యాత్రలో మా వెంట వచ్చిన గైడ్ పేరు చవాన్. కేదార్ గురించి, బదరీ గురించి అతనే మాకో విషయం చెప్పాడు. “కేదార్ లో పచ్చని చెట్లు విరివిగా  వుంటాయి. అవి ఎల్లవేళలా ఆక్సిజన్ విడిచిపెడుతూ వుంటాయి కనుక అంత ఎత్తున వున్నా  ఆయాసం అనిపించదు. బడరీలో చెట్లు వుండవు. ఎత్తుకు పోయిన కొద్దీ గాలిలో ఒత్తిడి తగ్గి, ఆక్సిజన్ సరిగా అందదు అంచేత నడిచేటప్పుడు మాట్లాడ కూడదు. మాట్లాడితే ఆయాసం [...]
(నేడు జాతీయ ప్రసార దినోత్సవం) పాటల్లోనే కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది.డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు మొదలయ్యేవి.‘యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే’ఉర్దూ తెలియని వాళ్లు కూడా వసీం అక్తర్ చదివే వార్తలు వినడం నాకు [...]
మేము డోలీలలో హాయిగానే కూర్చున్నాం. కానీ డోలీల వాళ్ళ సంగతి గమనిస్తే చాలా బాధ వేసేది. రాళ్ళల్లో బురదలో, నిటారుగా వుండే కొండ దారిలో మమ్మల్ని మోస్తూ వాళ్ళు నడుస్తున్నారు. చలికి వణుకుతూ డోలీల్లో కూర్చోవడమే మాకు ఇంత బాధగా వుంటే, వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ, పైగా డోలీల్లోకూర్చున్న మమ్మల్ని మోసుకుంటూ అంతంత దూరాలు ప్రయాణాలు చేస్తున్నారంటే వాళ్ళ కష్టం ఊహించు కోవడానికే [...]
ఓ నలభయ్ ఏళ్ళ క్రితం కేబినెట్ మంత్రిగా చేసిన పీ. నరసారెడ్డి   చాలా ఏళ్ళ క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు.  రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది. చాలా కాలం తరువాత మళ్ళీ ఇదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే  గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ‘ఎలా వున్నారు’ అనే నా ప్రశ్నకు ఆయన ఇలా [...]
రాజకీయాలు తరువాత.ముందు ఒక తెలుగువాడిగా వెంకయ్యనాయుడు గారికి అభినందనలు.ఒక విలేకరిగా ఆయన గురించిన కొన్ని పాత స్మృతులు తెలపడం ఒక్కటే ఈ పోస్టు లక్ష్యం.1972 - 73 ప్రత్యేక ఆంద్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. నేను బెజవాడ నార్లవారి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను.  బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఇప్పుడు స్వరాజ్ మైదానం అనుకుంటా, అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రధాన [...]
స్వర్ణ, సురేష్, రంగడు మాత్రం చీకటితోనే లేచారు. మమ్మల్ని లేపి, మొహాలు కడిగించి వేడి వేడి కాఫీలు తాగించారు. తలకు మంకీ టోపీ, కాళ్ళకు  ఉలెన్ సాక్సూ తొడిగారు. మేం ఎవరం స్నానాలు చేయలేదు. మేమే కాదు బస్సులో వచ్చిన వాల్లెవ్వరూ చేయలేదు. మొహాలు, చేతులు కడుక్కోడానికే కాదు, తాగడానికి కూడా వేన్నీళ్ళే. ఒక్క రంగారావుగారు మాత్రం అంత చలిలోనూ పట్టుదలగా స్నానం చేసే బయలుదేరారు.అందరం [...]
నాకే విచిత్రం అనిపించింది నా జ్ఞాపక శక్తి చూసి. రాత్రి తిన్న కూర ఏమిటంటే బుర్ర తడుముకుండే పరిస్తితి నాది. అలాంటిది .....పాతికేళ్ళు దాటిందేమో చూసి, నిన్న ప్రెస్ క్లబ్ లో అమర్ తో కనబడ్డాడు. ‘తెలుసు కదా మన...’ అని అమర్ అనేలోగా  నేనే ముందుగా “ద్రాస్త్విచ్ కగ్జిలా నరేందర్” అనేశాను. అతడూ వెంటనే “ఎలా వున్నారు శ్రీనివాసరావు గారూ” అంటూ పలకరించాడు. నరేందర్ అంటే గూడవల్లి [...]
ఇంకా నాలుగు కిలోమీటర్లు వెళ్లాలన్నారు. వర్షం ఆగడం లేదు. చలి దుర్భరంగా వుంది. మేమంతా దుప్పట్లు కప్పుకుని కూర్చున్నాం. భారతి బాధ చూడలేకపోయాం. ఒక  కిలోమీటరు ఉందనగా మళ్ళీ ఆపారు. అక్కడ కొండ నిటారుగా వుంది. డోలీవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడం కష్టంగా వుంది. తొందరగా గదికి చేర్చమని భాష రాకున్నా సైగలతో చెప్పాం. వాళ్లకు అర్ధం అయినట్టు వుంది. పైగా ఇలాంటి ప్రయాణాల్లో [...]
రోజూ ఎన్ని టీవీ చర్చలకు వెళ్ళినా ఆలిండియా రేడియో రికార్డింగ్ కు వెళ్ళడంలో కిక్కే వేరప్పా. ఏవిటో ఫేస్ బుక్ భాష అలవడుతున్నట్టుంది కాబోలు. ఎంతయినా   నా వృత్తి జీవితంలో రేడియో నా పుట్టిల్లు. అటూ ఇటూగా ముప్పయ్యేళ్ళ అనుబంధం. 1975 నవంబరు 14 న అందులో  మొదటిసారి కుడికాలు మోపాను. పుట్టింటి ఆరాటం అంటే ఏమిటో ఈరోజు ఆకాశవాణికి వెళ్ళినప్పుడు అర్ధం అయింది.   రిటైర్ అయి అడుగు బయట [...]
మహాత్ములు, స్వాములు తమ అనుగ్రహ భాషణల్లో సాధారణంగా ఆ సర్వేశ్వరుడిని తప్ప  మనుష్యమాత్రుల్ని ప్రశంసించడం జరగదని నా విశ్వాసం. తమ ధార్మిక సేవా కార్యక్రమాలకు అండదండలకొసం కొండొకచో రాజుల్ని, పాలకుల్ని పొగడడం కొత్తేమీ కాదు. అలాంటిది చనిపోయిన ఒక వ్యక్తిని, అందునా కేవలం వివేకసంపద మినహా ఏవిధమైన లౌకిక బాహ్య సంపదలను కూడబెట్టుకోకుండా ఈ లోకం నుంచి సెలవు తీసుకున్న వ్యక్తిని [...]
మర్నాడు తెల్లవారుఝామున్నే లేచి స్నానాలు కానిచ్చి బస్సులో రుద్రప్రయాగ చేరుకున్నాము. అక్కడ మందాకినీ, అలకనంద నదులు కలుస్తాయి. కానీ అక్కడ నీళ్ళు ఇఘాలు. అంత చల్లటి నీళ్ళలో స్నానాలు కష్టమని శ్రీనగర్ లోనే ఆ కార్యక్రమం ముగించుకుని వచ్చాము కనుక నదిలో నీళ్ళు నెత్తిన చల్లుకున్నాము. బస్సు ఆగిన చోటునుంచి నది దగ్గరికి చేరుకోవడం కూడా కష్టం. ఇరుకు దారి. కాలు జారింది అంటే ఏకంగా [...]
ఋషీకేశ్ నుంచి హిమాలయాలు ప్రారంభం. అక్కడి నుండే ఘాట్ రోడ్డుపై ప్రయాణం మొదలు. కొంత దూరం పోయిన తరువాత చల్లటి మంచి నీళ్ళు దొరుకుతాయని ఒక చోట బస్సు ఆపారు. అందరం వెళ్లి వాటర్ బాటిల్స్ లో తెచ్చుకున్నాము. ఎండ తీక్షణంగానే వున్నా గాలి చల్లగానే వీస్తోంది. కనుక హాయిగానే వుంది. ఒక వైపు అగాధమైన లోయ. మరో వైపు ఆకాశాన్ని అంటే పర్వతాలు. బస్సులో చాలామంది తెలుగు వాళ్ళు వున్నారు. ఒకామె [...]
నిన్న సాయంత్రం (శనివారం) మహా టీవీ ‘ఎడిటర్స్ టైం’ ప్రోగ్రాం లో మాట్లాడాలని పిలిచారు. ఫోన్ ఇన్ కాబట్టి బయటకు పోవాల్సిన పని లేదు, వర్క్ ఫ్రం హోం లాగా. మహా టీవీ ఎడిటర్ ఐ. వెంకట్రావు గారు, నేను, ఎప్పుడో నాలుగున్నర దశాబ్దాల క్రితం బెజవాడ ఆంద్రజ్యోతిలో కలిసి పనిచేసాము. నాపట్ల ఇప్పటికీ అప్పటి వాత్సల్యం చెక్కు చెదరలేదు. ఫేస్ బుక్ లో నేను రాసే వాటిని ఆయన శ్రద్ధగా చదువుతారు. [...]
ఋషీకేశ్ లో బస్సు దిగగానే తొందర తొందరగా కాలకృత్యాలు పూర్తి చేసుకుని గంగా స్నానానికి వెళ్ళాము. వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా నున్నటి తళతళ మెరిసే గుండ్రాళ్ళు. మంచి మంచివి  ఎంపికచేసుకుని తీసుకుపోతుంటే వాటికంటే మంచివి కనిపించేవి.  అలా వాటిని ఏరుకుంటూ కుప్ప  పోస్తుంటే గమనించిన ఓ పెద్దాయన, ‘ఆ  గుండ్రాళ్ళు  ఏం చేసుకుంటారు, మంచి  సాల గ్రామాలు దొరుకుతాయి, [...]
రైల్లోనే రెండో రోజు గడిచిపోయింది. మర్నాడు ఉదయమే లేచి మొహాలు కడుక్కున్నాం. మా కంపార్టు మెంటులో మిగిలిన వాళ్ళందరూ హడావిడిగా సామాన్లు సర్దుకుంటున్నారు. అది చూసి ప్రేమ ‘ఢిల్లీ వచ్చిందేమో’ అన్నది. శారదక్కయ్య కిటికీ లో నుంచి చూసి ‘ఢిల్లీలో ఇలా ఖాళీ స్థలాలు వుంటాయా!కాదేమో’ అన్నది సందేహంగా. ఇంతలో శేషు, రంగడు వచ్చి ‘ఢిల్లీ వచ్చింది, పదండి’ అనేసరికి అందరం హడావిడిగా [...]
  మాస్కో రేడియోలో పని ముగించుకుని ఆఫీసునుంచి బయలుదేరాలని అనుకునే సమయంలో నటాషా ఎదురుగా వచ్చింది. రష్యన్ భాషలో ‘ట’ లు లేవు, ‘త’లు తప్ప అనేవారు కలం కూలీ జీ. కృష్ణ గారు.  కానీ, నేను మాత్రం  కాస్త వత్తిపలికినట్టుగా వుంటుందని ‘నటాషా’ అని  పిలిచేవాడిని. నా రష్యన్ భాషా ప్రావీణ్యం పేరు పెట్టి పిలవడం వరకే. ఆ తరువాత ఏదో సినిమాలో జంధ్యాల చెప్పినట్టు ఆదివారం మధ్యాన్నం టీవీ [...]
మా యాత్ర ఏమో కానీ అందుకోసం మా చెల్లెలు ప్రేమ బిడ్డలు ఫణి, మణి పడ్డ హడావిడి అంతాఇంతా కాదు. చక్కిలాలు, కారప్పూస, కజ్జెకాయలు, వేయించిన అటుకులు ఇంకా రైల్లో తినడానికి పులిహోర, పెరుగన్నం, ఒంటి పూట వాళ్ళకోసం పూరీలు, కూర అన్నీ చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు. మా పెద్ద తమ్ముడి మూడో అమ్మాయి వాణి వచ్చి బదరీ, కేదార్ వెడుతున్నారు కదా, మా తరపున కూడా దణ్ణం పెట్టండి అంది. ‘మీ అందరి [...]
(ప్రారంభం)మా చిన్న తమ్ముడు భండారు శ్రీనివాసరావు కాలు విరిగి ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసి, చెల్లెలు భారతితో కలిసి హైదరాబాదు వెళ్ళాము. అప్పుడే భారతి పెద్ద కోడలు, సురేష్ భార్య స్వర్ణ మాకో సంగతి చెప్పింది, వైష్ణవీదేవి దేవాలయం చూడడానికి వెడుతున్నామని. వాళ్ళ అన్నయ్య కాశ్మీరులో పెద్ద మిలిటరీ అధికారి. అత్తామామల్ని తీసుకుని కాశ్మీర్ చూడడానికి రమ్మని ఆయన కబురు చేసాడు. వస్తే, [...]
వాస్తవానికి సమాజంలో వైద్యులది విశిష్టమయిన స్తానం. అందుకే డాక్టరును ‘డాక్టరు గారు’ అని గౌరవంగాసంబోధిస్తారు. నలుగురిలో వారికి పెద్దపీటవేసి మన్నన చేస్తారు. రోగాలబారి నుంచి కాపాడే అపర ధన్వంతరులుగా, ప్రాణబిక్ష పెట్టే కలియుగ దైవాలుగా కొలుస్తారు. నాకిప్పటికీ గుర్తు. మా చిన్నతనంలో మా వూరికి వారానికోసారి ఓ డాక్టరుగారు సైకిలు మీద వచ్చేవారు. చిన్న చితకా జ్వరాలకు [...]
“మాది భీమవరం పట్టణం. అప్పటికే మాది బాగా కలిగిన కుటుంబం.  తదనంతర కాలంలో మా కుటుంబం ఆర్థికంగా బాగా దెబ్బతింది. నేను భీమవరం ఎస్. సి. హెచ్ బి. ఆర్. ఎమ్ హైస్కూలులో ఆరోతరగతి చదువుతున్నాను. ఆ దశలో మా మాతా మహులు మా కుటుంబాన్ని నరసాపురం మండలంలోని మల్లవరం గ్రామానికి తీసుకు పోయారు. అది 1968 సంవత్సరం. నన్ను ప్రక్కనే ఉన్న మత్స్యపురి గ్రామములోని జిల్లా పరిషత్తు హైస్కూల్ లో చేర్చారు. [...]
‘నాకు PAN కార్డు ఉంది నేను ఓటు వెయ్యొచ్చా?’“కుదరదండి వోటర్ కార్డు కావాలి’‘నాకు వోటర్ కార్డు ఉంది దాని మీద రేషన్ దుకాణం లో సరుకులు కొనచ్చా?’‘కుదరదండి రేషన్ కార్డు కావాలి’‘రేషన్ కార్డు ఉంది గ్యాస్ దొరుకుతుందా?’‘కుదరదండి, ఆధార్ కార్డు కావాలి’‘ఆధార్ కార్డు ఉంది బ్యాంకు ఖాతా తెరవచ్చా?’‘కుదరదండి PAN కార్డు కావాలి’‘అయ్యా, నాకు PAN కార్డు కావాలి’‘మీ వద్ద ఆదార్ కార్డు [...]
గురువు ద్రోణాచార్యుడు కురుపాండవ సోదరులకు విలు విద్యలో పోటీ పెడతాడు. ఒక వృక్షం కొమ్మల మధ్య పక్షి బొమ్మను పెట్టి దాని కన్నుకు గురిపెట్టి  బాణం కొట్టమని ఆదేశిస్తూ, ఒకొక్కరిని విడివిడిగా  ఆ చెట్టుపై ఏం కనబడుతున్నదో చెప్పమంటాడు. “చెట్టు, కొమ్మలు, ఒక కొమ్మపై పక్షి, ఆ పక్షి కన్ను.”“కొమ్మపై పక్షి, ఆ పక్షి కన్ను”“పక్షి” ఆఖరుకు అర్జునుడి వంతు.“అర్జునా! ఏం కనబడుతోంది?” [...]
(ప్రస్తుతం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న నా పాత్రికేయ మిత్రుడు మాడభూషి శ్రీధర్ ఒకప్పుడు 'ఉదయం' దినపత్రికలో పనిచేసారు. దాసరిని స్మరించుకుంటూ, అలనాటి ఉదయపు రోజులను గుర్తు చేసుకుంటున్నారు ఇలా) "ఉదయం దిన పత్రిక చైర్మన్ దాసరి నారాయణరావు గారి ఇంట్లో రాత్రి 12 తరువాత కీలకమైన సమావేశానికి రావాలని పిలుపు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన [...]
(చంద్రబాబు మూడేళ్ళ పాలనపై ఈరోజు (08-06-2017) ఆంధ్రజ్యోతి దినపత్రిక (ఏపీ ఎడిషన్) లో నా వ్యాసం)“కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ ఆడమన్నట్టుగా వుంది”నవజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మూడేళ్ళ పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో సాంఘిక మాధ్యమాల్లో వెలువడిన ఈ వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుందనిపిస్తోంది.దాదాపు పదేళ్ళ విరామం తరువాత చంద్రబాబు నాయుడు [...]
నా జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో కనిపించే పేరు  డి. వెంకట్రామయ్య.నేను అభిమానించే ఈ  కధా రచయితే నాకు సహోద్యోగి కాగలడని నేను ఎన్నడు వూహించలేదు.'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే  ఆయన రాయడం బాగా తగ్గించారు.  తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో! వస్తున్న కధల్లో రాశి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు