నా చిన్నప్పుడు మానాన్న గారు పళ్ళు తోముకోటానికి పందుంపుల్ల నోట్లోపెట్టుకుని మెట్లుదిగి భావి దగ్గరకు వెళ్ళేవాళ్ళు. తిరిగి పైకి వచ్చేటప్పుడు ఆరోజు కూరగాయలు తుంపుకుని వచ్చే వారు. ఆ ప్రక్రియ అంటే నాకు చాలా ఇష్టం. బహుశ పల్లెటూరిలో చిన్నప్పుడు పెరిగిన వాతావరణం అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ దొడ్లో భావి లేదు, పందుంపుల్లలూ లేవు. కానీ అదేపని నేను చాలా ఏళ్ళు సాయంత్రం పూట [...]
ముందరే చెబుతున్నాను ఈ ముద్దుగుమ్మ కధ వింటే మీకు కళ్ళు చెమరుస్తాయి. చాలా జాలిపడిపోయి బాధ పడి పోతారు. పాపం ఈ భామ, తను జీవితంలో ఎంతో కోరుకున్న పెళ్ళి డబ్బులేక మానుకోవాల్సొచ్చింది.వివరాల్లోకి వెళ్తే ఈ ముద్దుగుమ్మ తన 14 ఏళ్ళప్పుడే ప్రేమలో పడింది.  యువ ప్రేమికులిద్దరూ  పెళ్లి చేసుకుందామని 18 ఏళ్ళకే  తాంబూలాలు పుచ్చు కుని సహజీవనం చేపట్టారు. వాళ్ళ 20 వ [...]
పక్కింటి పరమేశం మాట్లాడకుండా ఇంట్లోకి వచ్చి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. సామాన్యంగా ఇట్లా ఉండడు. ఏదో మాట్లాడుతూ నవ్వు మొహం తో ఇంట్లోకి వస్తాడు. నాకు అనిపించింది ఇక్కడ ఎదో తిరకాసు ఉందని.మొహం చూస్తే ఎదో బాధపడుతున్నట్లు ఉంది   -- ఏమిటి సంగతి ? అన్నాను. సమాధానం లేదు. సామాన్యంగా బాధపడుతున్న వాళ్ళని "ఏమిటి బాధ" అని అడిగితే చెప్పలేరు. ఇంకో రూటులో పోవాలి.ఇంట్లోకి [...]
ఆఫీసు నుండి వచ్చిన కామేశ్వరమ్మకి మొగుడు ఇల్లా ఎందుకు మారిపోయాడో అర్ధం కావటల్లేదు. చెప్పినపని చెయ్యడు. ఒకటో రెండో చేస్తున్న పనులు కూడా సరీగ్గా చేయటల్లేదు. మొన్న రైస్ కుక్కర్లో బియ్యం నీళ్లు పోసి కుక్ స్వీచ్ నొక్కటం మర్చిపోయాడు. ఆకలితో ఆఫీస్ నుంచి వచ్చి   అన్నం వండుకోవాల్సి వచ్చింది. నిజం చెప్పొద్దూ  కూర మాత్రం చేశాడులే. పైకెళ్ళి బట్టలు మార్చుకొచ్చి గిన్నెలు [...]
కాఫీ తాగి బయట ఎలా ఉందో అని కిటికీ లోనుండి చూస్తున్నాను. వాళ్ళు చెప్పినట్లు అప్పుడే స్నో మొదలయింది. ఒక అడుగు దాకా పడుతుందని చెబుతున్నారు. చికాగో ఎయిర్పోర్ట్ నుండి వెళ్లే ప్లేన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. లేకపోతే ఈ పాటికి న్యూయార్క్ లో వుండే వాళ్ళం. చూస్తున్నాను పక్కింటి పరమేశం మాఇంటికి ఎందుకో పరిగెత్తుకు వస్తున్నాడు.పరమేశం, భార్యా పక్కింట్లో ఉంటారు. రిటైర్ [...]
మన శరీరంలో చాలా ముఖ్యమయిన భాగం మన మెదడు. మనం చేస్తున్నామనుకుని మనం చేస్తున్న పనులన్నీ అది మన చేత చేయించినవే. మనం తీసుకునే చర్యలన్నిటికీ కారణం అదే. అది చర్యలు తీసుకునేందుకు ఉపయోగించిన సమాచారం మన పంచేంద్రియాల నుండి వచ్చినదే. అది మనం చదివినది, చూసినది, విన్నది. మన పరిచయాలూ, చదువులూ, సన్నిహితులూ, మన అనుభవాలూ వేరు కాబట్టి మనం తీసుకునే చర్యలు అందరివీ ఒకటిగా [...]
జుబీన్ మెహతా symphony conduct చేస్తున్నారంటే వెళ్ళి చూడాలని ఎంతమందికో కోరిక ఉంటుంది. చేతితో పట్టుకున్న కర్రని తిప్పుతూ orchestra తో స్వరాలని మేళవిస్తుంటే మనో రంజకంగా ఉండి తన్మయత్వంలో మునిగిపోతాము. కర్ర తిప్పుతూ అన్ని వాయిద్యాలనీ సమయ స్ఫూర్తి తో సంకలనం చేయించి మధుర స్వరాలను మిళితం చెయ్యటం symphony conductors కే సాధ్యం.మన తలలో Prefrontal Cortex అనేది మెదడు పై భాగంలో ఉంటుంది. ఇది జుబిన్ మెహతా (Zubin Mehta ) [...]
మన అందరి దేహాల్లో ఓ కంప్యూటర్ ఉంది. మన చేత పనిచేయించే దదే. మనకి అది ఎల్లా పనిచేస్తుందో  చూచాయగా తెలుసు. కానీ అది సరీగ్గా పని చెయ్యకపోతే బాగు చేసే సామర్థ్యం మనకు లేదు.ఇంతెందుకు దాని భాగాలు తెలుసుకానీ, భాగాలనన్నిటినీ కలిపి పనిచేయించే ఆపరేటింగ్ సిస్టం (OS ) మనకి తెలియదు.మన శరీరంలో  ఉన్న కంప్యూటర్ లో ముఖ్యభాగం మన మెదడు. మూడు పౌన్లు ఉన్న మన మెదడు ప్రపంచెంలో మన [...]
The Blood-Brain Barrier, The Meninges and Cerabrospinal Fluid. ప్రకృతి మనం జీవించేందుకు రెండే రెండు పనులు చెయ్యమని మన చేతుల్లో పెట్టింది. అవి తినటం, తాగటం. మనుషులు కష్టపడుతారేమోనని వాటికి కావాల్సిన వాటిని కూడా తనే సృష్టించింది. చెట్లద్వారా తినటానికి ఆహారం. నదులద్వారా తాగటానికి నీరు సృష్టించింది. అది చెప్పేది ఒకటే "నేను సృష్టించిన వాటిని ఆహారంగా తిను. నేను వాటిలోని పోషక పదార్ధాలను వేరుచేసి రక్తంలో [...]
(న్యూరో ట్రాన్స్మిటర్స్ ) NeurotransmittersNeurotransmitters గురించి చెప్పాలంటే ముందరగా మెదడు గురించి సూక్ష్మంగా చెప్పాలి.మన మెదడులో సమాచార పంపిణీ కేంద్రం న్యూరాన్ అనే ఒక కణం (cell ). మనం పుట్టేటప్పుడే 100 బిల్లియన్ న్యూరాన్ల తో పుడతాము. మనం కొత్తసంగతులు నేర్చుకున్నకొద్దీ, విడి విడిగా ఉండే ఈ న్యూరాన్లు కలిసిపోతూ ఉంటాయి. ఈ కలసి కట్టుగా ఉన్న దాన్ని neural  network అంటారు. దాదాపు 20 ఏళ్ల వయస్సు నుండీ మనలో [...]
మోటార్ న్యూరాన్స్ (Motor Neurons)రారోయి మాయింటికీ మావోమాటున్నదీ మంచి మాటున్నదినీవు నిలుచుంటేనిమ్మ చెట్టు నీడున్నదినీవు కూర్చుంటేకురిసీలో పీటున్నదినీవు తొంగుంటేపట్టెమంచం పరుపున్నది"దొంగరాముడు " చిత్రంలో సావిత్రి పాట పాడుతూ R. నాగేశ్వరరావు చుట్టూతా తిరుగుతూ నృత్యం చేస్తుంది. ఆ నృత్యం లో తన మొహం నుండీ కాళ్ళ దాకా ఎన్నో కదలికలు మనం చూస్తాం. ఆ కదలికలన్నీ ఆ యా చోట్ల ఉన్న [...]
"కూరలో ఉప్పు లేదు వెయ్యాలి""నాకు బాగానే ఉంది, సరిపోయింది ""లేదు సరిపోలేదు""నాకు సరిపోయింది"సంభాషణ ఇల్లా వెళ్తూ, వెళ్తూ ఎక్కడికో పోయి, ఇంట్లో జుట్టులు పట్టుకున్న రోజులు ఉన్నాయి. మన ముక్కూ మన కళ్ళూ ఇంతెందుకు మన అవయవాలు ఏవీ ఇంకోళ్ళతో సమానంగా (exact ) ఉండవు. అయినప్పుడు మన రుచులు (tastes ) ఎందుకుండాలి? ఉండవు . ఇంతెందుకు వంట చేస్తున్నప్పుడు వట్టిచేతులతో మా ఆవిడ పట్టుకునే భగుణ ని [...]
జీవితంలో సంవత్సరాల తరబడి కలసి తిరిగిన వ్యక్తి మనని చూసి తెల్ల మొహం వేస్తే ఎల్లా ఉంటుంది?  చెప్పినా  గుర్తు పట్టక పోతే చేసేదేముంది? దీనికంతటికి కారణం మెదడు. ఇటువంటి మెదడుకు సంబంధించిన వ్యాధులు ప్రపంచెంలో ఇప్పుడు ఏకారణానో ఎక్కువ అవుతున్నాయి. అమెరికాలో  ప్రతి 63 నిమిషాలకీ ఒక అల్జీమర్స్, dementia case ని గుర్తిస్తున్నారు.మనశరీరాన్ని మొత్తం ఎల్లవేళలా పని చేయించేది మన [...]
కాఫీ తాగేసి ఎంచేద్దామా అని ఆలోచిస్తున్న భార్గవికి, కాఫీ తాగి ఊర్కెనే కూర్చున్న భర్తా,  డైనింగ్ టేబుల్ మీద ఉన్న దానిమ్మ కాయలూ  కనపడ్డాయి. వెంటనే ఈ రెండు జడపదార్ధాలని ఎందుకు కలపకూడదనే ఆలోచన వచ్చింది.భార్గవికి ఇటువంటి ఆలోచన వస్తుందనుకుంటే, బహుశా వల్లి Costco లో కొన్న దానిమ్మకాయలు, భార్గవికి ఇచ్చేదికాదు.రిటైర్ అయిన భర్త అలా ఊర్కేనే కూర్చోటం ఏమాత్రం మంచిది కాదు. If you don't use it [...]
మొన్నీ మధ్య "డెన్నీస్" రెస్టారంట్ కి వెళ్ళాము. కాఫీ తాగటం ఇష్టం లేక "నీళ్ళు " డ్రింక్ గ ఇమ్మన్నాము. సర్వర్ నుండి తర్వాత ప్రశ్నలు "టాప్ వాటర్ "  "లెమన్ వాటర్" "ఐస్" "వితౌట్ ఐస్". పక్క బొమ్మని Lemon అంటారు. కింద బొమ్మ Lime.అప్పటి దాకా రెస్టారెంటుల్లో  "లెమన్ వాటర్" సర్వ్ చేస్తారని తెలియదు. సరే  "లెమన్ వాటర్" తెప్పించామనుకోండి, ఒక జగ్ నీళ్ళ లో ఒక స్లైస్ యెల్లో లెమన్ వేశారు. [...]
అమెరికాలో డిసెంబర్ అంటే పండగ రోజులు. ప్రతి సంవత్సరం అందరూ ఉత్కంఠతతో ఎదురు చూసే క్రిస్మస్ ఈ నెలలో వస్తుంది. ఇంటి ముంగిళ్లన్నీ లైట్ల తోరణాలతో అలంకరిస్తారు. సామాన్యంగా ఇంట్లో ఒక క్రిస్మస్ ట్రీ ఉంటుంది. దానికి కూడా అలంకరణలు చేస్తారు. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే క్రిస్మస్ రోజున శాంటాక్లాస్ ఇంట్లోవాళ్లందరికీ ప్రజంట్స్ తెచ్చి క్రిస్మస్ ట్రీ కింద పెడతాడు. క్రిస్మస్ [...]
ఎప్పుడో పిల్లలు చదివి పడేసిన పుస్తకాలని ఇప్పుడు చదవటం కొంచెం చిన్నతనంగా ఉండచ్చు కానీ చదివిన తరువాత అవి ఇచ్చే తృప్తి వేరు. ఇదివరకే ఎందుకు చదవ లేదనిపిస్తుంది. నేను న్యూయార్క్ వెళ్ళినప్పుడల్లా ఎదో ఒక పుస్తకం చదవటం అవుతోంది. ఈ తడవ చదివిన పుస్తకం "హెర్మన్ హెస్" వ్రాసిన  "సిద్దార్ధ".హెర్మన్ హెస్ జర్మనీ లో Claw అనే ఊళ్ళో జులై  2, 1877 పుట్టారు. జర్మన్ భాషలో చాలా నవలలు [...]
ఎల్లాగూ న్యూయార్క్ దాకా వచ్చాము. ఎప్పుడూ కుదరటల్లేదు. ఈసారయినా ఇషికాను చూడాలి పార్వతిని చూడాలి తప్పదు అనుకుంది భార్గవి. వీకెండ్ ఇషాన్ బర్తడే ట తప్పకుండా వెళ్ళాలి. వాళ్ళు నాలుగు వందల మైళ్ళ దూరంలో రిచ్మండ్ అనే ఊళ్ళో ఉంటారు. డ్రైవింగ్ కుదరదు. ప్లేన్ లో వెళ్ళాలంటే మధ్యలో ఆగి ఇంకో ప్లేన్ ఎక్కాలి ట్రైన్ అయితే ఎక్కి కూర్చుంటే అక్కడ దిగొచ్ఛు. దానికి తోడు ఖరీదు కూడా [...]
నాకు చిన్నప్పట్నుంచీ తెనాలి అంటే చాలా ఇష్టం. నా మొదటి హెయిర్ కట్ అక్కడే చేయించు కున్నాను. నా జీవితంలో మొదటి సినీమా "స్వర్గ సీమ" అక్కడే చూశాను. మొట్టమొదట హోటలికి గూడా అక్కడే వెళ్ళాను. దానికి తోడు అత్తయ్య గారిల్లు  రాముడన్నయ్య ఇల్లు అక్కడే ఉన్నాయి. మేము తెనాలి దగ్గర ఒక పల్లెటూర్లో "కఠెవరం" లో ఉండేవాళ్ళం. తరువాత ఊళ్ళు మారటం అయింది ఎక్కువగా వెళ్ళటా నికి [...]
ఈ నెలతో మాకు వేసవి కాలం అయిపోయి "Fall" (ఆకురాలు కాలం ) మొదలయింది. అమెరికాలో మేము ఉండే ప్రాంతంలో (Chicago దగ్గర ) కాల మార్పిడి స్పష్టంగా కనపడుతుంది. వసంత కాలంతో(మార్చి నెల) చిగిర్చిన చెట్లు, ఫాల్ లో ఆకులన్నీ రాల్చేసి మోడు లవుతాయి. డిసెంబర్ నుంచీ మార్చి దాకా మంచు తుఫానులూ, చలి. మాకు పెరట్లో కూరగాయ మొక్కలు వేసుకుని, పండిన కూరలు వండుకుని తిని ఆనందించే భాగ్యం సంవత్సరానికి [...]
New York Skylineమేము న్యూయార్క్ వేపు వెళ్ళినప్పుడల్లా Manhattan లో ఒక కాన్సర్ట్ కో, ఒక బ్రాడ్వే షోకో, ఒక మ్యూజియం కో, ఒక పెద్ద రెస్టో రెంట్ కో వెళ్తాము. మా ఇంటి పక్కన ఉన్న Liberty Park కు తప్పకుండా వెళ్తాము. పై బొమ్మ అక్కడనుండి కనపడే న్యూయార్క్ స్కై లైన్. పై బొమ్మలో ఎత్తుగా ఉన్న భవనం Twin Towers  శిధిలం అయిన తరువాత దాని బదులు కట్టినది. ఈ తడవ Rubin Museum కి వెళ్డామన్నారు. నాకు స్వతహాగా మ్యూజియం లంటే [...]
 బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ బుల్లి కాబేజీ ల్లాగా ఉంటాయి. చెట్టుకి మొగ్గల్లాగా కాస్తాయి. చలికాలం లో గానీ  స్ప్రౌట్స్ (మొగ్గలు) చెట్టునుంచి బయటకు రావు. ఇది నాకు బాగా తెలుసు, క్రిందటి సంవత్సరం "మే" లో పెరట్లో వేస్తే డిసెంబర్ కి గానీ బుల్లి కాబెజీలు రాలేదు. అందుకనే సామాన్యంగా క్రిస్మస్ డిన్నర్లో ఇది ఒక సైడ్ డిష్. కొంచెం ఉప్పేసి ఉడక పెట్టి ప్లేట్లో పెడతారు. ఎవరింటికో [...]
భూమి మీద స్వయం శక్తితో బ్రతికే శక్తి మొక్కలకి (plants ) మాత్రమే ఉంది. అవి పైనుండి  గాలినీ, సూర్యరశ్మినీ,  భూమినుండి నైట్రోజన్ లాంటి పదార్ధాలని తీసుకుని బతకటానికి శక్తిని సంపాదించుకుని, వాటి జాతి అభివృద్ధి కోసం కాయలూ విత్తనాలు తయారు చేసుకుంటాయి . మనుషులతో సహా మిగతా జంతువులుబ్రతకాలంటే ఒకటే మార్గం, మొక్కలు  తిని బతకటమో లేక ఆ మొక్కలను తిని జీవించే వాటిని చంపి [...]
మనం తీపి పదార్ధాలని చాలా ఇష్టంగా తింటాం. మితంగా తింటే అన్నీ మంచివే కానీ మితానికీ ఇష్టానికీ సఖ్యత ఉండదు. ఎప్పుడూ కొట్లాడు కొంటూ ఉంటాయి. తినటం తగ్గించ లేము.అసలు ఈ పోస్ట్ వ్రాయటానికి కారణం, స్థూల కాయానికి, డయాబెటీస్ , గుండె జబ్బులకి ఒక విధంగా షుగర్ కారణం కావచ్చని పరిశోధకులు నిర్ణఇంచటమే.మామూలుగా మనం షుగర్ని రెండువిధాలుగా తీసుకుంటాము. మామూలు షుగర్ గా (కాఫీ లోగా ), పళ్ళు [...]
మన జీవితంలో  ఉప్పూ, తీపి లేకుండా భోజనం చేసే రోజులు చాలా తక్కువ. అవి మనం జీవించటానికి చాలా ముఖ్యం కూడాను. తీపిని  "షుగర్" అనే ఇంగ్లీష్ పేరుతో చెప్పగానే దాని ప్రాముఖ్యం తెలుస్తుంది. తీపి  మనం పంచదారగా తినకపోయినా, మనము తిన్న కార్బో హైడ్రేట్లు శరీరంలో  "షుగర్" గా మార్చబడి, రసాయనికంగా మనము పీల్చే "ఆక్సిజన్" తో కలపబడి మనకు శక్తి నిచ్చే పదార్ధం (ATP) [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు