకి లేదు .నా చేతులుపాటుపడతాయ్ప్రార్ధన చెయ్యవు .నా కోరికలునేను తీర్చుకోవాల్సినవేఏ శక్తి,భక్తి తీర్చేవి కావు .నా సాష్టాంగ ప్రణామంనా కన్నవాళ్ళకేకపట సన్నాసులకు కాదు .నాకు జీవితమంటేఅలుపెరుగని పోరాటమేఅర్ధింపులు,వేడికోళ్ళు అస్సలుండవ్ .నా ఇంట్లో పూజ గదులుండవ్ప్రేమ గదులుంటాయ్పుస్తకాల గదులూ ఉంటాయ్ .నన్ను నేను సమర్పించుకునేదినా లోని [...]
ఆదిలాబాదు అడవుల మీద మోహం ఈనాటిదా? కాదు కాదు…. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. సమతా రోషిణి ఆ జిల్లాలో పనిచేసినపుడు… మనోరమ ఆదిలాబాదు కలెక్టారాఫీసులో ఉద్యోగం చేసినపుడు…. చాలా చాలా అనుకున్నాను. ఎన్నోసార్లు వాళ్ళను అడిగాను.  ఆదిలాబాదు ట్రిప్‌ వేద్దాం… వివరాలు సేకరించండి అంటే…. ఎవ్వరూ వినలేదు. నా కోరిక అలాగే దాక్కుని వుండిపోయింది. ఆ అడవి మీద మోహం మరింతగా [...]
ఆ రోజు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియమ్‌లోకి ప్రవేశించేటప్పుడు మనసులో ఓ చిన్న అసౌకర్యం. అయితే అంతకుముందు గేటు బయట చూసిన వైలెట్‌ కలర్‌ పూలబంతులు ఈ అసౌకర్యాన్ని చాలా వరకు తగ్గించేసాయి.ఆ పూలను చూసాకా కూడా మనసులో చీకాకులు, చింతలు మిగిలివున్నాయంటే మనం సరిగ్గా లేమన్న మాట. అంతకు ముందు అదే దారిలో వచ్చిన భానుజ గానీ, జమున గానీ ఆ పూలను చూడనే లేదు. అలా ఎలా చూడకుండా వుంటారా అని [...]
నేనూ..... నా లైఫ్ లైన్ మా సీతారామపురంనిన్నటి ఆంధ్రజ్యోతి నవ్య లో మా ఊరి గురించి నా తీపి గుర్తులు.నిన్నంతా నేను గీత, అన్నవరం,తలుపులమ్మ లోవ,దానవాయి పేట బీచ్,పంపానది చుట్టూ చక్కర్లేస్తున్నాను.అప్పుడు ఈ ఆర్టికల్ వచ్చిందని వందలాదిగా ఫోన్స్.మీరూ చదివేస్తే ఓ పనైపోతుంది. http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHY/2013/12/08/ArticleHtmls/08122013101015.shtml?Mode=1
చాలా సంవత్సరాలుగా కాకినాడ సమీపం లో ఉన్న మడ అడవుల గురించి వింటున్నాను. నేను పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలోనే కానీ తూర్పు గోదావరిలో ఉన్న అందమైన మడ అడవుల్ని చూడడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది.నా రాజమండ్రి ప్రయాణానికి కారణాలు వేరే ఉన్నాయి కానీ నా మనసులో తిష్ట వేసినవి మాత్రం కోరింగా మంగ్రూవ్ ఫారెష్ట్.ఈ
"అల"జడులు  నా కవిత్వం నేను రాస్తున్న కవిత్వం పేరు 'అల 'జడులుఇవి నా గుండెల్లో అలజడుల ఆనవాళ్ళు జీవితం కట్టుకొయ్యకు కట్టేసినట్టు అనిపించిందంటే కనబడని కట్లను విప్పుకోవడం మొదలెట్టాల్సిందే!!   *** ఎవ్వరూ ఆపకపోయినా నీ దారుల్లో నువ్వెళ్ళలేకపోతున్నావంటే నీ మార్గమేదో నీకింకా స్పష్టమవ్వనట్టే !!! *** ఏ సంబంధం లోను లేని బానిసత్వం  భార్యాభర్తల సంబంధంలో ఎందుకుందో ఎప్పటికి [...]
ఈ రోజు నేను గీత (నా నేస్తం)లంచ్ చేస్తూ బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటుంటే....... హఠాత్తుగా నా బుర్రలోకి ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది.ఉదయం లేచిన దగ్గర నుండి ఇంటింటికీ ఎన్నో అవసరాలుంటాయి.ఎన్నో సర్వీసులు కావాల్సుంటుంది.పెద్దవాళ్ళు,వ్యాధిగ్రస్తులై మంచాన పడ్డవారికి హోం నర్సులు,ఇంట్లో సహాయం చెయ్యడానికి హౌస్ మెయిడ్స్,వారం వారం ఇల్లు శుభ్రం చెయ్యడానికి హౌ కీపర్,తోటని [...]
కర్నూల్ లో ఉన్న పది రోజుల్లో నా చుట్టూ ఉన్న ప్రకృతిఎన్ని భిన్న కోణాల్లో కనిపించిందో,నా లోపల ఎన్ని అనుభవాలను నింపిందోవర్ణించలేను కానీ చూపించగలను.క్షణానికో అనుభవం,నిమిషానికో అనుభూతి.ఆకాశం పగలు ఎంత అద్భుతంగా ఉంటుందో రాత్రి మరింత అందంగా ఉంటుంది.పగలు రాత్రి తేడా తెలియని ఉద్విగ్నం లో మునిగిపోయాను.ఎన్ని నదుల్ని చూసాను....క్రిష్ణ, తుంగభద్ర, హంద్రి.....ప్రకృతిని ఎప్పుడూ [...]
ఫేస్ బుక్ లో ఈ రోజు పూజలు,వ్రతాలూ,నోముల గురించి నేను రాసినవి చదివి చాలా మంది మెచ్చుకున్నారు,కొంతమంది నొచ్చుకున్నారు.కొంతమంది మీరు చెయ్యకపోతే మానెయ్యండి కానీ వేరేవాళ్ళని మానమని చెప్పకండి అని కోప్పడ్డారు.కానీ.... నేను చెయ్యదలుచుకున్నవి..చెప్పదలుచుకున్నవి చేసి తీరతాను.నేను సైన్స్ చదువుకోలేదు(ఓరియంటల్ టెంత్ క్లాస్) కానీ శాస్త్రీయ దృక్పధం [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు