తిరుపతిలో డిసెంబర్ 27, 28, 29 తేదీలలో ‘4వ ప్రపంచ తెలుగు మహాసభ’లను అత్యంత పరమోన్నతంగా నిర్వహించబోతున్న విషయం జగద్వితమే. ఈ సందర్భమున మన ‘తెలుగు భాషా ప్రశస్తి’’ గురించి చర్చించుకోవడం సందర్భోచితం. దేశీయులు, విదేశీయులు, సంగీతకారులు, సాహితీవేత్తలు, భాషావేత్తలు, రాజకీయ నేతలు మన తెలుగు భాషను శ్లాఘించిన తీరు, మెచ్చుకొన్న మాటలు చదివితే, తెలుగువారి తనువు అణువణువునా [...]