నిదానంగా చదవండి....... ఖచ్చితంగా నవ్వితీరుతారు మీ గురించి 5 మాటలు మీరు You You You You You You You You You You You You You You You You You You You.... 1. మీరు పరమ పరమ బద్ధకస్తులు ... ఎందుకంటే అన్ని You లను మీరు చదవలేదు.. 2. You ల మధ్యలో ఒక Yoo కూడా ఉంది. దాన్ని మీరు గమనించలేదు. 3 .జస్ట్ ఇప్పుడే మీరు Yoo కోసం వెతికారు. 4. మీ మొఖం ఎర్ర బడు తోంది.. అక్కడ Yoo లేదని... మీ గురించి 13 నిజాలు చెబుతాను.......... 1.మీరిప్పుడు మొబైల్ పట్టుకుని ఉన్నారు.... 2 [...]
పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా?ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను  అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.అయితే ఇది ఇప్పటి విషయం కాదు. కొంచెం అటూ ఇటూగా  మూడు దశాబ్దాలు గడిచాయి.అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్.విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై,  రామోజీరావు [...]
పార్టీ మార్పిడుల విషయంలో వార్తల స్క్రోలింగులు వారాల తరబడి సాగుతాయి ఇలా:పార్టీ మారాలనే ఆలోచనలో పలానా పార్టీ మారే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన పలానా పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన పలానా తుది శ్వాస వరకు పార్టీలోనే కొనసాగుతానని  స్పష్టం చేసిన పలానా పార్టీ అధినాయకత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన పలానా నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైతే తీవ్ర [...]
మా బావగార్లలో ఇద్దరు శ్రీ అయితరాజు రామారావు (వల్లభి), శ్రీ కొలిపాక రామచంద్ర రావు (రెబ్బారం) స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఖమ్మం జిల్లాలో బ్రిటిష్ వ్యతిరేక ఆందోళనలు నడిపి పద్నాలుగు మాసాలకు పైగా కఠిన  జైలు శిక్ష అనుభవించారు. మహాత్ముని బోధనలకు ప్రభావితులై తమ గ్రామాల్లో అంటరానితనాన్ని నిర్మూలించే విషయంలో గ్రామీణులను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించేవారు. వున్నవాళ్ళు, [...]
సుమారు అరవై ఏళ్ళ కిందటి మాట. ఖమ్మం జిల్లా, వల్లభి గ్రామం. కారణం తెలవదు కానీ ఆ వూళ్ళో అగ్రవర్ణాలకు, దళితులకు నడుమ ఘర్షణలు తలెత్తాయి. దళిత వాడకు చెందిన మగవాళ్ళు, పెద్ద పెద్ద ఖామందులు ఎవరూ వూళ్ళో వుండలేక బయట ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్తితి. మా పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు ఆ ఊరుకు పెద్ద. ఆయన పూనికపై నాగపూరు నుంచి కాబోలు, వినోబా శిష్యులు బన్సాలీ గారు వల్లభి వచ్చి [...]
పరవస్తు లోకేశ్వర్ గారు రాసిన సిల్క్ రూటులో సాహస యాత్ర పుస్తకంలో రాసిన ఒక విషయం గుర్తుకు వస్తోంది. అయిదేళ్ళ క్రితం చైనాలో తాను జరిపిన  రైలు ప్రయాణ అనుభవాన్ని ఆయన ఇలా అభివర్ణించారు.“చైనా భాషలో లీన్ యాన్ అంటే పువ్వుల తోట అని అర్ధం. కానీ ఎడారి కొసన ఉన్న పట్టణం కాబట్టి ఎక్కడా చెట్టూ చేమా జాడ కూడా లేదు.  రైలు స్టేషన్ కు మూడంచెల పటిష్టమైన భద్రత. టిక్కెట్టు యెంత ముందు [...]
వారాల అబ్బాయిలా ప్రతి గురువారం పొద్దున్నే యధావిధిగా స్నేహ టీవీ డిబేట్ కు వెళ్ళొచ్చి తీరిగ్గా మరోమారు పేపరు తిరగేస్తుంటే మా ఆవిడ ఫోను సంభాషణ చెవుల్లో పడింది. మిగతా సమయాల్లో ఏమో కాని, ఫోను మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆవిడ స్వరం స్పష్టంగా, స్పుటంగా వినిపిస్తుంది.“ఇక్కడ వానల సంగతా. నిన్న  కాస్త తెరిపి ఇచ్చింది కానీ, మళ్ళీ భారీ వర్షాలు అంటూ టీవీలు భయపెడుతున్నాయి. [...]
చంద్రబాబు నాయుడికి హై టెక్ సీఎం అనే పేరు ఏనాటి నుంచో వుంది. దానికి తగ్గట్టే టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో ఆయన ఎప్పటికప్పుడు ‘అప్ డేట్’ అవుతుంటారు కూడా. ‘భారత్ అంబుల పొదిలో మరో కొత్త యుద్ధ విమానం’ అన్నట్టుగా చంద్రబాబు వాడే పదాల పొదిలోకి కూడా కొత్తవి వచ్చి చేరుతుంటాయి. నిన్న విశాఖలో మరో రెండు కొత్త పదాలను – ‘బ్లాక్ చెయిన్, అగ్రి హ్యాకధాన్’ అనేవాటిని  ఆయన [...]
కొన్ని వారాలు వెనక్కి వెడితే...సాక్షి టీవీలో అమర్ ఫోర్త్ ఎస్టేట్ ప్రోగ్రాం. పక్కన ఎక్జిక్యూటివ్ ఎడిటర్ రామచంద్ర మూర్తి గారు కూడా వున్నారు, నంద్యాల ఎన్నికల తరువాత అనుకుంటాను. “అధికారం ఉన్నదే దుర్వినియోగం చేయడానికి, లేకపోతే ఆ అధికారం ఎందుకు?” అన్నాను ఒక ప్రశ్నకు జవాబుగా.అధికార దుర్వినియోగాన్ని నేను సమర్దిస్తున్నానా అనే భావం వారి మొహాల్లో కనిపించి నేను కొంత వివరణ [...]
యాక్టివ్ జర్నలిజంలో ఉన్న కాలంలో   రాజకీయాల్లో తలపండిన అనేకమంది తరచుగా అడిగే ప్రశ్న ‘ముఖ్యమంత్రిని కలవడం ఎలా?’  ఆ రోజుల్లో నాకు ఆశ్చర్యం కలిగించే ప్రశ్న అది.ముఖ్యమంత్రులను కలవడం ఆషామాషీ కాదు అన్న వాస్తవం ‘విలేకరిత్వం’ ఒదిలిన తర్వాత కానీ నాకూ అర్ధం కాలేదు.  అప్పటిదాకా తలుపు తోసుకుని వెళ్ళిన తమను, ఆ  ‘తలుపు’ దగ్గరే అడ్డగించే ద్వారపాలకులకి తమ  ‘ప్రవర’ [...]
  ఇది సినిమా రివ్యూ కాదు. ఒక అభిప్రాయం మాత్రమే. 1970  నుంచి 1975 వరకు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసేరోజుల్లో నండూరి రామమోహన రావు గారు నాచేత వారం వారం సినిమా రివ్యూలు రాయించేవాళ్ళు. తెలుగు సినిమాలతో పాటు అప్పుడు విజయవాడలో అడపాతడపా విడుదల అయ్యే హిందీ సినిమాలు చూసి సమీక్షలు రాస్తుండేవాడిని. పాకీజా సినిమా వాటిల్లో ఒకటి. ఇక ఇన్నేళ్ళలో రివ్యూలు రాయడమే కాదు, అసలు సినిమాలు [...]
పెడదారి పడుతున్న యువత అనే అంశంపై ‘టీనేజ్ టెర్రర్’ అనే పేరుతొ రాజ్ న్యూస్ టీవీ ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలను పాఠకుల దృష్టికి తీసుకురావలని అనిపించింది.(రాజ్ న్యూస్ వారికి కృతజ్ఞతలు)“ఎదిగే వయసులోనే సమిధలవుతున్నారు.. నిద్ర లేచినప్పటి నుంచి ఊహల్లో ఊరేగుతూ ఊసుల్లోనే బతుకుతున్నారు.. చదువు .. కెరీర్ పక్కనపెట్టి.. లవ్, అట్రాక్షన్ [...]
ఈమధ్య ఇలా అనిపిస్తోంది. డాక్టర్ భరత్ పుణ్యమా అని ఈమధ్య ఒక పుస్తకం చదివాను. అది చదివిన తరువాత ఇక రాయడానికి పూర్తిగా స్వస్తి చెప్పి ఇలాటి పుస్తకాలే చదువుతూ వుండాలని గట్టిగ అనిపిస్తోంది. ఆ గొప్ప  పుస్తకం పేరు “సిల్క్  రూటులో సాహస యాత్ర”.  దాన్ని రాసిన గొప్ప రచయిత పేరు పరవస్తు లోకేశ్వర్. మొదటి ప్రచురణ 2013 లో. నాలుగేళ్ళకు చదవగలిగినందుకు ఒక రకంగా సంతోషంగా వుంది. [...]
“విన్నంతలో కన్నంతలో వైఎస్సార్” అనే నా వ్యాసం ఈరోజు సాక్షి పత్రిక ప్రచురించింది. దాంతో ఉదయం నుంచి నా మొబైల్ మోగుతూనే వుంది. ఎంతమంది నాతొ మాట్లాడారో లెక్కలేదు. రాజశేఖరరెడ్డి గారి ‘రాజకీయం’ గురించీ, ఆయన పాలనలో జరిగిన కొన్ని వివాదాంశాలు గురించి మెజారిటీ జర్నలిష్టులకు మించిన విభిన్న అభిప్రాయాలు నాకూ లేవు. కాకపొతే ఒక ముఖ్యమంత్రిగా ఆయనలో అభివ్యక్తి చెందిన ఒక మానవీయ [...]
(Published in SAKSHI telugu daily today, 02-09-17,on the occasion of death anniversary of Dr.Y.S.Rajasekhara Reddy)  సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన వై.ఎస్. రాజశేఖర రెడ్డికి, తనకు తానుగా ప్రజలందరికీ మేలు చేసే అవకాశం పూర్తిగా లభించింది ముఖ్యమంత్రి అయిన తరువాతనే. రాజకీయ ప్రవేశం చేసిన తొలి నాళ్లలో నిర్వహించిన మంత్రి పదవులు మినహా ఆయన ఎక్కువ కాలం సచివాలయానికి, ఆఫీసు ఫైళ్ళకు దూరంగా, పార్లమెంటు సభ్యుడిగానో లేదా ప్రతిపక్ష నాయకుడిగానో [...]
(ఈరోజు ఆగస్టు  31,బాపూ గారివర్ధంతి సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు)Srinivasulu Bhattaram గారని నాకొక ఇంటర్ నెట్ మిత్రులు వున్నారు. చక్కని రాయసకాడు. సున్నితమైన హాస్యం ఆయన రచనల్లో చిప్పిల్లుతూ వుంటుంది. ఆయన నాలాగే ‘బాపూ రమణల’ వీరాభిమాని. బాపూ గారితో వ్యక్తిగత సన్నిహిత పరిచయం వున్న అదృష్టవంతులు కూడా. ఆయన ఇంటిపేరు తెలుగులో ఎలారాస్తే యేమో అని యధాతధంగా ఇంగ్లీష్ లోనే ఇవ్వాల్సివస్తోంది. [...]
ఈ తెల్లవారుఝామున ఫోను మోగింది. పెద్దాయన దాటిపోయారు అని చెప్పారు వల్లీశ్వర్.  ఆదివారం రాత్రే  జ్వాలా, నేనూ కలిసి బంజారా కేర్ ఆసుపత్రికి వెళ్ళాము. ఐ.సి.యూ. లో ప్రసాద్ గారిని చూశాము. జీవితంలో ఎలాంటి బంధాలు లేకుండా బతికిన మనిషి ముక్కు, నోటికి బంధనాలతో చూస్తుంటే ఎంతో బాధ వేసింది. ఈ రాత్రి గడవడం కష్టం అనే భావన డాక్టర్ల అభిప్రాయంగా తోచింది. అయ్యో అనిపించింది. ప్రసాద్ గారి [...]
"Today marks an important and exciting day for us. As I have informed you earlier, Sakhi got selected as the Fashion Ambassador for Nordstrom - a leading high end fashion retailer headquartered in Seattle. "As fashion ambassador, she will learn the ropes of how the retail and fashion industries work - a non paid training for the remainder of her year. "On her first day as fashion ambassador at Nordstrom, she talked to her trainer and asked if she can actually work in a paid capacity. She got a employment form home and filled it up herself, scheduled a phone interview the following week and then went for an in-person interview yesterday. "Today, she was offered a job as a Sales associate at Nordstrom and she starts working from Aug 22. "I can't believe that my young girls are already standing on their own legs and giving flight to their dreams. As parents we cannot but feel proud because we aspire for our kids to be better than us, go further than us, attain more [...]
భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన దాదాపు  తొంభై ఏళ్ళ వయస్సులో కూడా చెల్లమ్మగారు, మా బామ్మగారు పచ్చి మంచి నీళ్ళు సైతం ముట్టకుండా నిష్టగా ఉపవాసాలు చేసేవాళ్ళు. భారత భాగవతాలు చదవడం, యాత్రలు చేయడం అన్నీ పద్దతిగా చేసేవారు. మా బామ్మ గారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర, దక్షిణ యాత్రలు అన్నీ చేసింది. చెల్లమ్మ గారు మాకు బుద్ధి తెలిసిన తరువాత ఎటూ వెళ్ళేది కాదు. [...]
"సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి తోడుపడవోయ్‌" అన్న గురజాడ వారి మాటను ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు ఈ ప్రకాష్.ఇంతకీ ఈ ప్రకాష్ ఎవరంటే!ముందు ఓ కధ చెప్పుకోవాలి.ఒకాయన ఒక రోజు స్కూటరు మీద వెడుతుంటే టైరులో గాలి తగ్గినట్టు అనిపించి రోడ్డుపక్కన ఓ టైర్ పంక్చర్ షాపు ముందు ఆగాడు. ఈ ఒకాయన్ని చూడగానే ఆ మెకానిక్కు లేచివచ్చి, ‘మీరలా ఆ స్టూలు మీద కూర్చోండి, నిమిషంలో మీ బండి పని [...]
భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన “మా కుటుంబం మొత్తంలో మా చిన్న తాతగారు   భండారు సుబ్బారావుగారి తరహానే  వేరు. సుబ్బయ్య తాతగారిది  ఆధ్యాత్మిక దృక్పధం. జాలిగుండె. ఎవరికి కష్టం వచ్చినా చూడలేడు. కాకపొతే ప్రధమ కోపం. కాని అది తాటాకు మంట లాటిది. ఇట్టే ప్రజ్వరిల్లినా మళ్ళీ అట్టే చల్లారిపోయేది. చిన్నతనంలో చాలా దుడుకు మనిషి అని పేరు కాని పెద్దయిన తరువాత  చాలా [...]
భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన “పర్వతాలయ్య గారి తమ్ముడు లక్ష్మీనారాయణ గారు వ్యవహార దక్షుడు. వూళ్ళో తగాదాలు వస్తే ఆయన దగ్గరకు వచ్చి పంచాయితీ పెట్టేవారు. సన్నగా,పొడుగ్గా, నిటారుగా ఉండేవాడు. ఎనభయ్ నాలుగేళ్ళకు పైగా జీవించాడు. ఆయనకు సంతానం కలగలేదు. మా పినతండ్రి రామప్రసాదరావు గారిని దత్తు తీసుకున్నారు. మా తాతగారు పర్వతాలయ్య గారు బండ్లు కట్టుకుని భద్రాచలం [...]
భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన “మా తాతగారు పర్వతాలయ్య గారికి చిన్నతనంలోనే పెండ్లయింది. పెండ్లిలో కూడా మా బామ్మ ఆయనపై పడుకుని నిద్రపోయిందట. పొలిమేర మీద ఊళ్ళు కావడం వల్ల బాగా రాకపోకలు ఉండేవి. ఇద్దరూ కలసి ఆడుకునేవారట. మా బామ్మగారు సమర్త కాకపూర్వమే గర్భం ధరించిందట. మా నాన్నగారు పోయినప్పుడు చెల్లమ్మమ్మ ఎంతో దుఃఖపడింది. ఆ ఏడుపులోనే,  ఇదిగో ఈకధ,  ఆమె నోట [...]
భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన “ఆరోజుల్లో  పుట్టి ధాన్యం రూపాయాకో రెండుకో అమ్ముడయ్యేది. పంటలన్నీ వర్షాధారం. ధరలు లేవు. దానితో చాలామంది రైతులు శిస్తు కట్టలేక పొలాలు వొదిలేసి వెళ్లిపోయారట.  అప్పటి నిబంధనల ప్రకారం ఆ శిస్తు తాను  చెల్లించి ఆ పొలాలను రామయ్య గారు తీసుకున్నారట. ఆయనకు కరిణీకంచేసినందుకు లభించే జీతం నెలకు మూడో నాలుగో రూపాయలు. అవేం చేయాలో [...]
భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన “కంభంపాడు గ్రామం కృష్ణాజిల్లాలోది. (లోగడ ఇది నందిగామ తాలూకాలో వుండేది. తాలూకాల రద్దు, మండల వ్యవస్థ ఆవిర్భావం తరువాత మా గ్రామం వత్సవాయి మండలంలో చేరింది). ఈ గ్రామ చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు లేవు. గ్రామంలో వున్న శ్రీ రాజలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించారని చెబుతారు. అదే [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు