నిజానికి ఈ పేచీలు కొత్త విషయం ఏం కాదు, చార్వాకుడి కాలం నుంచి చూస్తున్న తతంగమే. దేవుడ్ని నమ్మని ఈ చార్వాకుడు బృహస్పతి శిష్యుడు. నాస్తిక మత వ్యాప్తి చేసినవాడు. లోకాయత సిద్ధాంత కర్త. చార్వాక, లోకాయత ఇలా అనేక పేర్లు వున్నాయి ఈ శాఖకు. ‘లోకాయత’ అంటే ప్రజల తత్వశాస్త్రం అనీ, ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు. లోకాయతకు మిగతా తత్వ శాస్త్రాల  లాగా ఒక మూల పురుషుడు [...]
కొన్నేళ్ళ క్రితం ఒక వారపత్రిక వాళ్ళు నేను రాసిన మాస్కో అనుభవాల కూర్పు,  ‘మార్పు చూసిన కళ్ళు’ రచనని సీరియల్ గా వేస్తామని చెప్పి, ప్రచురణ మొదలయ్యే తేదీని కూడా నిర్ణయించి సరిగ్గా ఆఖరు నిమిషంలో మనసు మార్చుకున్నారు.  వాళ్ళు నాకు స్వయంగా చెప్పిన కారణం ఏమిటంటే, ఈ రచన ఇంతకుముందే నా బ్లాగులో వచ్చినందువల్ల, తమ పత్రిక నియమనిబంధనల ప్రకారం ప్రచురించ లేకపోతున్నామని. నేనూ [...]
(PUBLISHED IN ANDHRAPRABHA DAILY TODAY, 20-07-18) “ధర్మము ధర్మమటంచు వితండ వితర్కములాడదీవు, ఆ ధర్మము నేనెరుంగుదు.....” అంటాడు శ్రీరామాంజనేయ యుద్ధం నాటకంలో శ్రీరామచంద్రుడు, తనకు ధర్మం గురించి చెప్పబోయిన ఆంజనేయుడితో. యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు ధర్మాధర్మ విచక్షణకు తావుండదన్న ధర్మసూక్ష్మం ఇందులో దాగుంది.భారత పార్లమెంటు సాక్షిగా ఈరోజు పాలక ప్రతిపక్షాల నడుమ సాగనున్న ‘నీదా నాదా పైచేయి’ [...]
దేవాలయాల్లో సంప్రోక్షణ జరపడం అనేది సాంప్రదాయంగా వస్తున్న వ్యవహారమే. నిజానికి గుళ్ళల్లో ఈ కార్యక్రమం ప్రతి రోజూ జరుగుతుంది. ఏడాదికోసారి చేసే సంప్రోక్షణలలో మొత్తం గుడిని శుభ్రం చేస్తారు. ఇక మహా సంప్రోక్షణ అంటే ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ సమయంలో మూల విరాట్టును ఆవాహన చేసి ఆ మూల మూర్తిలోని లోని దైవిక మహత్తును, దైవ శక్తిని గర్భగుడికి ఆవలగా  ఏర్పాటు చేసిన మరో [...]
ఒకరిని అంటే పడే రోజులు కావివి. అంచేత నామీదే వేసుకుని చెబుతున్నాను.కొన్నేళ్ళ క్రితం అమెరికా నుంచి మా అబ్బాయి వచ్చాడు. చుట్ట పక్కాలకు, స్నేహితులకు కొన్ని కానుకలు పట్టు కొచ్చాడు. వాటి మీద వున్న ప్రైస్ టాగ్స్ తీసేస్తుంటే నేనన్నాను, ‘అలా వుంచి ఇస్తే తీసుకున్న వాళ్లకు వాటి విలువ తెలుస్తుంది కదా’ అని. వాడన్నాడు, ‘ఏదో  గొప్ప కోసం తేలేదు, అభిమానం కొద్దీ తెచ్చాను’. [...]
చాలా కాలం క్రితం నేను రాసిన ‘మార్పు చూసిన కళ్ళు’ (నా మాస్కో అనుభవాలపై పుస్తకం) ఆవిష్కరణ రవీంద్ర భారతిలో జరిగింది. అప్పటి తమిళనాడు గవర్నర్ రోశయ్య గారు ఆవిష్కరించారు. పత్రికా సంపాదకులు కూడా కొందరు పాల్గొన్నారు.కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు ఒకతను వచ్చి పలానా పత్రిక విలేకరిని అని పరిచయం చేసుకున్నాడు. రవీంద్ర భారతిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను [...]
లక్ష సర్క్యులేషన్ వున్న పత్రికలో మన వ్యాసం అచ్చవుతే ఆ లక్షమందీ దాన్ని చదువుతారు అనుకోవడం ఓ భ్రమ. కాకపొతే ఎక్కువమంది  కళ్ళల్లో పడే అవకాశం ఎక్కువ. కాదనను.ప్రేమలేఖను ఎంతమంది చదువుతారు చెప్పండి. ప్రేయసి ఒక్కరు చదివితే చాలని మురిసిపోతాడు ప్రియుడు.నలుగురూ చదవాలనే ఏ రచయిత అయినా కోరుకుంటాడు. అయితే ఆ ‘నలుగురు’ లక్షమంది కావచ్చు, ‘నలుగురే’ కావచ్చు. అందుకే నేను రాసేది [...]
సోవియట్ యూనియన్ లో స్టాలిన్  అనంతరం అధికారానికి వచ్చిన కృశ్చెవ్ వీలు చిక్కినప్పుడల్లా స్టాలిన్ విధానాలను తూర్పారబడుతుండే వాడు. నిజానికి స్టాలిన హయాములో కృశ్చెవ్ ఆయనకు కుడి భుజంగా ఉండేవాడు. స్టాలిన్  ఏం చెప్పినా  పెదవి విప్పి ఏమీ చెప్పలేకపోయేవాడు.స్టాలిన్ తదనంతరం కృశ్చెవ్ సోవియట్ కేంద్ర కమిటీ అధినాయకుడిగా పదవి చేపట్టిన  తర్వాత ఆయన స్టాలిన్ ను పదేపదే [...]
ఈ సాయంత్రం ఒక ఫోను కాల్ వచ్చింది. ‘సేలం నుంచి శ్రీధర్ విశ్వనాధన్ ని మాట్లాడుతున్నాను’ అన్నది అవతల గొంతు స్వచ్చమైన తెలుగులో. అప్పుడు నాకూ ఆశ్చర్యం వేసింది, తమిళనాడు అంటున్నాడు, ఈ తెలుగేమిటని. అదే అడిగాను. ‘పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నాను, అదో కధ. ముందు నేను ఫోను చేసింది ఆదిరాజు అనే జర్నలిష్టు విషయంలో’‘ఆదిరాజా! ఆయన మీకెలా తెలుసు?’‘మీరు ఈ రోజు ఆంధ్రప్రభలో ఆయన్ని [...]
రాజీవ్ గాంధి బాంబు దాడిలో మరణించినప్పుడు నేను మాస్కోలో వున్నాను. ఆ దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకు నేను కుటుంబంతో కలిసి  కాఫీ తాగడానికి ఓ హోటల్ కు వెళ్లాను. అక్కడ మాకు సర్వ్ చేయాల్సిన వెయిట్రెస్ వృద్ధురాలు. అక్కడ వయసుతో పనిలేకుండా ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు వుండేది. మమ్మల్ని చూడగానే భారతీయులమని గుర్తు పట్టింది. అనుమాన నివృత్తికోసం ‘ఇందీస్కీ పజాలుస్తా’ (మీరు [...]
ఈ రోజు ఉదయం  AP 24 X 7 ఛానల్ సీయీఓ వెంకట కృష్ణ నిర్వహించే చర్చాకార్యక్రమంలో ఒక వింత వాదన నా చెవిన పడింది. (ఈ అంశంపై జరిగిన చర్చలో నాకు అవకాశం రాలేదు, నా వరకు వచ్చేసరికి మరో అంశం తీసుకున్నారు. ఒకోసారి సమయాభావం వల్ల ఇలా జరుగుతూ వుంటుంది)విషయం ఇది. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు ఇరవై వేల మంది గ్రామ సహాయకుల జీత భత్యాలను ఇతోధికంగా పెంచింది. [...]
మహానటి సావిత్రి ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒక సినిమాలో, చెల్లెలుగా మరో సినిమాలో వేస్తే ప్రేక్షక జనాలు ఆదరించిన మాట నిజమే కానీ, వేషాలు మార్చుకున్న రాజకీయ రంగస్థల నటులను మాత్రం ఇట్టే గుర్తు పట్టేయగలరన్న సంగతిని వాళ్ళు మరచిపోతున్నట్టున్నారు. అందుకే కాబోలు వేషం మార్చినా ప్రజలు పట్టుకోలేరన్న నమ్మకంతో వ్యవహరిస్తున్నారు.ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూడండి. రంగస్థలం [...]
నూట యాభయ్ రూపాయలతో చూపిస్తా రండంటున్నారు రాజేష్ వేమూరి.నాకు సంతోషం అనిపించి ఆ ప్రయాణం ఇవ్వాళే మొదలెట్టాను. ఇంకా పోలండులోనే వున్నాను. చూడాల్సినవి ఇంకా చాలా వున్నాయి. జర్మనీ, స్వీడన్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జెక్ రిపబ్లిక్, ఇంకా మనకు ఆట్టే తెలియని, నోరు తిరగని మరో దేశం లిచ్టేన్ స్టెయిన్. కాకపోతే చదువరికీ అద్భుతమైన అనుభూతిని [...]
My article on YS Jagan Mohan Reddy completing four years as AP Opposition Leader published in Andhra Prabha today, 5th June, 2018)నా నలభయ్ ఏళ్ళ పాత్రికేయ జీవితంలో వినని మాట గత నాలుగేళ్ళలో తరచుగా వినబడుతోంది. అదేమిటంటే వైసీపీ నేత జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలం అయ్యారని. సాఫల్య వైఫల్యాలు లెక్కించడానికి ప్రతిపక్షం చేతిలో ఉన్న అధికారాలు ఏమిటన్నది, నాకు అర్ధం కాని విషయం. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు కాబట్టి విఫలం [...]
ఈరోజు జూన్ రెండో తేదీ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో ప్రచురితం.(నాలుగేళ్ల పరిపాలనకు మాత్రమే ఈ వ్యాసం పరిధి పరిమితం, రాజకీయ అంశాలను, అందుకు సంబంధించి చంద్రబాబు సాఫల్య, వైఫల్యాలను ఇందులో చేర్చడం లేదు,  దానికి ఈ సందర్భం తగినది కాదని రచయిత అభిప్రాయం)ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్ళ పైచిలుకు చంద్రబాబు సాగించిన పరిపాలనతో సరిపోల్చకుండా ప్రస్తుత నాలుగేళ్ల బాబు పాలన [...]
“ఇవ్వాళ  పేపరు చదివిన తరువాత కేసీఆర్ పట్ల నాకున్న దురభిప్రాయాలు పూర్తిగా తొలగిపోయాయి”హైదరాబాదులో సెటిలయిన ఒక తెలుగు మిత్రుడు ఓరోజు పొద్దున్నే ఫోను చేసి చెప్పిన మాట ఇది.ఆయన ఇంకా ఇలా అన్నారు.“ఉద్యమం రోజుల్లో ఒక పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు విని జీర్ణించుకోలేనంత కోపం పెంచుకున్న వాళ్ళలో నేనూ ఒకడ్ని. అయితేనేం పాలకుడిగా కేసీఆర్ కు నేను నూటికి నూటపది [...]
(ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం)2014 ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మొదటి ఏడాది పాలన ముగియవచ్చిన సందర్భంలో లోకసభలో నాటి ప్రతిపక్షనేత రాహుల్ గాంధి ఒక వ్యాఖ్య చేశారు, ‘ఈఏడాది కాలంలో మోడీ దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేద’ని. తన వ్యాఖ్యకు వత్తాసుగా రాహుల్ మరో మాటను జోడించారు. ‘మోడీ పాలనకు తాను సున్నా [...]
మా ఆవిడకు ‘ప్రత్యేక స్థాయి’ కల్పించిన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి  ప్రముఖులతో వ్యక్తిగత పరిచయాలు లేకున్నా వారికి సంబంధించిన జ్ఞాపకాలు కొన్ని వుంటాయి.అలాంటిదే ఇది.నలభయ్ ఏళ్ళ కింద  సంగతి. అప్పుడు నేను బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్  ఎడిటర్ గా పనిచేస్తున్నాను. ఆ రోజుల్లో యద్దనపూడి సులోచనారాణి నవల ‘మీనా’ ఆంద్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా వచ్చేది. ఆ నవల [...]
దాదాపు పుష్కరం దాటింది అనుకుంటా డాక్టర్ రంగారావు గారికి ఈ ఆలోచన వచ్చి. అప్పటికే ఆయన రూపకల్పన చేసిన 108, 104 సర్వీసులు ఉమ్మడి రాష్ట్రంలో కుదురుకుంటున్నాయి. గత నెలలోనే ఆయన మరణించారు. కనుక  ఆయన మదిలో కదిలిన ఆ కొత్త ఆలోచనను ఎవరు ముందుకు తీసుకు పోతారో తెలియదు. ఈ గతం గుర్తుకు రావడానికికల  వర్తమానం గురించి చెప్పాలి.నిన్న మమ్మల్ని ఒక సమస్య ఎదుర్కుంది. నిజానికి చాలా చిన్న [...]
(PUBLISHED IN ANDHRAPRABHA DAILY ON 08-05-2018)ఆగస్టు 15 అనగానే చటుక్కున అందరికీ గుర్తుకు వచ్చేది ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై భారత ప్రధాన మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేయడం. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చిన మాట నిజమే కాని, ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధానమంత్రి ఈసారి ఎగురవేస్తారా లేదా అనే సందేహం మొట్టమొదటిసారి మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం [...]
కృష్ణా జిల్లా పేరును తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు పేరిట మార్చాలని నిర్ణయించారు.అయితే ఇక్కడ ఒక తకరారు వుంది. ఈ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ పాలక పక్షం అయిన తెలుగు దేశం పార్టీ కాదు. ఆ పార్టీకి బద్ధ శత్రువు, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అయిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకుడు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ [...]
  ఒక మనిషి ఎలా జీవించాడు అన్నది అతడి మరణం చెబుతుంది. డాక్టర్ రంగారావు విషయంలో అదే జరిగింది.డెబ్బయి అయిదేళ్ళ జీవితం. ఎన్ని అనుభవాలు, ఎన్నెన్ని సంఘటనలు.  ముదిమి వయసులో వాటన్నిటినీ ఒకచోట గుది గుచ్చడం ఎంతటి శ్రమ! డాక్టర్ రంగా రావు గారు ఈ శ్రమను శ్రమ అనుకోకుండా,  మరొకరిని శ్రమ పెట్టకుండా అతి తేలిగ్గా పూర్తి చేసారు. అదీ ఆయన జీవితం చరమాంకంలో.  ‘హాపింగ్ మెమొరీస్’. [...]
(Published in Andhra Prabha daily today, 25-04-2018)పదిహేడేళ్ళ క్రితం 2001లో తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతో ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అయినప్పుడు తెలంగాణా ప్రాంతానికి చెందినవారు కూడా అనేకమంది మెటికలు విరిచారు. గతంలో  తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో పుట్టిన పలు పార్టీల సరసనే టీఆర్ఎస్ పార్టీని కూడా నిలిపి, ఆ పార్టీ భవిష్యత్తుపై  నైరాశ్యంతో  కూడిన ప్రకటనలు చేసారు. అయితే ఇటువంటి అనేకానేక  ఊహాగానాలను, [...]
(ఏప్రిల్ 20 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం)“నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్ర పోనివ్వను”ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదేళ్ళకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడి డైలాగ్ ఇది. ఆ రోజుల్లో సంగతేమో కానీ, 2014 లో కొత్తగా ఏర్పాటయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు [...]
ఆకాశవాణిలో తమ స్వరాల ద్వారా అశేష తెలుగు ప్రజల అభిమాన నీరాజనాలు అందుకున్న మాజీ అనౌన్సర్లు, కళాకారులు ఈరోజు హైదరాబాదులో కలుసుకుని పాత ముచ్చట్లు కలబోసుకున్నారు. ఆలిండియా రేడియో సీనియర్ న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య పూనికపై ఈ సమ్మేళనం జరిగింది. తనతో కలిసి పనిచేసిన ఒకనాటి రేడియో సహచరులను ఒక్క చోటకు చేర్చాలనే సంకల్పంతో  విందు భోజనసమేత సంగమాన్ని ఈ మధ్యాహ్నం [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు