జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన పాత్రికేయ మిత్రుడు అడిగాడు- "పోయిన సంవత్సరమే మా రాష్ట్రం కొంత కుదుటపడింది. పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి, అభివృద్ధికి శాంతియుత పరిస్థితులే పునాది అని మీరు అంటున్నారు కదా, కానీ, కేంద్రం వ్యవహరించిన తీరు వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది కదా?''- అఫ్జల్ గురు ఉరితీత వల్ల ఉత్పన్నమయిన పరిస్థితిని [...]
నయాగరా జలపాతాన్ని చూసి- నిలుచున్న సముద్రం లాగా ఉన్నది- అన్నాడట తమిళ కవి వైరిముత్తు. పోలిక అద్భుతమే అయినా, నీళ్లను నీళ్లతో పోల్చగలిగే సులువు అందులో ఉన్నది.నల్లగొండ సభావేదిక మీద తెల్లదుస్తుల బవిరి గడ్డపు ఆ మనిషిని చూసినప్పుడు మాత్రం మంచినీళ్లకు లాల్చీపైజమా తొడిగినట్టు కనిపించింది. అతని చూపులు దాహంతో తీక్షణంగా ఉన్నాయి. అతని మాటలు ఎత్తిపోతల్లాగా ఎగిరి [...]
"ఆ పిశాచం నిన్న ఇక్కడికి వచ్చింది, ఇక్కడే ఈ చోటనే నేను నిలబడ్డ చోటునే నిలబడి మాట్లాడింది, ఇంకా దాని గంధకపు వాసన గుప్పుమంటూనే ఉంది'' అని శిలువకు అభివాదం చేస్తున్నట్టు అభినయించి ఆ వక్త ఒక్క క్షణం ఆగాడు. "అయ్యలారా, అమ్మలారా, అమెరికన్ అధ్యక్షులవారు, అదే నేనిప్పుడు పిశాచం అని చెప్పానే ఆ పెద్దమనిషి, ప్రపంచం అంతా తన సొంతజాగీరన్నట్టు ఈ వేదిక ముందునుంచి మాట్లాడారు...'' అంటూ [...]
మొన్న బుధవారం నాడు హైదరాబాద్‌లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నిజానికి అది రౌండ్ టేబుల్ కాదు. రౌండ్ టేబుల్ అంటే ఒక అంశం మీద విభిన్న అభిప్రాయాలు, వివిధ అభిప్రాయాలు కలిగినవారు కూర్చుని సమాన స్థాయిలో సంప్రదించుకునే వేదిక. అక్కడ జరిగింది అది కాదు. అక్కడ ఉన్న సభ్య ప్రపంచం లేదా పౌర సమాజం ప్రతినిధులు, అంతో ఇంతో బాధితవర్గాలకు తోడుగా ఉంటున్నామనుకునే బృందాలు- తామెంత [...]
డెబ్భయిల మొదట్లో హైదరాబాద్‌లో ఇన్ని ఆటోలు లేవు. ఫ్లయివోవర్లు, రయ్యిన దూసుకుపోయే కార్లూ లేని కాలం కాబట్టి, చిన్న చిన్న ఉతార్లూచడావులతో నగరం చదునుగానే ఉండే రిక్షాలకు అనువుగా ఉండేది. ఎప్పుడన్నా అవసరమై రిక్షాలో కాలేజీకి వెళ్లాలంటే, రిక్షా అతనికి ఆంధ్రసారస్వత పరిషత్ ప్రాచ్యకళాశాల అని చెపితే ఏమి తెలుస్తుంది? తిలక్‌రోడ్డు, ఎస్పీహాలు అంటే కూడా తెలిసేది కాదు. [...]
 తెలంగాణ ఉద్యమం మళ్లీ ఒక సుదీర్ఘ విరామంలోకి వెడుతున్నట్టే కనిపిస్తోంది. సడక్ బంద్‌లు విజయవంతంగా, ఉధృతంగా జరగవచ్చును కానీ, ఆ తరువాత ఇక పరీక్షల సీజన్ ప్రవేశిస్తుంది. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉద్యమాలు నిర్వహించాలనే విలువను తెలంగాణ ఉద్యమం తనంతట తానే ఆమోదించింది కాబట్టి, తాను మౌనం పాటించక తప్పదు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు గురువారం నాడు ప్రారంభమవుతున్నాయి, అవి [...]
'అంతులేని కథ' సినిమాలో అయిదారు నిమిషాల పాటు కనిపించి ఆ పంచెకట్టు అందగాడు అమితంగా ఆకర్షించాడు. తెలుగు 'తూర్పు పడమర'కు తమిళ మాతృక 'అపూర్వ రాగంగళ్'తోనూ, బాలచందర్‌దే ఇంకో సినిమా డబ్బింగ్ 'మన్మథలీల'తోనూ అతని పేరు అప్పటికే సినిమాప్రేక్షకులకు సుపరిచితమైపోయింది. ఆ తరువాత వచ్చిన '16 వయతినిలే' (పదహారేళ్ల వయసు) వికలాంగ నాయకపాత్రలో అతను అద్భుతంగా రాణించాడు. కానీ, కమల్ హాసన్ [...]
అయిపోయింది కదా, ఇక చర్చేముంది? కత్తిపోటు వల్లయినా, తుపాకి కాల్పుల్లో అయినా, ఉరితాడు బిగిసి అయినా ఎవరైనా చచ్చిపోతే, ఆ తరువాత చేయదగింది ఏముంటుంది? అంత్యక్రియలు తప్ప. అఫ్జల్ గురు గురించి కూడా ఇక చేయగలిగింది ఏమీ లేదు. అంత్యక్రియలు కూడా ప్రభుత్వమే చేసేసింది. అతనొక తీవ్రమైన నేరాభియోగాన్ని ఎదుర్కొన్నాడు. న్యాయస్థానం అతని ప్రమేయాన్ని నిర్ధారించింది. ఉరి తీయమని తీర్పు [...]
కె అంటే ఏమిటి శ్రీనివాస్? - అని అడిగారు బాలగోపాల్. ఆయనతో నేను వ్యక్తిగత సంభాషణ చేసింది అతి తక్కువ సార్లు. ఆయనంతట ఆయన అడిగిన వ్యక్తిగత ప్రశ్న మాత్రం అదొక్కటే. కండ్లకుంట- అని చెప్పాను. కందాడనో, కందాడైనో అనుకున్నాను- అన్నారాయన. నేను కూడా శ్రీవైష్ణవుడిని అని తెలుసుకుని సామాజిక కుతూహలంతో ఆ ప్రశ్న అడిగి ఉంటారు. [...]
కాస్త అటూఇటూగా పదిహేనేళ్లు అయింది. అప్పటికింకా ఆరంభమే. భువనగిరి సభ జరిగింది వరంగల్ సభా జరిగింది కానీ, ఉద్యమం అని చెప్పదగ్గ జోరు మాత్రం లేదు. మొదట మేలుకొన్నవారిలో ఒకరైన రచయితలు అక్కడక్కడా మీటింగులు పెట్టుకుని చర్చలు చేసుకుంటున్నారు. అటువంటి ఒకానొక తొట్టతొలి మీటింగులో ఒక కవి ఆవేశంగా ఒక ప్రశ్న వేశాడు. [...]
మాటల్లో నిప్పులు చెరగడం చేతలకు ప్రత్యామ్నాయమని కేసీఆర్ఎప్పుడో కనిపెట్టారు. పార్టీ స్థాపించి, తొలి ఎన్నికల్లో గెలిచి కేంద్రంలోను, రాష్ట్రంలోను పాలకపక్షాల్లో ఒకటైన తరువాత, జనంలో ఉద్యమకారులుగా గుర్తింపు మిగుల్చుకోవడానికి ఆయన ఎంచుకున్న మార్గం- దూషణలు, భీషణ ప్రతిజ్ఞలు, ప్రగల్భాలు. అప్పట్లో కేసీఆర్‌కాదు కానీ, మరో కేంద్రమంత్రిగా ఉన్న ఆలె నరేంద్ర వారం వారం [...]

ఏమీ చేయకపోవడం అంటే కూడా ఏదో ఒకటి చేయడమే- పి.వి. నరసింహారావు సుప్రసిద్ధమైన మాటలు అవి. అయితే, తాను చేయాలనుకున్న పనుల విషయంలో ఎటువంటి తాత్సారమూ ఉదాసీనతా లేకుండా చాకచక్యంతో, చాణక్యంతో వ్యవహరించిన ఘనత పీవీ కి ఉన్నదని మనం మరచిపోలేము. పీవీతో వ్యక్తిగతంగా సరిపడకపోయినా సోనియాగాంధీకి పీవీమార్గంపై విముఖత ఏమీ లేదు. చేతలే కాదు, మాటలు కూడా కరువైన వ్యక్తిని ఆమె ప్రధానిగా [...]
ఎక్కడా ఏ చడీ చప్పుడూ వినపడకున్నా , అదిగో తెలంగాణ వస్తోందని హడావుడి చేసే కెసిఆర్‌, ఇప్పుడు ఎందుకు అఖిలపక్షం బూటకం, నెలగడవు నాటకం అని నిరాశాగీతం ఆలపిస్తున్నారు? ఉద్యమం చేయాలనేవాళ్లంతా తాము విఫలమైతే చూసి సంతోషించాలనుకునేవాళ్లే అని నిర్ధారించిన చంద్రశేఖరరావు, ఇప్పుడు ఉద్యమమొక్కటే తెలంగాణకు మార్గం అని ఎందుకు నినదిస్తున్నారు?  సాగరహారం జనసమీకరణలో  జెఎసి [...]
మరణశిక్ష అన్యాయమనే నమ్మాను, కసబ్ విషయంలో కూడా అట్లాగే అనిపించింది. కానీ, వీళ్ల విషయంలో అట్లా అనిపించడంలేదు- అంటోంది మా అమ్మాయి. మీ అమ్మాయి, ఆ అమ్మాయి, మరో అమ్మాయి, ఎవరైనా అమ్మాయి బహుశా ఇప్పుడు అటువంటి మాటే అంటారు. ఆ మాట విన్నపుడు, దేశమంతటా నగరాల్లో పట్టణాల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న, కొవ్వొత్తులు వెలిగించిన, శనివారం నాడు రాష్ట్రపతి భవన్ ముందు జలఫిరంగులకు, [...]
రెండున్నరేళ్ల కిందట దుబాయ్‌లో ప్రపంచ పర్యాటకస్థలాల ప్రదర్శన జరిగింది. వివిధ దేశాల వారు తమ తమ దేశాల్లోని పర్యాటక స్థలాలను వివరించే స్టాల్స్ అందులో ఏర్పాటు చేశారు. 'ఇండియా టూరిజమ్' వారు కూడా అందులో పాల్గొన్నారు. కేరళ, కర్ణాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు భారత్ తరఫున ఆ మేళాలో తమ తమ రాష్ట్రాల్లోని పర్యాటకస్థలాలను అందమైన ఛాయాచిత్రాలతో, బ్రోచర్లతో సందర్శకులకు [...]
పందొమ్మిదివందల ఎనభై. జనతాప్రయోగమో, స్వప్నమో భగ్నమయింది. మళ్లీ ఎన్నికలు. అప్పుడే మరచిపోతారా అత్యవసర పరిస్థితిని, తిరిగి అనుశాసనిక పర్వాన్ని ఆహ్వానిస్తారా? - ప్రత్యర్థులందరూ చీలిపోయారు నిజమే కానీ, మూడేళ్లలోనే మేడమ్‌ని క్షమిస్తారా?- సందేహంగానే ఉండింది. ఇందిరాగాంధీకి కూడా సందేహంగా ఉండింది. అందుకే, రెండు స్థానాల నుంచి పోటీచేయాలనుకున్నారు. రాయబరేలీని నమ్మలేరు, [...]
తెలుగు భాషను రక్షించుకోవడానికి, సాధికారం చేయడానికి ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను విన్నవించడానికి ఒక ప్రతినిధి బృందం ఈ మధ్య ముఖ్యమంత్రిగారిని కలిసిందట. అధికార భాషా సంఘం ఏర్పాటును, ప్రపంచ మహాసభల ఆలోచనను స్వాగతిస్తూనే, తెలుగు మనుగడకు అవసరమైన నిర్దిష్ట విధానచర్యలను చేపట్టకపోతే, సభల వల్ల ఉపయోగం లేదని, నిరసనల నుంచి తప్పించుకోవడం కోసమైనా కొన్ని నిర్ణయాలను [...]
రామ్‌గోపాల్ వర్మ ఎంత మాటన్నాడు?ఏ ఉద్దీపన కలాపమూ లేకుండానే ముగిసిపోయిన రతిక్రియ లాగా ఉందట అజ్మల్ కసబ్ ఉరితీత! కసబ్‌ని ఖండఖండాలుగా నరికి నడివీధిలో చంపేయాలని తనతో సహా భారతీయులెందరో కోరుకున్నారట, అలా జరగకపోయేసరికి ఎంతో నిరుత్సాహమూ కలిగిందట. ఇటువంటి మాటలు మాట్లాడినందుకు ఆయన ఇంటి మీద ఎవరూ దాడులు చేయలేదు, ఏ పోలీసులూ అతని మీద కేసులూ పెట్టలేదు. పోలికల్లో కొంచెం [...]
ఎన్నికలు వస్తాయో రావో కానీ, ఎన్నికలు వస్తాయేమోనన్న వాతావరణం మాత్రం వచ్చింది. ఈ సారి ఎన్నికలు రాజకీయపార్టీల జనాదరణపైనో, విధాన బలాలపైనో గాక- ప్రచారనిర్వహణ సామర్థ్యం మీద, ప్రత్యర్థులను బలహీనపరిచే చాణక్యం మీదా ఆధారపడనున్నాయని స్పష్టమైపోయినందున, అస్త్రాలకు ముందుగానే పదునుపెట్టవలసిన అవసరం ఏర్పడింది. ఎన్నికలు ఎప్పుడన్నా జరగనీ, ఇప్పటి నుంచి రానున్న కాలమంతా [...]
మళ్లీ ఒబామా గెలిచాడు. రిపబ్లికన్ రోమ్నీ గట్టి పోటీ ఇస్తున్నాడని ఎన్ని సర్వేలు చెప్పినా ఒబామాయే గెలుస్తాడని అనిపించింది. ఎందుకంటే, అందరు డెమొక్రాట్ అధ్యక్షుల లాగే, పదవీకాలం ముగిసే సరికి ఒబామా కూడా నికార్సయిన రిప్లబికన్‌గా తయరయ్యాడు. అలాగే, మైకెల్ జాక్సన్ లాగే అతను కూడా తన నల్లచర్మాన్ని ఒలుచుకుని శ్వేతసౌధానికి తగ్గట్టు ధగధగలాడాడు.రిపబ్లికన్ పార్టీకి, [...]
చావుబతుకులు దైవాధీనాలన్న మాట నిజమేనేమో కానీ, గాలిలో దీపం పెట్టి నీవే దిక్కు అంటే దేవుడు మాత్రం ఏమి చేయగలడు? జాతీయస్థాయి పార్లమెంటేరియన్‌గా ఎదిగిన ఉత్తరాంధ్ర జననేత కింజారపు ఎర్రంనాయుడు ప్రాణాన్ని కాపాడడం సాధ్యమయ్యేదో కాదో చెప్పలేము కానీ, ఆయనను రక్షించడానికి జరగవలసిన మానవప్రయత్నం జరగలేదని మాత్రం చెప్పగలము. ప్రమాదసమయానికీ, ఆస్పత్రికి చేరే సమయానికి మధ్య [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు