“ఏవిటండీ ఈ రాజకీయ నాయకులు మాట్లాడే భాష రోజురోజుకూ ఇలా దిగజారిపోతోంది?”అన్నారు ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ పొద్దున్నే ఫోను చేసి.ఆయన మృదు స్వభావులు. సున్నిత మనస్కులు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం డైరెక్టర్ గా పనిచేశారు. రేడియో కార్యక్రమాల్లో  ఏదైనా అప్రాత్యపు వాక్యం దొర్లినా విలవిలలాడేవారు. ఇక నేటి రాజకీయుల ఇష్టారాజ్యపు మాటల తూటాలు [...]
‘తాంబూలాలు ఇచ్చేశాం, మీ ఇష్టం’ అనేశారు ఢిల్లీలో  ఏలికలు“ఈరోజు లాగానే రేపూ, కాకపోతే సభ మర్నాటికి కాకుండా నిరవధికంగా వాయిదా. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇదే జరుగుతుంది. నా మాటే కాదు, జనం అనుకుంటున్నది కూడా ఇదే.”గురువారం రాత్రి సాక్షి టీవీలో అడిగిన ప్రశ్నకు నా సమాధానం.    అద్భుతం జరగలేదు, కాబట్టి అందరూ అనుకున్నదే జరిగింది. పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా [...]
ఎలక్షన్ కమీషనర్  (ఆ రోజుల్లో ఒక్కరే) గా వుండగా టీ.ఎన్. శేషన్ ఓసారి హైదరాబాదు వచ్చారు. రాజ భవన్ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం. అందరం బిలబిలా వెళ్లాం. ఎలక్షన్ కమిషనర్ హోదాలో అది మొదటి సమావేశం. ఆయన గురించి వినడమే కాని వ్యవహార శైలి ఎవరికీ పరిచయం లేదు. గది నిండి పోయింది. ఇంతలో ఆయన వచ్చారు. ఫోటోలు తీసుకోవడానికి ప్రెస్ ఫోటోగ్రాఫర్లు అక్కడి సోఫాలపైకి ఎక్కారు. ఇది మామూలే. ఫోటో [...]
బెన్ హర్ మహేష్ ఎక్కా. ఐ.ఏ.ఎస్.ఆయన్ని చూసి కాస్త అటూ ఇటూగా పాతికేళ్ళు. నేను గుర్తు పట్టనే లేదు. రాత్రి అన్నంలో వేసుకుంది ఏ కూర అంటే చప్పున చెప్పలేని గొప్ప జ్ఞాపక శక్తి నాది.ఆ విషయంలో జ్వాలాని మెచ్చుకుని తీరాలి. స్నేహితులు, సన్నిహితులవే కాక అప్పుడప్పుడు పరిచయం అయిన వ్యక్తుల పేర్లు, ఫోను నెంబర్లు అన్నీ ఆయనకి కరతలామలకం. నిజానికి ఆయన ఫోను చేసి చెప్పబట్టే బెన్ హర్ ఎక్కాని [...]
(జనవరి 18  యన్టీయార్ వర్ధంతి)యన్టీయార్ అని అభిమానులు ముచ్చటగా పిలుచుకునే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కొందరు తెలుగు దేశం నాయకులు ఆయన్ని కలిసి, 'పలానా జిల్లా ఎస్పీ ని బదిలీ చేయాల'ని  కోరారు. వారిని యన్టీయార్ రెండే రెండు ప్రశ్నలు అడిగారు."ఆ పోలీసు అధికారి అవినీతి పరుడా? చేతకానివాడా?"కాదన్నారు వాళ్లు."మరేమిటి?" సీ.ఎం. ఆరా."మన పార్టీకి పనికి [...]
వూరు మారిపోయింది – భండారు శ్రీనివాసరావు తెలతెలవారవస్తోంది. పక్కన శివాలయం మైకులోంచి బాలసుబ్రమణ్యం శివస్తుతి బిగ్గరగా వినవస్తోంది. ఇల్లు   ఇల్లంతా నిద్ర పోతున్నవారితో నిండిపోయివుంది. ఊరేలా మారిందో కళ్ళారా చూడాలనే కోరిక చలిని జయించింది. నిద్ర మంచం మీద నుంచి లేచి వీధిలో కాలుపెట్టాను. వూళ్ళో వున్నవే మూడు వీధులు. అవన్నీ ముగ్గుల దుప్పట్లు కప్పుకుని [...]
(విజయవాడ వీధుల కధలు – రచన: లంక వెంకట రమణ)మితృడు రమణ ఈ పుస్తకానికి విజయవాడ వీధుల కధలు అని ఎందుకు పేరు పెట్టాడో తెలియదు కానీ ఇందులో విజయవాడ విశేషాలే ఎక్కువగా వున్నాయి. ఇందులో బెజవాడ వద్ద కృష్ణానదిపై కట్టిన ఆనకట్టతో మొదలయిన ప్రకాశం బరాజ్  కధ ప్రధానమైనది. అదిలా సాగింది.“ప్రధానమైన నిర్మాణాలన్నీ మాయా మంత్రాలతో నిర్మించినవి కావు. వాటి వెనుక అనేకమంది త్యాగం వుంది. [...]
(విజయవాడ వీధుల కధలు – రచన: లంక వెంకట రమణ)“బోధిసత్వ మైత్రేయుడు  బెజవాడ దగ్గర ఒక కొండపై జ్ఞానోదయం కోసం తపస్సుచేసి, అక్కడే శరీరం వదలివేసాడని రాబర్ట్ సువెల్, రాయల్ ఏషియాటిక్ సొసైటీ (లండన్) 1884 పత్రికలో రాశాడు.బుద్ధుడు నిర్యాణం చెందిన తర్వాత మంజుశ్రీ గా జన్మించాడని, మైసోలియా (నేటి మచిలీపట్నం) నగరానికి త్రిపిటకాలు సంపాదించడం కోసం వెళ్లి తిరిగివస్తూ, దారిలో కొండ మీద గొప్ప [...]
నాలుగున్నర దశాబ్దాల క్రితం. విజయవాడ లబ్బీపేట ఆంద్రజ్యోతిలో పనిచేస్తున్న రోజులు. లంక వెంకట రమణ నా సహోద్యోగి. ఏమి చదివాడో తెలియదు కాని ఆంద్ర ఆంగ్ల భాషల్లో కొట్టిన పిండి. మధ్యాన్న భోజన సమయంలో దగ్గరలో వున్న మా ఇంటికి పోయే వాళ్ళం. ఒక్కటే గది. కుర్చీలు, మంచాలు ఉండేవి కావు. ఆ గదిలోనే  నా భోజనం. ఆయన అక్కడే చాప మీద  వరద రాజస్వామిలా పడకేసి, తలకింద మోచేయి పెట్టుకుని  అనేక [...]
  “అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః  పచామ్యన్నం చతుర్విధం”(శ్రీ మద్భగవద్గీత, పంచ దశాధ్యాయం,  పురుషోత్తమ ప్రాప్తి యోగము)   తాత్పర్యం: నేను వైశ్వానరుడు అను పేరు గల జఠరాగ్నినై, సకల ప్రాణుల శరీరములయందు ప్రవేశించి, జఠరాగ్నిని  ప్రజ్వలింప చేసే ప్రాణాపానములనే వాయువులతో కలిసి, భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యములనే నల్లుగు [...]
1970. అంటే నలభయ్ ఏడేళ్ళ నాటి ముచ్చట.బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా చేరిన తొలి రోజులు. ఎడిటర్ నార్ల గారు హైదరాబాదుకు మకాం మార్చడంతో నండూరి రామమోహన రావు గారే పత్రిక బాధ్యతలు చూస్తున్నారు.“ఏం రాయమంటారు?”నండూరి వారికి నా ప్రశ్న.“ఏదైనా రాయండి, ఏమి రాసినా అది  మీకు  ముందు అర్ధం అయిందా లేదా చూసుకోండి”నండూరి వారి జవాబు. 
మూడేళ్ళ క్రితం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ యాత్రానుభవాలను గురించి నాడు ‘సూర్య’ దినపత్రికలో రాసిన వ్యాసం నుంచి చిన్న పేరా:“ తిరుమల గర్భ గుడి నుంచి బయటకు వచ్చిన తరువాత భక్తుల అసలు కష్టాలు మొదలవుతాయి. అధికారులు, వీ ఐ పీ లను తీసుకువచ్చి మళ్ళీ తీసుకుపోయే వాహనాలు గుడి దరిదాపుల దాకా వస్తాయి. కానీ సామాన్య భక్తులు  మాత్రం పాదరక్షలు లేకుండా [...]
సోషల్ మీడియాలో ఏదైనా రాస్తే ఎవరు చదువుతారు అనే అనుమానం చాలామందితో పాటు నాకూ వుంది. కేన్సర్ హాస్పిటల్  లో వైద్య నిపు ణుడు డాక్టర్ సెంథిల్ రాజప్ప నాకు ఈ రోజు పంపిన ఈ సందేశం ఆ సందేహాన్ని పటాపంచలు చేసింది. ఇప్పటివరకు వారెవ్వరో నాకు ఛాయా మాత్రంగా కూడా తెలియదు. పొత్తూరి వారి అనుభవాన్ని నేను నా మాటల్లో రాసాను. అంతే!  నందిరాజు వంటి మిత్రులు స్పందించారు. అది అంతటితో [...]
నిజం నోరు దాటే లోపలే పుకారు ఊరు దాటుతుందంటారు. సోషల్ మీడియా ప్రవేశం తరువాత ఈ వదంతుల వేగం మరింత పెరిగింది.కొందరు రాజకీయ నాయకుల గురించి, లేదా సినీ, సామాజిక రంగాల్లో ప్రముఖుల గురించి ఫోటో షాపో, మరో ప్రక్రియ ఏదో తెలియదు కానీ, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫోటోలు ఈ మీడియాలో విచ్చల విడిగా హల్ చల్ చేస్తున్నాయి. వారి గురించిన కాకమ్మ కబుర్లు [...]
సంకల్పానికి చిత్తశుద్ధి తోడయితే దానికి ఒనగూడే బలం గురించి, రేడియోలో విన్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి అనుగ్రహ భాషణం నుంచి (యధాతధంగా కాకపోయినా, మూలభావం దెబ్బతినకుండా) “నిప్పు రాజేయడానికి అగ్గిపెట్టె కోసం వెతుకులాడేవాడికి అది దొరకొచ్చు, దొరక్కపోవచ్చు. కానీ, నిమ్ముకున్న రెండు కర్ర ముక్కల్ని, రెక్కలు విరిగేలా రాపాడిస్తూ సంకల్పబలంతో నిప్పు పుట్టించాలని [...]
రిటైర్ అయి పుష్కరం దాటింది. ఆ కాలంనాటి రాతలు, కోతలు ఇప్పుడు లేవు. అంతా హైటెక్. అన్నీ కంప్యూటర్ల మీదే. అయినా ప్రతిదానికీ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు మాత్రం తప్పడం లేదు. అదృష్టం! ఎవరూ దక్షిణలు అడగడం లేదు.మొన్న పెన్షన్ స్లిప్ మెయిల్ లో పంపారు. వివరాలు అన్నీ సరిగానే వున్నాయి. కానీ పెన్షన్ నామినీ కాలంలో మా ఆవిడ పేరు లేదు. పెళ్లి నాడు కూడా ఇద్దరం కలిసి ఫోటో దిగలేదు [...]
ఈరోజు కార్తీక సోమవారం (13-11-2017) మధ్యాన్నం ఒంటిగంటా పది నిమిషాలకు రేడియోలో ఈ గొంతు వినపడింది. ఈ సాయంత్రం వార్తలు కూడా రంగారావు గారే చదవాలి. కానీ చదవడానికి ఆయన లేరు. సాయంత్రం బులెటిన్ కు సిద్ధం అవుతూ రేడియో స్టేషన్ లోనే కుప్పకూలిపోయారు. న్యూస్ రూమ్ లో పనిచేసే ఇతర సిబ్బంది వెంటనే ఆయన్ని దగ్గరలోని హైదర్ గూడా అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కానీ ఫలితం దక్కలేదు. ఏ వార్తలు [...]
ఎవరయినా ఒక పెద్ద పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు మరో పార్టీలోకి జారిపోతే ఆ సందర్భాన్ని'పార్టీ మార్పిళ్ళకు పరాకాష్ట’  అని గిట్టని పార్టీల వాళ్లు వ్యాఖ్యానిస్తుంటారు. ఇదేదో కొత్త విషయం అయితే ఆశ్చర్య పడాలి. ఈ చేరికలకు, చీలికలకు ఇది మొదలూ కాదు, చివరా కాదు. అందుకే విమర్శించేవారు మరో సందర్భంలో సమర్ధించడానికి సిద్ధంగా ఉండడానికి సిద్ధపడి వుండాలి. సమర్ధించేవారు ఇంకో [...]
నేను రేడియోలో పనిచేసే రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తుమ్మల నాగేశ్వర రావు గారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఆయన మా రేడియోకు ప్రధాన శ్రోత. రోడ్డుమార్గాన  ఖమ్మం జిల్లాకు వెళ్లి వస్తున్నప్పుడు, మధ్యాన్నం 1.10  లేదా  సాయంత్రం  6.15  అయితే చాలు, మంత్రి గారు ప్రయాణిస్తున్న మోటారు వాహనం రోడ్డు పక్కన నిలిచిపోయేది. ప్రాంతీయ [...]
అని చాలామంది అడుగుతున్నారు. నిరుడు జూన్ లో జరిగిన విషయం ఇది. నేనే మరచిపోయాను. కేటీఆర్ గుర్తుపెట్టుకున్నారు. అది ఆయన గొప్పతనం. తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి గారిని ఉద్దేశించి రాసింది. చివరి వాక్యం అందుకోసమే.అప్పటి పోస్టింగు ఇదిగో!   ఇలాగా కూడా జరుగుతుందా! – భండారు శ్రీనివాసరావు  కొన్ని విషయాలు వింటుంటే నిజమా అనిపిస్తుంది.మామేనకోడలుకు [...]
“ప్రభుత్వం అన్నాక పొగిడే వాళ్ళు వుంటారు, తెగిడే వాళ్ళు వుంటారు. పూలూ వేస్తారు, రాళ్ళూ వేస్తారు. మా పార్టీ వాళ్ళు ఆహా ఓహో అంటారు, అది సహజం, దానికి పొంగి పోకూడదు. అలాగే ప్రతిపక్షాల వాళ్ళు విమర్శలు గుప్పిస్తారు. అదీ సహజమే. వాటికి కుంగి పోకూడదు. కానీ నిష్పాక్షికులయిన జర్నలిష్టులు ఏదైనా రాస్తే, అది ప్రతికూలంగా వున్నా విషయం ఏమిటో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.  అలాగే [...]
నిరుడు నవంబరు ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అత్యంత నాటకీయంగా ప్రకటించారు. నిర్ణయం జరిగి ఏడాది కాలం గడిచి పోతున్న తరుణంలో కూడా ఈ నిర్ణయం మంచి చెడులను గురించి దేశ వ్యాప్త చర్చలు జరుగుతూ వుండడం విశేషం.పెద్ద నోట్ల రద్దు దరిమిలా, ‘సూటిగా...సుతిమెత్తగా....’ అనే శీర్షికతో  నేను మొదటి రెండు నెలల్లోనే సుమారు పది వ్యాసాలు రాసి ప్రచురించాను. [...]
మరణం తధ్యమని తెలిసిన పరీక్షిత్తు ఏం చేశాడు ? శుక మహర్షి ఆధ్వర్యంలో భాగవత సప్తాహంలో  శేషజీవితాన్ని గడిపాడు.దాదాపు ఇదే మాదిరి వృత్తాంతం విశాఖ నుంచి వినవచ్చింది. కాకపొతే ఇది జరిగి నలభయ్ అయిదేళ్ళు గడిచాయి.భాగవతుల పరమేశ్వర రావు గారి అసలు ఇంటి పేరు ఇదో కాదో తెలవదు. కానీ ఇదే పేరు అలా నిలబడి పోయింది. దానికి కారణం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆ కుటుంబం ఇచ్చే [...]
తెలంగాణా మునిసిపల్ వ్యవహారాలు, ఐ.టీ. శాఖల మంత్రి శ్రీ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) బీబీసి తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు ముప్పయి నిమిషాల పాటు సాగింది. బీబీసి తరహాలోనే విలేకరుల బృందం ప్రశ్నలు సంధించింది. వాటికి కేటీఆర్ తనదయిన శైలిలో తడబాటు లేకుండా సమాధానాలు ఇచ్చారు. ఇందులో వింతేమీ లేదు. కాకపోతే చివర్లో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎప్పుడో ఏడాది క్రితం [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు