కన్నీరింకిన కనుదోయి కలత పడుతున్న మనసు కల'వరాల' నడుమ ఊగిసలాడుతున్నాయి  అపసవ్యపు జీవితాలు అర్ధాంతరపు బతుకులు అడ్డదిడ్డంగా అడుగులేస్తూ తడబడుతున్నాయి పరుగులెత్తే క్షణాల కాలం మరచిన గతాల గురుతులు మరలనివ్వని గుండె సవ్వడులైనాయి చేజారిన చేవ్రాలు వెక్కిరిస్తూ వీడని చిక్కుముళ్ళైన వాస్తవాన్ని వద్దని వారిస్తూ వాపోతోంది...!! 
1.  మనసు బాధను మాయం చేస్తున్నా_మౌనగానాన్ని ఆలపిస్తూ...!! 2.  దైవమూ చిన్నబోతోంది_మానవత్వం మరచిన మనుష్యులను చూస్తూ..!!
 నేస్తం,        ఆస్తులు అందరు సంపాదిస్తారు కానీ వాటిని సద్వినియోగ పరిచేది కొందరే. ఆ కొందరిలో నాకు అత్యంత సన్నిహతులు కృష్ణకాంత్ గారు ఉండటం నాకు చాలా సంతోషకరమైన విషయం. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు పదిమందికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉన్నారంటే అది వారి నిరంతర కృషికి నిదర్శనం. మాటలు అందరు చెప్తారు కానీ చేతల్లో ఎంతమంది చేస్తున్నారు అంటే వేళ్ళ మీద [...]
మానవ అద్భుత మేథాశక్తికి మరో రూపమైన  యంత్రాల చేతిలో కీలుబొమ్మలౌతున్న జీవ చైతన్యం సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్న విజ్ఞానం కొత్త పుంతల ఒరవడిలో పడి యాంత్రికతగా మారుతున్న నేటి సగటు మనిషి జీవితాలు పరిపూర్ణ మానవుని నుంచి అసంపూర్ణ ఉనికిగా మారుతున్న పరిణామ క్రమాన్ని స్వాగతిస్తున్నంత కాలం కొడిగడుతున్న అనుబంధాలు రెప రెపలాడుతూనే ఉంటాయి. 
ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిప్పుల్లో కాలుతోంది అధికారానికి తలొగ్గి ధనం చేతిలో కీలుబొమ్మై కళ్ళు లేని  కబోధిగా మారింది నిజాలను వింటూ అబద్దాలను నమ్ముతూ అంధకారంలో మునిగిపోతోంది రావణ కాష్ఠాల నడుమ రామరాజ్యం కోసం ఎదురుతెన్నులు చూస్తోంది అంగడిబొమ్మలా అమ్ముడుబోతూ అర్ధనగ్న నైతిక విలువల్లోబడి అల్లాడుతోంది ఈనాటి న్యాయదేవత...!!
ఆచార సంప్రదాయాలకు ఉపనిషద్వేదాలకు నిలయమైన భరతావని కన్న ఆణిముత్యం గాంధీ అర్ధరాత్రి స్వతంత్రాన్ని స్వాగతించి స్వరాజ్యపు బావుటానెగురవేసి అహింసాయుధాన్ని పరిచయం చేసిన ప్రథముడు అరాచకాలకు అక్రమాలకు ఆలవాలమైన ఈనాటి భారతంలో మహాత్ముడు మళ్ళి పుడితే అభాసుపాలౌతాడేమో జాతిపిత సస్యశ్యామల సుందర స్వతంత్ర భారతాన్ని కలలుగన్న శాంతి సుధాముడు నివ్వెరపడి [...]
1.  నా ఖాళీలన్నీ పూరించబడ్డాయి నువ్వు విసిరెళ్ళిన జ్ఞాపకాలతో....!!
నేస్తం,          ఏంటో ఈమధ్య కొందరు ఎదుటివాళ్ళ తప్పులు వెదకడంలో బాగా ఆసక్తిగా ఉంటున్నారు. నీతులు చెప్పేందుకే కానీ ఆచరించేందుకు కాదు అని ఋజువు చేస్తూ ఒక వేలు ఎదుటివారిని చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు తమనే చుపిస్తున్నాయన్న చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఓ నాలుగు సన్మానాలు, కాసిన్ని బిరుదులూ వచ్చేస్తే చాలు ప్రతి ఒక్కరి రాతల్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఆ [...]
1.  విసుగు రావడంలేదెందుకో_భేషజాల్లేని చెలిమి మనదని కాబోలు...!! 2.  బాసలక్కరలేని బంధమే మనది_పది కాలాలు పదిలమంటూ...!! 3.  ఆహ్లాదంగా హత్తుకుంటున్నా_చినుకుల చిరునవ్వులను...!! 4. గమనానిదెప్పుడూ వెలుగు బాటే_తప్పటడుగులెన్ని వేసినా..!!
నీరెండకు నిశ్శబ్ధానికి స్నేహం ఏకాంతమైయ్యింది ఎందుకో ఒంటరితనానికి వలస వచ్చిన జ్ఞాపకాల గువ్వల సందడెందుకో సమస్యల చట్రాలు చుట్టుముట్టినా పోరాట పటిమ తగ్గడంలేదెందుకో చీకటి చుట్టమై చేరుతుంటే నేనున్నానని వేకువ ఓదార్పెందుకో గతపు గాయాలు గుచ్చుతుంటే రేపటి భవితపై ఆశలెందుకో దిగులు దుప్పటిలో దాగిన చిరునవ్వులకు వెలుగెప్పుడో రాలిపడుతున్న స్వప్నాల నడుమ వెలసిన [...]
1. ఎందరిలో ఉన్నా ఏకాంతమే     నువ్వులేని క్షణాలను గుర్తుచేస్తూ...!!
 నేస్తం,     మనకు ఏది కావాలన్నా మన సమాజంలో ప్రతి దానికి ఓ అర్హత ఉంటుంది. దేశాన్ని శాసించే రాజకీయాల్లో ఎందుకు లేదు..? డబ్బు, రౌడీయిజం ముఖ్యమైన అర్హతలుగా మన దేశ సామాజిక రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక చిన్న ఊరి నుండి మొదలై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఉన్నాయి. కాస్త పేరున్న స్కూల్ లో జాయిన్ అవడానికి తల్లిదండ్రి అర్హత అడుగుతున్నారు ఇప్పుడు. ఒకప్పటి సంగతి పక్కన పెడితే [...]
పసిడి వెన్నెల నవ్వుల పసి పాపాయి ఆన్యకి పుట్టినరోజు శుభకామనలు నాలుగో తరం యువరాణికి శుభాభినందనలు  ప్రేమతోమూడు తరాల ఆత్మీయులు 
1.   ఎదురుచూపులు అలవాటేనట మాటల మౌనానికి...!! 2.  మధుర స్వరాలు మనవే నీ నా తేడాలెందుకు...!! 3.  మమతలన్ని నీతోనే గాయాలన్నింటిని మాన్పేస్తూ..!!
కనిపించని లోకాల్లో వినిపించని కథనాలు తెరచిన రెప్పల్లో తెలియని భావాలు మూసిన గుప్పిట్లో దాగిన సూర్యోదయాలు వెలితి పడుతున్న బంధాల్లో వెతల సంకలనాలు గతించిన గతాల్లో గమనించలేని గురుతులు అలసిన ఆత్మ నివేదనల్లో మిన్నకుండి పోయిన అంతర్లోచనాలు....!!
1.  వయసుడిగినా అందమే_ఆత్మీయత నిండిన జీవితాల్లో...!! 2.  ధనాత్మకమైనాయి_అరువు తెచ్చుకున్న అనుబంధాలు..!!
ముఖపుస్తక మిత్రురాలు గాయిత్రి కనుపర్తి గారి ఇట్లు...  నీ... పుస్తకం గురించి చెప్పాలంటే.. ముందుగా పుస్తకాన్ని చూడగానే ఆకర్షించే ముఖ చిత్రంతో కనిపించింది. కాస్త లోపలి పేజీలు తిరగేయగానే అందమైన చిత్రాలతో అర్ధవంతమైన కవితా భావజాలాలు ఆర్తిగా పలకరించాయి. ఇట్లు... నీ... అన్న పేరులోనే అంతర్గతంగా పరిచిన ఓ ఆత్మీయత, ప్రేమపూర్వక అక్షరాల అక్షింతలు మనకు కనిపిస్తాయి. మొదటి కవనంలోనే [...]
1.  ధ్యాసంతా నీపైనే ధ్యానానికి తావీయక...!! 2.  మనసు చెమ్మ మదిని తాకింది....!! 3.  నాకెప్పుడూ నీ ధ్యాసే మరలనీయని మనసు కళ్ళెంతో...!!
1.  అత్యల్పం జీవితం_చావు పుట్టుకల చేతిలో...!! 2.  అక్షరానికి ఆయువెక్కువ_అనంత భావాలకు ఆలవాలమౌతూ...!! 3.  అనునిత్యం నీతోనే_అనురాగం నేనై...!! 4.  అక్షరాల విరులే అంతటా_ఆత్మీయంగా అల్లుకుంటూ...!!
1.   వెన్నెల వర్షిస్తోంది చీకటి చినుకులకు పోటిగా...!! 2.  వాస్తవమై వద్దామనుకున్నా కలగా కలిసి పోతానని తెలియక...!!
1.  ఆస్వాదిస్తున్నా నీ చెలిమిని మదిని నింపిన మౌనంలో...!! 2.  మనసు చెప్పింది నీ మౌనాన్ని మాటల్లో తెలపమని...!!
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు