ఇండియా వెళ్ళినప్పుడల్లా గుళ్ళు, గోపురాలు, షాపింగ్ మాల్సు తిరిగినట్లే విశాలాంధ్ర సందర్శనం కూడా ఒక భాగమయిపోయింది. ఆ మధ్య విశాఖపట్నం వెళ్ళినప్పుడు విశాలాంధ్ర కి వెళ్తే కావాల్సిన పుస్తకాలేమీ పెద్దగా లేవు. దానిలోని వారు కూడా పెద్ద ఉత్సుకత చూపించలేదు ఇది చూడండి అది చదివారా అంటూ. విజయవాడలో విశాలాంధ్ర సందర్శనం మాత్రం మరచిపోలేనిది. అక్కడ కౌంటర్లో ఉన్న ఆయన దగ్గర నుండీ [...]
సినిమా పేరు వినగానే ఏదో అలా గాలి వాటం గా వచ్చి పోయే తెలుగు సినిమాలలో ఒకటి అనిపించింది.ఆ మధ్య థ్రిల్లర్, వగైరా అని ప్రెస్ మీట్లో ఊదరగొట్టిన సినిమాని తీరా  చూస్తే ఒక సీ గ్రేడు సినిమా అయ్యేసరికి  ఈ సినిమా పెద్దగా ఆకర్షించలేదు. ఆ మధ్య నారా వారి అసుర చూసాకా యూ ట్యూబులో కమర్షియల్‌గా హిట్టు కాకపోయినా కొన్ని మంచి సినిమాలు  దొరుకుతాయి అని అర్ధమయ్యింది. అలా చూసినదే నా నీడ [...]
అబు ఉస్మాన్..టైగర్ జిందా హై(కృష్ణ జింకలు చనిపోయాయనుకోండి అది వేరే విషయం)చూసిన వారెవరికైనా అన్ని పాత్రల కంటే ఎక్కువ గుర్తుండిపోయే పాత్ర. సజ్జద్ డెలాఫ్రూజ్ అనబడే ఇరానీ మూలాలున్న ఈ  నటుడు విలనీని అధ్భుత రీతిలో పండించాడు. విలనీ అంటే సూట్లేసుకుని, చుట్టూ అమ్మాయిలతో, స్విమ్మింగ్ పూల్ దగ్గర సేద తీరుతూ ఠపీ ఠపీ మని పిట్టల్ని కాల్చినట్లు కాల్చేసే విలనీ కానేకాదు. ఒంటి మీద [...]
ఎన్నెన్ని టెరా బైట్ల ఙాపకాలు బామ్మా నీతో.. వాటిల్లోంచి ఓ నాలుగు ముక్కలు బామ్మ..ఇప్పుడొక ఙాపకం మాత్రమే.బామ్మ ట్రేడ్ మార్క్ తొక్కుడు లడ్డూలూ,వేసవి కాలంలో తన చేత్తో కలిపిన ఆవకాయ సాయంత్రం తులసి కోట దగ్గర కూర్చుని తిన్న గుర్తులు, నేను కాలేజీలో ఉండగా రాసిన ఉత్తరాలు,వంటింట్లో దండెం మీద ఆరేసిన చీరని ముట్టుకుంటా ముట్టుకుంటా అని అడిగి తిన్న తిట్లు, అందరూ ఎంత ఎగ్జైట్ [...]
మొన్న ఫేస్‌బుక్ తిరగేస్తోంటే ఒక నడివయసు ఆయన తన ఊర్లో సంక్రాంతి సంబరాల గురించి పెట్టిన ఫోటో చూసాను. అంత వరకూ బాగానే ఉంది. అందరూ చేసే పనే. వాళ్ళింట్లో కన్న కూతురు చనిపోయి ఆర్నెల్లు(చదువుకుంటున్న అమ్మాయే. పోనీ పెళ్ళయ్యి అత్తారింటికి సాగనంపిన పిల్ల కూడా కాదు)అయ్యిందేమో అంతే.అసలు అందరూ అలా ఎలా పట్టు బట్టలు కట్టుకుని పండగ జరుపుకుంటున్నారో అర్ధం కాలేదు. ఇంకో పెద్ద కట్టె [...]
పాపం ఇంట్లో మరుగుదొడ్లు లేక బహిర్భూమికి వెళ్ళిన ఆడవాళ్ళని రేప్ చేసి చంపెస్తేనో లేదో రేప్  కి గురి కాబడ్డ ఆ మహిళలు వెలి వేయబడితేనో మనకెందుకు?? వీళ్ళేమైనా మన ఓట్లకి పనికొస్తారా, రాబోయే ఏఎన్నికలకైనా ఏమాత్రమైనా ఉపయోగబడతారా?? వీలయితే రేప్ కి గురి అయిన ప్రదేశమో, వారు ఆత్మ హత్య చేసుకుంటేనో కాసేపు వృత్తాలు గీసి , జూం చేసి, అయిన వాళ్ళ ఏడుపులతో చూపిస్తే ఛానెళ్ళకి ఓ న్యూస్ [...]
ఇంటి ముందు మామిడి తోరణాలు,వరుసలుగా కట్టిన బంతి ఇతర రంగు రంగుల పూలు అదే గృహ ప్రవేశం జరిగే ఇల్లని చెప్తున్నాయి.ఇంటి సింహ ద్వారం ముందు పేరుకున్న చెప్పుల గుట్ట అతిధుల సంఖ్య ని చెప్తోంది. "కలశస్య ముఖే విష్ణు..."..హలో ఆ.. ఆ థాంక్యూ పిన్నీ...ఆ..ఏమిటీ అసలు వినబడ్డం లేదు..సాయంత్రం చేస్తాను,  బాయ్ ..వినాయకుడికి చిన్న బెల్లం ముక్క పెట్టండి...ఆ పూర్తిగా రినోవేట్ చేయించామండీ..మొత్తం [...]
దీపావళి తరువాత కొన్ని రోజులకి పిక్నిక్ కి వెళ్తామని చిన్నప్పుడు ఎంత ఉత్సాహం గా అనిపించేదో. వాటినే కార్తీక వన భోజనాలంటారని చాలా యేళ్ళు తెలీదు. చిన్నప్పుడు మేము మోతుగూడెం అనే ఒక చిన్ని ఊర్లో ఉండేవాళ్ళము.ఊరిలో ముప్పావు మంది  మంది ఆం. ప్ర. విద్యుత్ సంస్థ ఉద్యోగులే.మిగతా పావు వంతు జనాభా అక్కడ ఉన్న ఒకటి రెండు బట్టల కొట్లు, ఒక స్టేషనరీ షాపు, ఒక హోటల్, ఒక పాన్ షాప్,ఒక ఫోటో [...]
తెలుగు సినిమా కధా ఎక్కడున్నావమ్మా?? అదేంటి ఈ మధ్య కనపడని దానిని వెతుకుతున్నా అని ఆశ్చర్యపోకండి.ఏది ఎక్కువ కాలం కనపడకపొతే  దాని మీదే మనసు పోతుంది కదా అందుకనే ఈ వెతుకులాట. అసలు చిట్టచివరిగా ఎక్కడ చూసానూ అని ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు.అదేమిటి మరీ విడ్డూరం కాకపోతేను..అది మాయమయ్యి చాలా రోజులయ్యిందా నాకే మతిమరుపెక్కువయ్యిందా?? ఏమో మరి. సరేలే సినిమాలు తీసేవాళ్ళకే [...]
ఈ మధ్య ఫేస్ బుక్ లో చూసిన ఒక ఆర్టికల్ మీదే ఈరోజు టపా. దానిలో రిటైరైన ఇద్దరు దంపతులు మొదట పెద్దబ్బాయి దగ్గరకి వెళ్ళి కోడలి డెలివరీ అయ్యి పుట్టిన మనవరాలి బాగోగులు చూసుకుని వస్తారు. ఇంతలో చిన్న కొడుకు ఫోను చేస్తాడు తన భార్య కి సాయం గా రమ్మని. పెద్దాయన ఉలుకూపలుకూ ఉండదు. ఆవిడ తరచి అడిగితే చెప్తాడు, "బేబీ సిట్టర్స్" గా వెళ్ళడం తనకి ఇష్టం లేదనీ, ఏదో అలా వెళ్ళి చూసి [...]
2014 ఆగస్టు 31 దాదాపు మాకు రాత్రి 8 అవుతోంది. రెస్టారెంట్లో కూర్చుని ఉన్నాము ఫుడ్ ఆర్డర్ చేసి.అదేమిటి బాపూ ఇక లేరుట ఫేస్బుక్ చెక్ చేసుకుంటున్న మా వారి  నోటి నుండి ఆ మాట వినగానే తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి. ఇంతలో మా అక్క మెసేజ్ నువ్వు చాలా లక్కీ అంటూ..ఇంతకీ నేను ఎందుకు లక్కీయో  తెలుసా. అంతకుముందు దాదాపు రెణ్ణెల్లక్రితం అంటే జూలై 4 2014 న బాపూ గారిని కలిసాను. ఆయన [...]
1)ఇంతకుముందు బాలక్రిష్ణ అంటే వెటకారం తో కూడిన అభిమానం ఉండేది. సిమ్హా కూడా అలా ఉన్నప్పుడు చూసినదే. బాలయ్యతో పాటు ఆ మధ్య మంచక్కయ్య అంటే కూడా అభిమానం పెరగడంతో, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "సీ కొడతారా సిరాకు పడతారా..అబ్బెబ్బే కాదు కాదు, "ఊ కొడతారా ఉలిక్కి పడతారా " సినిమా నాకు జంబో కాంబో నే. 2)సినిమా సంగతెలా ఉన్నా బాలయ్య బాబు  నా అంచనాలకి మించి నటించేసాడు. సిగార్ [...]
పొగ మంచు కాదు, సింగపూర్ ఇప్పుడు పొగ గుప్పెట్లో చిక్కుకుంది.పొరుగు దేశమైన ఇండొనేషియా లోని సుమత్రా అడవుల్లో ఫారెస్ట్ ఫైర్ వల్ల రాజుకున్న పొగ సింగపూర్ ని కమ్మేసింది.ఎప్పుడూ ఎండ వానా తప్ప ఇంకొకటి ఎరగని సింగపూర్ వాసులని ఈ పొగ భయభ్రాంతులని చేస్తోందనటం లో సందేహం లేదు. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ ప్రతీ గంటకీ తమ వెబ్ సైట్ లో ఇస్తున్న సమాచారం ప్రకారం ఈ ఉదయం 11 గంటలకి [...]
నిన్న "నానాటి బ్రతుకు" కధ చదివాకా మనసంతా అదోలా అయిపోయింది.ఈ కధ నిజంగా కదిలించింది నన్ను.నేటి విద్యా వ్యవస్థని కళ్ళకి కట్టినట్లు వర్ణించిన రచయిత "ఆకెళ్ళ శివ ప్రసాద్" గారికి అభినందనలు.చాలా బాగుందండీ మీ కధ. దాదాపు ఆరేడేళ్ళ క్రితం అనుకుంటా మా ఊళ్ళో ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయులు ఇలా ఇంటింటికీ తిరిగి తమ స్కూల్ కోసం మర్కెటింగ్ చెయ్యడం చూసాను. వారి వెతలు చూస్తే మనసు [...]
దేనికైనా టైము రావాలి అని ఊరికే అనరేమో.చాగంటి వారి ప్రవచనాలు విను అని మా నాన్నగారు గత 2-3 సంవత్సరాలనుండీ చెవిలో ఇల్లు,అపార్టుమెంటు అన్నీ కట్టేసుకుని పోరుతూనే ఉన్నారు..ఆ వింటాను అని చెప్పో, వింటున్నావా అంటే ఆ ఆ అనేసి మాట మార్చేసాను ఇన్నాళ్ళూ. ఆ మధ్య ఓ సారి మనసు బాలేదమ్మా అంటే సుందర కాండ విను శాంతి కలుగుతుంది మనసుకి అని చెప్పింది అమ్మ. అదొక్కటీ విందామని మొదలుపెట్టి, [...]
ఇంకో ఆడపిల్ల బలైపోయింది. మన ఉద్యమకారులకి ఆయుధం దొరికింది తమ "ప్రతాపం" మళ్ళీ చూపించడానికి. ఆ అమ్మాయి అంత్యక్రియలు అయ్యేవరకు నిరసనలు, ఆందోళనలతో మాస్ హిస్టీరియా ఇచ్చిన కిక్కు తో వీరావేశంతో ప్లకార్డులు ప్రదర్సిస్తారు. ఎలాగూ చేతిలో పనే కాబట్టి ఫేస్ బుక్ లో మెసేజిలు,డిస్ప్లే పిక్చర్ గా ఓ నల్ల వ్రుత్తం పెట్టేసుకుంటారు. అన్నా హజారే ఉద్యమం అప్పుడు కూడా ఇదే పరిస్థితి [...]
ఓ హడావిడి వీక్ డే ఉదయం చామనఛాయ లో,సన్నగా పొడుగ్గా ఉన్న ఒక మనిషి చిన్న బ్యాగుతో ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆయన మా మామయ్యగారి ఫ్రెండు. కనీసం ముఖ పరిచయం కూడా లేదు ఆయనతో. బాగున్నారండీ అని పలకరించి మంచినీళ్ళు ఇవ్వడానికి లోపలకి వెళ్ళాను కాస్త అసహనంగానే. ఎవరో తెలీని మూడో మనిషి మనతో ఓ పక్షం రోజులు ఉంటాడు అంటే కలిగే అసహనం అది. నేను ఇచ్చిన మంచినీళ్ళ గ్లాసు అందుకుని ఏమీ [...]
చిన్నప్పుడు,చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు లెండి తొమ్మిది పదీ తరగతుల్లో అనుకుంటా మా ఇంట్లో టేప్ రికార్డర్ ఉన్న రోజుల్లో అమ్మ సాయంత్రాలు రుద్రం నమకం పెట్టేది. అప్పుడు అమ్మ అవి పెడీతే విసుగ్గా అనిపించేది కానీ పెద్దయ్యాకా నచ్చే చిన్నప్పటి బెల్లం కూరలు,ఒడియాల పులుసుల్లాగ ఇది కూడా నచ్చడం మొదలయ్యింది. రకరకాల గొంతుల్లో ఆ నమకం చమకం వినడానికి ప్రయత్నిచాను [...]
ఏమిటో ఈ రోజు పొద్దున్న నుండీ ఈ రచ్చ.ఓ మామూలు మాస్ మసాలా సినిమా కి అంత హడావిడి ఏమిటో. అంతే లెండి హిట్టు కొట్టక తప్పదన్న పరిస్థితిలో సినిమా వస్తే ఈ మాత్రం రచ్చ తప్పదేమో. ఆ మధ్య బిజినెస్ మ్యానేమో "...చ్చ" అంటూ హిట్టు కొట్టాడు మెగా వారసుడేమో "రచ్చ" అన్నాడు నెక్స్ట్ హిట్టు కావాల్సిన హీరోలెవారైనా "పిచ్చ"(వీడికి పుట్టింది కచ్చ అనేది ట్యాగ్ లైను ) అని పెట్టుకుంటే సరి.నాకు అర్ధం [...]
అసలు ఈ లాంగ్ వీకెండు లో ఎక్కడకీ కదలకూడదని నిర్ణయించేసుకుని శనివారం అమలుచేసేసాను. ఆదివారం కూడా విజయవంతంగా ముగించెయ్యబోతున్న నాకు నాలుగున్నరి కి వచ్చిన ఓ ఎసెమ్మెస్సు అడ్డుపుల్లేసింది. ఆ మెసేజ్ సారాంశం సాయంత్రం ఆరింటికి "రాజన్న" సినిమా కి వెళ్తున్నాము అని.వాళ్ళు వెళ్తోంటే నాకు చెప్పారు అంటేనే అర్ధం అవుతోంది కదా, చీజ్ వేసి జెర్రీ ని టాం కలుగులోంచి బయటకి లాగినట్లు [...]
ప్రతీ సారీ లాగే ఈ సారి కూడా డిశంబరు లో ఇండియా వెళ్ళాను. ఈ సారి ట్రిప్ లో తిరుమల వెళ్ళి శ్రీ వారిని దర్శించుకున్నాము కుటుంబ సమేతంగా.దాదాపు 7-8 యేళ్ళ తరువాత అనుకుంటా నడిచి కొండెక్కాను.మొదట్లో కాస్త అలసట అనిపించిన్నా దారిలో దొరికిన వేడి వేడి దోశలు,ఆంధ్ర వారి ఆల్ టైం ఫేవరెట్ ఉప్పూ కారం రాసిన మామిడి ముక్కలు, జామ కాయలు,రేగి పళ్ళు తింటూ మూడున్నర గంటలలో కొండపైకి చేరుకున్నాము. [...]
దూకుడు నిన్న టిక్కెట్లు దొరకలేదు. సరే అని రాత్రి కూర్చుని నేను నా రాక్షసి చూసాను.రానా సినిమాలు ఏమీ చూడలేదు ఇంతకముందు. ఎలా నటించాడో చూడాలని ఉత్సాహం గా అనిపించింది.రానా నటన శూన్యం.డైలాగ్ డెలివరీ బాగా మెరుగు పరచుకోవాలి.మంచమ్మాయి టాక్ షో లో ఇతనిని చూసి నత్తి లేకుండా మాట్లాడే వారసుడు దొరికాడే అనుకున్నాను.కొన్ని కొన్ని డైలాగుల్లో ఇతను కూడా "పెల్లి,కల్లు" బ్యాచేనేమో [...]
హాయిగా బయట వర్షం కురుస్తోంటే, నేను సుష్టుగా బ్రేక్ఫాస్టు చేసి, అందరికీ ఓ స్వాతంత్ర్య దినోత్సవ మెసేజీ కొట్టి, రిప్లయిలు అందుకుని మరలా నేను రిప్లయ్ పెట్టి ఆన్ లైన్ లో మన ఛానెళ్ళు చూద్దామని కూర్చున్నాను. మొదట టీవీ తొమ్మిది పెట్టాను.సమాజాన్ని ఉద్ధరించే పని లో బిజీగా ఉండే వారు ఎందుకో ఈరోజు నన్ను కరుణించలేదు. టెక్నికల్ డిఫికల్టీ అని వచ్చింది. సరే అని టీవీ 1 పెట్టాను. [...]
పోయిన శని ఆది వారాలలో చూద్దామంటే టిక్కెట్లు లేవు ఏ షొ కీ కూడా. అసలు శుక్రవారమే దొరకలేదు. దొరకలేదు అంటే ముందు మూణ్ణాలుగు వరుసల్లో ఉన్నాయి కానీ అలా కక్కుర్తి గా చూసి ఆ నెప్పులు ఈ నెప్పులు తెచ్చుకోవడమెందుకని ఆగాము. ఓ సారి ధూం 2 మొదటి వరుసలో కూర్చుని చూసా లెండి, ఆ అనుభవం అన్నమాట. మొదటి వరుసలో కూర్చుని ఎవరైనా చూస్తారా అని అడక్కండి,అదంతే!! ఒకోసారి ఇలాంటి అద్రుష్టాలని,ఎప్పుడూ [...]
మాకు ఇక్కడ సింగపూర్ లో టీవీ పెట్టగానే "రక్తమోడిన రహాదరులు" అనో " కీచక టీచర్" అనో మరింకోటనో గాట్ఠిగా అరుస్తూ ఢఢన్ ఢఢన్ అనే బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ తో భయంకర ద్రుశ్యాలని చూపే ఛానెల్స్ లేవు. అసలు తెలుగు ప్రసారాలే లేవు. ఎప్పుడైనా తెలుగు చానెళ్ళని నెట్ లో చూడటమే. దాని లోటు ఫేస్ బుక్ తీర్చేసింది ఈరోజు నాకు. ఈ మధ్య నేనూ ఫేస్ బుక్ ఖాతా తెరిచాను. కానీ దానిలో నేను రాసేది తక్కువ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు