మొన్న Beaverton, Oregon లో పాలడుగు శ్రీచరణ్ అనే సంస్కృతాంధ్రకవి అష్టావధానం చేశారు. అవధానం జయ హనుమాన్ కోవెలలో జరిగింది. వందమందికి పైగా వచ్చి వీక్షించారు. శ్రీచరణ్ గారు మంచి ధారణా శక్తిని కనబరిచారు. పృచ్ఛకులలో నేనూ ఒకడిని - సమస్యని అందించాను. సమస్యలో జటిలమైన ప్రాసాక్షరం, పురాణలలో కిటుకు కలిపి ఇవ్వాలని తలచి ఈ క్రింది విధంగా ఇచ్చాను.దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె [...]
మొన్న బోతల్ నగరంలో జరిగిన "మన దీపావళి" కార్యక్రమానికి వ్యాఖ్యానం (MC) చేసాను. కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టం - "కృష్ణం వందే జగద్గురుం" అనే నాటిక. వందకు పైగా పిల్లలు అందరూ అద్భుతంగా నటించటమే కాక పద్యాలను కూడా వినిపించారు. పద్మలత గారి రచనలో నాకు ముఖ్యంగా నచ్చింది - పోతనకై ప్రత్యేకంగా ఉంచిన సన్నివేశం. పోతనలోని లోతుని తెలిపేలాగ "శారద నీరదేందు", "బాల రసాల", "పలికెడిది భాగవతమట" [...]
ఎప్పటినుండో "గురుపాదుకా స్తోత్రం" నేర్చుకోవాలి అనుకుంటున్నాను. మొన్న "గురు పౌర్ణమి" సందర్భంగా ఆ స్తోత్రానికి ప్రతిపదార్థాన్ని, తాత్పర్యాన్ని వ్రాసుకున్నాను. అది ఇక్కడ వ్రాస్తున్నాను.ఏమైనా పొరబాట్లు కనిపిస్తే చదువర్లు సరి చేయగలరు.ఏదైనా స్తోత్రానికి అర్థం తెలుసుకోవాలి అనుకుంటే, ముందు వచ్చే సమస్య: స్తోత్రం ఒక్కో చోట ఒక్కోలాగా ఉండటం. అదే సమస్య ఇక్కడా వచ్చింది. [...]
కథానాయకదర్శకనిర్మాతాదుల ఒత్తిడి లేకుండా వ్రాయడం ఏ చలన చిత్ర కవికైనా వరమే. బహుశా అందుకేనేమో, వేటూరి private albums కొన్నిటికి ఆణిముత్యాల వంటి పాటలు వ్రాసారు. "శ్రీ వేంకటేశ్వర పదములు" అనే album లో భక్తిని, వేదాంతాన్ని కలగలిపి వ్రాసిన సాహిత్యం విన్న ప్రతి ఒక్కరికీ నచ్చితీరుతుంది. ఆ పాటల్లో నాకు పదే పదే గుర్తొచ్చేది "మనిషిగ పుట్టెను ఒక మట్టి" అనే పాట. దీన్ని స్వరపరిచినది [...]
1997 లో విడుదలైన అన్నమయ్య చిత్రం లోని వేటూరి రాసిన చక్కనైన పాటల సాహిత్యానికి కీరవాణి అనువైన బాణీలు సమకూర్చారు. అంతకు ముందే వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, చెంగల్వ పూదండ, మాతృదేవోభవ వంటి చిత్రాలలో వీరిద్దరి జోడీ తెలుగుదనానికి సత్కారం చేసింది. ఈ చిత్రం కూడా ఆ కోవకు చెందిందే.పాట వ్రాసిన తరువాత బాణీ సమకూర్చితే ఆ కవి స్వేచ్ఛ పదాల ఒరవడిలో తెలుస్తుంది. అలాగే బాణీలో కూడా ఆ [...]
2014 ఉగాదికి సియాటల్ లో జరిగిన కవి సమ్మేళణానికి మంచి ప్రతిస్పందన లభించింది. ఆ స్ఫూర్తితో ఈ సారి కూడా జరుపుదామనుకున్నాము. ఈ సారి శ్రీరామ నవమి, ఉగాది కలిపి జరపాలని "మన సంస్కృతి" సంస్థ నిర్ణయించింది. శ్రీ సీతారాముల కల్యాణం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగింది. కొంచం ఆలస్యం అవ్వడంతో కవి సమ్మేళణానికి సమయం లేకపోయింది. అయినప్పటికి ప్రశ్నలను, ప్రోత్సాహాన్ని అందించిన భైరవభట్ల [...]
పండితులు, పీఠాధిపతులు, మహర్షులు కూడా తల్లిని గౌరవిస్తారు. ఏమిటి చూసుకుని మనబోటిగాళ్ళం తల్లిదండ్రులను అగౌరవపరుస్తామో అనిపిస్తుంది. వాళ్ళు పట్టించుకోకపోయినా, మనం వాళ్ళని ఎన్ని సార్లు క్షమాపణం అడిగినా, మనసులో పశ్చాత్తాపం పోదు. అలాగని మళ్ళీ తప్పు చెయ్యకుండా కూడా ఉండము. అదే ఆలోచిస్తూ ఇవి వ్రాసాను.నరక బాధకోర్చి మరణాన్ని దాటొచ్చిపేగు తెంచి నాకు ప్రేమ పంచిపెంచినాక [...]
ఈ రోజు ఏకాదశి అని కాసేపు కూర్చుని దైవచింతన చేద్దామని, శారదా దేవి గురించి కొన్ని పద్యాలు వ్రాసాను.పద్యరచన చేసి చాలా రోజులైంది. తప్పులుంటే చదువర్లు సరిచేయగలరు అని మనవి.నిముషంబైనను చిక్కదే దినమునన్ నీ దివ్యరూపంబు, హేవిమలా! చిత్తమునందుఁ దల్చి రుచిగా గానంబుఁ గావించగన్విమలాలై విలసిల్లు నీ గుణములన్, వేదాంత సందీపనీ!క్షమియింపమ్మ, కృపాసముద్రహృదయా! కారుణ్య [...]
ఈ మధ్యన ఆఫీసులో పని ఎక్కువై పాటలు వినే తీరిక లేకపోయింది. ఎప్పుడైనా కాస్త తీరికగా కూర్చుని పని చేస్తుంటే చెవులకు గరికిపాటి వారి భారతం వినిపిస్తున్నాను. అప్పుడప్పుడు మరీ వెలితిగా అనిపిస్తే అప్పుడు కాస్త ఇళయరాజా రసం పట్టిస్తున్నాను. అలాగ పట్టించి రసాలలో ఒకటి మలయాళం చిత్రం పుదియ తీరంగళ్ (కొత్త తీరాలు) లోని మారిపీలికాట్టే మారిప్పోకు అనే పాట. వినగానే నాకు చాలా [...]
ఈ రోజు వేటూరి పుట్టినరోజు. దాదాపు మూడేళ్ళ క్రితం ఆయన్ని తలుచుకుంటూ ఒక పాట వ్రాసాను. అందులో నాకు సంతృప్తిని ఇచ్చిన పంక్తి ఒకటుంది: మనసుపొరల బొంత కింద నీ పాట, దాగి ఆడుతోంది దోబూచులాట. ఇది వేటూరి గురించి నా అభిప్రాయాన్ని సూక్ష్మంగా చెప్తుంది. మనసు ఒక డబ్బా కాదు: ఒక డొల్ల, లోపల సరుకు ఉండటానికి. దానికి పొరలు ఉంటాయి. సరదాలు, కోఱికలు, పద్ధతులు, ఇష్టాలు, అనుబంధాలు, ఇలా. వేటూరి పాట [...]
2009 లో మలయాళంలో పళసి రాజా అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కేరళను పరిపాలించిన ఒక రాజు జీవిత చరిత్రను ఆధారం చేసుకుని తీయబడింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఒ.ఎన్.వి.కురుప్ అనే రచయితా సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్ర నేపథ్య సంగీతానికి గాను ఇళయరాజాకి జాతీయ పురస్కారం లభించింది.ఈ చిత్రం లో నాకు బాగా నచ్చిన పాట "కుణ్ణత్తే కుణ్ణక్కుం" అనే పాట. ఈ పాటను [...]
ఈ వ్యాసం మొదట వేటూరి.ఇన్ లో వెలువడింది. దయచేసి వేటూరి.ఇన్ ని సందర్శించి ఆ వెబ్సైటు ని విజయవంతం చేయగలరు అని ప్రార్థన.“ష్ గప్‌చుప్” సినిమాలోని ఈ పాటలో తెలుగుదనాన్ని కాచి వడబోసారు వేటూరి. మాట మాటలో తెలుగుదనాన్ని నింపారు. మాటి మాటికీ తెలుగు ధనాన్ని గుర్తు చేసారు. ఇలాంటి పాట వ్రాయాలన్నా, చిత్రంలో పెట్టుకోవాలన్నా చాలా తెలుగుప్రేమ కావాలి. ఆ ప్రేమ సినిమా [...]
నేను ఇంగ్లీష్ పాటలు వినేది తక్కువ. విన్నా అమెరికా పాటల కంటే కెనడా, బ్రిటన్ పాటలు వింటాను. వాళ్ళ సాహిత్యంలో లోతు ఎక్కువ అనిపిస్తుంది నాకు. చాలా రోజులుగా ఒక టీవీ ధారావాహిక చూస్తున్నాను. దాని పేరు Scrubs. నాకు బాగా నచ్చింది. హాస్యంతో పాటు కొంచెం లోతుని కూడా జోడించి తీసారు. ఆ ధారావాహిక శీర్షగీతం నచ్చి ఈ రోజే పూర్తిగా విన్నాను. అది కూడా నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ క్రింది [...]
ఈ వ్యాసం తొలుత veturi.in లో ప్రచురింపబడినది. దయచేసి veturi.in ని సందర్శించండి.వేటూరి ఒక అచ్చతెలుగు కవి. ఆయనకు తెలుగు అంటే ఉన్న మమకారం మనందరికీ తెలుసును. ఆయన పాటల్లో తెలుగుదనాన్ని, తెలుగు చరిత్రను, తెలుగు సంపదను ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు. ఇదంతా మనం ఇదివరకు చర్చిన్చుకున్నదే. వీటికి తోడు వేటూరి పాటల్లో నాకు నచ్చే మరొక అంశం ఏమిటి అంటే, ఆయన వాడే సంస్కృత సమాసాలు. కొన్ని [...]
ఎందుకో ఒక రోజు శారదాదేవిని తలుచుకుంటే ఈ పద్యం స్ఫురించింది. నాకు ఎంతగానో నచ్చిన పద్యాలలో ఇది ఒకటి. సంగీతం, సాహిత్యం అమ్మకు రెండు స్తనాలు అని పెద్దల ఉవాచ. అదే అమ్మ మళ్ళీ నా చేత చెప్పించింది. తోటకంకలుషారికి మంగళకారిణికిన్కలితామృతకావ్యవికాసినికిన్కలకంఠికి శ్రావ్యసుగానఝరీజలదాయినికిన్ నమ (నతి) శారదకున్అమ్మవారు మాయా. అంటే స్వతహాగా గుణాతీతమైన బ్రహ్మానికి రంగులు [...]
మనోనేత్రంలో కొంచెం దీర్ఘమైన వ్యాసం వ్రాసి అప్పుడే ఆరు నెలలు అవుతోంది. ఇతర వ్యాసంగాలలో హడావుడి పెరిగింది. ఏమిటో ఒక రకమైన బద్ధకం కూడా ఏర్పడింది. ఈ రోజుతో ఆ అడ్డంకిని తొలగించుకుందామని ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యన నా Google plus ఖాతాలో ఉంచిన కొన్ని పద్యాలను ఈ టపలో ప్రచురిస్తున్నాను.సందర్భంఒక రోజు కొంచెం చల్ల గాలికి జలుబు చేసినట్టు అనిపించింది. మనసులో ఒక చిన్న ఆలోచన మెదిలింది. [...]
చం:-శివయను మాట బిందువయి జిహ్వను తాకినయంత తానుగాఅవిరళమైన తీపి చని ఆవలి సంగతులెల్ల మాయమౌదివిధుని పాపరాశులను తీర్చినయట్టుల నాదు హృత్తునన్భవలవభావతాపములు భంజనమొందును భక్తివాహినిన్
 శా:-స్తన్యంబీయని తల్లియున్, శిశువులన్ సాకేటి దొడ్డాలియున్మాన్యంబౌ సిరియున్ దురాశగొలిపే మాయాత్మికాశక్తియున్కన్యల్ మ్రొక్కెడి మాతయున్! పురుషులన్ కాల్చేటి కామాగ్నియున్సన్యాసుల్ సుఖభోగులున్ కొలుచుయా శర్వాణివీవే గదే! భా:-బిడ్డకు పాలివ్వని తల్లివీ, పిల్లలను సాకే తల్లివీ నీవే. గౌరవప్రదమైన సంపదవూ నీవే, దురాశ కలిగించే మాయవీ నీవే. కన్యలు కొలిచే జగన్మాతవూ నీవే, [...]
వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> కారణమాలాలంకారంలక్షణం:(గ్రంథం: సంస్కృతచంద్రాలోకం, రచన: జయదేవ కవి)గుంభః కారణమాలా స్యాద్యథా ప్రాక్ప్రాంత కారణైఃనయేన శ్రీః శ్రియా త్యాగస్త్యాగేన విపులం యశః(గ్రంథం: తెలుగు చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)వరుస దప్పని కారణావళులతోడఁగీలు కొల్పినఁ గారణమాలయగునునీతిచే సిరి సిరి చేత దాతృతయునుదాతృతను భూరియశమన్నరీతి శర్వభావం: కారణం [...]
దాదాపు రెండేళ్ళ క్రితం అలంకారాల గురించి వ్రాయడం ఆరంభించాను. అసలు ఈ అలంకారాల గురించి ఎక్కడ చదువుతున్నాను, వీటి చరిత్ర ఏమిటి అనేది కూడా చెప్తే బాగుంటుంది అనిపించింది. ఈ వ్యాసం అందుకే.భారతదేశంలో తరతరాలుగా కవులు అలంకారాలను గుర్తిస్తూ వాటి గురించి దీర్ఘవిశ్లేషణలతో పుస్తకాలు వ్రాస్తూ వచ్చారు. వీరు అలంకారాల గురించి చెప్పే శాస్త్రాన్ని అలంకారశాస్త్రం అన్నారు. మనకు [...]
వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> హేత్వలంకారం లక్షణం:సంస్కృత శ్లోకం: (సంస్కృత చంద్రాలోకం నుండి)హేతోర్హేతుమతా సార్థం వర్ణనం హేతురుచ్యతేఅసావుదేతి శీతాంశుర్మానభేదాయ సుభ్రువాం ||అనువాదం: (ఆడిదము సూరకవి రచించిన తెలుగు అనువాదం నుండి)కార్యకారణములు రెండు గలియఁబలికెనేని యది హేత్వలంకృతి నా నెసంగునుదయ మందెడు నీ శశి మదవతీ కదంబమానముల్విచ్చు చెయ్దంబు కొఱకువివరణ: [...]
ఒక రోజు పొద్దున్నే రాంబాబు & కో మధ్య సంభాషణలు.వెం: ఆకలేస్తోందిరా. ఏమైనా తినడానికి ఉందా?రాం: వెళ్ళి వంటింట్లో వెతుక్కో.వెం: ఇక్కడ biscuit packet ఉంది? ఎప్పటిది?రాం: అది తినకు, ఎప్పుడో పరమపదించింది.వెం: (packet పై label చదువుతూ) ఇది September 1st న manufacture ఐందిరా. Best before 2 weeks of manufacture. ఫరవాలేదు.(వెంకట్ packet తెరిచి ఒక biscuit ముక్క తిన్నాడు. తింటూనే గొంతులో మండినట్టైంది, ఒక రకమైన చేదు నాలికని ముంచేసింది.)వెం: [...]
వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> వ్యతిరేకాలంకారంలక్షణం: వ్యతిరేకో విశేషః చేత్ ఉపమేయ ఉపమానయోఃవివరణ: ఉపమేయం, ఉపమానం ఈ రెంటిలో ఏదో ఒకదానిలోనున్న ప్రత్యేకమైన విశేషం చెప్తే అది వ్యతిరేకాలంకారం అవుతుంది. ఆ విషయం ఉపమేయాన్ని పొగిడే విధంగా ఉండటం సహజం. చంద్రాలోకంలో ఇచ్చిన ఉదాహరణ చూద్దాము.ఉదా:- (చంద్రాలోకం)సంస్కృత శ్లోకం: శైలా ఇవోన్నతాస్సంతః  కింతు ప్రకృతి [...]
మొన్న శన్యాదివారాల్లో వేటూరి వానపాటల గురించి మూడు భాగాలుగా ఒక వ్యాసం వ్రాసాను. అసలు ఆ రోజు కూర్చున్నది వాన మీద ఒక పాట వ్రాద్దామని. ఎంత ఆలోచించినా వేటూరి మాటలు నన్ను వదలకపోతే, సరే అసలు వేటూరి ఎలాగ వ్రాసారో చూసి నేచుకుందామని మొదలెట్టిన ప్రయత్నం చివరకు ఆ వ్యాసమై కూర్చుంది. అది వ్రాసిన తఱువాత కాస్త నా వస్తుపరిధి పెరిగింది అనిపించింది.ఈ రోజు కూడా సియాటల్లో వర్షం [...]
"ప్రేమించు పెళ్ళాడు" చిత్రానికి ఇళయరాజ స్వరపరిచిన "నిరంతరమూ వసంతములే" పాటలో ఋతువులనన్నింటినీ మారిపోతున్నా ప్రేమికులకు మాత్రం వసంతం లాగే ఉంటోంది అనే ఉద్దేశంతో వేటూరి వ్రాసిన పాట అత్యద్భుతం. దీని గురించి నేను ఇదివరకు ఒక వ్యాసం కూడా వ్రాసాను. ఇందులో రెండో చరణంలో అన్ని ఋతువులనూ వర్ణించారు కానీ చిత్రంగా వర్షఋతువుని వదిలేసారు.బహుశా అప్పటికే వర్షఋతువు గురించి చాలా [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు