హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి  వెలుగు నీడలు (1961) సినిమా కోసం "శ్రీ శ్రీ" గారు రచించిన ఈ పాట ఆనాటి ఆపాత మధురాల్లో ఒకటి.ఇదే ట్యూన్ తో ఈ పాట హిందీలో కూడా ఉంది "Naya Sansar (1959)" సినిమాలో "చందా లోరియా సునాయే" అనే జోలపాట.. చాలా బాగుంటుంది.నాకు ఈ హిందీ పాట వరకే తెలుసు.బ్లాగర్  "నీహారిక" గారు ఇదే పాట తమిళ్,గుజరాతీలో కూడా ఉందని చెప్పారు.అన్ని పాటలు కలిపి ఒకేచోట ఉంచితే [...]
2018 కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే అంటే జనవరిలో మాకు శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. ముందు రోజూ రాత్రే వెళ్లి అక్కడ వుండి, ఉదయాన్నే పూజలు,దర్శనాలు అయ్యాక ఖాళీ  టైమ్ ఉండటంతో మా తమ్ముడు జంగిల్ సఫారీ కొత్తగా పెట్టారు వెళదాం అనటంతో  సరేనని వెళ్ళాము. శ్రీశైలం నుండి సున్నిపెంట వెళ్లే దారిలో మెయిన్ రోడ్ కి పక్కనే చుట్టూ వెదురుపొదల మధ్యలో చాలా [...]
మేము చెన్నైకి వచ్చేటప్పటికే బాగా చీకటి పడిపోయింది.బీచ్ కి వెళ్ళాము.గాంధీ బీచ్,మెరీనా బీచ్ రెండు పక్కనే ఉన్నాయి. బీచ్ లో పెద్దగా వింతలూ,విశేషాలేమీ లేవు.చీకట్లో సముద్రం చాలా భయంగా అనిపించింది.ఎక్కడా ఖాళీ లేకుండా పిల్లలు,పెద్దలు బీచ్ అంతా సందడి చేస్తున్నారు.కార్ పార్కింగ్ కి కూడా ప్లేస్ దొరకటం కూడాకష్టమయ్యేంత జనం ఉన్నారు.చీకటి పడేసరికి చుట్టుపక్కల ఏమీ చూడటం [...]
ఆది పరాశక్తి సిద్ధార్ పీఠం చెన్నె వెళ్ళే దారిలో మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి దర్శనానికి వెళ్ళాము.తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో చెన్నై నుండి 92 km దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని ఆదిపరాశక్తి సిద్ధార్ పీఠం(Adhiparasakthi Siddhar Peetam) అంటారు.బంగారు అడిగళారు(Bangaru Adigalar) అనే గురువును ఇక్కడ అమ్మవారి రూపంగా భావించి పూజిస్తారు.అమ్మశక్తి ఆయన ద్వారా భక్తులతో మాట్లాడుతుందని,కోరికలు [...]
ఓం శ్రీ మాత్రే నమఃఅమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.శ్రీ గర్భరక్షాంబికా అమ్మ - Garbha-Raksha-Ambigai ( savior of fetus)మా తమిళనాడు యాత్రా విశేషాలు - బృహదీశ్వరాలయం - తంజావూరుతంజావూర్ బృహదీశ్వరాలయం నుండి అక్కడికి చాలా దగ్గర్లో 40 min (23.4 km) [...]
మా తమిళనాడు యాత్రా విశేషాలు - భూలోక వైకుంఠం శ్రీరంగం - previous post  linkశ్రీరంగం నుండి రాత్రికి తంజావూర్ వచ్చి అక్కడే స్టే చేసి,తెల్లవారుఝామునే ఆలయానికి బయలుదేరాము. అప్పటిదాకా విపరీతమైన మే నెల ఎండలలో మాడిపోయిన మాకు ఆరోజు చిరుజల్లులతో చల్లటి వాతావరణం చాలా సంతోషంగా అనిపించింది.వర్షం మరీ పెద్దది కాదు కాబట్టి వర్షంలోనే ఆలయానికి వెళ్ళాము. 2010కి 1000 సంవత్సరాలు పూర్తి [...]
నిన్న మా అమ్మ పుట్టినరోజు. మా అమ్మ ఉగాది పండగరోజే పుట్టింది కాబట్టి ప్రతి ఉగాదికి మాకు రెండు పండగలు.నిన్న face Book లో విషెస్ పెట్టాను.నా ఫ్రెండ్స్,మా తమ్ముడి ఫ్రెండ్స్ అందరూ అమ్మకి విషెస్ చెప్పారు. ఎప్పుడూ బ్లాగ్ లో కూడా విషెస్ పెట్టేదాన్ని ఈసారి పెట్టలేదు.కొంచెం లేట్ గా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను.ఎంతైనా బ్లాగ్లో రాసుకున్నవన్నీ మంచి జ్ఞాపకాలుగా  ఎప్పటికీ [...]
ఘన మునీంద్రులకు  అగమ్యమైయున్న నిను  యీ ధరమీద పలుమారు దర్శింపగలిగే సంతతమును  వర్ణింపగలిగే  చాలదా మా జన్మముజంబుకేశ్వరం నుండి శ్రీరంగనాధుని దర్శనానికి వచ్చాము.తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలోఉభయకావేరీ నదుల మధ్య(కావేరీనది,దాని ఉపనది కొల్లిదం)ద్వీపంలో శ్రీరంగక్షేత్రం ఉంటుంది.108 ప్రధాన విష్ణుదేవాలయాల్లో(దివ్యదేశాలు) మొట్టమొదటి,అత్యంత ప్రధానమైన,భూలోక [...]
మధురై నుండి 2 గంటల్లో శ్రీరంగం వచ్చేశాము.అక్కడ వెంటనే దర్శనానికి వెళ్లాలనుకున్నాము కానీ మధ్యాహ్నం దర్శనం విరామం సమయం కావటంతో గుడి మూసేసి ఉంది.ఈలోపు శ్రీరంగం ప్రాకారాల మధ్యలో ఉన్న షాపింగ్,ఆలయం అంతా తిరిగి చూసి,ముందు జంబుకేశ్వర్ ఆలయానికి వెళ్లి రావచ్చని అక్కడికి వెళ్ళాము.శ్రీ జంబుకేశ్వరుడు,శ్రీ అఖిలాండేశ్వరీ దేవి పంచభూత క్షేత్రాలలో రెండవది [...]
మధుర మధురతర మీనాక్షీ కంచిపట్టునా కామాక్షిమహిని మహిమగల మీనాక్షీ కాశీలో విశాలాక్షివరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానాహిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావామధురై మీనాక్షి అమ్మవారిని చూడాలన్నది మాకు ఎప్పటినుండో  ఉన్న కోరిక.చిన్నప్పుడు విజయ్ కాంత్,రాధల  మధుర మీనాక్షి సినిమాలో, తర్వాత మహేష్ బాబు అర్జున్ సినిమాలో సెట్టింగ్ అయినా ఆలయాన్ని చాలా [...]
Happy New Year 2017H: Harbinger ofA: AbundantP: Peace,P: Prosperity andY: Youthfulness.N: Newness coupled withE: Eternal HappinessW: Wean away your sorrows.Y: Your life is filled withE: EnormousA: Ambition that makes youR: Rich and righteous!
"కలికి పదములు కడలి కడిగిన కళ ఇది"Cape Comorin, కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని ఒక పట్టణము.భారతదేశానికి దక్షిణాన భరతమాత పాదాలను బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం నిత్యం కడిగే పవిత్ర త్రివేణి సంగమక్షేత్రం కన్యాకుమారి.భారతదేశానికి దక్షిణం వైపున చిట్టచివరి ప్రదేశం.కన్యాకుమారి సూర్యోదయం చాలా ప్రత్యేకత ఉందికదా, సినిమాల్లో కూడా [...]
ఇప్పటిదాకా రాసిన మొత్తంకథ ఈ లింక్ లో  చదవచ్చు..  http://raji-rajiworld.blogspot.in/search/label/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B0%BE%20%3F%3F%20--%E0%B0%92%E0%B0%95%28%E0%B0%B0%E0%B0%BF%29%20%E0%B0%95%E0%B0%A7క్లుప్తంగా ఇప్పటిదాకా జరిగిన  కధ .. బాగా చదివి,గవర్నమెంట్ సీట్లు తెచ్చుకోలేక కష్టపడి నాన్నసంపాదించిన డబ్బునంతా బెంగుళూరు యూనివర్సిటీకి ఫీజుల రూపంలో ఖర్చుపెట్టించిన అన్న,ఇద్దరు అక్కల్లా కాకుండా నాన్న ఆశయానికి, నాన్నకి  ఏకైక [...]
అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాంఈరోజు నుండి అమ్మవారి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి.విజయవాడ ఇంద్రకీలాద్రిమీద కొలువై,  భక్తులకు కొంగుబంగారైన అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తులు అమ్మవారిని రోజుకో అలంకారంలో దర్శించుకుని తరిస్తారు.మేము చిన్నప్పటినుండి [...]
చిదంబరం తర్వాత రామేశ్వరం చేరుకున్నాము.భారత భూభాగం నుండి నాలుగుపక్కలా నీళ్ళు ,మధ్యలో ఉన్న రామేశ్వరం ద్వీపం అద్భుతమైన ప్రదేశం.సహోదరులైన రామలక్ష్మణుల మధ్య ఎంత కష్టమొచ్చినా చెక్కుచెదరని ప్రేమాభిమానాలు, తనను కాపాడటానికి రాముడు వస్తాడని అచంచలమైన మనస్సుతో (లోపల తిట్టుకుంటూ బయట పొగుడుకుంటూ కాకుండా) ఎదురుచూసే సీతమ్మని చేరుకొని, ఆమె నమ్మకం నిలబెట్టటానికి రాముడి [...]
పోయిన సంవత్సరం (2015)  ఢిల్లీలో ఉన్న "SFIO -Serious Fraud Investigation Office" లో  Legal Consultants postsకి apply చేశాను.aplications short listing process అయ్యాక  Interview సరిగ్గా 4 రోజులుందనగా ఇంటర్వ్యూకి ఢిల్లీ రమ్మని  Call Letter  పోస్ట్ లో వచ్చింది.Interview Call Letter చూడగానే నాకు కంగారు మొదలయ్యిది. Interview కి సెలెక్ట్ అయ్యాము సరే, ఢిల్లీ వెళ్ళటం ఎలా? ఇప్పుడు వెళ్లకపోతే మంచి అవకాశం పోతుందేమో ? వెంటనే మా తమ్ముడికి ఫోన్ చేసాను.నాకంటే ఎక్కువ కంగారుపడ్డ [...]
చిన్న పిల్లల్ని ,చిల్లర (చిన్న/ వెధవ బుధ్ధులున్న) మనుషుల్ని ఎక్కువగా కదిలించకూడదని మా తమ్ముడు చెప్తుంటాడు. చిన్న పిల్లలకి వాళ్ళేం చేస్తున్నారో తెలియక ఇష్టమొచ్చినట్లు చేస్తుంటారు. చిల్లర మనుషులు మేమేం చేస్తే ఏంటి, మమ్మల్ని ఎవరేం చేయగలరు అనే అహంకారంతో చేస్తుంటారు. రవితేజ ఇడియట్ సినిమా వచ్చిన కొత్తల్లో  ఇడియట్ అంటే ఓ చంటి గాడి  ప్రేమకథ అని మురిసిపోతూ [...]
మహాబలిపురం నుండి మా ప్రయాణం చిదంబరం నటరాజ స్వామి  ఆలయానికి.ఇక్కడి నుండి మా ప్రయాణం అంతా ఈస్ట్ కోస్ట్ రోడ్ చెన్నై నాగపట్నం హైవే మీద సముద్రం పక్కనుండే జరిగింది.(3 h 1 min (161.1 km) via E Coast Rd and Chennai - Nagapattinam Hwy/E Coast Rd )ఈ ప్రయాణంలో మేము మర్చిపోలేనిది సముద్రానికి చాలా దగ్గరలో ప్రయాణించటం. కొంచెం కిందికి రోడ్డు దిగితే పక్కనే సముద్రం ఉండేది.ఉప్పు పండించే పొలాలు (salt fields)కనపడుతూ ఉండేవి.సముద్రానికి [...]
"A Journey through a magical Land"మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురంభారతీయ కళా జగతికిది గొప్ప గోపురంకట్టించాడు ఈ ఊరు పల్లవరాజుఆ కధ  చెప్పగ వచ్చాడు బాలరాజు..చిన్నప్పటినుండి ఈ పాట వినీ వినీ ఇప్పటికి వెళ్ళగలిగాము.చిన్నప్పుడు స్కూల్ డేస్ లో టూర్ అంటే చెన్నై తీసుకెళ్ళేవాళ్ళు మా St.ann's 'సిస్టర్స్. అప్పడు మాతమ్ముడు వెళ్ళాడు కానీ నేను,చెల్లి వెళ్ళేవాళ్ళం కాదు.కానీ చూడాలి అనుకునేవాళ్ళం [...]
2011 లో అరుణాచలం,కంచి,శ్రీపురం చూసిన తర్వాత మళ్లీ ఈ (2016) సంవత్సరం మే నెలలోమేము వెళ్లిన తమిళనాడు టూర్ ఎప్పటికీ మర్చిపోలేని సంతోషకరమైన జ్ఞాపకంగా గుర్తుండేలా జరిగింది.పంచభూత క్షేత్రాలు చూడాలని నాకోరిక,కాళహస్తి(వాయులింగం),అరుణాచలం(అగ్నిలింగం),కంచి(పృథ్వి లింగం) చూశాము,మిగతా 2 పంచభూతలింగాలు తమిళనాడులో ఉన్నాయిఎలాగూ వెళ్తున్నాం కాబట్టి చెన్నైలో ఎంతవరకు చూడగలమనుకుని [...]
ఒకప్పుడు  టీవీలో రాధిక సీరియల్స్ పిన్ని, శివయ్య, లక్ష్మి ఇలా అన్నిసీరియల్స్ వరసగా చూసేవాళ్ళం. తర్వాత అంత ఆసక్తిగా చూసినవి మంజులా నాయుడు సీరియల్సే. రుతురాగాలు, కస్తూరి,చక్రవాకం, మొగలిరేకులు ఇవన్నీ కూడా ఆసక్తిగా మొదలై ఏవేవే మలుపులతో ,ఏదో ఒక ముగింపుతో మొత్తానికి ఏమి జరుగుతుందో చూద్దాం అనిపించేలా ఉండేవి.ఈ మధ్య సుమారు మూడు సంవత్సరాల క్రితం మొదలైన "శ్రావణ సమీరాలు" [...]
ఆకాశమే ఆకారమై ,భూమియే విభూతియై అగ్నియే త్రినేత్రమై ,వాయువే చలనమై జలమే జగమేలు మందహాసమై ..   పంచభూతాధారా ప్రపంచేశ్వరా విధాతా విశ్వనాధ నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ప్రాణి మనుగడకు అత్యావశ్యకమైన ఈ పంచభూతాలకు అధిపతి శివయ్య పంచ భూతతత్వాలతో కొలువైన పంచభూత క్షేత్రాలను చూడటం కల నిజం కావటం లాగా అనిపించింది. చిన్నప్పుడు ప్రతి సంవత్సరం జనవరి 1 రోజు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు