ఎక్కడ??అడవిలోఏ అడవిలో?సరిస్కా అనే అడవిలో?ఎప్పుడు?మొన్న శనివారంఏమిటి కథ కమామిషు?చెప్తా చెప్తాపులిని..పెద్దపులిని....దగ్గరగా, 8-10 మీటర్ల దూరంలో...రెండు కళ్ళారా చూసాను. ("శివుని రెండు కళ్ళార చూసాను రామాహరి" లో రేలంగి ఎక్స్‌ప్రెషన్ ఊహించుకోండి)మొన్న శనివారం సరిస్కా అనే అడివికి వెళ్ళాం. రాజస్థాన్ రాష్ట్రంలో, ఢిల్లీ కి జైపుర్ కి మధ్యలో ఉంది. డిల్లీ నుండి నుండి 200 km దూరంలో [...]
అవి అత్యంత మధురాతి మధురమైన రోజులు....అనగా నా బాల్యము అన్నమాట :)మా విజయనగరం సంగీతానికి పెట్టింది పేరు. మా ఇంటా, వంటా సంగీతమే..అందరూ బాగా పాడతారు. మా ఇంట్లో ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులున్నారు. చిన్న, చితక,ముసలి ముతక...అందరూ బాగా పాడతారు. నేను పుట్టకముందే నాకు సంగీతం నేర్పించాలని నిర్ణయం అయిపోయింది. నా మొదటి గురువు మా అక్క (పెద్దనాన్నగారి కూతురు - ఇప్పుడు ప్రముఖ కర్నాటక [...]
"మనీ కోసం పని చేసే షి" అని అర్థం చెప్పుకుని చిన్నప్పుడు చాలా నవ్వుకునేవాళ్ళం.  పనిమనిషంటే మనలో చాలామందికి (నాతో కలిపి) ఉండే అభిప్రాయం "చులకన". అవును, పనిమనిషులు మనకి చులకన. మనం తినగా మిగిలినదో, పాచిదో వాళ్ళకి ఇస్తాం. బాగా వాడి వాడి విసుగెత్తిన బట్టలు ఇస్తాం. మన కాళ్ళ దగ్గర ఉండే మనిషి అని మనకి అభిప్రాయం. వయసులో ఎంత పెద్దవాళ్ళైనా సరే "ఒసేయ్" "ఏమే" అనే ఉంటాయి పిలుపులు. [...]
పుస్తకాలు పుస్తకాలు!"అటు నేనే ఇటు నేనే" అన్నట్టు ఎటు చూసినా పుస్తకాలు!ముందుకు వెళితే పుస్తకాలు, వెనక్కి చూస్తే పుస్తకాలు, పక్కకు జరిగితే పుస్తకాలు!చంద్రుణ్ణి చూసి ఎగిసే అలల్లా మీదకి దూకుతున్నాయి!తేనెపట్టు మీద రాయేసి కొట్టినట్టు ఝుమ్మన్ని మీదకు ముసురుతున్నాయి!కలకండ చుట్టూ చేరిన చీమల్లా చుట్టుముట్టేస్తున్నాయి!వలసపోయే పక్షుల్లా బారులు తీరి [...]
ముక్తేశ్వర్...సముద్రం మట్టం నుండి 800 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతం - హిమాలయాలలో భాగం. నైనితాల్ నుండి ఓ రెండుగంటల ప్రయాణం. కొండ పై కొనకి చేరుకుని, కారు దిగి చుట్టూ చూస్తుంటే ఇద్దరు ముగ్గురొచ్చారు "గైడ్ కావాలా" అంటూ. అక్కడ ఉన్నది చిన్న ముక్తేశ్వరుడి గుడి, దానికి ఓ పక్క రాళ్ళ గుట్టలు, మరో పక్క అడవి . ఇంతే కదా. ఏముంది చూడ్డానికి, గైడ్ ఎందుకు అనుకునేలోగా ఒకతను వచ్చి మా మనసులో మాటలు [...]
అమరసందేశం అన్న సినిమాలో శ్రీ శ్రీ విరచితమైన ఈ పాట నాకు ఎంతో ఇష్టం. ఈ పాటకి ఏ.ఎం రాజ ప్రాణం పోసారు అనే చెప్పొచ్చు. గొప్ప సాహిత్యానికి గొప్ప కంఠం తోడైతే ఆ పాట జనరంజకం కాక ఇంకేమవుతుంది! శ్రీ శ్రీ సాహిత్యం లోని అందం, లోతు, పదాల ఎంపిక అద్వితీయంగా ఉంటాయి. http://www.oldtelugusongs.com/cgi-bin/search2/search.pl?mucode=P0087 పల్లవి:ఏదో ఏదో నవీన భావంకదిలించే మధుర మధుర గానంచరణం:సుమదళాల పరిమళాల తేటలలోమయూరాల ఒయ్యారాల [...]
సంవత్సరం చివరికొచ్చేసరికి అందరూ సింహావలోకనం చేసుకుంటూ ఉంటారు కదా...నేనిప్పుడు అటువంటి కార్యక్రమాలు ఏవీ చేపట్టదలుచుకోలేదుగానీ ఈ యేడాదిలో నాకు బాగా సంతృప్తినిచ్చిన విషయం నేనెక్కువ పుస్తకాలు చదవడం, కొనుక్కోవడం. గత మూడు నాలుగేళ్ళుగా మూలన పడేసిన నా పుస్తక పఠనాన్ని తిరిగి ఆరభించాను. ఎలాగా ఏమిటి అన్నది ఇంతకుముందే నేను-నా పుస్తకాల గోల అంటూ అరిచి గీపెట్టాను. ఇప్పుడు [...]
నాకు రాజన్న నచ్చిందిముందుగా ఇలాంటి ఆలోచనతో ముందుకొచ్చిన విజయేంద్రప్రసాద్ గారికి ఒక సెబాస్ఈ సినిమా చేసిన నాగార్జున కి ఒక భేష్మొత్తం సినిమాని భుజస్కందాలపై మోసిన కీరవాణికి జేజేలు.దిక్కుమాలిన కాలేజీ ప్రేమలు, అడ్డం గా నరుక్కోవడాలు, వెకిలి కామెడీలు, వందమందిని ఇరగదియ్యడాలు లేవు.కొత్తగా, హాయిగా పోరాటవీరుడి చరిత్ర ఉత్తేజం కలిగించేలా ఉంది. మనకి ఇటువంటి కథలు సినిమాలుగా [...]
ఆమధ్య బజ్జులొచ్చి బ్లాగులని మింగేసాయని కొందరు...లేదు, కాదు బజ్జుల వల్ల మంచే జరిగింది అని నాలాంటి వారు కొందరు చిన్న చిన్న వాక్బాణాలు విసురుకున్నాం కద! సుజాతగారైతే (మనసులో మాట) ఏకంగా బజ్జా? బ్లాగా? అని పోస్ట్ కూడా పెట్టేసారు.ఇప్పుడేమో గూగలోడు బజ్జు మూసేస్తున్నానొహో అని ప్రకటించేసాడు. మా అందరికీ ఒకటే ఏడుపొచ్చేసింది. సరే ఇంక చేసేది ఏమీలేక బజ్జులో జరిగిన కొన్ని సరదా [...]
నేనూ శ్రీరామరాజ్యం చూసేసానోచ్. శనివారమే చూసాను కానీ "ఆ శని, ఆది వారాలు బ్లాగు/బజ్జు ఎవరు చూస్తారులే, సోమవారం తాజాగా రాద్దాం" అని ఊరుకుంటే...అయ్యబాబోయ్ అందరూ చూసేయడం, రాసేయడం కూడా అయిపోయింది. అయినాసరే నేను రాసి తీరుతాను...మీకూ చదవక తప్పదు. :Pకథ మనకు తెలిసినదే. దానిలో న్యాయాన్యాలు, వాదోపవాదాలు ఎరిగినవే. దాని గురించి మళ్ళీ రాయక్కర్లేదు. బాపూ ఈ సినిమాని ఎలా తీసారో చూద్దామని [...]
కార్తీక్ పెళ్ళి అని తెలిసిన రెండు నెలల ముందు నుండి మొదలయ్యింది హడావుడి. తను పెళ్ళి తేదీ చెప్పగానే "అరే సరిగ్గా నేను మా ఊరు వెళ్ళే ట్రిప్ ప్లాన్ చేసుకునే టైములోనే పడిందే" అని ఒకింత ఆశ్చర్యం, సంబరం. బలే బలే అనుకుంటూ తయారయిపోయాను. చాలామంది బ్లాగు మితృలు వస్తున్నారని తెలిసి సంతోషమనిపించింది. బ్లాగు/బజ్జు లలో పరిచయమైన మితృలతో సరదాగా కబుర్లు చెబుతున్నానుగానీ ఇప్పటివరకూ [...]
మన బ్లాగర్లలలో చాలామంది చాలా భావుకతతో బోల్డు బోల్డు రాసేస్తుంటారు కదా. పువ్వు గురించో, నవ్వు గురించో, "నువ్వు" గురించో...బలే రాస్తుంటారు. అలాగే రాధాకృష్ణుల గురించి...విరహవేదనల గురించి, ఆమె గురించి, అతని గురించి...ఏవేవో రాస్తుంటారు.మనకి అంత భావుకత లేదు, అదంటే ఏమిటో కూడా తెలీదు. అసలు వీళ్ళెలా రాస్తుంటారా అని తెగ ఆశ్చర్యపోతుంటాను. చివరికి నిన్న తెలిసింది. మన నేస్తం లేరూ [...]
ఢిల్లీలో ఏ గల్లీలో చూసినా పోలీసులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు. ఇదేదో బలే బావుందే...చక్కగా మనకి ఎంత రక్షణ అని మురిసిపోయేలోపే వాళ్ళ ప్రతాపాలు తెలిసి ప్రాణం బిక్కుబిక్కుమంటుంది. ఒక పెద్ద రోడ్డు మీద సాయంకాలం అయిన దగ్గరనుండీ రెండు వైపులా పెద్ద పెద్ద గేటుల్లాంటివి పెట్టేసి మధ్యలో కాస్త దారి మాత్రమే వదులుతారు. కార్లన్నీ ఒకదాని వెనుక క్యూలో వెళ్లాలన్నమాట. ఇది [...]
ఇవాళ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి పుట్టినరోజు. కంచిపట్టు చీర మీద ముత్యం దొర్లినట్టుగా ఉండే ఆవిడ గానం...అమృతం! పొద్దున్నే లేచి ఆవిడ పాడిన సుప్రభాతం వినని తెలుగిల్లు ఉంటుందా! ఎంత పుణ్యం చేసుకున్నామో ఆవిడ మనకు వరం గా దొరికారు. ఆవిడ గాత్రాన్ని విని మనం జన్మలు ధన్యం చేసుకున్నాం! ఆవిడ గురించి తెలియనిదెవరికి! నేను కొత్తగా చెప్పేదేమీలేదుగాని ఈరోజు ఆవిడ జన్మదిన సందర్భంగా [...]
Up date -1 (02-09-2011) ప్రతీక్ కి సొంత అక్కచెల్లెళ్ళు, అన్నాదమ్ములు ఉంటే వాళ్ళ బోన్ మేరో తో ప్రతీక్ బోన్ మేరో 99% మేచ్ అవుతుంది కాబట్టి పని సులువయ్యేది. కానీ ప్రతీకే మొదటి బిడ్డ. తన తల్లి బోన్ మేరో ని టెస్ట్ చేసారు. రిపోర్ట్స్ నిన్న సాయంకాలం వచ్చాయి. తల్లి బోన్ మేరో తో కుదరదని చెప్పారు. కాబట్టి ఆ option కూడా మూసుకుపోయింది. ఇంక డోనర్స్ కోసం వేచి చూస్తున్నారు. కేసు ఇంకా complicate అయ్యింది. [...]
మాయాబజార్ గురించి మరొక్కసారి... నిన్న బజ్జులో అందరం మాయాబజార్ గురించి తలుచుకుని కొంతసేపు ముచ్చటించి ఆనందించాం. అలా ముచ్చటిస్తుంటే అంతకుముందెప్పుడో మాయాబజార్ గురించి నవతరంగం లో నేను రాసిన వ్యాసం గుర్తొచ్చింది. వ్యాసంలో ఉన్న కొన్ని తప్పొప్పులను సవరిస్తూ మళ్ళీ ఇక్కడ.... మాయాబజార్ కొత్తగా రంగులద్దుకున్నవేళ నూతనకళతో మిలమిలా మెరిసిపోతోంది. కొత్తవన్నెలద్దడానికి [...]
చిన్నప్పటినుండీ భూకంపం ఎలా ఉంటుందో, జస్ట్ ఆ భావనని మాత్రం పొందాలని బలే సరదాగా ఉండేది. భూకంపం వల్ల వచ్చే పరిణామాలు వద్దు, ఊరికే ఆ అనుభవం మత్రం కావాలి. ఇది ఒక వింత కోరికగా ఉండేది నాకు. ఓసారి నేను పదో తరగతిలో ఉండగా అనుకుంటా...దీపావళి ఇంకో నాలుగురోజులలో వస్తుందనగా...ఓరోజు రాత్రి 8.00 అవుతుండగా ఇంట్లో సామానులు అదిరిపడ్దాయి. భూకంపం అనుకుని నేను, చెల్లి, అమ్మ బయటకి [...]
ఈ మధ్య చూసిన, నాకు నచ్చిన మూడు తమిళ చిత్రాల గురించి ఇక్కడ ప్రస్తావించాను. http://chitram.maalika.org/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%95%E0%B1%81-%E0%B0%A8%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8/
"కళతో లీనమయ్యే ఏ కళాకారుడైనా తన కళాసృష్టి ముగించాక దానికేసే కొద్ది క్షణాలు తమకంగా చూసుకుంటాడు.ప్రసవవేదన పడి బిడ్డను కన్నాక తల్లి ఆ బిడ్డ కేసి చూసుకోడానికి, అలానే ఒక కళాకారుడు తన "సృష్టిని" చూసుకోడానికి మధ్య తేడాలేదు." అని ఎక్కడో చదివాను.ఊహకి రూపమిచ్చి, జన్మనిచ్చే ఒకే ఒక సాధనం చిత్రలేఖనం. భావవ్యక్తీకరణకి తిరుగులేని సాధనం చిత్రలేఖనం. ప్రకృతి అందాలను, [...]
మొన్న సుజాత గారు శారదా శ్రీనివాసన్ గారి పుస్తకం గురించి తన బ్లాగులో రాసాక, నాదగ్గరున్న ఎప్పటివో పాత బాలనందం కార్యక్రమాలు గుర్తొచ్చాయి. "ఆపాత" జ్ఞాపకాలు మీకోసం. బాలన్నయ్య, బాలక్కయ్య తెలిసినవాళ్ళకి ఇవి అపురూపాలు. ఇవి విని అందరూ తమతమ బాల్యంలోకి హాయిగా వెళ్ళిపోండి! :) తాలలే తాలలే...మా పాపాయిపుట్టినరోజు పండుగపొట్టి బావ - చిట్టి మరదలుపిల్లలకే స్వరాజ్యం వస్తేపళ్ళోయమ్మ [...]
మా చిన్నప్పుడు ఈ వ్రాత గురించి వినడం తప్ప ఇంకేమి తెలీదు. పూర్వం రోజుల్లో ఒక అక్షరానికి ఇంకో అక్షరాన్ని కలిపేస్తూ రాసేవారని వింటూ ఉండేదాన్ని. మధురైలో తిరుమలనాయకర్ మహల్ లో ఉన్న పెద్ద లైబ్రరీకి వెళ్ళినప్పుడు అత్యంత పురాతన గ్రంధాల్లో ఈ వ్రాతని గమనించాను. ఎక్కడా ఖాళీ లేకుండా, ఎత్తిన చెయ్యి దించకుండా ఉన్న ఆ వ్రాత ఒక్క ముక్క బోధపడలేదు. పూర్వం ఘంటిక ని సిరాలో ముంచి [...]
ఈ మధ్య మనసుని కాస్త కలచివేసిన కబుర్లన్నమాట:1) మొన్న ఆ మధ్య నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కి వెళ్లాల్సొచ్చింది. స్టేషన్ బయట ఓ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు....వాళ్ళ చేతుల్లో చిన్న చిన్న జెండా కాగితాలు, గుండుసూదులు (అల్పీలు). ఎవరినీ ఏమీ అడగకుండా, చేతికి ఎవరు దొరికితే వాడి చొక్కాకి ఆ జెండాలు అతికించేస్తూ రెండు రూపాయిలు వసూలు చేస్తున్నారు. అసలు ఎంత సామర్ధ్యంగా చొక్కాలో, చేతులో [...]
ఈ మధ్య పిల్లలందరూ పరీక్షలు, ర్యాంకులనీ తెగ హడావుడి చేసేసారుగా...అవన్నీ చూస్తే నా పరీక్షల హడావుడిగుర్తొచ్చింది.చిట్టి సౌమ్యకి పరీక్షలతో ఎన్ని కష్టాలో! అసలు చిన్నప్పటినుండీ పరీక్షలంటే అస్సలు ఇష్టముండదు...వెధవ పరీక్షలుఎందుకొస్తాయో అని విసుక్కునేది. చిన్నప్పటినుండీ ఇష్టమున్న పని చాలా హాయిగా చేస్తూ ఇష్టం లేని పని అస్సలుచేసేది కాదు. అదే సూత్రం పాఠాలకీ వర్తించేది. [...]
నిన్న మధురవాణి బ్లాగులో రాసిన కృష్ణా! నేను...నీ రాధని! అన్న టపా చూసాక నాకు పింగళి వారు రాసిన "రాధనురా నీ రాధనురా" అన్న పాట గుర్తొచ్చింది. ఇది పెళ్ళి చేసి చూడు (1952) సినిమాలోది.రాధనురా నీ రాధనురా!రాసలీలలా ఊసే తెలియని కసుగాయలకారాధనురా!వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా!రాధనురా నీ రాధనురా!ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధనురా!మధురానగరి మర్మమెరిగిన మాధవ [...]
పుస్తకాలు చదవడం ఒక మంచి అలవాటు (హాబీ) అని చిన్నప్పటినుండీ పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ అదేంటో నాకు ఈ అలవాటు కానేలేదు చిన్నవయసునుండీ. పెద్దనాన్నగారు చెప్పే పద్యాలు అలాగే నేర్చేసుకుని తిరిగి ఒప్పజెప్పడం తప్ప పుస్తకాలు చదివిన పాపాన పోలేదు. చిన్నవయసులో చందమామ పుస్తకాలు మాత్రం విపరీతంగా చదివేదాన్ని. అవి తప్పితే వేరే పుస్తకాలు ముట్టుకుంటే ఒట్టు. అసలు అంతంత పెద్ద [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు