ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన నా కథ " సంచయనం".http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
నిజానికి హైటెక్ యుగంలో బ్రతుకుతున్న ఓ యద్దనపూడి హీరోయిన్ కనిపించింది నాకు కల్హారలో . ఆ భావాలు , ఆలోచనలు ,ఆత్మాభిమానం, ఆత్మ సంఘర్షణ నిస్సందేహంగా ఓ తరం ముందువే . టెక్నాలజీ పట్టాల మీద పరుగులు పెడుతున్న నేటి తరానికి అంత ఆలోచనకి సమయం లేదు . అలాగని వాళ్లు ఆలోచించడం లేదని కూడా అనలేం . వాళ్లు కూడా ప్రేమ మత్తు ఉన్న కాసేపూ అంతటి తీవ్రమైన భావాల్నీ కలిగి ఉండటం దగ్గరనించి [...]
నవ్య వీక్లీ లో ( జూలై 1 సంచిక లో) ప్రచురితమైన నా కథ " ఇట్స్ నాట్ ఓకే"..... ఇట్స్ నాట్ ఓకే "నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పర్సనల్. బార్న్స్ అండ్ నోబుల్ దగ్గర కలవటం కుదురుతుందా?’ ఆఫీస్ నుంచి బయలుదేరబోతుంటే వైదేహి  నుంచి వచ్చిన టెక్స్ట్ మెసేజీ చూసి శృతి ఆగిపోయింది . వైదేహి ని  కలిసి దాదాపు నెల రోజులకు పైగా అయింది. ఈ మధ్య ఫోన్ కాల్స్ కూడా లేవు. అలాంటిది హఠాత్తుగా ఒక  [...]
ఆది గురువు లాంటి తండ్రి ని తల్చుకోవటానికి ప్రత్యేకంగా రోజులు అక్కరలేదని తెలిసినా, ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా తెలుగు వెలుగు పత్రిక కోసం నేను రాసిన చిరు వ్యాసం. పితరౌ వందే !ఒక వ్యక్తిగా , ఒక రచయిత గా నా మీద మా నాన్నగారు రెంటాల గోపాలకృష్ణ గారి  ప్రభావం ఎంతగానో ఉంది. నాకు ఉహా తెలిసేనాటికే మా నాన్నగారు ప్రసిద్ధ రచయిత. ఆయన ఒక తండ్రిగా కంటే ఒక రచయిత గానే నాకు ఎక్కువ [...]
నా కొత్త కథ " The Couplet" సారంగ లో ప్రచురితమయింది. రా రా స్వామి రా రా.. యదువంశ సుధాంబుధి చంద్ర “ పాట మంద్రంగా వినిపిస్తోంది.  అప్పుడే బయట నుంచి వస్తున్న మాయ కు లోపల ఏం జరుగుతోందో  తెలుసు కాబట్టి నెమ్మదిగా శబ్దం చేయకుండా తలుపు తెరిచి అక్కడే చూస్తూ నిలబడిపోయింది. వైష్ణవి డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె తన లో తాను లీనమైపోయి నృత్యం చేస్తోందన్న సంగతి ని అర్థం చేసుకుంది మాయ. [...]
ఒక్కటంటే ఒక్క మాట కూడా బయటకు రాకుండా పెదవి దగ్గర ఆనకట్ట వేసేసి ఎన్ని దాస్తుందో ఈ మనస్సు!ఆ అక్షరాలను చూస్తేఎన్ని అబద్ధాలు గుర్తుకొస్తున్నాయో !ఆ అక్షరాలూ చూస్తేఎన్ని నయవంచనలు తెలిసి వస్తున్నాయో !ఆ అక్షరాలూ చూస్తేఎన్ని దాపరికాలు తెలిసి పోతున్నాయో నాలుగు అడుగులు కలిసి వేస్తున్నప్పుడు ఒక్కో ముద్దా నోట్లో పెట్టుకుంటున్నప్పుడు పక్క మీద దుప్పటి  కళ్ళ మీదకు [...]
కవిగా, కథా రచయితగా, స్త్రీవాద విమర్శకురాలిగా సుపరిచితురాలైన కల్పనా రెంటాల రాసిన మొదటి నవల, తొలి బ్లాగ్ నవల 'తన్హాయి'. అలజడిని, ఆసక్తిని కలిగించిన ఆ నవలపై కల్పనతో మరో కథా రచయిత మల్లీశ్వరి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ.."నా మనసులో నీకోసం ఒక చిన్న ప్లేస్, నా కోసం నీ మనసులో ఒక చిన్న ప్లేస్ దాచుకోవడం వల్ల ఈ పెళ్ళిళ్ళకు పెద్ద భూకంపాలు రావు'' అంటున్నాడు కౌశిక్."ఒకే ఒక్క రోజు [...]
కవిత్వం ఎలా పుడుతుంది? ఎందుకు పుడుతుంది? కవి అయిన వాళ్ళు, కాని వాళ్ళు కూడా సాధారణంగా ఈ ప్రశ్నల గురించి ఏదో ఒక సందర్భం లో తప్పకుండా ఆలోచిస్తారు. కవిత్వం ఒక రస విద్య లాంటిదని చెప్పుకోవచ్చు. కవిత్వం రాయాలని ఉన్నా, రాయలేని వాళ్ళు ఎందరో! ఎలా రాస్తామో కూడా తెలియకుండానే అలా రాసుకుంటూ వెళ్లిపోయే సహజ కవులు మరెంతమందో! కవిత్వం రాసేవాళ్ళను ఎలా రాస్తారు అని కానీ, ఎందుకు రాస్తారు [...]
అసంపూర్ణ శూన్య పదాలతో వాక్యం ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుందిసత్యమో , అసత్యమో!ప్రతి వాక్యానికి కొన్ని అర్థాలు, మరికొన్ని అపార్థాలులోపలి భావం ముసుగు ధరించికొత్త వాక్యమవుతుంది  వాక్యం తరువాత వాక్యం తో సిద్ధమైన ఓ కవిత్వ వేదిక ఆ తర్వాత ఒక్కో వాక్యం వీడ్కోలు పలికివెళ్లిపోతుందికుప్పకూలిపోతున్న  వేదిక నువెనుతిరిగైనా చూడకుండా!ఎన్ని కవితలు పుట్టినా పదాల మధ్య [...]
సారంగ పుస్తక ప్రచురణలు నవంబర్, 2010 లో ప్రారంభించినప్పుడు తెలుగు పుస్తకాలను కేవలం ప్రింట్ రూపం లోనే కాకుండా యాపిల్  ఐ బుక్స్,  ఇతర ఈ –బుక్స్ గా  కూడా అందివ్వాలని సంకల్పించాము. ఆ చిరకాల స్వప్నం ఇవాళ సాకారమయింది. సారంగ ప్రచురణలు యాపిల్ ఐ బుక్స్ ప్లాట్ ఫారం లో కూడా సెప్టెంబర్ 20,2012 నుంచి  లభ్యమవుతున్నాయని సగర్వంగా, సంతోషంగా తెలియచేస్తున్నాము. సారంగ సంస్థ నుంచి [...]
స్వరం మార్చిన ఒక మాట  నీతో మాట్లాడలేక....పెదవి ఒంపుల నుంచి ఓ వెల్లువై రాబోతున్న మాటల జల్లుఓ వలయం లా వెనక్కు తిరిగిగుండెలోతుల్లో జారిపోయింది.ఎవరెవరి కళ్ల మీదుగానో జారిపోతున్న నిన్ను చూడలేక .....కనుపాపల చీకటి కొసల నుంచిజాలువారే ఓ నీటి చుక్కకళ్లెదుట కాలిపోతున్న కలల్ని చూసిఅలలు లేని సముద్రమైలోపల్లోపల ఎండిపోయింది.మాటలు లేని పగళ్ళు,నిద్ర లేని రాత్రుళ్లుస్పర్శ  లేని [...]
నిద్ర నాకు గాయాన్ని కానుక చేసిందిగాయం నాకు రాత్రిని కానుక చేసిందిఈ రాత్రినేం చేసుకోను?ఈ చీకటి ని ఎలా మూట కట్టుకోను?నిద్ర పెట్టె తీసిచంద్రకాంత శిలా నేత్రాలను తెరిచానుకన్నీటి ని దాచుకుంది దుఃఖంనిద్ర రాదుకలలూ రావూనిజాల్ని అబద్ధాలుగా చూడటం ఎలా?నిద్రంటేనిజాల్ని దాచుకోవటమేగా?కలలంటేస్మృతుల్ని ఎగరేయటమేగా?ఏ నిజ సూర్య కిరణం లోంచోనిద్ర వస్తూ ఉంటుందినా పార్ధివ [...]
Saaranga Publications is looking to hire one person for an operations manager plus proof editing tasks. This person should be based in Hyderabad. The essential tasks that this person is expected to do are as follows: - Manage Saaranga books affairs as per Publisher's instructions, including working with and managing relations with printers, distributors, online and retail book sellers - Perform initial copy editing and proof checking for Telugu books that are published by Saaranga - Work with composing / typesetting service companies to make sure Saaranga jobs are completed in a timely fashion - As a rule this job requires frequent communication with the Publisher in the U.S., over phone, email, and instant messaging means. Saaranga places the highest priority to the professional communication skills above every other technical skill for this job.  - In general, ability to use Microsoft Word or any other document preparation software will be a minimum [...]
సాక్షి ఆదివారం సంచిక లో (జూలై 22) ప్రవాసం శీర్షిక కోసం నేను రాసిన వ్యాసం ఇది. [...]
“భారత దేశం నా మాతృదేశం. భారతీయులందరూ నా సహోదరులు. “ చిన్నప్పుడు స్కూల్లో చదివిన ప్రతిజ్న ఇంకా నా చెవుల్లో గింగురుమంటూనే వుంది. అనుక్షణం నా దేశం గొప్పతనం , నా “ సహోదరులకు”  స్త్రీజాతి పట్ల వున్న ఆదరాభిమానాలు , స్త్రీ ని దేవత గా కొలిచే నా దేశ సంస్కృతి గురించి  ప్రతి రోజూ ఎవరో ఒకరు నాకు  ఉద్బోధ చేస్తూనే  ఉన్నారు.  గత వారం గౌహతి లో జరిగిన సంఘటన ఎంతమందికి తెలుసో [...]
డాలస్ లోని  రేడియో ఖుషీ ఆధ్వర్యం లో  మదర్స్ డే సందర్భం గా  మహిళా సంబరాల కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళలను సన్మానించటం లో భాగం గా సాహిత్య రంగం లో  మేం చేసిన కృషి ని గుర్తిస్తూ నాకు, మాలతి గారికి కూడా సన్మానం  చేశారు. సన్మాన కార్యక్రమాలు ఎలా ఉంటాయో, ఎలా జరుగుతాయో బాగానే అనుభవం వున్న మేమిద్దరం  ఆ కార్యక్రమం కంటే కూడా ఆ సందర్భంగా మేమిద్దరం ఒక [...]
ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీ రావు గారు ప్రతి ఆదివారం హెచ్. ఏం.టీ.వీ . లో నిర్వహిస్తున్న ధారావాహిక కార్యక్రమం లో 36 వ ఎపిసోడ్ లో నా కథ " అయిదో గోడ" కథ గురించివిశ్లేషణ ప్రసారమయింది. ఈ సందర్భంగా నా ఇంటర్వ్యూ కూడా ప్రసారం చేశారు.మొత్తం ఎపిసోడ్ ను ఇక్కడ [...]
చాలా రోజులు..కాదు ...చాలా నెలల తర్వాత మళ్ళీ నా బ్లాగు లోకి వచ్చాను.ప్రముఖరచయిత, నటుడు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి ఆధ్వర్యం లో హెచ్ ఏం టీవీ లో ప్రసారమవుతున్న ప్రసిద్ధ సాహిత్య సంచికా కార్యక్రమం  " వందేళ్ల కథకు వందనాలు" లో నా కథ ప్రసారం కానున్నది. నేను రాసిన కథల్లోంచి ఏ కథ మీద చర్చా కార్యక్రమం ప్రసారం చేయబోతున్నారు అన్న దాని మీద వీక్షకులు ఎస్.ఏం.ఎస్. పంపించవచ్చు. లక్కీ [...]
నవలలు చదివి చాన్నాళ్ళయింది. అంతర్జాల ఇంద్రజాలంలో ఇరుక్కునిపోయి దశాబ్దకాలంగా పెద్దపుస్తకాలని బుక్‌షెల్ఫ్ కే పరిమితం చేసేసిన ఈ రోజుల్లో ఈ “తన్హాయి”నవల పాత అలవాటుని తిరగతోడినట్టయింది. 70, 80 దశకాల్లో ప్రముఖ(?) రచయిత్రులుండేవారు. అప్పట్లో వారి కథల్నీ, నవలల్ని చదివేవాళ్ళం ఇంక వేరే మార్గంలేక. ” మెత్తటి, నల్లటి తారు రోడ్డుమీద విమానం లాంటిపెద్ద కార్లూ, ఓ గొప్పింటి [...]
తన్హాయి నవల బయటకు వచ్చి దాదాపు నెలన్నర రోజులు కావస్తోంది. పాఠకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పుస్తకం కోసం అభిమానం తో ఎదురుచూసిన పాఠకులకు ఈ సందర్భంగా మరో సారి కృతజ్నతలు. ఫేస్ బుక్ లో తన్హాయి గ్రూప్ తన్హాయి పుస్తకం మీద తమ అభిప్రాయాలూ , ఆలోచనలు, అనుభూతులు పరస్పరం పంచుకునేందుకు ఫేస్ బుక్ లో ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటయింది. ఎంతో మంది పాఠకులు తన్హాయి మీద తమ అభిప్రాయాలను [...]
‘ ప్రేమ ఎలా పుడుతుంది? ఎందుకు పుడుతుంది?’—కొన్ని వందలేళ్ళుగా మానవులను వేధిస్తున్న ప్రశ్నలివి. వీటికి సమాధానం తెలుసుకోవటం కోసం నిరంతర అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. పాశ్చాత్య సమాజాలలో ప్రేమ-పెళ్లి ఈ రెండింటిని కలిపి చూడరు. కానీ సంప్రదాయానికి పెద్ద పీట వేసే మన భారతీయ సమాజంలో ఈ రెండూ ఒక దానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. ప్రేమ-పెళ్లి కి ముందే కలగాలా? పెళ్ళి తర్వాత ఇతరులను [...]
సారంగ పబ్లికేషన్స్ప తాజా ప్రచురణలు ” తన్హాయి’, ’ యమకూపం’ పుస్తకాలు అమెజాన్ లో దొరుకుతున్నాయి. ఇండియా వెలుపల నివసించే వారు అమెజాన్ ద్వారా ఈ రెండు పుస్తకాలను ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఒక్కో పుస్తకం ధర $9.95 . అమెజాన్ లో తన్హాయి, యమకూపం పుస్తకాల లింక్ లు [...]
( తన్హాయి పుస్తకం కోసం వంశీకృష్ణ రాసిన వ్యాసం ఇది. వార్త ఆదివారం అనుబంధం లో డిసెంబర్ 10 వ తేదీ ప్రచురితమయింది)
వందేళ్ల నాటి జెన్నీ...నేటి నళిని....“ నళినీ జమీలా అనే ఓ సెక్స్ వర్కర్ ఇటీవల తన ఆత్మకథ రాశారు. ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి అనువదిస్తున్న రోజుల్లో, కొన్ని వాక్యాల దగ్గర హఠాత్తుగా ఆగిపోతుండేదాన్ని. నళిని చెప్పిన అవే అనుభవాలు, అవే పరిశీలనలు గతంలో ఎక్కడో చదివానని అనిపించేది. కుప్రిన్ 'యమా ద పిట్'కు రెంటాల గోపాలకృష్ణ అనువాదం 'యమకూపం' చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ [...]
ప్రేమ ఎప్పుడూ ఓ కొత్త పదం, ఓ కొత్త భావన.కానీ ఆమె—అతను ఎప్పుడూ ఓ కొత్త సంఘర్షణ. ఈ కాలం లో అది ఇంకో సంఘర్షణ, ఇంకో భావన. మారుతున్న కాలపు కథ, మారుతున్న సంఘర్షణ కు అక్షర రూపం “ తన్హాయి”. దాదాపుగా ఏడాది క్రితం ఈ బ్లాగు లో మీ అందరి ఆదరాభిమానాల మధ్య పూర్తయిన సీరియల్ “ తన్హా యి “ ఇప్పుడు పుస్తక రూపం లో మార్కెట్ లో విడుదలయింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ల్లోని ప్రముఖ బుక్ స్టాల్స్ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు