కొన్ని రాజకీయపార్టీలు, షాపుల అడ్వరటైస్ మెంట్స్ వాళ్లు  రోడ్దు  వెంబడి పెద్ద సౌండుతో మైకులో అనౌన్స్ చేస్తూ వెళ్తుంటారు. ఇవన్ని చాలా ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని మీటింగుల సందర్భంగా  ఎక్కువ సౌండుతో మైకులో చెబుతుంటారు. చుట్టుప్రక్కల ఇళ్ల వారికి  సంగతి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. మైక్ సౌండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్నా సరిగ్గా వినబడదు. సౌండ్ [...]
Sunday, October 31, 2010 సాయి సాయి పూజా నియమములను ఉన్నదున్నట్లు తెలుసుకోవటం ఎంతో అవసరం. ఎందుకంటే ఎంతో కష్టపడి కఠిననియమములను పాటించి ...... దైవాన్ని ఆరాధించి శీఘ్రముగా పరమాత్మను పొందాలనుకొనేవారు ఎందరో ఉంటారు. సామాన్యులు కూడా సరియైన పధ్ధతులను తెలుసుకోవటం ద్వారా వారికి వీలయినంత నియమములను పాటించటానికి ప్రయత్నిస్తారు. లౌకికపరమయిన కోరికలను (విద్య, ఉద్యోగం ) సాధించాలంటేనే, [...]
గోవు   సకల   దేవతాస్వరూపం   కాబట్టి,   నూతన  గృహప్రవేశ   సమయంలో     ఆవును    తీసుకు  వచ్చి     గృహప్రవేశం   చేయిస్తే  మంచిదంటారు. .  పాతకాలంలో   అపార్ట్మెంట్స్  లేవు  కదా  !  అప్పుడు     గోవు   గృహప్రవేశానికి    ఏమీ  ఇబ్బంది  ఉండేది  కాదు.  అయితే  ఈ  రోజుల్లో  అపార్ట్మెంట్స్  పుణ్యమాని  ఎన్నో  అంతస్తుల  ఎత్తున  ఇళ్ళు  ఉంటున్నాయి  .  అయినా  మనవాళ్ళు  ఊరుకోరు  .....  .  కొందరు  
ఈ మధ్య జరిగిన విషయాన్ని తెలియజేస్తాను.  మాకు  తెలిసినవాళ్ళు వాళ్ళింటికి రమ్మని ఎప్పటినుంచో పిలుస్తున్నారు. మేము కూడా వాళ్ళింటికి వెళ్ళాలని అనుకున్నాం. అనుకోకుండా మా బంధువులు కూడా మొన్న వారింటికి  వెళ్దామని అనటంతో  బయల్దేరటం జరిగింది.  అయితే, అప్పటికే సాయంత్రమవుతోంది. తిరిగి వచ్చేటప్పటికి ఆలస్యమవుతుందేమో అనిపించి,  త్వరగా సాయంకాలపు దీపారాధన కొంచెం పూజ చేసి [...]
Monday, October 4, 2010 దైవపూజ సుఖముగా ప్రశాంతముగా చేసుకోవాలండి. విసుగుతోనో, భయపడుతూనో చేయకూడదు. భగవంతుడు దయామయుడు. పూజలో లోటుపాట్లను ఆయన క్షమిస్తారు. వాటి గురించి అతిగా ఆలోచించి దైవపూజలకు , దైవానికి దూరమవ్వటం మరీ పాపం.నేను ఒకదగ్గర ఇలా చదివానండి. తీర్ధప్రసాదములు తీసుకుని గుడిలోనుంచి బయటకు వచ్చాక తిరిగి వెంటనే మళ్ళి గుడిలోకి వెళ్ళకూడదని......... పెద్దలు ఇలా ఎందుకు చెప్పారో ?
Saturday, September 18, 2010 ఈ రోజుల్లో కొన్ని పధ్ధతులు పాటించటం కుదరకపోవచ్చండి.ఉదా.......ఏదైనా గుడికి గానీ పుణ్యక్షేత్రములకు గానీ వెళ్ళేముందుగానీ, తిరిగి అక్కడినుండి వచ్చేటప్పుడు గానీ ఇతరుల ఇళ్ళకు వెళితే మన పుణ్యములు వారికి, వారి పాపములు మనకు తగులుతాయని నేను ఒక దగ్గర చదివానండి. ఇది పాటించటం ఒకోసారి చాలా కష్టంగా ఉంటుంది.అయితే పాతకాలంలో కొందరు ఊళ్ళు తిరుగుతూ బంధువుల ఇళ్ళలో [...]
ఒకప్పుడు నారదులవారు తామే గొప్ప విష్ణుభక్తులమని భావించి, ఆ మాట విష్ణుమూర్తి ద్వారా వినాలనుకుని వైకుంఠానికి వెళ్లి అడగగా, విష్ణుమూర్తివారు  భూలోకంలో కూడా ఒక రైతు తనకు గొప్ప భక్తుడని తెలియజేస్తారు.   అంత గొప్ప భక్తుడు ఎలా ఉంటాడో చూడాలని కుతూహలంతో నారదుడు భూలోకానికి వెళ్లి చూడగా, ఆ రైతు తన స్వధర్మాలను చక్కగా నిర్వర్తిస్తూ తనకు వీలు కుదిరినంతలో విష్ణుమూర్తిని [...]
ఎవరైనా మతం మారటానికి ఎన్నో కారణాలు ఉంటాయేమో? హిందువులలో కొందరు అంటరానితనం వంటి కారణాలతో బాధపడి మతం మారితే,కొందరు మారటానికి మరి కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు. ఇంకా మరికొన్ని విషయాలను గమనిస్తే, ఆధునిక కాలంలో ఆచారవ్యవహారాల్లో వచ్చిన విపరీతపోకడలు కూడా ఇందుకు కారణం కావచ్చు. ఆచారవ్యవహారాల్లో  క్లిష్టత ఉన్నాకూడా ప్రజలు సరళంగా ఉండే విధానాలపట్ల మొగ్గుచూపే అవకాశం [...]
మేము చెన్నైలో ఒక అపార్ట్మెంట్లో ఉండే రోజుల్లో  అపార్ట్మెంటుకు సెక్రటెరీగా ఒకామె ఉండేవారు. ఆమె బాగా చదువుకున్నామె . నాకు ఆమె గురించి ఎక్కువ విషయాలు తెలియవు.  అయితే, అపార్ట్ మెంట్  లో  తెలుగు తెలిసిన ఒక పెద్దామె నాకు బాగా పరిచయం అయ్యారు. ఆ పెద్దామె ఎన్నో  కబుర్లు చెప్పేవారు. మాటల్లో సెక్రటరీ కుటుంబం గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేసారు. ఉదా.. సెక్రటరీ,  శ్రీ [...]
శ్రీలక్ష్మీదేవి  జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు. పెద్దలు అష్టలక్ష్ముల గురించి తెలియజేసారు.  ఇంకా  ఎన్నో చక్కటి విషయాలను తెలియజేసారు.  ఇంటి ముందు ఆవుపేడతో కళ్ళాపి జల్లటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. ఆవుపేడ నీటితో కలిపి జల్లటం వల్ల ఇంటి పరిసరాల్లో ఉన్న చెడు బాక్టీరియా పోయి ఇంట్లో వాళ్ళకు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు [...]
చదువు, జ్ఞానం, ప్రతిభ, నేర్పరితనం లాంటి అర్హతలు అన్నీ ఉన్న వారు పురుషులయినా స్త్రీలయినా , నూటికి యాభై జనాభా టాలెంట్ దేశానికి తప్పక ఉపయోగపడాలి. ఈ రోజుల్లో చాలామంది డబ్బు సంపాదించటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. డబ్బు వల్లే అన్ని సంతోషాలనూ పొందలేము కదా ! కొందరు వ్యక్తులు దేశం మీద పడి ఇతరుల సొమ్మును కాజెయ్యటం, బలహీనులను హింసించటం..వంటి పనులను చేస్తుంటారు. ఇలాంటి [...]
కొందరు ఏమంటున్నారంటే, స్త్రీలు ఎన్నో రంగాలలో ముఖ్యమైన స్థానాలలో ఉంటే సమాజం బాగుపడిపోతుంది అంటున్నారు. అయితే, గత ఏభై సంవత్సరాల నుంచీ గమనిస్తే, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు..ఇంకా ఎన్నో ఉద్యోగాలు, వ్యాపారాలలో స్త్రిలు  పని చేసారు, పనిచేస్తూనే ఉన్నారు. మరి, చాలామంది స్త్రీలు ఎన్నో రంగాలలో  ముఖ్యమైన పాత్రల్లో ఉన్నా కూడా.. సమాజంలో నేరాలు జరుగుతూనే [...]
పాతకాలం స్త్రీలు భర్త సంపాదించి తెస్తే ఆ సొమ్ముతో ఇంటి బాధ్యతను నిర్వర్తిస్తూ పిల్లలను దగ్గరుండి పెంచుకుంటూ ఇంటి అజమాయిషీ నిర్వర్తిస్తూ హాయిగా ఉండేవారు. అప్పటి స్త్రీలకు బంగారం రూపంలో కూడా సంపద ఉండేది. ఆ స్త్రీ ధనాన్ని పురుషులు వాడుకునేవారు కాదు. ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళు ఏమంటున్నారంటే భార్య బాగా చదివి, పెద్ద ఉద్యోగం చేసి ఎక్కువ జీతం తెస్తూ , ఇంట్లో [...]
కొంత పాతకాలంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఇంటిపట్టున ఉన్న రోజుల్లో స్త్రీలు ఎన్నో కష్టాలు పడుతున్నారని భావించి ..బైటకు వచ్చి, విద్యను అభ్యసింటం, ఉద్యోగాలు చేయటం,వ్యాపారాలు చేయటం ఎక్కువయింది. సరే, మరి ఇప్పడు స్త్రీల పరిస్థితి ఎలాగుంది ? ఈ రోజుల్లో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను గమనిస్తే ఏమనిపిస్తుందంటే,ఈ రోజుల్లో స్త్రీల పరిస్థితి పెనం పైనుంచి పొయ్యిలో పడినట్లు [...]
ఈ మధ్యన భారతదేశం 104 ఉపగ్రహాలను ఒకేసారి విజయవంతంగా ప్రయోగించటం ఎంతో గొప్ప విషయం. ఇస్రో వారు మరియు ఈ విషయంలో పనిచేసిన అందరూ అభినందనీయులు. ఈ విషయం గురించి ఆలస్యంగా రాస్తున్నాను కానీ... నాకు కూడా ఆ రోజు చాలామంది భారతీయులలానే టెన్షన్ అనిపించింది. ప్రయోగం విజయవంతం అయ్యాక ఎంతో సంతోషం కలిగింది. అంతా దైవం దయ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూతన భవనాలు ప్రారంభోత్సవం జరిగిన [...]
ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి వింటుంటే సమాజం ఎటుపోతోందో అర్ధం కావటం లేదు. మహిళలపై  అత్యాచారాలు జరగటం చాలా ఘోరం. మరొక ఒక సంఘటనలో ఒక యువకుడు యాక్సిడెంట్ గురయ్యి రోడ్డుపై విలవిలలాడుతూ తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేయమని ప్రాధేయపడుతూ ఫోన్ నంబర్ ఇచ్చినా చుట్టుప్రక్కల గుమికూడిన జనం స్పందించలేదట.  కొందరయితే ఆ యువకుడు గిలగిలలాడుతుంటే సెల్ ఫోన్లో చిత్రీకిరిస్తూ [...]
Wednesday, January 29, 2014   ఈ  రోజుల్లో  సమాజ  వ్యవస్థ  గందరగోళంగా  తయారయింది.  పిల్లల  పరిస్థితి  మరీ  అయోమయంగా  ఉంది .  పెద్దవాళ్ళు  తమ  స్వేచ్చ  గురించి,  తమ  హక్కుల  గురించి  మాట్లాడుతున్నారే  గానీ  పిల్లల  హక్కుల  గురించి   మనం  ఏం  చేస్తున్నాము ? పూర్వం  మగవాళ్ళు  కుటుంబం  కోసం  డబ్బు  సంపాదించటం,  ఇంటికి  కావలసిన  సరుకులను   తేవటం  వంటి  పనులను  చేస్తే ,  స్త్రీలు  ఇంటిని 
ఓం  మహాశివరాత్రి సందర్భముగా అందరికి శుభాకాంక్షలు.
 జీవితంలో మంచి జరగాలంటే చెడ్డపనులు చేయకుండా మంచిగా ప్రవర్తించటం అవసరం.  మంచిగా జీవించటానికి కనీసం ప్రయత్నించాలి. **************** అజామిళుని కధ. వంటి కధలను చెప్పటంలో.......* పురాణేతిహాసాలలోని   చరిత్రలను  తెలుసుకుంటుంటే,   దైవము మరియు   పెద్దలు  మన  కోసము   ఎంతగా   ఆలోచిస్తారో కదా  !  అనిపిస్తుంది. ప్రపంచములోని   ప్రతి ఒక్కరూ  మంచి   ప్రవర్తనను  కలిగి   దైవానికి   దగ్గరవ్వాలని (  [...]
ఓం  పూర్వము అయోధ్యను పాలించే దశరధమహారాజు కొలువై ఉండగా అందలి జ్యోతిషశాస్త్రజ్ఞులు రాజుగారితో ఇట్లనిరి. ఓ రాజా! గ్రహములలో కడు క్రూరుడైనటువంటిన్నీ , దేవరాక్షసులకు సైతము భయము గొల్పునటువంటిన్నీవాడైన శనైశ్చరుడు కృత్తికాంతమును ప్రవేశించి రోహిణీశకటమును భేదింపబోవుచున్నాడు. దానివలన 12 సంవత్సరములు దుర్భిక్షము కలుగును.    ఆ మాటలు విని దశరధుడు మంత్రి పురోహితులతో [...]
  ఒకప్పుడు దశరధుడు శనిదేవుని వద్దకు వెళ్ళి ప్రార్ధించగా..శనిదేవుడు వరాలను ఇచ్చారని తెలుస్తోంది. .దశరధుల వారు  చేసిన శని స్తోత్రాన్ని చదవటం (లేక వినటం).. శ్రావణ మాసంలోనిశనివారమున నల్లనివస్త్రము, నువ్వులు దానం చేయటం లేదా తిలతైలాభిషేకము చేయటం...ద్వారా భక్తులకు మంచి జరుగుతుందని.. తెలుస్తోంది. అహంకారం ,ద్వేషాలు.. మొదలైన వాటివల్ల మనుషులు ఎన్నోతప్పులు చేస్తారు. [...]
Friday, July 13, 2012 శ్రీ శనిదేవుని మహిమలు......రెండవ భాగము. ఓం.....శ్రీ  శనేశ్వరులు  నికృష్ఠు ,  వికృత  రూపుడు కాడు.  తపోగ్నిచే  దహించబడిన  స్వర్ణ  కాంతి  కాయుడు  సర్వాంతర్యామి,  సర్వ  సాక్షీభూతుడు. పరిపూర్ణ  అహింసామూర్తి... ..."  తన  కర్మ  శేష  ఫలితముగా  అయితేనేమి,  కుకర్మల  కారణముగా  నైతేనేమి   మానవుడు  రోగి  లేక  భోగి  అవుతున్నాడు   మానవుల  కుకర్మల  ఫలితమే  రోగము.  రోగము
Wednesday, July 11, 2012  .శ్రీ శనిదేవుని మహిమలు.. ఓం... MAHIMA SHANI DEV KI PART 1 - YouTube......లో శనిదేవుని మహిమలు ఉన్నాయి. ఇంకా చాలా మహిమలు ఉన్నాయి. ఈ శనిదేవుని మహిమలు చాలా భాగాలుగా ( ధారావాహికగా ) imagin T.V. లో వచ్చాయి. ఈ శనిదేవుని మహిమలు చాలా బాగుంటాయి. శనిదేవుడంటే కొందరికి భయం ఉంటుంది. కానీ, శనిదేవుని మహిమలు గురించి తెలుసుకుంటే శనిదేవుడు ఎంత కరుణామయుడో తెలుస్తుంది.
శ్రీ శనిదేవుని  మహిమలు.. క్రింద  లింకులు  ఇస్తున్నానండి. Mahima Shani Dev ki Part 2 6th june 2009 - YouTube Mahima Shani Dev ki Part 3 6th june 2009 - YouTube Mahima Shani Dev ki Part 2 13th june 2009 - YouTube Mahima Shani Dev ki Part 3 13th june 2009 - YouTube Mahima Shani Dev ki Part 4 13th june 2009 - YouTube Mahima Shani Dev ki Part 1 20th june 2009 -
దైవాన్నిచూపించండి .. అని ఎవరైనా అడిగితే సూర్యుణ్ణి చూపించవచ్చు. సూర్యుడు ఆరోగ్యప్రదాత అని పెద్దలు చెబుతారు. శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము. ఈ  లింక్ వద్ద ...  Dwadasa Arya Surya Stuthi - YouTube ********************** .వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు